অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

బాబోయ్ పండ్లు!

బాబోయ్ పండ్లు!

fruitsపండ్ల మార్కెట్లో ఎన్నో రకాల పండ్లు మనల్ని ఎంతగానో ఆకర్షిస్తుంటాయి. అరటి, మామిడి, జామ, ఆపిల్, బొప్పాయి, రేగు, సీమరేగు, దానిమ్మ ఇలా రకరకాల పండ్లను ఇష్టపడని వారు ఎవరుంటారు? వాటి ఆకర్షణిమైన రంగు, రుచి, వాసన అలాంటివి. అందుచేతనే పిల్లలు, పెద్దలు ఎవరైనా వాటిని కొనుక్కుని తెనేవారే. ఈ రోజుల్లో రవాణా సదుపాయాలు పెరిగాయి. కోల్డ్ స్టోరేజి సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. వీటివల్ల ఏడాది పొడవునా తాజా పండ్లు అవి పండే చోటా పండని చోటా కూడా దొరుకుతున్నాయి. పండ్లకు కేవలం రంగు, రుచి, మంచి వాసన మాత్రమే కాకుండా మంచి పోషక విలువలు ఉంటాయి. వాటిలో సి విటమిన్ ఉంటుంది. పండ్లు మనకు సహజసిద్ధమైన ఆహారం. ఇవి ఆరోగ్యానికి మంచివని, అందుకునే ఆయా సీజన్ లలో దొరికే పండ్లను తినాలని డాక్టర్లు చెబుతుంటారు. కానీ ఈ రోజుల్లో పండ్లు కొంత ముప్పుగా పరిణమిస్తున్నాయి.

కాయల్ని తొందరగా మగ్గించేందుకు ముఖ్యంగా సీజన్ కాని రోజుల్లో సీజన్ కు ముందు విచక్షణా రహితంగా ఉపయోగిస్తున్నారు. కొనుగోలు దార్లను ఆకట్టుకోవడానికి కొందరు వ్యాపారస్తులు రసాయనాలను ఉపయోగిస్తున్నారు. కొనే వాళ్ళను బాగా ఆకట్టుకోవడానికి ఇలా చేస్తూన్నారు.

అరటికాయలు, మామిడికాయలు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. అవి మగ్గి పండ్లయినప్పుడు పసుపు రంగులోకి మారతాయి. మామిడికాయ పులుపు రుచిపోయి తియ్యటి రుచి వస్తుంది. అరటికాయ వగరు లేదా చప్పని రుచిపోయి తియ్యటి రుచి వస్తుంది. ఇలాంటి మార్పులే అన్ని పండ్లలోను వస్తాయి. కాయ మగ్గి పండుగా మారడం ఒక సహజమైన ప్రక్రియ. సహజంగా మగ్గినపుడు వాటిలో కొన్ని భౌతిక, జీవ రసాయన మార్పులు సంభవిస్తాయి. వాటిలోని కార్బోహైడ్రేట్, ప్రోటీన్ లైపిడ్ లు మార్పుకు లోనవుతాయి. అందువల్ల రంగు, రుచి, వాసనలో మార్పులు వస్తాయి. పచ్చికాయ ముదిరి మగ్గే దశకు చేరుకున్నపుడు ఎథిలిన్ అనే అసంతృప్తి హైడ్రోకార్బన్ వాయువును ఉత్పతి చేసి బయటికి విడిచిపెడుతుంది. అంటే మగ్గే ప్రక్రియ ప్రరంభామయిందన్నమాట. ఎధిలిన్ ఏర్పడడంలో ఎమైలేజ్ వంటి ఎంజైములు ఉత్పత్తి అవుతాయి. ఇవి పండు లక్షణాలను మార్చే చర్యలకు ఉత్ర్పేరకాలుగా పనిచేస్తాయి. క్లోరోఫిల్ విచ్చిన్నమై కొత్త రంగు పదార్ధాలు ఏర్పడతాయి. కాయతోక్క ఆకుపచ్చ రంగు నుంచి ఎరుపు, పసుపు, నారింజ ఎరుపు మొదలైన రంగుల్లోకి మారుతుంది. కాయలో ఉండే ఆమ్లాలు విచ్చిన్నమవుతాయి. దీనివల్ల పులుపు రుచిపోతుంది. ఎమైలేజ్ ఎంజైమ్ స్టార్చ్ ని విచ్చన్నం చేసి చక్కేరగా మారుస్తుంది. దీనివల్ల పండుకి తియ్యదనం వస్తుంది. రసం ఏర్పడుతుంది. కాయలో కణాల మధ్య వుండే పెక్టిన్ పగిలిపోవడం వల్ల ఆ కణాలు ఒక దానితో ఒకటి కలిసిపోతాయి. దీనివల్ల కాయగా ఉన్నప్పుడు వుండే గట్టిదనం పోయి పండు మెత్తబడి పోతుంది. ఎంజైమ్ లు చేసే పని ఇంకొకటి ఉంది. అవి కాయలోని పెద్ద పెద్ద సేంద్రియ అణువులను చిన్నచిన్న అనువులుగా విడగోడతాయి ఇవి ఇగిరి పోయి గాలిలోకి ప్రేవేశిస్తాయి. పండు సువాసనకు ఇదే కారణం.

ఈ రోజుల్లో మనం పండ్ల మార్కట్ కు వెళితే కృత్రిమంగా మగ్గించిన పండ్లు మనకు దర్శనమిస్తున్నాయి. మిలమిలా మెరుస్తున్న పసుపురంగుతో ఆకట్టుకుంటాయి. కానీ పైకి ఆకర్షణియంగా కన్పించే పండ్లన్నీ ఆరోగ్యానికి మంచివి కావు. ఎకరితిగా ఒకే రంగులో ఉండే పండ్లు సహజంగా మగ్గినవి కాకుండా కృత్రిమంగా మగ్గినవయితే పళ్ళన్నీ ఒకే రంగులో ఏకరీతిగా ఉండవు. టమాటోలన్ని ఒకే ఎరువు రంగులో ఉన్నా మామిడి, అరటి, బొప్పాయి పళ్ళు ఒకే రకంగా పసుపు లేదా నారింజ ఎరుపురంగులో ఉంటె అవి కృత్రిమంగా మగ్గినవి కావచ్చు. పుచ్చకాయలు, దానిమ్మ కాయల్లో కూడా కొన్ని రాసాయనాలను ఇంజక్షన్ చేసి మగ్గించడం లేదా సైజు పెంచడం చేస్తూన్నారని చెబుతున్నారు. పుచ్చకాయలకు ఆక్సిటిసిన్ వాడుతున్నారని కొందరు అనుమానిస్తున్నారు. కానీ శాస్త్రజ్ఞాలు దీని ఖండిస్తున్నారు.

కాల్షియం కార్బైడ్, ఇదేఫాన్ ఆక్సిటాసిన్ వంటి రసాయనాలను కృత్రిమంగా మగ్గించేందుకు ఉపయోగిస్తూన్నారు. కాల్షియం కార్బైడ్ ను మసాలా అని కూడా పిలుస్తారు. ఇధేఫాన్ అంటే 2-క్లోరో ఇధేల్ ఫాస్పోనిక్ ఆమ్లం. దిన్ని ఇద్రేల్ లేదా ఫ్లోరెల్ అని కూడా అంటారు. ఇది ఒక పురుగు మందు. ఆక్సిటాసిన్ అనేది క్షీరదాల్లో ఉండే హార్మోన్. దీన్ని పశువులకు మందుగా వాడతారు.

కాల్షియం కార్బైడ్ చాలా చవక. ఒక కిలోగ్రామ్ ధర రూ.25 లేదా రూ.30 ఉంటుంది. ఇది సుమారు 200 కి.గ్రా మామిడి కాయల్ని మగ్గించేందుకు సరిపోతుంది. అందుకని వ్యాపారస్తులు కాయల్ని కృత్రిమంగా మగ్గించేందుకు దీన్ని ఎక్కవగా వాడుతున్నారు.

మామిడి కాయల్ని లేదా అరటి గెలల్ని ఒక గదిలో గుత్తగా ఉంచి లేదా పెట్టెల్లో పెట్టి వాటికీ దగ్గరగా ఉంచి లేదా పెట్టెల్లో పెట్టి వాటికి దగ్గరగా ఒక కాగితం సంచిలో కొంచెం కాల్షియం కార్బైడ్ ను చేరుస్తారు. వాటిలో ఉన్న తేమ తగలడంతో కాల్షియం కార్బైడ్ నుంచి వేడితో పాటు ఎసిటిలిన్ వాయువు వెలువడుతుంది. ఫైటోహర్మోన్ ఎధీలిన్ లాగే ఎసిటిలిన్ కూడా పండ్లను మగ్గేలా చేస్తుంది. అరటిపళ్ళ విషయంలో కాల్షియం కార్బైడ్ పెట్టిన 24 నుంచి 48 గంటల్లో మగ్గడం మొదలవుతుంది. వేలితో నొక్కినపుడు కాస్త మెత్తబడితే ఐస్ గడ్డల మధ్య ఉంచుతారు.అప్పుడు ఆకుపచ్చ కాస్తా ఆకర్షణియమైన పసుపురంగులోకి మారుతుంది. ఇలా కృత్రిమంగా మగ్గినవి ఏమంత రుచిగా ఉండవు. తొందరగా మగ్గినా రెండు రోజులు కంటే నిలువ ఉండవు.

కృత్రిమంగా మగ్గించేందుకు ఇధేఫాన్ లేదా ఇధైల్ ద్రావణంలో కాయల్ని ముంచడం లేవా వాటిమీద ఆ ద్రావణాన్ని స్ప్రే చేయ్యడమే చేస్తారు. తమిళనాడులోని మామిడి పళ్ళను మగ్గించేందుకు నీరు (5లీటర్లు) 39% ఇధేఫాన్ (10 మి.లీ) సోడియం హైడ్రాక్సైడ్ (2గ్రా.) మిశ్రమం వాడతారు. మామిడి కాయల్ని ఒక గదిలో పడేసి ఆ గదిలో ఒక మూల ఒక బకెట్లో ఈ మిశ్రమం ఉంచుతారు. ఎధీలీన్ వాయువు విడుదలై మామిడి కాయలు మగ్గుతాయి.

వాణిజ్యపరంగా దొరికే కాల్షియం కార్బైడ్ లో ఆర్సెనిక్ ఫాస్పరస్ మలినాలుగా ఉంటాయి. అందుచేత దీనితో కృత్రిమంగా మగ్గింసిన పండ్లను తింటే అనారోగ్యాన్ని కోనితేచ్చుకున్నట్లే. ఆరోగ్యం మాటేమేగాని, లేనిపోని రోగాలు మాత్రం వస్తాయి. ఈ పళ్ళను తింటే ముందు కడుపులో గడబిడ మొదలవుతుంది. కార్బైడ్ విష ప్రభావం వల్ల తలపోటు, తలతిరంగడం, మతిస్దిమితం లేకపోవడం , జ్ఞాపక శక్తి తగ్గడం, కాళ్ళు చేతులు తిమ్మిరెక్కడం ఇలా రకరకాలుగా అనారోగ్యానికి గురువుతాం. ఈ దుష్చలీతాలను గుర్తించి, కాల్షియం కార్బైడ్ ను చాలా దేశాల్లో నిషేధించారు. మన దేశంలో ఆహార కల్తి నిరోధక చట్టం 1954 ఆహార కల్తి నిరోధక నిబంధనలు (రూల్స్) 1955 ప్రకారం కాల్షియం కార్బైడ్ ను ఉపయోగించి పండ్లను కృత్రిమంగా మగ్గించడం నిషేధించారు. ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తే, 3సంవత్సరాలు జైలుశిక్ష రూ.100 జరిమానా విధించవచ్చు. కాని ఈ చట్టం కింద కేసులు నమోదు చేసినట్టు దాఖలాలు లేవు.

మార్కెట్ లో పండ్ల రంగు చూసి మనం మోసపోకూడదు. పళ్లన్నీ ఏకరీతి ఒకే రంగులో ఉన్నా, పై తోక్కమీద నల్లటి మచ్చలున్నా అవి కృత్రిమంగా మగ్గినవేనని అనుకోవచ్చు. ఒక గెలలో అరటి పండ్లన్నీ మగ్గినట్లుండి. గెల కాడ మాత్రం ఆకుపచ్చగా ఉంటే అవి కృత్రిమ మగ్గినవే. సీజన్ కు ముందే మార్కెట్ లోకి వచ్చిన పళ్ళను కొనడం అంతమంచిది కాదు. మామిడి పల్లైతే, జూన్, జులైలు అసలైన సీజన్. పప్పుడు మార్కెట్ లో కి సహజంగా మగ్గిన పళ్ళు వస్తాయి. అప్పుడు కొనుక్కోవడం మంచిది.

పండ్లను కొనుక్కొన్న తర్వాత వాటిని ముందుగ బాగా కడుక్కోవాలి. కులాయి నీటితో కడిగితే పళ్ళకు అంటివున్న రసాయనాలు చాలా వరకు పోతాయి. ఆపిల్స్ వంటి పళ్ళను తినేముందు వాటి తొక్కను తీసేయడం మంచిది. మామిడి పళ్ళు, ఆపిల్స్ వంటి వాటిని నేరుగా తినడం కన్నా వాటిని ముక్కులుగా చేసుకొని తినడం మంచిది.

ఆధారం: డా. ఇ.ఆర్. సుబ్రహ్మణ్యం© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate