పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

జిల్లేడు

జిల్లేడు ఉపయోగాల గురించి తెలుసుకుందాం.

mar021.jpgజిల్లేడు చెట్టు చూడని వారు ఉండరు. ఎక్కడ చెత్త చేరుతుందో ఎక్కడ జనసంచారం తక్కువగా ఉంటుందో అక్కడ జిల్లేడు చెట్లు మొలుస్తాయి. స్కూలు గ్రౌండలో, కాలి నడకన వెళ్ళే దారికి అటూ, ఇటూ, రైల్వేపట్టాలకు పక్క నుండే స్థలాలలో ఇది విరివిగా కనిపిస్తుంది. మన వాళ్లు వినాయక చవితి రోజు దీని పూలను దండకట్టి వినాయకుడికి మెడలో అలంకరిస్తారు. మనలో చాలా మంది ఇది పిచ్చి చెట్టుగా అనుకొంటుంటాం. కొంతమంది దీని పాలలో, ఆకులలో విషం వుంటుందని కూడా నమ్మతుంటారు. ఇది ఆసియా దేశాలైన థాయ్ లాండ్, సింగపూర్, శ్రీలంక, చైనా మరియ ఇండియాలో విరివిగా పెరుగుతుంది. దీన్ని ఉత్తర భారతదేశంలో .. మేదార్ అంటారు. ఇది ఎంత ఉపయోగపడే చెట్టో తెలిస్తే ప్రతి ఒక్కరూ దీన్ని ఇంట్లో తులసిచెట్టుతో సమాన గౌరవం ఇచ్చి పెంచుకుంటారు. దీనివల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకుందామా!

  • mar022.jpgపాము కరిస్తే విషప్రభావం తగ్గించడానికి దీని ఆకులు నమిలిస్తారు. దీని వేరు నుంచి తీసిన రసాన్ని పాము కాటేసిన చోట వేస్తారు.
  • దీని ఆకుల నుంచి తీసిన రసాన్ని తేనెలో కలిపి త్రాగితే జ్వరం తగ్గిపోతుంది.
  • దీని రసం త్రాగితే కడుపులో ఉండే నులి పురుగులు చనిపోతాయి.
  • ప్రేవులలో ఉండే పుండ్లు (ULCER) తగ్గడానికి దీని ఆకులను ఎండబెట్టి పొడిచేసి పాలలో కలిపి తాగిస్తారు.
  • దీని రసం విరేచనం అవడానికి మలబద్దకం పోవడానికి వాడుతుంటారు.
  • కీళ్లనొప్పులు పోవడానికి వీటి ఆకుల నుండి వచ్చే పాలను పూస్తారు.
  • నరాల బలహీనతకు, అస్థమాకి, రక్తప్రసరణకి మరియు చర్మవ్యాధులకు కూడా ఇది ఉపయోగపడుతుంది.

ఇప్పుడు ఒప్పుకుంటారా ఈ మొక్క మానవాళికి ఉపయోగపడే అత్యంత అద్భుతమైన మొక్క అని.

ఆధారం: సి.ఆనంద్

3.00284900285
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు