పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

జీవం పుట్టుక – పరిణామం

ప్రి కేంబ్రియన్ మహాయుగం

(The precambrain era)

feb14.jpg450 కోట్ల సంవత్సరాలనుండి 57 కోట్ల సంవత్సరాల మధ్య కాలం అంటే సుమారు 393 కోట్ల సంవత్సరాలు. భూమి పుట్టిన 100 కోట్ల సంవత్సరాలకు, అంటే ఇంత క్రితం 350కోట్ల సంవత్సరాలప్పుడు ఏకకణ జీవులు అంటే బాక్టీరియా కేంద్రక పూర్వ జీవులు ఆవిర్భవించాయి. ఇంత క్రితం 140 కోట్ల సంవత్సరాలప్పుడు ఆల్గే లాంటి నిజ కేంద్రక జీవులు రూపొందాయి. కేంద్రక పూర్వ బాక్టీరియా నుండి నిజ కేంద్రక ఆల్గే (Eucarydic Algae) గా పరిణామం చెందడానికి 210 కోట్ల సంవత్సరాల కాలం పట్టినది. తొలి బహుకణ జీవి రూపొంది నేటికి 70 కోట్ల సంవత్సరాలు అయి౦ది. నిజ కేంద్రక ఏకకణ జీవి నుండి సరళ బహుకణ జీవిగా పరిణామం చెందడానికి సుమారు 70 కోట్ల సంవత్సరాలు పట్టినది. ఈ బహుకణ జీవుల దేహాలు చాలా మెత్తగా ఉండేవి. పురుగుల్లాగా, జెల్లీ చేపల్లాగా సున్నితంగా ఉండేవి. కాని ఈనాడు ఉన్న బహుకణ జీవులేవి వాటి వారసులు కాదు. అవి అప్పుడే అంతరించి పోయాయి. అవి పరిణామ ప్రయోగాలుగా మిగిలిపోయాయి. వాటి సంతతిని వృద్ధి చేసుకోలేక పోయాయి.

పురాజివ మహాయుగం

(The Palaeozoic era)

కేంబ్రియన్ యుగం: (The cambrain period):57 కోట్ల సంవత్సరాలనుండి 50కోట్ల సంవత్సరాల మధ్యకాలం జీవకణంలో భాగంగా హరితరేణువు రూపొందింది ఈ కాలంలోనే. కిరణజన్య సంయోగ క్రియ అంటే బాక్టీరియా , ఆల్గే, ఫంజి జీవులు బాగా ఉనికిలోకి వచ్చాయి. feb15.jpgదీనివలన స్వేచ్చా ఆక్సిజన్ వాతావరణంలోనికి వచ్చి చేరినది. దీంతో రకరకాల జీవరాశులు రంగం మీదకు వచ్చాయి. గట్టి పెంకువంటి నిర్మణాలుగల రకరకాల బహుకణ జీవులు ఆవిర్భవించాయి. ఇవే ఈ రోజున వెన్నెముక లేని జీవులకు పూర్వీకులు. కేంబ్రియాన్ యుగానికి చెందిన కెనడియన్ రాతి పర్వతాలలోని బర్జన్ షేర్ ప్రాంతంలో ఎక్కువగా శిలాజాలు దొరికాయి. కొన్ని శిలాజాలు చాలా విచిత్రంగా వున్నాయి. ఐదు జతల కళ్ళుగలవి, వింతగోలిపే టెంటాకిల్ నిర్మాణాలు గలవి. సైన్స్ ఫిక్షణ్ నవలల్లో గల జీవుల లాంటివి ఉన్నాయి. వీటికి నేటి జీవులకి పోలికే లేదు. ఇలాంటివి ఆ తర్వత మరలా ఇతర శిలాజ ప్రాంతాలలో లభించలేదు. అంటే వరిణామ క్రమంలో ఈ వింత జీవుల విఫలమయినాయి.

ఆర్డోవిసియన్ యుగం

(The ordovician period)

50 కోట్ల సంవత్సరాలనుండి 4.35 కోట్ల సంవత్సరాల మధ్యకాలం తొలి శీతల యుగం తర్వాత భూమి మెల్లమెల్లగా వేడెక్కనారంభించింది. అగ్ని పర్వత పేలుళ్ళు కొనసాగాయి. ఉత్తర అమెరికాలో అప్పలాచియన్ పర్వతాలు ఏర్పడ్డాయి. సున్నాన్ని స్రవించే ఆల్గే ఎక్కువగా ఏర్పడ్డాయి. ఫలితంగా సముద్రపు అడుగున సున్నపు బండలు ఏర్పడ్డాయి. చేపల లాంటి తొలి వెన్నెముక జీవులు ఈ కాలంలో ఏర్పడ్డాయి. వీటికి బారి రక్షణ కవచాలుండేవి. ఆనాటి సముద్రాలలో ఈ జీవులు అధికంగా ఉండేవి.

సైలెరియాన్ యుగం

(The Silerian period)

feb13.jpg43.5 కోట్ల సంవత్సరాల నుండి 41 కోట్ల సంవత్సరాల మధ్య కాలం. ఉత్తర అమెరికా ఐరోపా తొలుత విడివిడిగా ఉండేవి. ఈ యుగాంతానికి అవి రెండూ దగ్గరయ్యాయి. యురామేరికా గా రూపొందాయి. అవి ఢీకొన్నందున కెనడాలో కేలడోనియన్ పర్వతాలు ఏర్పడ్డాయి. వాతావరణం వేడెక్కింది. కొన్ని ప్రాంతాలలో ఎడారి పరిస్దితులు ఏర్పడ్డాయి. దవడలు లేని చేపలు ఆ కాలంలో సాధారంగా ఉండేవి. మొట్టమొదటి దవడ గల చేప ఈ కాలంలోనే రూపొందింది. సముద్రాలలో తేళ్ళు ఉండేవి. సముద్రపు అలుపుమొక్కలు సర్వసాధారణంగా ఉండేవి. ఆకులులేని, వేర్లులేని తొలి నేల మీద పెరిగే మొక్కలు ఈ యుగంలో ఆవిర్భవించాయి.

డివోనియన్ యుగము

(The Devonian period)

41 కోట్ల సంవత్సరాల నుండి 36 కోట్ల సంవత్సరాల మధ్యకాలం. వాతావరణం ఇంకా వేడేక్కింది. పొడిగా మారింది. సముద్రాలు ఎండిపోయాయి. అక్కడక్కడా నీటినేలవులు ఏర్పడ్డాయి. లోతు తక్కువ సముద్రాలలో సరస్సులలో రకరకాల చేపలు విరివిగా ఉండేవి. అందుకే ఈ యుగాన్ని చేపల యుగం నేల మీదకు వచ్చాయి. అంచున ఈకలు గల చేపలు కొన్ని బలమైన ఈకలను ఏర్పరచుకున్నాయి. ఇవి ఎండిపోయే నీటిమడుగునుండి మరొక మడుగు లోనికి ప్రాకేదానికి ఉపయోగపడ్డాయి. ఆ విధంగా తొలి ఉభయచర (నేలమీద, నీటిలోనూ సంచరించే) జీవులు రూపొందాయి. ఇక్తియోస్టిగా అనే జీవి కాళ్ళు ప్రక్క ఈకలనుండి రూపొందాయి.  దీని తోక మాత్రం చేపతోక లాగే ఉంటుంది. ఇక్తియాస్టిగా చేపలకు ఉభయచరాలకు మధ్యగల లింకుగా భావిస్తూన్నారు.

ఉభయ చరాలలో గాలిని నింపుకోగల ఊపిరితిత్తులు ఉంటాయి. కాని జలచర జీవ లక్షణాలనూ కలిగి వుంటాయి. అవి గుడ్లను నీటిలోనే పెడతాయి. ఆ గుడ్లకు నీటిలో ఉండేదానికి అనుకూలంగా జెల్లీలాంటి రాక్షస కవచం ఉంటుంది. మాన్ మొక్కులు ఫెర్న్ మొక్కలు ఈ కాలంలో ఉనికిలోకి వచ్చాయి. ఇవి నేలమీది మొక్కలే అయినా నీటిమొక్కల లక్షణాల వీటికి ఉంటాయి. ఉదాహారణకు మొక్కలు శుకక్రణాలు నీటిలో ఈది అండంలో ఫలదీకరణం చెందాల్సిందే.

కార్బోనిఫెరస్ యుగం

(The Carbiniferous period)

36 కోట్ల సంవత్సరాలనుండి 29 కోట్ల సంవత్సరాల మధ్యకాలం. ఈ యుగంలో వాతావరణం వెచ్చగా తేమగా ఉండేది. చిత్తడి నేలలు ఎక్కువగా ఉండేది. కాని దక్షిణార్ద గోళంలో మంచు ఎక్కువగా ఉండేది. ఉభయచరాలు సర్వసాధారణం. ఈ యుగంలోనే ఉభయచరాలనుండి తొలి సరిసృపాలు(ప్రాకేడి జంతువులు/Reptiles) అభివృద్ది చెందాయి. ఈ తొలి సరీసృపాలు గట్టి కవచం గల గ్రుడ్లను నేలమీద పెట్టేవి. దీనితో నీటి అనుబంధాన్ని పోగోన్నుకున్నట్లు అయినది. ఉభయ చరాలకు, సరిసృపాలకు మధ్యగల లింకుకు ఉదాహరణ సిమోరియా జీవి.

feb16.jpg25సెం.మీ నిడివిగల రెక్కల తూనీగలు ఈకాలంలో ఉండేవి. రాక్షస బొద్దింకలు ఈ కాలంలో ఉన్నాయి. సముద్రాల ఎత్తులు మార్పులు చెందాయి. ఫలితంగా వరదలు ఏర్పడ్డాయి. ఆనాటి వృక్ష సంపద పై ఇసుక బురద మేట వేసినది. వృక్ష కళేబరాలు సరిగా కుళ్ళలేదు. అందువలన పాచి పట్టినట్లుండేది. ఆ తర్వత క్రమేణా బొగ్గుగా రూపాంతరము చెందినది.

ఉత్తరార్ధగోళంలో బొగ్గు నిక్షేపాలు విరివిగా ఏర్పడ్డాయి. అందుకే ఈ యుగాన్ని కార్బోనిఫేరస్ యుగం అన్నారు. విత్తనాలు గల ఫేర్నులు, వివృత బీజాలు కోనిఫెర్ వృక్షాలు ఈ కాలంలో ఉనికిలోనికి వచ్చాయి.

పేర్మియన్ యుగం

(The Permian period)

29 కోట్ల సంవత్సరాలనుండి 24కోట్ల సంవత్సరాల మధ్యకాలం వాతావరణం వెచ్చగా, పొడిగా ఉండేది దక్షిణార్దగోళంలో శీతల పరిస్దితులు ఉండేవి. దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఇండియా, ఆస్ట్రేలియా , అంటార్కిటికా న్యూజిలాండ్ లను కలిగిన భూ ఖండాన్ని గొండ్వానా ల్యాండ్ అంటారు. ఈ గొండ్వానా ల్యాండ్, ఆసియా భూఖండం యూరామేరికాతో కలిసిపోయినది. ఫలితంగా ఈ కాలం లో ఒకే ఒక పెద్ద భూఖండం పాంజియా గా ఏర్పడినది. ఈ ఖండాలన్నీ డీకొట్టుకొని ఇలా కలవడం వలన ఆల్ఫ్స్ పర్వతాలు రూపొందాయి. బొగ్గుతో కూడిన చిత్తడినేలలు అంతరించాయి. రకరకాల సరిసృప జాతుల సంఖ్య విపరీతంగా పెరిగింది. విపు చేపరేక్కల వంటి నిర్మాణ గల వింతజీవి. డిమేట్రోడన్ ఈ కాలంలో ఉండే ఉభయజీవులు కూడా కొనసాగుతున్నాయి. ఆధునిక కీటకాలు ఉనికిలోనికి వచ్చాయి. చేపలు పెద్ద ఎత్తున అంతరించాయి. కోరల్స్ లాంటి సముద్రజీవులు అంతరించాయి. ఎండిపోయిన పరిస్ధితుల్లో చిత్తడి నేలలు తగ్గిపోయాయి. చిత్తడి నేలల్లో నివసించే హార్ టేయిల్స్ క్లబ్ మాస్ వంటి మొక్కలు అంతరించాయి. కోనిఫెర్ వృక్షాలు-వివృత బీజాలు, మెయిడేన్ హెయిర్ వృక్ష జాతులు జింకో వృక్షాలు ఉనికిలోనికి వచ్చాయి.

3.03237410072
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు