অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

జనవరి నెల సైన్సు సంగతులు

జనవరి నెల సైన్సు సంగతులు

201 – 1894

ప్రముఖ భారతీయ భౌతిక శాస్త్రవేత్త సత్యేంద్రనాధ్ బోస్ జన్మదినం. వీరు ఆల్బర్ట్ ఐన్స్టీన్ కు సమకాలికులు.

 

 

2 – 1959

21ఆనాటి రశ్యా దేశం వారు మొట్టమొదటి మానవ రహిత “ఛంద్రళోధని” లూనా – 1ని ప్రయోగించారు. ఈ పరిశోధనలకు శ్రీకారం చుట్టబడింది.

 

3 – 1906

18ఖగోళ శాస్త్రవేత్త విలియం మోర్గాన్ జన్మించిన రోడు. ఈయన పాలపుంత సర్పింలాకారంలో ఉన్నదని వివరించారు.

 

 

4 – 1809

22అంధుల కొరకు ప్రత్కేక లిపిని పూరొందించిన లూయిస్ బ్రెయిల్లీ జన్మించిన రోడు.

 

 

5 – 1555

24సేఫ్టీ రెజర్ ను తయారుచేసిన కింగ్ క్యాంప్ గిల్లెట్ జన్మించిన రోజు.

 

 

8 – 1642

భౌతిక శాస్త్ర పితామహుడు హెలిలియో గెలీలి మరణించిన రోజు. ఈయన ఖగోళశాస్త్ర  పరిశోధనలకు ప్రథమంగా టెలిస్కోపును వాడారు.

9 – 1922

మన దేశంలో జన్మించి అమెరికాలో స్థిరపడిన హర్ గోవింద్ ఖొరానా జన్మదినం ఈరోజే. వీరు 1968 సం.లో వైద్యశాస్త్రంలో వోబెల్ బహుమతి పొందారు.

12 – 1895

ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరిజిల్లాల్లో జన్మించి, అమెరికాలో స్థిరపడిన ప్రముఖ జీవ రసాయన శాస్త్రవేత్త డా.యల్లా ప్రగడ సుబ్బారావు గారి జన్మదినం ఈ రోజే. ఫోలిక్ ఆమ్లం, టైట్రాసైక్లిక్న్లు, కాన్సర్ నిరోధక ఔషధాలు తయారు చేశారు. 1995 సంవత్సరాన్ని సుబ్బారావు గారి శతదిలోత్సవ సంవత్సరంగా జరుపుకున్నారు. వీరిని “అద్భుత ఔషధ సృష్టికి మంత్రగాడు” అని అంటారు.

14 – 1742

25బ్రిటిష్ గణిత, ఖగోళ శాస్త్రవేత్త ఎడ్మండ్ హేలీ మరణించిన రోజు. హేలీ మొట్టమొదటిసారిగా తోకచుక్క తిరిగి రావడాన్ని ఖచ్చితంగా లెక్కించి చెప్పారు. ఒక కాంతివంతమైన తోకచుక్కకు హేలీ పేరుపెట్టడం జరిగింది.

 

 

16 – 1961

భారతదేశపు రెండవ శోధనా రియాక్టర్ “సైరస్” (Cirus) ప్రారంభించిన రోజు.

18 – 1736

27ఆవిరితో పనిచేసే ఇంజన్ ను రూపొందిచిన బ్రిటీషు ఇంజనీరు జేమ్స్ వాట్ జన్మదినం. అంతర్జాతీయ ప్రమాణాల్లో శక్తికి ప్రమాణంగా వాట్ పేరును వాడుతున్నారు.

 

 

23 – 1907

28జపాన్ దేశానికి చెందిన భౌతిక శాస్త్రవేత్త హిడికి యుకావా జన్దినం. మెసానులు అనే మౌలిక కణాలున్నాయని ముందుగానే లెక్కించి చెప్పింన పరిశోధనకు గాను 1949లో నోబెల్ బహుమతి లభించింది.

 

 

24 – 1966

భారతీయ శాస్త్రవేత్త హోమీ జహంగిర్ భాభా విమాన ప్రమాదంలో మరణించిన రోజు. దేశంలో అణుశక్తి పరిశోధనలకు పునాదులు వేశారు. ముంబాయి సమీపంలో ఉన్న “భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్” వీరు స్థాపించినదే.

25 – 1627

వాయువులు ధర్మాలకు సంబంధించి అనేక పరిశోధనలు జరిపిన ఐరిష్ శాస్త్రవేత్త రాబర్ట్ బాయిల్ జన్మదినం. మూలకం, ఆమ్లము, క్షారము వంటి భావనలు వీరు ప్రతిపాదిచినవే.

26 – 1823

29బ్రిటీష్ డా. ఎడ్వర్డ్ జెన్నర్ మరణించిన రోజు. టీకాలను ప్రారంభించినది వీరే.

 

 

29 – 1986

ఈ రోజున అమెరికన్ స్పేస్ షటిల్ “చాలెంజర్” ప్రయోగించబడింది. అయితే అది ప్రయోగించబడిన 73 సెకన్లకు పేలిపోయి దానిలో ఉన్న ఏడుగురు వ్యామోగాములు మరణించారు.

31 – 1913

30అమెరికా రసాయన శాస్త్రవేత్త ఇర్వింగ్ లాంగ్ ముర్ జన్మించిన రోజు, పలుచని పొరలు, తాలాలుకు సంబంధించి చేసిన పరిశోధనలకు నోబెల్ బహుమతిని పొందారు.

 © 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate