অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

జంతువుల్లో వేసవి నిద్ర, శీతాకాల నిద్ర

జంతువుల్లో వేసవి నిద్ర, శీతాకాల నిద్ర

8వేసవిలో ఎండలు ముదిరి, ఉప్ణోగ్రత బాగా పెరిగినప్పుడు రకరకల జీవులు ఎలా తట్టుకుంటాయ? మనుషులైతే శరీరం నుండి నీరు ఆవిరైపోకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. బాగా నీళ్ళు, తాగతాం. కానీ తాగటానికి ఆ నీరే కరువైతే... జంతువులు ఏం చేస్తాయి. ఈ విపత్కర పరిస్థితి నుండి ఎలా బయటపడతాయి. చాలా జంతువులు ఎండ తీవ్రత నుండి బయటపడటానికి నిద్రలోకి జారుకుంటాయి. దీనినే వేసవి నిద్ర లేదా ఏస్టివేషన్ (Aestivation) అంటారు. లాటిన్ భాష నుండి ఈ పదం వచ్చింది. ఏస్టాస్ (aestas) అంటే వేసవి అని అర్థం. బావుంది కదా! ఎంచక్కా వేసవి అంతా నిద్రపోవచ్చు. అంటే ఈ కాలంలో జంతువు ‘సుప్తావస్థ’ (Dormaner)లోకి వెళుతుంది. అంటే ఒక అచేతన దశ. జంతువు ఈ కాలంలో ఏ పని చేయకుండా చేష్టలుడిగి ఉంటుంది. శరీరపు జీవన చర్యావేగం (Metabolic rate) మట్టానికి దిగిపోతుంది. ఈ సుస్తావస్థ కేవలం వేసవిలోనే జరగాలని లేదు. కొన్ని సందర్భాల్లో అధిక ఉష్ణం, ఎండలు వుంటే చాలు. నిద్రలోకి పోతాయి. ఈ ప్రక్రియ వెన్నముక్క జీవులు (vertebrates) వెన్నుముక్క లేని జీవుల్లోనూ (Invertebrates) కనిపిస్తుంది.

క్షీరదాలు కాని జంతువుల్లో ముఖ్యంగా తాబేళ్లు, మొసళ్ళు, సాలమాండర్, కొన్ని ఉభయ చరాలు వేసవి నిద్రకు పెట్టింది పేరు. కేన్టోడ్ (canetoad) గ్రోటర్ సైరస్ లు ఎండాకాలం భూమిలోపలికి పోయి అక్కడ వుండే తేమ, చల్లదనాన్ని ఆశ్రయిస్తాయి. కాలిఫోర్నియా ఎర్రకాళ్ళ కప్పను వేసవి నిద్రకు మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇది వేసవి అంతా నేలలోపలి పొరల్లో ఉండి శక్తిని నష్టపోకుండా చూసుకుంటుంది.  అహారలేమి నుండి రక్షణగా వేసవి నిద్ర ఉపయోగపడుతుంది.

కప్పల్లో మరో చిత్రమైన ఏర్పాటును మనం ఆస్ట్రేలియాలో చూడవచ్చు. ఇవి వేసవిలో నీటిని ప్రత్యేకంగా నిల్వ చేసుకుంటాయి.

10ఇసుకలోపలి పొరల్లోకి పోయి తనచుట్టూ నీరుచొరబడలేని లేదా నీరు కారిపోనీ ఒక ముసుగును ఏర్పాటు చేసుకుంటుంది. దీనిని ఒక కప్ప ఒక శ్లేష్మపు (mucus) పొరసు విడుదల చేయటం ద్వారా తనచుట్టూ ముసుగుతొడుక్కుంటుంది. దీనిలోనే నీటిని నిల్వ ఉంచుకొని ఎండాకాలమంతా భూమిలోపల సుప్తావస్థలో జీవిస్తుంది. ఈ రహస్యం తెలిసిన ఆస్ట్రేలియా ఆదిమ తెగల వాళ్లు నీళ్ళు దొరకని సందర్భాల్లో భూమిని తవ్వి కప్పలను బయటకు తీసి అవి తమకోసం దాచుకున్న నీటిని నెమ్మదిగా పిండి తాగేసి కప్పలను మరల అక్కడే వదిలిపెడతారు. చిత్రంగా ఉంది కదా కప్ప ఏర్పాటు చేసుకున్న నీటిబుగ్గ.

క్షీరదాల్లో ఈ ప్రక్రియ లేదనే చెప్పవచ్చు. కానీ 2004లో జర్మనీ దేశస్తుడైనా కాత్రిన్ డైస్మన్ మలగసీ పొట్టికోతి (Malagasy dwarf lemur) సంవత్సరములో ఏడు నెలలు చెట్ల తొర్రల్లో సుప్తావస్థలో ఉంటుందని తెలియజేసాడు.

11వెన్నముక జంతువుల్లోనే కాకుండా అనేక రకాల మెలస్కాజాతి అకశేరుకాల్లో కూడా వేసవి కాల సుప్తావస్తను గమనించవచ్చు. భూమి మీద మనకు కనిపించే నత్తగుల్లలు మంచి ఉదాహరణ. నత్తగుల్ల జాతికి చెందిన హలిక్స్, సెర్ఫుల్లా, తేబా వేసవి తాపం నుండి బయట పడేందుకు సుప్తావస్థలోకి పోతాయి. కొన్ని చెట్ల నీడన పేరుకున్న చెత్తలోకి పెళ్లిదాక్కుంటాయి. మరికొన్ని పెద్ద పెద్ద చెట్ట్ల పైకి పోకుతాయి. అంతేకాదు మనం ఏర్పాటు తేసిన కంచె, అందుకుపయోగించిన స్తంభాల పైకి కూడా ఎక్కి బారులు తీరుతాయి. ఇవి తమ పెంకు తెరుచుకున్న ప్రదేశాన్ని శ్లేష్మపు పొరను స్రవించటం ద్వారా నీరు నష్టపోకుండా సీల్ చేస్తాయి. హెలిక్స్ పొమాటెయా నత్తలు శ్వాస తీసుకునేందుకు, చిన్న రంధ్రం ఉంచి మొత్తాన్ని సీల్ చేస్తాయి. వీటిలో ఈ పొరకు దున్నుగా కాల్షియం కొర్బొనేటుతో తయారైన గట్టి పెంకును గమనించవచ్చు. వీటిలో జీవనచర్య వేగం మందగించి, నీరు నష్టపోకుండా నిద్రలో వుంటాయి.

శీతాకాల నిద్ర (Hibernation)

జంతువులు అతిశీతల వాతావరణం నుండి తమకు తాము కాపాడుకోవడానికి ఎంచుకున్న ప్రక్రియ శీతాకాల నిద్ర (Hibernation). ఇదొక రకం సుస్తావస్థ ఈ జంతువుల్లో శరీర ఉష్ణోగ్రత తక్కువగా ఉండి, తక్కవస్థాయిలో శ్వాసిస్తాయి. వీటి జీవన చర్య వేగం కూడా మందగిస్తుంది. ఆహారకొరత ఉన్న, అతిశీతల వాతావరణం ఆహారాన్ని అలా జాగ్రత్తగా వాడుకునేందుకు తమ శరీరంలో నిల్వ ఉన్న కొవ్వును వాడుకుంటాయి. ఈ ప్రక్రియకు మంచి ఉదాహరణ రొడెంట్లు (rodents). ఇవి ప్రధానంగా కలుగుల్లో జీవిస్తాయి. శీతల వాతావరణంలో  జరిగే ఈ ప్రక్రియ ప్రధానంగా ఆబారాన్ని కాపాడుకునేందుకు జరుగుతోంది. జంతువుల మందగించిన జీవన చర్యవేగం వల్లనే తక్కువ శరీర ఉష్ణోగ్రత ఉంటుంది.  శీతాకాల నిద్ర కొన్ని రోడుల నుండి వారాలు, నెలలకు కూడా విస్తిరించవచ్చు. వాతావరణ ఉష్ణోగ్రత, జంతువు శరీర పరిస్థితి జంతువు శరీరం పై ఉన్న బొచ్చు వంటి అనేక విషయాలపై ఆధారపడి సుస్తావస్థ కాలం ఉంటుంది. ఈ నిద్రలోకి పోయే ముందు జంతువులు ఎక్కువగా తిని రొవ్వురూపంలో శక్తిని నిల్వ చేసుకుంటాయి.

12భూమిపై సంచరించిన ఉడత, రాడెంట్, ఎలుక జాతులు ఇందుకు ఉదాహరణ. ఐరోపా ముళ్ళపంది (European Hedgehog) వంటి కీటకాహార జీవులు, మోనోట్రీములు, మార్సూపియన్ (కంగారు జాతి) జాతుల్లో శీతాకాల నిద్ర కనిపిస్తుంది. వీటిలో శరీర ఉష్ణోగ్రత బయటి వాతావరణ స్థాయికి దగ్గర్లో ఉంటుంది. శ్వాసక్రియ వేగం బాగా తగ్గుతుంది. దీనితో ఇవి దీర్ఘనిద్ర లోకి పోతాయి. ఇవి అప్పుడప్పుడు ఈ నిద్ర నుండి లేచి తమ శరీర ఉష్ణోగ్రత, గుండె కొట్టుకోవడాన్ని సరిచేసుకుంటాయి కూడా. ఇలా అఏవి మధ్యలో నిద్రలోవడం జంతువులో అంతర్గతంగా జరిగే మార్పుల వల్లనే కాని బాహ్యంగా వచ్చే మార్పులు వాటిని నిద్రలేప లేవు. ఈ పరిస్థితి వాటి ప్రాంతాలకు ముప్పుగా కూడా అవి వాటిని సినేసే వాటి కంట్లో పడినప్పుడు పరిణమిస్తుంది.

గబ్బిలాలు, ఎలుగుబంట్లలో కూడా శీతలనిద్రను చూడవచ్చు. కాకపోతే వీటిలో ఈ నిద్ర నుండి మేల్కొంటాయి కూడా. ఏ బాహ్యా ప్రేరణకు నిద్ర నుండి మేల్కొంటాయి కూడా. ఏ బాహ్యా ప్రమాదం లేకుంటే ఇవి శీతాకాలమంతా సుప్తావస్థలోనే గడుపుతాయి. వీటి సిప్తావస్తను కొందరు నిజమైన సుప్తావస్థ గా గుర్తించారు. వారు దీనిని సహజీవనం లేదా శీతాకాల బద్దక జీవనంగా పరిగణిస్తారు.

పక్షుల్లో సైతం ఈ రకపు సుప్తావస్థ  ఉంటుంది. కాకపోతే ఇది ఎంతో కాలం ఉండదు. పైగా దీనిని నిజమైన లుప్తావస్థగా పరిగణించలేము. (హమ్మింగ్ బర్డ్స్, కోలీస్, స్టిప్ట్) శీతల రక్త జీవులైన ఉబయచరాల్లో ఈ ప్రక్రియ సాధారణం. వీటి శరీర ఉష్ణోగ్రతలు బయట వాతావరణం మారితే మారుతాయి. అందుకే శీతాకాలంలో ఉష్గోగ్రతలు తగ్గిపోతే తమను తాము రక్షించుకోవటానికి కప్పలు నీటి మడుగు లోలోపలికి పెళ్ళి తలదాచుకుంటాయి. వేసవి నిద్రకూడా శీతల రక్తజీవుల్లోనే కన్పిస్తుంది. ఇక్కడ అధిక ఉష్ణోగ్రత నుండి కాపాడుకోవటానికి సుస్తావస్థలోకి వెళతాయి.© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate