పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

కృత్రిమ ఆకులు

వైద్య శాస్త్రం లో మరో వెలుగు.

mar26.jpgకృత్రిమ కణం గురించి క్రెయిగ్ వెంటర్ పరిశోధనల గురించి విన్నాం ఇటివలి పరిశోధనల గురించి విన్నాం. ఇటివలి పరిశోధనల వలన జీవశాస్త్రం కొత్త పుంతలు తొక్కుతోంది. వినూత్న జీవశాస్తం ‘సింధటిక్ బయాలజి’ అందుబాటులోకి వచ్చింది. ఇంతకు ముందే జీవ సాంకేతిక శాస్త్రం (బయోటెక్నాలజీ) సుక్ష్మజీవుల్ని, ముఖ్యంగా శైవలాలను, బాక్టీరియాలను ఉపయోగించి వైద్యశాస్త్ర పరంగా, ఔషదాల తయారీలో, ఇంకా సంప్రదాయేతర ఇంధన రంగాల్లో విశేష ఫలితాలను సాధించింది. mar27.jpgశిలాజ ఇంధనాల పై (అంటే పెట్రోల్ డీజిల్ వంటివి) ఆధారపడటం అవి మనకు ఎంతో కాలం లభ్యం కావని మనకు తెలుసు. తరిగిపోతున్న ఇంధన వనరులకు ప్రత్యామ్నాయంగా సౌరశక్తిని వినియోగించడం మంచిదని ప్రతి ఒక్కరూ అంగికరిస్తున్న సత్యం. ఫోటో ఓల్టాయిక్ సేల్స్ ద్వారా సౌరశక్తిని వినియోగించుకొనే విజ్ఞానం అందుబాటులో ఉన్న అది బాగా ఖర్చుతో కూడుకున్నది. సౌరశక్తిని మరింత పట్టిష్టంగా సులభంగా చౌకగా లభించే ఇంధనంగా మార్చడం ఎలా? దీని పై ప్రపంచ వ్యాఫ్తంగా అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. ఇటివలే అమెరికాలోని నార్త్ కెరొలినా యూనివర్సిటికీ చెందిన పరిశోధకులు తమ వినూత్న పరిశోధనలను వెల్లడించారు. అవే కృత్రిమ ఆకులు. నిజానికివి ఆకులు కావు. కాని అవి ఆకులు చేసే పనిని చేస్తాయి. అందుకే ఇలా పిలవటం.

ప్రకృతిలో మొక్కలు కాంతి శక్తిని రసాయనశక్తిగా అంటే కాంతిని వినియోగించుకుని తయారు చేసుకుంటాయని దీన్నె కిరణజన్య సంయోగ క్రియగా పెర్కొంటాం. ప్రతి మొక్క తన ఆకులను సూర్యకాంతిని సాధ్యమైనంత ఎక్కువగా వాడుకునే విధంగా అమర్చుకుంటాయి. దీన్ని మనం పత్ర విన్యాసం అంటాం. రకరకాల పత్ర విన్యాసం కాంతిని సమర్ధవంతంగా వినియోగించుకునేందుకు పరిణామం చెందినవే. మరి మనకు ఆ ఆకుల్లా సూర్యశక్తిని ఇంధనంగా మార్చే విలైతేనా? ఇక మన ఇంధన వనరుల కొరత, పెట్రోల్ ధరల భారం గురించి మరిచిపోవచ్చు. ఆ కోణంలోనే ఈ కృత్రిమ ఆకుల పరిశోధన. అకుల్లో ఉండే హరితరేణువులు లేదా క్లోరోఫిల్ కాంతి శక్తిని రసాయనశక్తిగా మార్చడంలో కీలక పాత్ర వహిస్తాయి. అందుకే ఈ పరిశోధకులు ఒక ప్రయోగం చేశారు. ఇందులో వారు నీటి ఆధారంగా చేసిన జెల్ ను ఉపయోగించి దానిలోకి మొక్కల క్లోరోఫిల్ ను ప్రవేశపెట్టారు. అంతేకాదు మరో ప్రయోగంలో ఈ జెల్ లో గ్రాఫైట్ తో పొదిగిన నానో గోట్టాలతో చేసిన ఎలక్ట్రోడులను అమర్చారు. ఈ నానో గొట్టాలతో ఉన్న ఎలక్ట్రోడ్ లు అకుల్లో ఉండే క్లోరోఫిల్  లా పనిచేసినాయి. అప్పుడు జెల్ కాస్త మొక్కల్లో ఉండే ఆకుల్లా పని చేసింది. ఇంకేముంది ఆకుల కిరణజన్య సంయోగ క్రియ జరిగినట్లే. ఈ జెల్ కూడా కాంతి శక్తిని విద్యుచ్చక్తిగా మార్చివేసింది. ఫోటో ఓల్టాయిక్ సేల్స్ లా కాకుండా ఈ జెల్ ఎటుంటే అటు ఎలా అంటే అలా అమర్చుకునే వీలుంది. పైగా చౌక కూడా. ఈ విధానం నిజంగా వాణిజ్య పరంగా కూడా విజయం సాదిస్తేనా! ఇక ఒక అద్భుతం సాధంచినట్లే.

2.9963099631
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు