অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

గడియారం

గడియారం

3పూర్వ కాలంలో ఎవరి చేతికి గడియారాలు లేవు. కాని అందరి దగ్గరా కావలిసినంత సమయం ఉండేదంట. పిల్లలతో కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడిపేవారు. ఇప్పుడు అందరి చేతులకు గడియారాలు న్నాయి. కాని ఎవ్వరి దగ్గరా టైం లేదు. కుటుంబంతో గడపటానికి టైం లేదు. అసలు తమ గురించి తాము ఆలోచించడానికే టైం లేదు. సరే, అందరికీ టైం చూపించి నా గురించి(గడియారం) తెలుసా? రండి చెబుతా.

ప్రకృతి సిద్ద కాలవ్యవధులైన దినము సూర్యోదయం నుండి మరునాడు సూర్యోదయం వరకు), చంద్ర  మాసము (అమావాస్య నుండి అమావాస్య వరకు) సంవత్సరము వసంత కాలం నుండి తరువాత వసంత కాలం వరకు) కాకుండ వీటికంటే చిన్న కాల వ్యవధులు (గంటలు, నిముషాలు, క్షణాలు) కొలవడానికి పనికి వచ్చే సాధనమే నేను అనగా గడియారం (CLOCK), క్లొక్కా (C LOCCA), అనగా గంట(BELL). అ పదం నుండి క్లాక్ అనే పేరు వచ్చింది. మానవుడు కనుగొన్న అతి ప్రాచీన వస్తువులలో నేనూ ఒకదాన్ని. శతాబ్దాలుగా, వివిధ రకాలైన భౌతిక క్రమంలో, ప్రయోగాలలో వివిధ రకాలైన గడియారాలు వాడుతూ ఇప్పుడున్న రూపం నాకు స్థిరపడింది.

4మొదటగా పగలులో కాలాన్ని లెక్కించడానికి సూర్య గడియారాన్ని వాడేవారు. ఒక గోళాకార రాతి పై సూర్యుని నీడని బట్టి కాలాన్ని లెక్కించేవారు (ఇలాంటి గడియారంను రాడామాన్ సింగ్ జైపూర్ లోని జంతర్ మంతర్ లో ఏర్పాటు చేశాడు, ఇప్పటికిఅక్కడ చూడవచ్చు). శాస్త్రీయంగా నిర్మించిన సూర్యగడియారం పగలులో చాలా ఖచ్చితంగా ప్రాంతీయ సమయాన్ని సూచించడానికి ఉపయోగపడేది. కానీ ఈ గడియారాన్ని పనిచేయాలంటే సూర్యుని వెలుగు విధిగా వుండాలి. సూర్యుడేలేనప్పుడు, రాత్రి పూట కూడా సమయాన్ని కొలవటానికి వేరొక సాధనం కావలసి వచ్చింది. తరువాత క్రొవత్తి గడియారం (CANDLE CLOCK) అగరబత్తి గడియారం (STICK OF INCENSE), ఇసుక గడియారం(HOUR GLASS) లాంటివి కనపగొనబడ్డాయి.

సమాన కాలవ్యవధులలో క్రొవత్తి సమాన పొడవు కాలుతూ పోతుంది. అలాగే అగరబత్తి కూడా కాలుతూపోతుంది.  ఈ సమయాన్ని లెక్కించి గడియారాలు తయారు చేసారు. నున్నటి ఇసుక గడియారాన్ని రూపొందిచారు క్రీస్తు పూర్వం 16వ శతాబ్దం లో బాబిలోనియా, ఈజిప్టులలో నీటి గడియారంలో క్లిష్టమైన వేగము మార్చే పరికరాలు  (gears) అమర్చి ఖచ్చితమైన సమయాన్ని చూచించే విధంగా తయారుచేసారు. ఈ సాంకేతిక సమాచారం క్రీ,శ.725లో చైనా ద్వారా కొరియా, జపాన్ దేశాలకు చేరింది.

5క్రీ.శ.1580లో ఇటలీ శాస్తవేత్త గెలీలియో గెలీలి లోలకము (PENDULUM) యోక్క డోలనాలను లెక్కించి గడియారంలో వాడవచ్చని కనుగొన్నాడు. కానీ ఆయన అలాంటి పరికరం తయారు చేయలేదు. 1656లో డచ్ శాస్రవేత్త క్రిస్టియన్ హైగెన్స్ తొలి లోలకం గడియారాన్ని నిర్మించారు. ఈ గడియారం ఒక రోజులో 1 నిమిషము మాత్రమే దోషంతో ఖచ్చితమైన సమయాన్ని చూపించేది. 16వ శతాబ్దంలో టైకోబ్రహి గడియారంలో నిముషాలు, సెకనులు చూపే ఏర్పాటు చేసాడు. రాబర్ట్ హుక్ స్ప్రింగ్ అంటే చుట్టబడిన టెంపర్ గల కమ్మీ. స్ప్రింగ్ లో గల శక్తిని వుపయోగించి 1675లో అంటే లోలకం గడియారం కనుగొన్న 18 సంవత్సరాలకు హైగెన్స్ బాలన్స్ వీల్ థయారు చేసి జేబు గడియారం (pocket watch) తయారుచేసాడు. చాలా కాలం ఈ రూపం లో నా ఆకారం స్థిర పడిపోయింది.

61932 లోSIEKO కంపెనీ వారు ప్రపంచపు తొలి క్వార్టజ్ (quartz) వాట్ “Astron”ను తయారు చేసారు. ఈ క్వాడ్జ్ వాచీల స్వతః సిద్దమైన ఖచ్చితత్వము, తక్కువ ఖర్చుతో తయారు లాంటి లక్షణాల వల్ల ప్రపంచ వ్యాప్తంగా వీటిని విరివిగా వాడుతున్నారు. ఇప్పటికీ వీటిదే పైచేయి. 1949లో అటామిక్ గడియారం కనుగొనబడింది. ఇదే ప్రస్తుత ప్రపంచంలో అతి ఖచ్చితమైన సమయం చూపే గడియారం National Institute of Standard and Technology ఆధ్వర్యంలో నిర్మించబడ్డ సీసియం (cesium) అటామిక్ క్లాక్ (Atomic clock) 300 లక్ష కోట్ల సంవత్సరాలకు (30 బిలియన్ సంవత్సరాలకు) ఒక్క సెకను, ఒకే ఒక్క సెకను తేడాతో సమయాన్ని చూపుతుంది. తరువాత ఎలెక్ట్రానిక్ వాచీలు వచ్చాయి. ఇవి సంఖ్యలను తెరపై చూపిస్తాయి, కనుక ఇవి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. కానీ మన్నిక తక్కువ.

గోడగడియారాలు, చేతి గడియారాలు, స్టాప్ వాచీలు, స్పోర్ట్స్ వాచీలు, స్టాప్ క్లాకులు, అలారం గడియారాలు, ఇలా అనేక రూపాలలో నేను అందరికీ అన్ని విధాలుగా ఉపయోగపడుతానన్న మాట. “పరోప కారార్థం ఇదం శరీరం కదా!” ఇద్దనమాట నా (గడియారం) కథ.

7కొనమెరుపు: IST – భారత ప్రామాణిక సమయము (Indian Standard Time) గురించి సరాసరి సమయము (Greenwich Mean Time0 కంటే 5½ గంటలు ఎక్కువ. 1792లో ఈస్ట్ ఇండియా కంపెనీ వారు మద్రాసు నగరం (ఇప్పుడు చెన్నై)లో వేదశాల (observatory)ని ఏర్పాటు చేసారు. 1802 లో కంపెనీ అధికారిక ఖగోళ శాస్తవేత్త జాన్ గోల్డింగ్ బామ్ మద్రాసు యొక్క అక్షాంశాన్ని (longitude) గ్రీన్విచ్ మెరిడీయన్ కు తూర్పుగా 80 డిగ్రీల 18 నిమిషాల 30 సెకనులుగా నిర్ణయించారు. (east of Greenwich meridian). విదేశాలలోని ప్రామాణిక గడియారంలో భారత దేశానికి ప్రామాణిక సమయాన్ని ఏర్పాటు చేసేరు. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు ఫిరంగీ మోగ్రోలా ఆ గడియారం అనుసంధానం చేయబడింది. అలా 200ల సంవత్సరాల నుండి మన IST కొలవబడింది.© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate