పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

గుండె కాయ

గుండె గురించి అడిగి తెలుసుకున్న పిల్లలు.

heart.jpgసాయంత్రం 5 గంటలు అయ్యింది. ప్రతి రోజు ఉషారుగా వచ్చే పిల్లలు ఆ రోజు దిగులుగా వచ్చారు.

అమ్మా: ఏంటమ్మాయి! ఏమయింది మీకు?

మధుర : ఓ... ఎం లేదమ్మా

ప్రజ్ఞ: అదేం కాదమ్మా అక్క వాళ్ళు ప్రెండు లక్ష్య ఉంది కదా!

అమ్మ: ఏమైంది లక్ష్యకు?

ప్రజ్ఞ: లక్ష్యకు కాదమ్మా! వాళ్ళ నాన్నకు గుండె ఆపరేషన్ జరిగిందట. అందుకని లక్ష్య ఏడుస్తుందని, అక్క కూడా దిగులుగా ఉంది.

అమ్మ: దిగులుపదకమ్మా! తగుతుందిలే! లే పలుతాగుదువు కాని రామ్మ! తేవాలా? (యిదంతా ఒకవైపున తాతయ్య గమనిస్తున్నాడు)

తాతయ్య: పిల్లళు యిలా రండి. (ప్రజ్ఞ స్పీడ్గాను, మధుర నిదననగా వచ్చి తాత ప్రక్కన కూర్చొన్నారు)

ప్రజ్ఞ: తాతయ్య! అసలు గుండెకు ఆపరేషన్ ఎందుకు చేస్తారు?

తాతయ్య: గుండెలో కవాటాలు ఉంటాయని తెలుసుకదా మీకు.

పిల్లలు: ఆ తెలుసు!

తాతయ్య: ఎన్ని కవాటాలు ఉంటాయి.

పిల్లలు: నాలుగు(4)

తాతయ్య: ఆ కవాటాలు పనిచేస్తూ చెడురక్తాన్ని (అవశ్యక తక్కువగా ఉన్న) ఊపిరితిత్తుల్లోకి మంచి రక్తాన్ని శరీర భాగాలకు పంపుతాయి.

ప్రజ్ఞ: అవును..... మా మాస్టారు చెప్పారు.

తాతయ్య: యింకా ఏమి చెప్పారు మీ మాస్టారు?

ప్రజ్ఞ: గుండె, రెండు ఉపిరితిత్తుల మధ్యలో కొంచెం ఎడమ భాగంలోకి జరిగి ఉంటుందని, ఎవరి గుండె వారి పిడికిలంతే ఉంటుందని, సంకోచ, వ్యాకోచాల వల్ల రక్తం బయటకి లోపలికి ప్రవహిస్తుందని చెప్పారు తాతయ్యా.

తాతయ్య: అవును... కరేక్ట్ యింకా గుండె గురించి ఎం తెలుసు నీకు

ప్రజ్ఞ: నాకంతే తెలుసు! తాతయ్య: మధురా... నువ్వు చెప్పు నికేంతెలుసు గుండె గురించి.

మధుర: గుండెలో నాలుగు గడులుంటాయి. పై రెండు గదులను కర్ణికలు (Atria) అనీ క్రింది రెండు గదులను జటరికలనీ (ventricles)అని అంటారు.

తాతయ్య: మరి ఇంకో ప్రశ్న! గుండె ఎలా పనిచేస్తుందో తెలుసా?

ప్రజ్ఞ: గుండె లబ్..డబ్ అని కొట్టుకుంటుంది. నేను డాక్టర్ అంకుల్ స్టేత్స్కోపుతో విన్నాను.

మధుర: శరీర భాగాల నుండి చెడురక్తాన్ని గుండె ఊపిరితిత్తులకు పంపుచేస్తుంది. అక్కడ శుద్ధి కవించబడి ధమనుల ద్వారా తిరిగి గుండెను చేరుతుంది. ఆ రక్తమే అవయవాలకు పంపబడుతుంది.

తాతయ్య: భలే చెప్పావ్ మధుర్! (యింతలోనే కాలింగ్ బెల్ మోగింది. అమ్మా తలుపు తీసింది. డాక్టర్ అంకుల్ తాతయ్యకు చెక్ అప్ చేయడానికి వచ్చాడు)

ప్రజ్ఞ: గుండె నొప్పి ఎందుకు వస్తుంది తాతయ్య!

తాతయ్య: తక్కువ రక్తప్రసరనతో గుండె ఎక్కువగా పనిచేయాల్సిన వచ్చినప్పుడు గుండె నొప్పి వస్తుంది.

డాక్టర్ అంకుల్ : గుండెకు రక్తం సరఫరా చేసే రక్తనాళాలు (Coronary Arteries) అకస్మాతుగా సంకోచించడం వలన .

గుండెకు రక్తం తగ్గిపోయి గుండె ఎడమ వైపు ఛాతిలో నొప్పి తెలుస్తుంది.

మధుర : డాక్టర్ అంకుల్ మరి గుండెకు ఆపరేషన్ ఎందకు చేస్తారు?

డాక్టర్ అంకుల్: రక్తనాళాలు సన్నబడి గుండె కండరాలకు రక్తం అందక రక్తం గడ్డకట్టడంతో గుండెపోటు (Heart Attack) వస్తుంది. గుడేపోటు వచ్చిన తర్వాత కొంత దూరం నడిచినా, పనిచేసినా గుండెలో నొప్పి, ఆయాసము వస్తుంటే వీరికి “బైపాస్ ఆపరేషన్” గాని “యంజియో ప్లాస్టిక్” గాని అవసరం వస్తుంది.

(అమ్మ పిల్లలకు పాలు, తాతయ్యకు చేక్కరలేని టి యించ్చించి. డాక్టర్ అంకుల్క కు కాఫీ యిస్తూ.)

డాక్టర్ గారూ, అసలు గుండెపోటు ఎందుకు వస్తుందంటారా.

డాక్టర్ అంకుల్: 20 సం. దాటినా ప్రతి వ్యక్తిలో ఎంతోకొంత గుండె రక్తనాళాల్లో వ్యర్ధ పదార్ధాలు అడ్డుగా ఉంటాయి. బీ.పి, షుగర్ ఉన్నవాళ్ళకు గుండెపోటు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది.

తాతయ్య: డాక్టర్ గారూ. మా మిత్రునికి బీ.పి, షుగర్ లేవు, స్మోకింగ్, డ్రింకింగ్ అలవాట్లు కూడా లేవు మరి అతనికి ఎదుకు వచ్చిందంటారు?

డాక్టర్ అంకుల్ : మానసిక ఒత్తిడికి ల్లోనయ్యే వారికి కూడా వచ్చే అవకాశం ఉంది తాతగారు!

అమ్మ: ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి డాక్టర్ గారు?

డాక్టర్ అంకుల్

  1. బీ.పి ఉన్నవారు ఉప్పు, షుగర్ ఉన్నవారు తీపి పదార్ధాలు తగ్గించాలి.
  2. రక్తనాళల్లో క్రొవ్వు పెరగకుండా చూసుకోవాలి.
  3. ఆహారం స్వల్పమైన మోతాదులో తీసుకోవాలి. పొగత్రాగడం నూనె పదార్ధాలు, మసాలాలు తగ్గించాలి.

తాతయ్య: అదిర్రా గుండె కధ.... విన్నారు కదా! ఏంమ్మా! మధురా, దిగులు పోయింది కదా!

అమ్మ: డాక్టర్ అంకుల్ కు థాంక్స్ చెప్పండి మరి!

ప్రజ్ఞ, మధుర: థాంక్స్ డాక్టర్ అంకుల్!

రచయిత: తవ్వా సురేష్, సెల్: 9705833305

3.01652892562
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు