పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

జీవం పుట్టుక – పరిణామం

మధ్య జీవ మహాయుగంలోని జీవ పరిణామం గురించి తెలుసుకుందాం.

ట్రయాసిక్ యుగం (The Triassic Period)

jeevam1భూమండలం మీద కొన్ని ప్రాంతాలు పొడిగా వేడిగా ఎడారిని తలపిస్తూ ఉండేవి. పెర్నియన్ యుగంలో ఆవిర్భవించిన సరీసృపాలు విస్తరించాయి. జనాభా పెరిగింది. ఈ సరీసృపాలు నుండే ఒక శాఖ డైనోసారులుగా రూపాంతరం చెందాయి . గ్రీకులో దైనోస్ (Deinos) అంటే రాక్షస (భయంకర) అని అర్ధం. సారస్ (sauros) అంటే బల్లి (ప్రాకెడిది) అని అర్ధం.

కోర్బోని ఫెరస్ యుగంలో భూమి మీదికి వలస వచ్చిన ఉభయ చరల్లోని ఒక శాఖ నుండి సరిసృపాలు రూపొందాయి. పేర్మియన్ యుగంలో సరీసృపాలు అభివృద్ధి అయినాయి. ట్రయాసిక్ యుగం లో ఈ సరిసృపాలే డైనోసారుగా అవతరించాయి. ఈ డైనోసారుల నుండి కొన్ని మరలా వెనక్కు అంటే సముద్రంలో కి వెళ్ళాయి. చేపలాంటి రూపాన్ని పొందాయి. వాటిని సముద్ర సరీసృపాలు అంటారు.

ఉదా: ఇక్తియోసారస్ (ichthyo-saurs). ఇక్తస్ (Ikhthus) అనగా చేప అని గ్రీకు అర్ధం.

సరీసృపాల నుండే పాలిచ్చి పెంచే స్ధన్యజీవులు (Mammals) పరిణామం చెందాయి. ఇవి చకచక పరుగేడగల పొట్టి జీవులు. చుంచులు, ఎలుకలు లాంటివి. వివృత బీజాలైన కొనిఫర్ వృక్షాలు, జింకో వృక్షజాతులు విరివిగా వుండేవి. వీటి పై వుండే కీటకాలను ఈ స్ధన్య జీవులు తిని బతికేవి. అప్పుడప్పుడే వివృత బీజలైన సెకస్ జాతులు కూడా ఉనికి లోనికి వచ్చాయి.

సముద్ర సరీసృపాలు:

దైనోసారులు

సరీసృపాలు

పాలిచ్చి పెంచే జీవులు స్ధన్య జీవులు

జురాసిక్ యుగం (The Jurasic Period)

jeevam2ఈ యుగంలో అంతకు ముందున్న “పాంజియా” అనే ఒకే ఒక పెద్ద భూ భండం ముక్కలైంది. రెండు ముక్కలుగా దూరం జరిగాయి. మధ్య సముద్రం వరదలా ముంచెత్తింది. మధ్యలో అట్లాంటిక్ సముద్ర మేర్పడింది. పైన అంటే ఉత్తరాన లారేషియా, క్రింద అంటే దక్షిణాన గొండ్వానాల్యాండ్ లు ఏర్పడ్డాయి.

నిజానికి మధ్యయుగం లోని జురాసిక్ యుగమే సరీసృపాల స్వర్ణ యుగం. ఎందుకంటే ఈ డైనోసారులు పలు విధాలుగా విస్థారించాయి. అంతేగాదు అధిక సంఖ్యలో ఉండేవి. కొన్ని శాఖాహారులో ఉండేవి. కొన్ని శాఖాహరులు, కొన్ని మాంసా హరులు. రకరకాల ఆకారాలు, సైజులలో ఉండేవి.

టిరోసార్స్ (Pterosors) అనే డైనోసార్ కు పొడవాటి రెక్కలుండేవి. టిరాస్ (Pteron) అనే గ్రీకులో రెక్క అని అర్ధం. తొలి పక్షి అర్కియోప్టేరిక్స్ (aschaeopteryx) సరిసృపాల నుండి. ఈ కాలంలోనే పరిణామ క్రమంలో ఉనికిలోనికి వచ్చంది. ఈ పక్షికి ఈకలుండేవి. దంతాలు గల దవడలుండేవి. రెక్కలకు పంపుదిరిగిన గోళ్ళు౦డేవి. ఈ పక్షులు వికారంగాను గోళ్ళ చిటారు కొమ్మల పై ప్రాకేదానికి ఉపయోగపడేవి. ఆ కాలంలో కొనిఫెర్ వృక్షాలు మెయిడెన్ ఫెయిర్ వృక్షాలు విరివిగానుండేవి.

క్రటేషియన్ యుగం (The cretaceous period)

jeevam3కదలిక కొనసాగింది. గొండ్వానా ల్యాండ్ నుండి భారతదేశం విడిపోవడం మొదలైంది. అండిస్ మరియు రావి పర్వతాలు ఏర్పడ్డాయి. క్రటేషియస్ యుగం చివరి పాదంలో అగ్నిపర్వతం పేలుళ్ళు జరిగాయి. లావా ప్రవహించింది. అలా ఏర్పడిందే భారత దక్కను పిటభూమి. ఈయుగా ప్రారంభంలో డైనోసారులు ప్రబలంగా ఉన్నా చివరకు అంతరించాయి. ఈ కాలంలో చాలా పక్షిజాతులు చిన్న చిన్న స్ధన్యజివులు ఉనికిలో ఉన్నాయి. నాటి అర్కియోప్టేరిక్స్ పక్షిలాగ ఈ కాలపు నీటి పక్షులలో దంతాలు ఉండేవి.

నేటి ఆఫ్రికా, దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా మరియు పవువా న్యూగినియా, స్యుజిలాండ్ లు గొండ్వాన ల్యండులో ఒకనాడు కలిసి ఉండేవి. తర్వాత విడిపోయినాయి. వీనిని గొండ్వానా సంబంధ ఖండాలు ఉంటారు. పురాతన ఎగరలేని పక్షుల ప్రత్యెక విస్తరణకు ఈ గొండ్వానా ల్యాండ్ కారణం. ఎగరలేని పక్షులు ఈ గొండ్వానా ల్యాండ్ ఖండాలలోనే విస్తరించి ఉండేవి. ఆఫిక్రా ఖండం ఆస్ట్రిచ్ (Astrich), దక్షిణ అమెరికా రియా (Rhea), ఆస్ట్రేలియా మరియు పవువా న్యూగినియా కాస్సోవారి (Cassowary), న్యూజిలాండ్ కివి (kiwi) పక్షుల పూర్వికుల స్ధానం గొండ్వానా ల్యాండ్. అది విడిపొయినప్పుడు పూర్వికులు విడిపోయిన ముక్కల్లోకి చేరి తమదైన ప్రత్యేకక శైలిలో పలు రకాలుగా పరిణామం చెందాయి. కాని ఉమ్మడి పూర్వికులు గనుక ఉమ్మడి లక్షణం ఎగరలేకపోవడం మాత్రం అలానే ఉండిపోయింది. కాని భారతదేశంలో ఎగరలేని పక్షులు, వాటి జాతులు లేవు, గొండ్వానా నుండి భరతం విడివడిన తర్వాత గొండ్వానాలో ఎగరలేని పక్షల పూర్వికులు రూపొంది ఉంటాయి. కాని మిగిలిన ఖండాలలోకి ఆ పూర్వికులు వచ్చి చేరాయి. ఆ తర్వాత వేర్వేరు పక్షి జాతులు దగ్గరి సంబంధం గలవి రూపొందాయి. పరిణామం చెందాయి.

న్యూజిలాండ్ స్ధన్యజివులు లేవు. ఉమ్మడి ఖండం నుండి స్ధన్యజీవుల పూర్వికులు ఈ ప్రాంతానికి ప్రవేశించకమును పై న్యూజిలాండ్ విడిపోయి ఉండవచ్చు. పక్షులు వేగంగా అన్ని ప్రాంతాలకు విస్తరించగలవు గనుకు న్యూజిలాండ్ కు చేరి ఉంటాయి. ఎగరలేని పక్షులైనా వీటి రెక్కలు వేగంగా నడిచేదానికి దూరప్రయాణాలు చేసిదానికి క్రమంలో ఇది చాలా ఆసక్తికరమైన అంశం.

టేర్షరి యుగం (Tertiary Period)

వాతావరణం చల్లదనం నుండి వెచ్చదనంలోకి మారింది. ఖండాల కదలిక వలన పర్వతాలు రూపొందడం మొదలైంది. భారత ఫలకం (Indian Plate). ఆసియా ఫలకం (Asian plate) తో డి కొనింది. ఫలితంగా హేమాలయ పర్వతాలు ఏర్పడ్డాయి. ఆల్ఫ్స్ పర్వతాలు, రాకీ పర్వతాలు, కాస్కేడ్ పర్వతాలు కూడా ఖండాలు ఢీకొన్నందున ఏర్పడినవే. సముద్రాలలో సొర చేపలు, ఎముక చేపలు పుష్కలంగా ఉండేవి. క్షీరదాలు సర్వసాధారణం ముఖ్యంగా శాఖాహారులు భిన్న రూపంలో విస్తరించాయి. పుష్పించే మొక్కల ఆకులను ఆహారంగా తీసుకొనే జంతువులు తొలుత ఎక్కువగా ఉండేవి. వాతావరణం పొడిగా తయారవడం వలన గడ్డిభూములు ఏర్పడ్డాయి. ఫలితంగా గడ్డిని ఆహారంగా తీసుకొనే జంతువులు రూపొందాయి. మొత్తంమీద ఆకులు మేసేవి. గడ్డిని మేసేవి గడ్డి మైదానాలను ఆవాసంగా చేసుకున్నాయి.

ఈ యుగంలోనే తోకలేని కోతి పూర్వికుల నుండి పరిణామ క్రమంలో మానవుడు రూపొందడం ప్రారంభించాడు.

క్వార్టెర్నరి యుగం (Quarternary Period)

ఈ యుగాన్ని రెండు శకాలుగా విభజించారు.

ఎ. ప్లిస్తోసిన్ శకం (Pleistocene epoch): ఈ శకంలో నాలుగు సార్లు హిమికర్ణం (glacitations) జరిగింది. అంటే వాతావరణం నీరు అతిశీతలం గావడం మంచుకొండలేర్పడడం నాలుగు పర్యాయాలు జరిగాయి. ఇందంతా 20 లక్షల సంవత్సరాల కాలంలోనే జరిగాయి. ఉత్తరార్ధ గోళంలోనూ, ఐరోపా, ఆసియా ఉత్తర అమెరికా మొత్తం మంచుతో నిండిపోయాయి. శీతల సమయాల్లో జీవజాలం స్దిబ్బతకు లోనయ్యేది. వాతావరణం వెచ్చబడగానే జీవరాశులు చురుకుగా మారేవి. చాలా ప్రదేశాల్లో కొన్ని జీవ జాతులు అంతరించేవి. బ్రతికి బట్టకట్టిన జివరాశులు వాటి జనాభాను పెంచుకోనేవి. వాటి జనాభాను పెంచుకొనేవి. వాతావరణాన్ని తట్టుకోగాలిగేవి. మానవుడు తన పరిణామాల్ని కొనసాగించాడు.

క్షీరదాలు రకరకాలుగా విస్తరించాయి. ఉత్తరార్ద గోళంలో, బొచ్చు ఖడ్గమృగాలు, బొచ్చు ఏనుగులు రంపంలాంటి దంతాలు గల పులులు ఏర్పడ్డాయి.

హూలోసిన్ శకం: ఇది ఇటివలి శకం. మనం కూడా ప్రస్తుతం ఈ శకానికి చెందినవారమే. వాతావరణం వెచ్చబడింది. ప్రస్తుత వాతావరణం ఏర్పడింది. బొచ్చు ఏనుగులు, బొచ్చు ఖడ్గ మృగాలు అంతరించాయి.

డైనోసారుల గురించి

jeevam4ఇంతక్రితం 23 కోట్ల సంవత్సరం నుండి 16 ½ కోట్ల సంవత్సరాల మధ్యకాలం సరిసృపాల స్వరణయుగం. నాటి పెద్ద పెద్ద సరిసృపాలయిన డైనోసారులు అంతరించాయి. అందులో 350 జాతుల శిలాజాలు మాత్రమే తెలుసు. ఇంకా శిలాజాలు వెలుగులోకి రావాల్సి ఉంది.

డైనోసారులను ప్రధానంగా రెండు గ్రూపులుగా విభజించారు.

1. బిల్ల లాంటి నడుము ఎముకను కలిగినవి : ఇవి మరలా రెండు రకాల శాఖాహార సారోపాడులు (Sauropods) మరియు మాంసాహార ధీరోపాడులు. శాఖాహార సారోపాడులకు ఉదాహరణ బ్రాకియోసారస్ (Bracheosaurus) ఇది 23 మీటర్లు పొడవు ఉంది 50టన్నుల బరువు ఉండేవి. ఇవి నాలుగు కళ్ళ ప నడిచేవి. 12 మీటర్లు ఎత్తున ఉండే చిటారు కొమ్మలు ఆకులను సైతం తినేసేవి.

శాఖాహార సారోపాడుల గ్రూపుకు చెందిన మరొక ఉదాహారణ డిప్లోడాకస్ (Diplosocus). ఇది 27 మీటర్ల పొడవు ఉండేది. బహుశ ఇదే ఇప్పటివరకు వెలసిన అది పొడవైన భూచర జంతువు.

సారోపాడులు రాజ్యమేలేటపుడు పుష్పించే మొక్కలు లేవు. కోనిఫెర్ , సేకడ్ , మెయిడేన్ హెయిర్ వృక్షాల ఆకులు తిని బ్రతికేవి.

మాంసాహార ధారోపాడులు బలమైన వెనుక కాళ్ళతో నడిచేవి. ముందుకాళ్ళు చాలా చిన్నవి. ఉదాహరణకు టిరానోసారస్ రెక్స్ (Tyraunosaurus rex) ఇది కూడా చాలా పెద్ద జంతువే. ఇది దంతాలు గల దవడలు గలది. తీక్షణమైన చూపుగాలది ఈ ధీరోపాడులనుండే బహుశా పక్షులు రూపొందివుండవచ్చు.

2. పక్షిలాంటి నడుము ఎముకను కలిగిన డైనోసారులు:

jeevam5వీటికి ఉదాహరణ స్టిగోసారస్ (Stegosaurus). 8మీటర్ల పొడవు. వీపుమీద మొనదేలిన ఎముక ఫలకాలు వరుసగా ఉంటాయి. బహుశా ఇవి ఉష్ణోగ్రతను నియంత్రిన్చేదానికి ఉపయోగపడేవి. మరొక ఉదాహరణ ట్రై సెరటాప్స్ (Triceratops) 10 మీటర్ల పొడవు. మెడచుట్టు ఎముకల అంచు కలది. ఇంకొక డైనోసారు పారా సారోలోపస్ (Parasaurolophus). 11 మీటర్ల పొడవు. దీని తలమీద వింత కిరీటం ఉంటుంది. (కోడి పుంజుతల పై జుట్టు ఉన్నట్లు) అందులోని గదులు జతకుడేడానికి చేసే శబ్దాలను పెంచేదానికి అనుకరించే డానికి ఉపయోగ పడుతాయని భావిస్తున్నారు. పచ్చిక మేసే పక్షిలాంటి నడుము ఎముకను కలిగినవి క్రటేషియస్ యుగంలో రూపొందినవి. ఆనాడు రూపొందిన పుష్పించే మొక్కలను తిని బ్రతికేవి.

డైనోసారులన్నీ చాలా పెద్దవని అనుకుంటాం. కాని కొన్ని కోడిపిల్లలంత చిన్నవీ ఉన్నాయి. పెద్దపెద్ద డైనోసారులు బహుశా శీతల రక్తం గలవి. ఈ చిన్న డైనోసారులు పక్షులు, జంతువులు లాగా ఉష్ణరక్తంగల స్ధిరోష్ణ జీవులు.

ఒక్కొక్కసారి జంతువులకు అస్సలు ఆహారం దొరకదు. ఒక్కొక్కసారి బాగా దొరకదు. ఒక్కొక్కసారి బాగా దొరుకుతుంది. అందుకని జంతువులు ఆహారం బాగా దొరికే సమయంలో ఆహారాన్ని తీసుకోని క్రోవ్వు రూపంలో నిల్వజేసుకుంటాయి. జంతువు ఎంత పెద్దదయితే అంతగా క్రొవ్వును నిల్వజేసుకోగలవు. ఆహారం దొరకనపుడు ఈ క్రొవ్వు నిల్వలను వాడుకొంటాయి.

ఆహారం అందుబాటు అక్కడక్కడ విసిరివేసినట్లు ఉంటే జంతువులు చాలా దూరం తిరగాలి. జంతువు ఎంత పెద్దదయితే అంతగా ఎక్కువ దూరాలను తిరగగలదు. ఈదగలదు. ఆహారాన్ని సంపాదించుకోగలదు. ఇవి జంతువులు పెద్దగా ఉండేదానికి కారణాలు.

మరి డైనోసారులు జంతువుల కంటే చాలా చాలా పెద్దవిగా ఉండేదానికి కారణమేమిటో ? ఏదో ఒకరోజుకు మానవుడు తెలుసుకోగలడు.

టిరాన్నోసారస్ లాంటి కొన్ని డైనోసారులు గుంపులుగుంపులుగా తిరగకుండా ఒంటరిగానే, ఏకాంతంగా వేటాడేవి. మరికొన్ని ఇతర డైనోసారులు మందులుమందులుగా కదులుతూ గడ్డి మోసేవి. కొన్ని ప్రాంతామేలలో 10,000 డైనోసారూ శిలాజాలు ఒకే చోట దొరికాయి. తూర్పు ఆఫ్రికా మైదానప్రాంతాలలో క్యూర మృగాలు మందలు మందలుగా తిరిగిన ఆనవాళ్ళున్నాయి.

ఆఫ్రికా క్యూరమృగాలవలె డైనోసార్లు పెద్దపెద్ద మందులుగా కుడి సంవత్సరాంతంలో వలన వెళ్ళేవని అంకుంటున్నారు. ఇది ఊహె కావచ్చు. కొన్ని డైనోసార్లు గూళ్ళు కట్టుకొని గుడ్లు పెట్టేవని మనకు తెలుసు. గుట్టలు, గుట్టలుగా ఉన్న గుడ్ల శిలాజాలు లభ్యమయినాయి. ఇవి అత్యద్భుతాలుగా నిల్వచేయబడ్డాయి. లేదా భద్రపరచబడ్డాయి. కొన్ని సందర్భాలలో ఈ గుళ్ళు కాలనీలలాగా ఉంటాయి. మధ్యన సమాన దూరాలలో ఏర్పాటై ఉండేవి. సముద్ర పక్షుల గూళ్ళ కాలనీల లాగా ఉండేవి.

ఇంతకీ డైనోసారులు మంచి తల్లిదండ్రులేనా? వాటికి జతగూడే సాంప్రదాయావేమైనా ఉండేవా? పారాసారాలూపస్ (parasaurolophus) అనే డైనోసారు ధ్వనులు నాటి జురాసిక్ వాతావరణంతో ప్రతిధ్వనించేవా? అవి బూడిద రంగువేనా? లేక ప్రకాశవంతమైన రంగులు గలవా?

ఇవన్నీ తెలుసుకోవాలంటే గత కాలంలోకి వెళ్ళాల్సిందే. కొన్ని విషయాలు శిలాజాల రూపంలో రాళ్ళ మధ్య రాసి ఉండవు.

ఈ డైనోసారులకేమయినది? ఉన్నట్టుండి వాటికి ఈ భూమ్మీద నూకలు ఎందుకు తెల్లిపొయాయి?

నేటికి అరున్నర కోట్ల సంవత్సరాల క్రితం అవి అంతరించిపోయాయి. ఆనాటికి ఉన్న 60-70 శాతం జీవరాశులు, మొక్కలైతేనేమి, జంతువులైతేనేమీ అంతరించిపోయాయి. ఇంతపెద్ద ఎత్తున జీవరాశులు నశించే దానికి కారణాలేంటి? వాటిని వివరించే రెండు సిద్ధాంతాలు ఉన్నాయి.

వాల్టర్ ఆల్వరేజ్ మరియు ఫ్రాంక్ అసారో సిద్ధాంతం: (Walter Alvoraz అండ్ Frank Asaro theory)

నాడు ఓ పెద్ద ఉల్కాపాతంగాని తోకచుక్క భూమిని డి కొనడం వలన క్కడున్న జీవరాశులన్నీ నశించాయి. భూమిని డికొన్నపుడు ధూళి, దుమ్ము భూమిచుట్టూ ఎగసింది. సూర్యరశ్మి భూమిని చేరలేకపోయింది. వృక్షాలు కిరణజన్యసంయోగక్రియ (Photosynthesis) ను జరుపలేక పోయాయి. వృక్షాలు, మొక్కలు నశించాయి. వాటిమీద ఆధారపడ్డ శాఖాహారులు అంతరించాయి. శాఖాహారాలను తినే మాంసాహరాలు నశించాయి. మొత్తం ఆహారపు గొలుసు దెబ్బతినింది. ఈ పెద్ద దుమ్ముధూళి మేఘం గ్రీన్ హౌస్ ఎఫేక్టు (Green house effect) ను ఇచ్చినది. అవేడికి మొక్కలు జంతువులు చనిపోయాయి. ఎక్కువ ఉష్నోగ్రతల వలన ఆక్సిజన్ (O2) నైట్రోజన్ (N2) కలిసి నైట్రస్ ఆక్సైడ్ (N2O) ఏర్పడినది.

ఈ నైట్రిస్ ఆక్సైడ్ (Nitrous oxide), నీటితో (water) తో కలసి నైట్రిక్ ఆసిడ్ (Nitric acid) ఏర్పడినది.

ఈ నైట్రిక్ యూసిడ్ (స్పటికామ్లము) వర్షరూపంలో భూమి మీద పడినది. మరింతగా జీవులు నశించాయి.

ఈ ఉల్కాపాత సిద్ధాంతమును ఋజువు చేసేది ఇరిడియం మూలక నిల్వలు (కటేషియస్ టేర్షరీ యుగాల మధ్య కాలంలో ఈ మూలక నిల్వలు ఎక్కువగా ఉన్నాయి. ఇరిడియం (Iridium) మూలకం ఉల్కలలో ఎక్కవగా ఉంటుంది. భూమి పైన చాలా తక్కువుగా ఉంటుంది.ఉల్కలు డికోన్న కాలపు భూమి పొరలలో ఇరిడియం నిల్వలు ఎక్కువగా ఉన్నాయి.

విన్సెంట్ కోర్టిలట్ సిద్ధాంతము: ఈ సిద్దాంతము అగ్ని పర్వత పేలుడుకు సంభంధించినది. అగ్నిపర్వత పెలుడే దక్కను ప్రాంతం ఎత్తుగా మారినది. భారత ఫలకం ఆఫ్రికానుండి దూరంగా జరిగంది.

అందుకు 10 కోట్ల సంవత్సరాలు పుట్టింది. అపుడు హిందూ మహాసముద్రంలో మారిషస్ దీవికి దగ్గరగా మరొక రియూనియస్ అనే దీవి ఉండేది. అగ్నిపర్వత పెలుడంతో లావా పైకి వచ్చి 2400 మీటర్ల మందాన ఒక పొర ఏర్పడింది. దాని వైశాల్యం 20 లక్షల చదరపు కిలోమీటర్లు. ఇంత పెద్ద పేలుడు వలన పొగ, దుమ్ము , ధూళి సల్ఫర్ ఆవిరులు ఏర్పడ్డాయి,. ఫలితంగా ఆహార గోలను గత సిద్ధాంతంలో వలె దెబ్బతినింది.

ఇలా జివరాశుల ధ్వంసం 5 కోట్ల సంవత్సరాలు క్రితం పేర్మియన్ కాలపు చివరన కూడా జరిగినది. అపుడు బసాల్టుశిలలతో సైబీరియన్ పిటభూమి ఏర్పడింది. అకాలానికి ముందే డైనోసారులు పరిణామక్రమంలో ఏర్పడడం ప్రారంభమైనది. ఫెర్మియస్ జీవరాశి ధ్వంసం డైనోసారులు ముందుకు సాగేందుకు ఆ తర్వాత భూమి పై ఆధిపత్యం వహించేందుకు దారి తీసింది. ఖగోళవస్తువు తాకిడి అలాగే అగ్నిపర్వత పేలుళ్ళ ఆశ్చర్యం. దీని పై ఇంకా పరిశోధనలు జరగాల్సి ఉంది.

డైనోసారుల అభివృద్ది నాశనం, జివరాశుల ధ్వంసం ఆకస్మిక ఆపదల వలన జరిగినవి. జివపరినామంలో ఉన్నట్టుండి జరిగే ఆకస్మిక ఘటనలు ముఖ్యపాత్రనే పోషించాయి. డైనోసారులు ప్రబలంగా ఉన్నపుడు క్షిరదాలు చుంచులు లాంటి చిన్న జంతువులు అడవి నేల పై ఉన్న పురుగు లను వానపాములను తీసి బతుకుతుండేవి. ఈ చిన్న పరిమాణమే పర్యపరణ ప్రమాదాన్ని ఎదుర్కొనేందుకు తోడ్పడింది. నాటి తొలి క్షీరదాలు అపుడు చనిపోయిన జంతు వృక్ష కళేబరాలను ఆహారంగా గ్రహించి మనుగడ సాగించాయి. ఆ విధంగా ప్రకృతి విధ్వంసాన్ని ఎదుర్కొని నిలబడ్డాయి. మందుకు సాగాయి పెద్ద పెద్ద బొచ్చు ఏనుగులు దృవ ఎలుగుబంట్లు – మానవులు ఈ క్షిరదాల నుండే రూపొందాయి.

aug13మొప్పలు అంచున ఈకలు కలిగిన చేపలు డివొనియన్ యుగానికి ముందే ఉండేవి. డివోనియన్ యుగంలో సముద్రాల ఎండిపోయి నీటి మడుగుల్లాగా తయారైనాయి. చేపలు అధికంగా ఉండేవి. విధిలేక నీటి మడుగులను విడాల్సి వచ్చింది. నేలమీదకు రాసాగాయి. చేపలు తమ ఈకలను బలమైన ఈకలుగా అభివృద్ధి చేసుకున్నాయి. ఈ ఈకలతో నేలమీద బరువు మోపి ఒక మడుగు నుండి మరొక మడుగులోకి వెళ్ళేవి. ఇలా ఆదిమ ఉభాయచారం ఇక్తియోస్టిగా రూపొందింది. దీని కాళ్ళు చేతులు ఈకల నుండి ఏర్పడ్డాయి. తోక మాత్రం చేపతోక లాగా ఉంటుంది. ఈ ఉభయచరాలు ప్రాకెడి జీవులైన సరీసృపాలుగా మారి నేలను ఆక్రమించాయి. కొన్ని మరలా నీటిలోకి వెళ్ళి నివాసమేర్పరచుకొన్నాయి. అవి తమ కాళ్ళను పోగొట్టుకొన్నాయి. మరలా అంచున ఈకలు బలమైన తోకను ఏర్పరచుకున్నాయి. అభివృద్ధి చెందిన సరీసృప రూపం కాస్తా నీటిలో బ్రతకడానికి చేప అవతారం ఎత్తింది.

ఇక్కడ పరిణామం భిన్నశాఖలుగా వికసించ (Divergent evolution) డానికి బదులు శాఖలు ఒకే శాఖ (Convergent evolution) లాగా అనిపిస్తాయి. ఇలాంటిదే ఆధునిక డాల్ఫిన్ లు – చేపలు.

ఒకే పూర్వక జివి పలు భిన్న రూపాలనిస్తుంది. దీన్నే Divergent evolution అంటాము. దీనికి ప్రాచీన ఉదాహరణ చిన్న చుంచులాంటి కీటకాహార క్షిరదం – తిమింగలాలుగా, పొండాలుగా, కంగారూలుగా, జిరాఫీలుగా పలు రూపాలుగా వికసించింది.

aug12Divergent evolution ఆధునిక ఉదాహరణ. పెంపుడు కుక్కలు రకరకాలుగా వికసించి భిన్న రూపాలలో ఈనాడు కనిపిస్తూన్నాయి. ఉదా:- అల్సేషియన్, డాల్మేషియన్, జర్మన్ షేప్పర్డ్, చిహువాహువా,  పూడుల్. ఇవన్నీ పెంపుడు కుక్కలలోని రకాలు. వీటి జన్యువులు కొన్ని తోడేలు నుండి వచ్చినవి. ఈ కుక్కలన్నింటికి పూర్వికురాలు తోడేలు. తోడేలు జన్యువుల కలిగి రకరకాల ప్రత్యేకతలతో కనిపిస్తాయి. అంత మాత్రాన నక్కలు – వాటి రకాలు మాత్రం కాదు.

సజీవ శిలాజాలు : - 1938 లో దక్షిణాఫ్రికా తూర్పుతీరంలో చేపలు పట్టేవారికి ఒక వింత చేప దొరికింది. స్ధానిక మ్యూజియం బాధ్యత చూచే కోర్టేనే – లాటిమర్ అను మహిళ మొదటగా దీనిని పరిశిలించారు.

ఇదొక ప్రత్యేకమైన జివి అని అనుకున్నారు. సంబంధిత శాస్తవేత్తలకు పంపారు. ఆమె అనుకునట్లే అది ప్రత్యేకమైన చేపగా అనుకున్నట్లే అది ప్రత్యేకమైన చేపగా వారు తేల్చారు. గౌరవంగా ఆమె పేరునే లాటిమెరా అని ఆ చేపకు పేరుపెట్టారు. 46 కోట్ల కిందటి చేప శిలాజాలతో పోలికలున్నాయి. 46 కోట్ల సంవత్సరాల నుండి ఎలాంటి మార్పు లేకుండా ఈ చేపలు ఉన్నాయి.

1938 నుండి మడగాస్కర్ దగ్గరలోని కొమొరో దీవులకే ఈ చేపలు పరిమితమైనాయి. ఇలాంటి సజీవ శిలాజాలు ఇతరాలు కొన్ని ఉన్నాయి. అవన్నీ దివులకో -  సముద్ర అగధాలకే పరిమితమైనాయి. యుగయుగలుగా ఎ మాత్రం మారకుండా ఉన్నాయి. మార్పును ప్రొత్సహించే పర్యావరణ పరిస్ధితులు లేకపోవడం అలానే సహజశిద్దమైన వీటిని తినే జీవులు పరభక్షకాలు (Predators) లేకపోవడమే కారణం.

న్యూజిలాండ్ కు చెందిన దీవులలో టువాటారా అనే (Tuatara) ముళ్ళబల్లి ఉంది. దీని దగ్గరి బందువులు 17 కోట్ల సంవత్సరాల క్రిందిటి డైనోసారుల స్వర్ణయుగం కాలం నాటివి. ఎ మాత్రం పరిణామం చెందకుండా అలానే ఉన్నాయి. కారణం న్యూజిలాండ్ లో మానవులు ప్రవేశపెట్టన కుక్కలు తప్ప క్షిరద తరగతికి చెందిన పరభక్షకాలు అంటే బల్లులను తినే జంతువులు లేకపోవడమే.

మెయిడేన్ హెయిర్ వృక్షం (Maiden hair tree) దీనిని ginkgo biloba  అంటారు. ఇది పేర్మియన్ కాలం నాటిది. ఇప్పటికి ఆసియాలో మనదేశంలో కూడా అలంకరణ మొక్కగా ఉన్నది. ఇప్పటికి ఆ వృక్షంలో మార్పులేదు.

కాలం : మయోసిన్ శకం

jeevam6(Miocena Epoch): క్రి.పూ 2 కోట్ల 50 లక్షలక్షల సంవత్సరాల కాలం ప్రదేశం : ఆఫ్రికా(దీనిని మానవ ఊయల అటారు)

వాతావరణం : వేడిగా పొడిగా మారుతోంది. కనుక అరణ్యాలు కాస్త గడ్డిభూములు (సవన్నాలు Savannahas) గా మారాయి. ఈ భూముల్లో అక్కడక్కడా చెట్లు గూడా ఉండేవి. ఈ భూముల్లో నెమరువేయు గిట్టలుగలిగిన జంతువులుండేవి. ఇవి ఆకులు – వచ్చిక మేస్తూ మందలు మదలుగా ఉండేవి. కోతులు చెట్లమీద ఉండేవి. ఆ కోతుల్లో ఒక రకం చెట్లమీదనుండి నేలమీదకు దిగి జివించసాగాయి. కోతులకు చెట్లమీద తిరుగాడేటపుడు సమతస్దితి (Balance) సాధించేందుకు తోక అవసరం తిరిపాయింది. తోకలేని కోతులుగా మారాయి. ఇవే మన పూర్వీకులు.

ఈ తోకలేని కోతుల (Apes) వంశము ప్లియోసిన్ శకం క్రి.పూ 30 లక్షలు – 40 లక్షల సంవత్సరాల మధ్య రెండు శాఖలుగా చీలినది. ఒక శాఖ చింపాంజీ గొరిల్లాలుగా రూపొందింది. ఇవి మన దగ్గరి చుట్టాలు అనే సంగతి తెలిసిందే. మరొక శాఖ ఆస్ట్రలోపిధేసిన్ (Australo Pithecene) శాఖ, దీనినే ఆస్ట్రలో అంటే లాటిన్ లో దక్షిణం అని. ఫిదేకస్ అంటే గ్రీకులో తోకలేని కోతి అని. దక్షిణ ప్రాంతపు తోకలేని కోతులు,. ఆస్ట్రలో ఫిధేసిన్ శిలాజం దక్షిణాఫ్రిక ట్రాన్ వాల్ ప్రాంతంలో తొలుత బైటపడింది. మరలా ఇటివల ఇదియోపియాకు అల్లంత ఫిధేసిన్ అఫారేన్సిస్ అని పేరు పెట్టారు. వానిలో ఒక శిలాజానికి దానిని కనుగొన్న డోనాల్డ్ జోహన్సన్ లూసి అని పేరు పెట్టారు. ఈ లూసి శాఖ పలుశాఖలుగా చీలినది. అందులో ఒక శాఖను భారీ ఆస్ట్రలోఫిధేసేనులు అంటారు. ఈ (Australiopithecus robustus) పెద్ద పెద్ద ఎముకలతో భారీగా ఉండేది. అది 10 లక్షల సంవత్సరాలు క్రితం అంతరించిపోయింది.

కాలం : ఫ్లిస్టోసిన్ శకం

(Pleistoecene Epoch) :

(10 వేలు – 20 లక్షల సంవత్సరాల మధ్యకాలం)

jeevam7ఫ్లిస్టోసిన్ శకంలో 20 లక్షల సంవత్సరాలు క్రితం లూసి శాఖ నుండి చీలిన మరొక శాఖ హూమినిడులు (Hominids) శాఖ. ఈ హుమి నిడులు  రాతి పనిముట్లను తయారు చేసుకోగలిగారు. వాటి ఆధారంగా తమకు కావలసిన వస్తూవులను ఉత్పత్తి చేసుకోగలిగారు. ఈ లక్షణమే జంతుదశనుండి మానవుని వేరుచేసింది. మానవ జాతి చరిత్రలో ఇదొక గొప్ప మలుపు, ముందడుగు. పాతరాతియుగం. నాటి పనిముట్లు మీరు తయారుచేసినవే కాబట్టి వీరిని హూమోహెబిలిస్ (Homo Habilis) అన్నారు. Homo అనగా మానవుడు Habilis అనగా పంముట్లను చేసి వాటిద్వారా వస్తువులను ఉత్పత్తి చేసేవాడని అర్ధం. Handyman .

ఈ హుమోహెబిలిస్ పరిణామక్రమంలో హూమోఎరక్టన్ Homoerectus గా మారాడు. నిటారుగా రెండు కళ్ళతో నడిచే రూపం ఏర్పడింది. ఈ Homoerectus ఆఫ్రికా నుండి ఆసియాకు విస్తరించాడు.  ఈ కాలం హిమయుగాల కాలం. ఉత్తరర్దగోళం మంచుతో కప్పబడింది. సముద్రాలన్నీ మంచుగడ్డలుగా మారాయి. మధ్యలో భూభాగం వంతెనలాగా ఉండేది. ఆసియా – ఆఫ్రికా మధ్య భూభాగపు వంతెనలుండేవి. ఆఫ్రికా మధ్యప్రాచ్యం ఆసియా ఏఎ మార్గంలో శిలాజాలు చాలా బయటపడ్డాయి. 1890 లో జావా మనిషి 1926 పెకింగ్ మనిషి శిలాజాలు బయటపడ్డాయి. ఈ వంశ శాఖే నియాండర్తల్ మనిషిగా పరిణామం చెందినది. ఈ నియాండర్తల్ లోయ జర్మనీలోనిది. అక్కడ 1856 లో సున్నపురాయి గనిలో నియాండరైల్ మనిషి శిలాజాన్ని కనుగొన్నారు.

నియాండర్తల్ మనిషి పొట్టివాడు. కనుబొమలు దట్టంగా ఉండేవి. ఇతను మంచుయుగాల మధ్య కాలంలో ఐరోపా, ఉత్తర అమెరికా మధ్యప్రాచ్యం, మధ్య ఆసియా, చైనాలో ఉండేవాడు. పెద్ద పెద్ద బొచ్చు ఏనుగులను ఖడ్గమృగాలను, గుహల్లోని ఎలుగుబంట్లను చేతి గొడ్డళ్ళు, కర్ర ఈటెలతో వేటాడేవాడు. మాటలు రావు. నరమాంసం భక్షక లక్షణం ఉండేది. 30,000 సం. క్రితం అంతరించి పోయాడు. అంతరించి పోయేదానికి గల కారణాలను పలు సిద్దాంతాల ద్వారా తెలియజేశారు.

  1. అభివృద్ధి చెందిన క్రోమాగ్నాన్ మనుషులతో ఘర్షణ పడడం వలన అంతరించాడని
  2. జబ్బులు విపరీతమైన వాతావరణ మార్పుల వలన అంతరించాడని

ఈ హూమో ఎరేక్టన్ వంశములోని నియాండర్తల్ మనిషి అంతరించిపోగా క్రోమాగ్నాన్ మనిషి అవతరించాడు. సన్నగా పొడవుగా ఉండేవాడు. ప్రాన్సులోని దగ్గరి క్రోమాగ్నాన్ గుహలో మొదట ఈ మనిషి శిలాజాన్ని కనుగొన్నారు.

క్రోమాగ్నన్ మనిషి నేరుగా మన పుర్వికుడు. ఇతనికి సౌందర్యాభిలాష, కళాత్మకత ఎక్కువ. ఫ్రాన్సు దేశంలో చాలా గుహల్లో పెద్దపెద్ద అడవిదున్నల మందులు, జింకల మందలను వేటాడి నట్లుండె నిలువెత్తు పెయింటింగ్స్ కనిపించాయి. బహుశా ఇతనే నియాండర్తల్ మనిషితో ఘర్షణపడి గెలిచి మన జాతిని ప్రపంచ వ్యాప్తం చేశాడు. అందుకే శ్రీశ్రీ 1938 లో దేశ చరిత్రల కవితలో

తక్షశిల, పాటలీపుత్రం, మధ్యధరా సముద్ర తీరం, హరప్పా, మొహంజుదారో క్రో-మాన్సాన్ గుహముఖాల్లో చారిత్ర విభాత సంధ్య మానవ కధ వికాసమెట్టిది ?

ఏదేశం ఏ కాలంలో సాధించినదే పరమార్ధం ?

ఏ శిల్పం? ఏ సాహిత్యం

ఏ శాస్త్రం? ఏ గాంధర్వం

ఏ వెల్గుల కి ప్రస్ధానం

ఏ స్వప్నం, ఏ దిగ్విజయం

ఇరవైయ్యవ శతాబ్దపు  ప్రారంభంలో చాలా మానవ శిలాజాలు బయటపడ్డాయి. మనకర్ధమయ్యే దేమిటంటే ఆధునిక మానవ ఆవిర్భావం ఖచ్చితమైన నిచ్చెన మెట్లలాగా ఉండదు. అంటే తోకలేని కోతి నుంచి ఇంకొకటి. ఆ తర్వాత దానినుండి నేరుగా మనం ఇలా అనుకుంటుంటాము. అది సరిగాదు.

మానవ వికాసం శాఖోపశాకల వృక్షంలాగా ఉంటుంది. ప్రతిశాఖ ఒక పరిణామ ప్రయోగంతో అది అంతరించి పోయింది. పోతుంది,. కొమ్మన క్రోమాగ్నాన్ మనిషి అనేక సంఘర్షణలు తర్వాత అవతరించాడు. అతడు ప్రక్క జంతువులతో ఘర్షణ పడ్డాడు. అలానే తనలాంటి నియాండర్తల్ మనిషితో ఘర్షణ పడ్డాడు. అందులో తనకు మేలు చేసే వైవిద్యులు వలన నిలదొక్కుకున్నాడు. ఇదే గదా మనగడకోసం పోరాటమని  డార్విన్ చెప్పినది.

jeevam8మానవునికి - జంతువుకి తేడా ఏమిటి? అలాగే జంతువుల ముందుకు (గుంపు) మానవ సమాజానికి తేడా ఏమిటి? అనే విషయాలు చర్చిద్దాం.

జంతువునుండి మనిషిని వేరు చేసిన ప్రత్యేక లక్షణం పరికరాలను తయారు చేసుకోవడం. పరికరాలను తయారు చేసుకోగలిగిన జంతువే మానవుడు. పరికరాలను తయారు  చేసుకోలేనివి జంతుదశలోనే ఉండిపోయాయి  పరికరాలను తయారుచేసి కొని ప్రకృతివనరులను తనకు కావాలసిన రీతిగా మలచుకోన్నాడు. అంటే తన అవసరాలకు వస్తువులను ఉత్పత్తిలో చేసుకోవడం ప్రారంభించాడు. వస్తూ ఉత్పత్తిలో పరికరాలతో పనిచేయడాన్ని శ్రమ చేయడం అంటారు. పరికరాల తయారీతో శ్రమ చేయడం మొదలైంది. అంతుకుముందు ప్రకృతిలో దొరికినది దొరికినట్లు సేకరించి తినేవాడు. ప్రకృతి సిద్ద గుహలలో తలదాచుకొనేవాడు. ఈ దశ జంతుదశే అయినా ఆదిమానవ దశ అంటారు. ఈ దశను ఆహారసేకరణ దశ అని సేకరణ దశ అని అంటారు. jeevam9ఈ దశలో మానవ జీవితము జంతువుల లాగా గుంపు జీవితమే !

ఆ తర్వాత పరికరాలతో శ్రమ చేసి పస్పూత్పత్తి చేసే దశ వచ్చినది. సమిష్టిగా పనిచేయడం. వనరులను సమిష్టిగా వాడుకోవడం గత కాలపు గుంపు జీవితం కంటే భిన్నమైనది. బలీయమైనదిగా మారినది.

శ్రమ చేయడం – పనిచేయడం – ఉత్పత్తి చేయడం – ఉత్పత్తిని పంచుకోవడం – అందులో ఏర్పడిన సంబంధాలు – మానవ సంబంధాలు. లాంటి సంబంధాలు ఏ జంతు గుంపుకి ఉండవు. శ్రమ ద్వారా ఏర్పడిన ఉత్పత్తి ఉత్పత్తి ద్వారా కలిగిన సంబంధాలు వీటితో రూపొందినడే మానవ సమాజం ఇది ఒక ప్రత్యేకత.

jeevam10అదిమకాలంలో మానవులందరూ నరుల పై సమిష్టి హక్కు గలిగి ఉండేవారు. ఉదారణకు ఒక అడవి ఉన్నదనుకోండి. అందులో నివసించే మానవ సమూహమంతటికీ ఆ అడవి సమిష్టిహక్కు ఉండేదిగాదు. ఆ ఉమ్మడి అడవిలో పనిచేసి సృష్టించిన ఉత్పత్తిని అందరూ సమిష్టిగా అవసరం మేరకు పంచుకోనేవారు. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ లేదు. అందరూ సమానమే .అందరూ సమాన హక్కుదారులే. అందరూ సమాన బాధ్యతలు ఉండేవి. మానవుని ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేక సహజ పరిణామ క్రమంలో అంత ఉదాత్తమైన సమాజం రూపొందింది. దీనినే ఆదిమ కమ్యూనిస్టు సమాజం అన్నారు. ఇలాంటి సమాజం కొన్ని లక్షల సంవత్సరాలపాటు కొనసాగింది.

ఇటీవలి కాలంలో అంటే సుమారు క్రీ.పూ. 10,000లకు ఇవతల మానవ సమాజం బానిస సమాజంగా మన భారత దేశంలో అంతే కులసమాజంగా మారినది. ఎలా మారినదో ఇప్పుడు చూద్దాం.

jeevam11పరికరాలతో పనిచేసే క్రమంలో మానవుడు పరికరాలను మెరుగుపరచుకొన్నాడు. ఫలితంగా ఉత్పత్తి పెరిగినది. అవసరానికి మించి ఉత్పత్తి చేయడం వలన మిగులు ఏర్పడినది. ఈ మిగులును సమాజంలోని బలవంతులు స్వంత ఆస్థిగా మలచుకొన్నారు. ఆ తర్వాత పరికరాలపైక ఆధిపత్యం సాధించారు. ఆ రకంగా ఉన్నవారు- లేనివారు అనగా బానిస యాజమానులు - బానిసలు కలిగిన సమాజం ఏర్పడినది. పరికరాలు వనరులపై ఆధిపత్యం గలవారు బానిస యాజమానులు. ఏ హక్కులూ లేక శ్రమ చేసి యజమానులు పోసే గంజి తాగి బ్రతికి ఉత్పత్తి చేసేవారు బానిసలు. ఈ న మాజంలో తయారైన ఉత్పత్తి యజమానుల స్వంతం. ఇక్కడ ఉత్పత్తి సమిష్టిగా జరిగేది. పంపిణీ అసమానంగా ఉండేది. శ్రమ చేయకనే బానిస యాజమానులు అనుభవించేవారు.

ఇక్కడ బానిసలకు బానిస యాజమానులకు ఘర్షణ జరిగేది. దీనినే వర్గపోరాటం అంటారు. చివరకు ఆ సమాజం మారి భూస్వామ్య సమాజం వచ్చింది. ఇక్కడ పరికరాలు ఇంకా మెరుగుపడ్డాయి. ఉత్పత్తి ఇంకా పెరిగింది. మిగులు ఎక్కువైనది. పాత బానిస - బానిస యజమాని సంబంధాలస్థానే భూస్వామ్యకౌలు రైతు సంబంధాలు వచ్చాయి.

ఇక్కడ భూస్వాములకు కౌలు రైతులకు సంఘర్షణ చివరకు భూస్వామ్య సంబంధాలు తెగిపోయాయి. కారణం భూస్వామ్య సమాజంలోనూ పరికరాలు వేగంగా అభివృద్ధి అయినాయి. ఉత్పత్తి ఇంకా పెరిగింది. పంపిణీ అసమానంగా ఉంది. ఈ కాలంలో పరిశ్రమలు స్థాపించబడ్డాయి. అందులో పనిచేసే కార్మికులు ఏర్పడ్డారు. పరిశ్రమ యజమానులు ఉన్నారు.

jeevam12పాత భూస్వామ్య సంబంధాలు తెగిపోయి పరిశ్రమ యజమాని (పెట్టుబడిదారుడు) కార్మిక సంబంధాలు ఉనికిలోకి వచ్చాయి. ఈ సమాజాన్ని పెట్టుబడిదారీ సమాజం అంటాము. ప్రస్తుతం నడుస్తున్నదీ అదే సమాజం!

ఈ సమాజంలో అధునాతన యంత్రసామాగ్రితో కుప్పలుతెప్పలుగా సరుకులు తయారౌతున్నాయి. ఉత్పత్తి - ఆర్ధికం - మాంద్యంలోనికి పదేపదే జారిపోతున్నది. ప్రస్తుతం ప్రపంచం ఆర్ధిక మాంద్యంలో ఉన్నది.

ఇంక ఈ నమాజమూ మారుతుంది. కొత్త సోషలిస్టు సమాజం వస్తుంది. ఇప్పటికే చైనా, క్యూబా వంటి దేశాలు సోషలిస్టు దేశాలుగా ఉన్నాయి

ఇలా సమాజమూ మారుతుంది జీవం పరిణామానికి DNA ఎలాగో సమాజ పరిణామానికి ఉత్పత్తి పరికాలు అలాగే. ఉత్పత్తి పరికరాలు మారితే ఉత్పత్తి సంబంధాలు మారుతాయి. అప్పుడు పాత సమాజం స్థానే కొత్త | సమాజం ఏర్పడుతుంది. ఈ మారడంలో వర్గ సంఘర్షణ ఉంటుంది. అంటే, బానిసలు - బానిస యాజమానుల సంఘర్షణ... అలాగే భూస్వామ్య కౌలు రైతు సంఘర్షణ అట్లే పెట్టుబడిదారుడుకార్మికులు మధ్య సంఘర్షణ. ఈ సంఘర్షణనే విప్లవాలు అంటారు. విప్లవం జయప్రదం అయినప్పుడు కొత్త సమాజం పురుడుపోసు కుంటుంది. ఉన్నవాడు - లేనివాడు అనే తేడాలేని కష్టాలు కడగండ్లు లేనిఅందరూ సమానంగా అనుభవించే ఓ నూతన సోషలిస్టు సమాజం కావాలని కోరుకుందాం దానికి పాటుపడదాం.! మార్పు సహజం, మార్పు అనివార్యం జీవి పరిణామ సిద్ధాంత కర్త డార్విన్ అయితే సమాజ పరిణామ సిద్ధాంత కర్తలు మార్క్ - ఎంగెల్సులు.

ఆధారం: ఎం.వి. చలపతి

2.98595505618
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు