పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

గ్రాఫ్టింగ్

గ్రాఫ్టింగ్ ప్రక్రియలు సాధారణం.

nov15మా ఊళ్లో ఒక జామ చెట్టుకు జామ కాయలతో పాటు నిమ్మకాయలు కాస్తున్నాయి. మరో జామ చెట్టుకు జామ కాయలతో పాటు కమలాకాయలు కూడా వస్తున్నాయి. ఇది ఎలా సాధ్యం?

అక్కడ జామ చెట్టుకున్న ఒకే కొమ్మకు ప్రక్కప్రక్కనే జామకాయలు, నిమ్మకాయలు కాయవు. జామ చెట్టుకున్న ఒక కొమ్మకు జామకాయలు కాస్తూటే అదే జామచెట్టుకున్న మరో కొమ్మకు నిమ్మకాయలు కాస్తుండవచ్చును. జాగ్రత్తగా గమనించండి. ఇదే విధంగా రెండో జామచెట్టు విషయంలోను ఆరాతీయండి. పెరిగిన జామ చెట్టు కాండం లేదా కొమ్మను తెగ్గొట్టి అందులో చిన్న గాడి తీస్తారు. మీరు మాములు నిమ్మ చెట్టుకున్న లేత కొమ్మను తెగొట్టి దాన్ని పెన్సిల్ చెక్కినట్లు పలుచగా గొడ్డలి ఆకారంలో చెక్కుతారు. ఈ గొడ్డలి ఆకారాన్ని పోలిన నిమ్మచెట్టు శాఖను జామచెట్టు కొమ్మ గాడిలో పెట్టి మొత్తాన్ని మట్టితో పాటు గట్టిగా వెంటనే కట్టి పెట్టినట్లయితే కొన్ని రోజుల తర్వాత ఆ నిమ్మ చెట్టుకొమ్మ జామచెట్టులో భాగం అవుతుంది. ఇలాగే కమలా చెట్టు కొమ్మను మరో జామ చెట్టుకో లేదా అదే జామ చెట్టుకు మరో కొమ్మకో చేయవచ్చును. దీన్నే గ్రాఫ్టింగ్ (grafting) అంటాము. అప్పుడు కొమ్మలు తమ తమ చెట్లనే కాస్తాయి. ఇలాంటి ప్రక్రియలు సాధారణం. వింతేమి లేదు.

ఆధారం: ప్రొ. రామచంద్రయ్య

2.98130841121
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు