హోమ్ / విద్య / బాలల ప్రపంచం / బాలల సైన్స్ విభాగం / అడిగి తెలుసుకుందాం / గుడ్లగూబ రాత్రిపూట ఎలా చూడగలుగుతుంది?
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

గుడ్లగూబ రాత్రిపూట ఎలా చూడగలుగుతుంది?

గుడ్లగూబ రాత్రిపూట స్వష్టంగా చూడగలగడానికి గల నాలుగు కారణాలు తెలుసుకుందాం.

గుడ్లగూబను అశుభసూచకంగా చూడటం మనందరకు తెలిసిందే. కాని కొన్ని దేశాలలో గుడ్లగూబను ధనానికి, తెలివికి గుర్తుగా భావిస్తారు. గుడ్లగూబలో వున్న ప్రత్యేకత ఏమిటంటే అది పగటిపూట కంటే రాత్రిపూట స్పష్టంగా చూడగలుగుతుంది.

owl

గుడ్లగూబ రాత్రిపూట ఎలా చూడగలుగుతుందో అర్థం చేసుకోవటానికి మనము ఎలా చూడగలుగుతున్నమో తెలుసుకోవాలి. వస్తువులపై విస్తరించబడిన కిరణాలు పరావర్తనం చెంది, మన కంటిలోని రెటీనా అనే తెరపైకి కంటిలోని కటకం ద్వారా కేంద్రీకరించబడతాయి. అపుడు రెటీనా పై తలక్రిందులుగా వుండే ప్రతిబింబం ఏర్పడును. ఈ ప్రతిబింబం నేత్రనాడి ద్వారా మెదడుకు చేరవేయబడును. అపుడు మెదడులో స్పష్టమైన నిలువైన ప్రతిబింబం ఏర్పడుటవలన మనము చూడగలుగుతున్నాము.

గుడ్లగూబ రాత్రిపూట స్పష్టంగా చూడగలుగుటకు కారణము దాని కంటిలో గల నాలుగు ముఖ్య లక్షణాలు.

మొదటిది దాని కంటిలో కటకానికి, రెటీనాకు మధ్యగల దూరము మానవుని కంటిలో కంటే ఎక్కువ. అందువలన దాని రెటీనాలో రాడ్ లు పెద్ద ప్రతిబింబం ఏర్పడును.

రెండవది దాని రెటీనాలో రాడ్ లు మరియు కోన్ ల సంఖ్య మనకంటే ఎక్కువ. మనిషిలో చ.మి,మీ.కు 2000 చొప్పున వుంటే గుడ్లగూబలో చ.మి,మీ.కు 10,000 చొప్పున వుంటాయి.

మూడవది దానికంటిలో రసాయనికంగా ప్రోటీన్ అయిన ఎరుపురంగు పదార్థం వుండును. ఇది కాంతిని ఎక్కువ సున్నితంగా గ్రహించగలదు.

నాల్గొవది దాని కంటిలోని కంటిపాప ఎక్కువ విస్తరించగలదు. అందువలన ఏ చిన్న కాంతి పుంజమైనా కంటిలోకి ప్రవేశించగలదు.

ఈ నాలుగు కారణాల వలన గుడ్లగూబ చీకటిలో కూడా చూడగలదు. గుడ్లగూబ కంటికి కాంతికి ఎక్కువ సున్నితత్వం వుండుట వలన వస్తువులు చాలా కాంతివంతంగా కనబడతాయి. అందువలన పగటిపూట కాంతి కండ్లకు అసౌకర్యంగా వుండును. మరొక ప్రత్యేక లక్షణం ఏమిటంటే గుడ్లగూబ తన తలను 180º కోణంలో త్రిప్పగలుగుట వలన తన తలకు వెనుకవున్న వస్తువులను కూడా చూడగలదు.

3.0
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు