పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

కాలిన గాయాలు

కాలిన గాయాలకు చికిత్స తెలుసుకుందాం.

చిన్నపాటి కాలిన గాయాలకు చికిత్స (ఫస్ట్ డిగ్రీ గాయాలు)

ఇవి సాధారణంగా అంత ప్రమాదం కాదు. వీటి వల్ల బొబ్బలు కూడ రావు. అయినప్పటికి ఇవి చాల బాధ కలిగిస్తాయి. పిల్లలకు కాలిన గాయాలైనపుడు వెంటనే కాలినభాగాన్ని చల్లని నీటిలో వుంచాలి. ఇలా చేయడం వల్ల కాలడం వల్ల చర్మానికి జరిగే నష్టాన్ని తగ్గించవచ్చు. అంతేకాదు బాధ కూడ తగ్గుతుంది.

బొబ్బలెక్కిన గాయాలకు చికిత్స (సెకండ్ డిగ్రీ గాయాలు)

కాలడంవల్ల ఏర్పడిన బొబ్బలను చిదమకూడదు. బొబ్బలెక్కిన గాయానికి ఐస్ పెట్టకూడదు. ఒకవేళ బొబ్బలు చితికి పోతే వీలైనంత త్వరగా ఆ భాగాన్ని సబ్బుతో నెమ్మదిగా కడగాలి. కొద్దిగా వ్యాసిలీన్ తీసుకొని దాన్ని మరిగే వరకు వేడిచేయాలి.

చల్లారిన తర్వాత దాన్ని గాజుగుడ్డ మీద రాసి ఆ గుడ్డను కాలిన గాయానికి నెమ్మదిగా కట్టాలి.బిగుతుగా కట్టకూడదు.మీ దగ్గర వ్యాసిలిన్ లేకపోతే గాయాన్ని అలాగే వదిలేయాలి. కాని దాన్ని వీలైనంత శుభ్రంగా వుంచడం ముఖ్యం. నూనె, వెన్న, నెయ్యి వంటి పూతలు వేయకూడదు. ఇవి చాల దుమ్మును ఆకర్షిస్తాయి.

తీవ్రంగా కాలిన గాయాలు (థర్డ్ డిగ్రీ కాలిన గాయాలు)

తీవ్రంగా కాలిన గాయాలు చర్మాన్ని పూర్తిగా నాశనం చేసి కండరాలు బయటికి కనిపించేలా చేస్తాయి. ఇలాంటి గాయాలు ప్రమాదకరమైనవి. శరీరంలో ఎక్కువ బాగంలో అయిన గాయాలు ఎంత లోతుగా అయ్యాయన్న వాటితో సంబంధం లేకుండా వెంటనే పిల్లలను హాస్పిటల్ కు తీసుకెళ్లాలి.

హాస్పిటల్ కు వెళ్లేలోపు శుభ్రమైన వస్త్రాన్ని చల్లని నీటితో తడిపి దాన్ని గాయాలైన భాగాలల్లో చుట్టాలి. చర్మం లోపలి మాంసం కూడా కాలినపుడు ఇన్ఫెక్షన్ కు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సూక్ష్మక్రిములను ఎదుర్కోవడంలో చర్మమే మొదటి రక్షణ అవయవమనే విషయాన్ని మరచిపోవద్దు. ఏదైనా కారణం చేత వైద్యసహాయం అందుబాటులో లేకపోతే సెకండ్ డిగ్రీగాయాలకు చేసిన విధంగానే చికిత్స అందించాలి.

తీవ్రమైన గాయాలకు చికిత్స అందించడానికి ఆరోగ్యకేంద్రానికి వెళ్లడమే అన్నింటికంటే మంచి పద్దతి అని గుర్తుంచుకోండి.

ఆధారం: డా. ఎం. రమాదేవి

2.98895027624
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు