పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

జులై 22 𝞹 (పై) రమారమీ దినోత్సవం

జులై 22 𝞹 (పై) రమారమీ దినోత్సవం (𝞹 - approximation day) గా జరుపుకుంటారు.

july16ఒక సంఖ్య యొక్క విలువను ఆధారంగా చేసుకొని అంతర్జాతీయంగా సంవత్సరంలో రెండు ప్రత్యేక దినాలుగా జరుపుకొనే ప్రత్యేక సంఖ్య 𝞹. 𝞹 విలువ సుమారుగా 22/7. కావున 22వ తేదీ 7వ నెల (జూలై)ని 𝞹 యొక్క రమారమి దినోత్సవంగా (𝞹 - approximation day), 𝞹 విలువ 3.14... కావున 3వ నెల మార్చి 14వ తేదీన అంతర్జాతీయంగా దినోత్సవం (International 𝞹 day)గా జరుపుకొంటున్నాము.

ఇంతకి 𝞹 అంటే ఏమిటి?

వృత్తమును గీచి దాని చుట్టూ దారంను వృత్తవక్రం మీద క్రమంగా అమర్చి వృత్తరూపంలో గల దారాన్ని వెలికి తీసి స్కేలుతో ఆ దారం పొడవును కొలచితే అది వృత్తపరిది (Circumference)అగును. దీనిని 'C' అనే అక్షరంతో సూచిస్తారు. వృత్తం D - Diameter పరిధి (C)ని ఆ వృత్త వ్యాసం (D)తో భాగించగా వచ్చు ఫలితం ఒక స్థిర సంఖ్య. ఈ స్థిర సంఖ్యనే '𝞹' గా భావిస్తాం. వృత్తాన్ని చతురస్త్రీకరించడంపై శతాబ్దాల కృషి జరిగి చివరకు వృత్త వైశాల్యానికి సమాన వైశాల్యం గల చతురస్రం నిర్మించడం అసాధ్యమని తేల్చారు. ఈ కృషిలో భాగంగానే వృత్తపరిది, వ్యాసానికి గల నిష్పత్తి స్థిరమని తేల్చారు. క్రీ.శ.1706వ సం. లో జేల్స్ అనే శాస్త్రవేత్త ఈ స్థిర నిష్పత్తిని గ్రీకు అక్షరమైన 𝞹 తో సూచించారు.

ఈ 𝞹 విలువను కనుగొనుటలో శతాబ్దాలు కృషి ఉంది. అంటే ఆశ్చర్యంగా ఉంది కదూ! కాని ఇది నిజం. క్రీ.పూ. 1700 కాలం నాటి బాబిలోనియన్లు, బైబిల్ గ్రంథం, క్రీ.శ. మొదటి శతాబ్దం వరకు చైనీయులు 𝞹 విలువ 3గా పేర్కొన్నారు. వీరే కాకుండా బౌద్ధసాహిత్యం, రోమన్లు, జైనులు, ఖురాన్ గ్రంథాలు కూడా 𝞹 విలువను 3కు సమానంగా భావించాయి. తర్వాత కాలంలో రోమన్లు 𝞹 విలువను 3 1/8 గాను, క్రీ.పూ. 2200 సం. లో ఈజిప్టు వారు 256/81 = 3.1605 గా నిర్ణయించారు.

తర్వాత 3వ శతాబ్దంలో ఆర్కిమెడిస్ 𝞹 విలువ 3 1/7, 310/7ల మధ్య ఉంటుంది అన్నాడు. అంటే 𝞹 విలువ 3.1408, 3.1428ల మధ్య ఉంటుంది అని 𝞹 విలువను మొదటి రెండు స్థానాల వరకు సవరించి చెప్పిన మొదటి వ్యక్తి ఆర్కిమెడిస్.

𝞹 విలువ పై మనదేశంలో కూడా చాలా పరిశోధనలు జరిగాయి. భారతీయులు మొదట ఈ విలువను √10 గా భావించారు. అంటే సుమారు 3.16228 గా చెప్పారు. తర్వాత శుల్భ సూత్రకారంలో బౌద్ధాయనుడు 𝞹 విలువను 49/16 = 3.0625 గాను తర్వాత 3.088గాను తెలిపారు.

క్రీ.శ. 499లో ఆర్యభట్ట 𝞹 విలువను భూమి పరిధి, వ్యాసంతో పోల్చి చెప్పారు. భూమి వ్యాసం 20,000 కి. మీ. అయిన దాని పరిధి, 62832 కి.మీ.

కావున 𝞹 = 62832/20,000 = 3.1416 అని ఈ విలువను మొదటి నాలుగు దశాంశ స్థానాల వరకు తెలియజేసి, ఇది ఉజ్జాయింపు విలువ మాత్రమే అని చెప్పిన మొదటి సారి గణితవేత్త ఆర్యభట్ట. భారతదేశ గణిత వి చరిత్రలో ఇద్దరు 'ఆర్యభట్ట' అనే శాస్త్రవేత్తలుండేవారు. క్రీ.శ.476లో జన్మించిన ఆర్యభట్టను మొదటి ఆర్యభట్టగాను, క్రీ.శ. 950లో జన్మించిన ఆర్యభట్టను ఆర్యభట్ట-2 అంటాము. ప్రపంచ గణిత చరిత్రలో 𝞹 విలువను మొదటి 4 దశాంశాలకు సవరించి చెప్పినది. మొదటి ఆర్యభట్ట అయితే ఆర్యభట్ట-2 భూమి వ్యాసము 20,000ను 22చే గుణించి 7చే భాగించిన వృత్త పరిధి వస్తుంది.

కావున మనం ఇప్పుడు 𝞹 విలువను 22/7గా గణిస్తున్నాము. అందుకే 22వ తేదీ జూలై నెల నాడు 𝞹 రమారమీ దినోత్సవం నిర్వహిస్తున్నాము. తర్వాత క్రీ.శ.1150లో భాస్కరాచార్య 2 𝞹 విలువను 3927/1250 = 3.1416 గాను, మరలా 754/240 = 3.14166... గా తెలిపారు.

𝞹 విలువను క్రీ.శ. 1450 లో 355/113 = 3.14159292 అనే చిన్న భిన్నంతో నారాయణ పండిత సూచించారు.

మాధవ (క్రీ.శ. 1340 - 1425) 𝞹 విలువను 2827, 4333, 8823.3/9 x 1011 అను భిన్నంతో సూచించెను. ఇది 11 దశాంశ స్థానాల వరకు ఖచ్చితమైన విలువ.

𝞹 ను కరణీయ సంఖ్య గాను తర్వాత 'ట్రాన్స్ డెంటల్ నెంబర్'గా

భావించారు. శ్రీనివాస రామానుజన్ 𝞹 విలువను 14 దశాంశ స్థానాలకు తెలియజేశారు. ప్రస్తుతం కంప్యూటర్ల సహాయంతో 5 లక్షల దశాంశ స్థానాల వరకు కనుగొన్నా ఈ అన్వేషణ పూర్తి కాలేదు. ఇదీ పై కథ.

ఆధారం: హెచ్. అరుణ

2.99416909621
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు