పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

జపాన్

అభివృద్ధి గురించి, కష్టించి పనిచేసే ప్రజల గురించి ఎవరు మాట్లాడినా జపాన్ దేశాన్ని ఆదర్శంగా చెబుతారు.

1అభివృద్ధి గురించి, కష్టించి పనిచేసే ప్రజల గురించి ఎవరు మాట్లాడినా జపాన్ దేశాన్ని ఆదర్శంగా చెబుతారు. రెండవ ప్రపంచ యుద్ధంలో సర్వ నాశనమైన దేశాన్ని ఇరవై సంవత్సరాల కాలంలోనే పునర్నిర్మించి ఆర్థికాభివృద్ధిలో అగ్రదేశంగా నిలబెట్టారు జపాన్ ప్రజలు. అభివృద్ధిని, జాతీయతను మేళవించి సంప్రదాయాన్ని కాపాడుకునే విషయంలోనూ జపాన్ ఆదర్శమే. అణుమారణ మారణహోమాన్ని చవిచూసిన ఏకైక దేశం కూడా జపానే.

అత్యంత నైపుణ్యంతో అనేక రకాలైనా ఉత్పత్తులతో ప్రపంచాన్ని నింపేస్తున్న జపాన్ ఒకే భూఖండం కాదు, 6,852 ద్వీపాల సముదాయం, అందులో హెన్షు, హైకైడో, క్యుషు, షికోకు అనేవి పెద్ద ద్వీపాలు. ప్రపంచానికి దినం మొదలయ్యేది జపాన్ లోనే. అందుకే “Land of Rising Sun” అంటారు. ఆసియా ఖండానికి తూర్పుక చివరి పస్ఫిక్ మహాసముద్రం ఉండే జపాన్ ద్వీప సముదాయానికి రాజధాని “’టోక్యో నగరం” 3 కోట్ల, జనాభాతో ప్రపంచంలోనే అతి పెద్ద జన సాంద్రత కలిగిన నగరం కూడా టోక్యో.

213 కోట్ల జనాభా కలిగిన ఈ దేశంలో 98.5% శాతం జపాన్ జాతీయులే, మిగిలిన జనాభాలో 0.5% కొరియన్లు 0.4% చైనీయులు కాగా మిగిలిన 0.6% శాతం ఇతర జాతీయాలు, ఈ దేశ ప్రజల భాష “జపానీస్” కానీ అధికార భాష అంటూ ఏదీ లేదు. భూ విస్తీర్ణం 377,944 చదరపు కిలోమీటర్లు, పార్లమెంటరీ ప్రజాస్వామ్య దేశమే అయినా ఈ దేశానికి చక్రవర్తి కూడా ఉన్నాడు. అయన పేరు “అకిహిటో”. ఈ దేశ కరెన్సీని ”యెన్”గా వ్యవహరిస్తారు.

ప్రపంచంలో ఎన్నో దేశాలకు వెళ్ళి చదవచ్చు. పని చేయవచ్చు. కారణం, ఆ దేశాల్లో ఇంగ్లీషు ఉంటుంది. కానీ జపాన్ లో ప్రజలు, విద్యార్థులు జపాన్ భాషలోనే చదువుకుంటారు. వారి అభివృద్ధికి కారణం మాతృభాషలో ఉండడమేనని విద్యావేత్తలు పేర్కొంటారు.

3.0
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు