పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

గణిత గమ్మత్తులు

12, 13, 14.లతో గుణించడానికి చిట్కాలు

హాయ్ పిల్లలూ, లెక్కలంటేనే “అమ్మో" అనేస్తున్నారా! అందులోనూ గుణకారం అంటే ఇంకా 'భయం' అంటున్నారా! మీతో లెక్కలంటే 'ఆహా? అనిపించడానికీ గుణకారం పట్ల “మమకారం" పెంచడానికీ కొన్ని గుణకార గమ్మత్తులను చూద్దామా!.

12, 13, 14.లతో గుణించడానికి చిట్కాలు :-

  1. ఏదైనా సంఖ్యని 12, 18, 14. లతో గుణించునపుడు వచ్చు లబ్ద సంఖ్య యొక్క ఒకట్ల స్థానంలోని అంకె కొరకు, సంఖ్యలోని ఒకట్ల స్థానంలోని అంకెను 2, 3, 4.లతో గుణించాలి. (అనగా 12 అయితే 2 తో, 13 అయితే 3 తో, 14 అయితే 4 తో గుణించాలన్నమాట)
  2. పదుల స్థానం కొరకు, మళ్ళీ పదుల స్థానంలోని అంకెను 2, 3, 4 లతో గుణించి, ముందున్న ఒకట్ల స్థానంలోని అంకెను కలపాలి. మొదటి సోపానంలో రెండెంకెల సంఖ్య వస్తే, దాని పదుల స్థానంలోని  అంకెను కూడా ఇక్కడ కలపాలి.
  3. ఇలాగే వందల స్థానంలోని అంకెను 2, 3, 4.తో గుణించి, దాని ముందున్న అంకెను (సోపానంలో పదుల స్థానంలోని అంకెనూ) కలపాలి.
  4. మిగిలిన అన్ని స్థానాలనూ ఇదే విధంగా చేయాలి.

కొన్ని ఉదాహరణల ద్వారా సులభంగా అర్థమవుతుంది చూడండి :-

ఉదాహరణ I

ఉదాహరణ I

432 X 12 (2 తో గుణించాలి)

ఫలిత సంఖ్య

Step-1

ఒకట్ల స్థానం అంకె = 2X2

=4

Step-2

పదుల స్థానం అంకె = 3X2 = 6+2 (ఒకట్ల స్థానంలోని అంకె)

=8

Step-3

వందల స్థానం అంకె = 4x2 = 8+3 (పదుల స్థానంలోని అంకె)=11

=1

Step-4

వేల స్థానం అంకె = 0x2 = 0+4 (వందల స్థానంలోని అంకె) +1

=5

 

కావున  432X12

5184

ఉదాహరణ II

ఉదాహరణ II

986 X 13 (3 తో గుణించాలి)

ఫలిత సంఖ్య

Step-1

ఒకట్ల స్థానం అంకె = 6X3=18

=8

Step-2

పదుల స్థానం అంకె = 8X3 = 24+6+1=31 (6-ముందున్న అంకె; 1 స్టెప్ 1 లో పదుల స్థానం అంకె)

=1

Step-3

వందల స్థానం అంకె = 9X3 = 27+8+3=38 (8-ముందున్న అంకె; 1 స్టెప్ 2 లో మిగిలిన అంకె)

=8

Step-4

సంఖ్యలోని అంకెలన్నీ వాడాలి. కావున వేల స్థానంలో ఏమీ అంకె లేకపోయిన ‘0’ ను తీసుకోవాలి.

వేల స్థానం అంకె = 0x3 = 0+9+3

(9-ముందున్న అంకె; 3 స్టెప్3 లో మిగిలిన అంకె)

=12

 

కావున  986X13

12818

ఉదాహరణ III

ఉదాహరణ III

7093 X 14 (4 తో గుణించాలి)

ఫలిత సంఖ్య

Step-1

ఒకట్ల స్థానం అంకె = 3X4=12

=2

Step-2

పదుల స్థానం అంకె = 9X4 = 36+3+1+40 (3-ముందున్న అంకె; 1 స్టెప్1 లో పదులస్తానం అంకె)

=0

Step-3

వందల స్థానం అంకె = 0X4=0+9+4=13

=3

Step-4

వేల స్థానం అంకె = 7x4 = 28+0+1

=29   =9

Step-5

పదివేల స్థానం అంకె = 0x4 = 0+7+2

=9     =9

 

కావున  7096x14

99302

ఎలావుంది పిల్లలు ఈ గమ్మత్తు... ఫలితాన్ని సరిచూచినప్పుడు చాలా ఆనందించారు కదూ... ఇలాగే మీరు 15, 16......19 వరకు గుణకారాలను ప్రయత్నించండి. 15 తో గణించవలసి వచ్చినప్పుడు 5 తో, 10 తో గణించవలసి వచ్చినప్పుడు 6 తో... ఇక మీదే ఆలస్యం ప్రయత్నించండి. వచ్చేసారీ మరిన్ని గమ్మత్తులను నేర్చుకుందాం...

రచయిత: టి. తులసి, సెల్: 9493047625

3.0078125
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు