పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

చేతబడి అంటే ఏమిటి? అసలది ఉందంటారా?

చేతబడి ఉందనుకోవడం ఒట్టి మూఢనమ్మకం.

blackmagicచేతబడి, బాణామతి, చిల్లంగి, మంత్రాలు అన్నా పేర్లు ఏమైనా క్రియొకటే, ఒక్కొ ప్రాంతంలో ఒక్కొ పేరుతో పిలుస్తారు. వాస్తవానికి అవన్నీ కల్పితాలు. రుజువుకు నిలబడి నమ్మకాలు మీరడిగిన ప్రశ్నలోనే చేతబడికి సమాధానం వుంది. చేతబడి ఉందనుకోవడం ఒట్టి మూఢనమ్మకం.

చేతబడి బాణామతి, మంత్రాలు చేస్తున్నారనే నెపంతో మూఢనమ్మకాల కారణంగా వారిని వెలివేయడం, పండ్లూడగొడ్డడం, మలమూత్రాలను తాగించడం వంటి హింసలకు గురి చేస్తున్నారు. వారిపై దాడులు, హత్యలు ఇంకా సజీవ దహనాలు కూడా సాధారణమైపోయాయి.

తెలంగాణా ప్రాంతంలోని ప్రజలలో ఈ నమ్మకాలు ఎక్కువగా జీర్ణించుకొని పోయి ఉన్నాయి. వరంగల్ జిల్లా తిమ్మాపురం గ్రామంలో ఆగష్టు 2, 2000 సం. నాడు ఈ చేతబడి బాణామతి చేశారన్ననెపంతో ఐదుగుర్ని సజీవ దహనం చేశారు. యావత్ ప్రపంచంతో పాటు మన దేశం కూడా సకల సాంకేతిక రంగాల్లో కంప్యూటర్ వేగంతో ముందుకు వెళ్ళే ప్రయత్నాలు ఒక వంక జరుగుతుండగా, అలాంటి శాస్త్ర సాంకేతిక రంగాలను, విజ్ఞాన శాస్త్ర, వైద్య శాస్త్రం ఫలితాలను అవహేళన చేసేటట్లుగా రాతి యుగంనాటి అంధ విశ్వాసాలు గుడ్డి నమ్మకాలు కొనసాగుతున్నాయంటే ఎంత విచారకరమో ఆలోచించండి.

చేతబడి వంటి నమ్మకాల్ని అటుచదువులేని వారిలోను ఇటు చదువుకొన్న వారిలోను కూడా ఉన్నాయి. కారణమేమిటంటే వారిలో సహేతుక ఆలోచన కోరవడడమే. మూడనమ్మకాలు నమ్మడానికి ప్రధాన కారణం శాస్త్రీయ దృక్పథం లేకపోవడమే.

పిల్లలూ. మీరంతా శాస్త్రీయ దృక్పథం సహేతుకాలోచనాపరులై గ్రామీణ ప్రజానీకం దగ్గరకు ప్రజా సైన్స్ ను ప్రచారం చేస్తే మనం మరింత అభివృద్ధి చెందడంతో పాటు చేతబడి, బాణామతి, మంత్రాలు మానవాతీత శక్తులు వంటి మూఢనమ్మకాల నుంచి ప్రజల్ని బయట పడేయగలం.

బాణామతి, చేతబడి వంటి సంఘటనలు జరిగినప్పుడు అక్కడికివెళ్ళి మీరు పరిశీలించాలి. అక్కడి ప్రజలతో చర్చించి వారిలో శాస్త్రీయ దృక్పథం పెంచాలి. ఆవిషయంలో హేతుబద్దంగా ఆలోచించేటట్లు చైతన్యం తీసుకురావాలి. అలాంటి పరిస్థితి వస్తేనే సమాజం నుండి మూఢనమ్మకాలు దూరం కాగలవు. అశాస్త్రీయ సాహిత్యం సమాజం లోకి రాకుండా చూడడం మనందరి బాధ్యతగా స్వీకరించాలి.

ప్రశ్న అడిగినవారు: డి. శిరీష, టి. చందన, బాపూజీ స్కూలు, హన్నకొండ.

నిర్వహణ : ప్రొఫెసర్ ఎ. రామచంద్రయ్య.

3.03278688525
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు