పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

జ్వరం

జ్వరం యొక్క లక్షణాలు మరియు చికిత్స గురించి తెలుసుకుందాం.

aug19ఆరోగ్యంగా వున్న వారి శరీర ఉష్ణోగ్రత 37 సెంటీగ్రేడ్ డిగ్రీలు వుంటుంది. ఎవరికైనా అంతకంటే ఎక్కువగా వుంటే వారు జ్వరంతో బాధ పడుతున్నారని అర్థం. జ్వరంతో వుండడం అనారోగ్యం కాదు కాని, జ్వరంగా వుండడం చాలరకాల అనారోగ్య లక్షణాలలో ఒకటి.

జ్వరం వచ్చిన ప్రతిసారీ ఏదైనా చికిత్స ఇవ్వనవసరం లేదు. శరీరం క్రిములతో పోరాడే విధానంలో జ్వరం కూడ ఒకటి. కొన్నిసార్లు శరీరాన్ని అలా పోరాడనివ్వడమే మంచిది. తరచూ శరీర ఉష్ణోగ్రతను ధర్మామీటర్ ద్వారా చూసి నమోదు చేస్తుండాలి ధర్మామీటర్ అందుబాటులో లేనప్పుడు చేతిని వెనుకకు తిప్పి నుదిటి మీద చేయి పెట్టి చూస్తే వేడి తెలుస్తుంది. జ్వరం వచ్చిన పిల్లల చర్మం మీతో పోల్చినపుడు వేడిగా తాకుతుంది. జ్వరానికి సంబంధించిన ఇతర లక్షణాలు ఉన్నాయేమో చూడడం ద్వారా కూడా నిర్ధారించవచ్చు.

జ్వరం యొక్క సాధారణ లక్షణాలు

 • ఒళ్ళు వేడిగా ఉండడం
 • చెమట పట్టడం
 • వణుకుతుండడం
 • తలనొప్పి
 • ఒంటినొప్పులు
 • ఆకలి లేకపోవడం
 • సాధారణ బలహీనత

కొద్దిగా జ్వరం వున్నపుడు చికిత్స

 • పిల్లలకు తక్కువ బట్టలు వేయాలి. పసిపిల్లలైతే బట్టలు పూర్తిగా తీసివేయాలి. జ్వరం వున్నవారికి చల్లని గాలి వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గే అవకాశం వుంటుంది.
 • పిల్లలకు ఎక్కువ మొత్తంలో శుభ్రమైన నీటిని ఇవ్వాలి లేదా ఇతర ద్రవపదార్ధాలు ఇవ్వాలి.
 • పిల్లలు ఎక్కువ సార్లు మూత్ర విసర్జన చేసేలా చూడాలి.
 • ఒకవేళ మూత్రవిసర్జన చేయకపోయినా, మూత్రం ముదురు పసుపు రంగులో వస్తున్నా ఇంకా ఎక్కువ నీరు, ద్రవపదార్థాలు ఇవ్వాలి.
 • పారాసెటమాల్ వంటి టాబ్లెట్లు జ్వరం ఎక్కువగా వుంటే ఇవ్వవచ్చు. జ్వరం రావడానికి కారణాలు కనుగొని చికిత్స చేయించడం మంచిది.
 • ఐదు రోజుల్లో గనుక జ్వరం తగ్గకపోతే పిల్లలలో ఇతర అనారోగ్యాలు కనిపించక పోయినా కూడా డాక్టరు దగ్గరికి తప్పకుండా తీసుకు వెళ్ళాలి.

తీవ్రమైన జ్వరం

తీవ్రమైన జ్వరం త్వరగా తగ్గించకపోతే చిన్నపిల్లలకు చాల ప్రమాదకరం. ఇలాంటి జ్వరం వల్ల పిల్లల మెదడుకు శాశ్వతంగా నష్టం జరిగే ప్రమాదం వుంటుంది.

జ్వరం గురించి కొన్ని విషయాలు

జ్వరానికి ఎలాంటి మందులు అవసరం లేకుండా ఇంట్లోనే చికిత్స అందించవచ్చు. ప్రతిసారీ జ్వరం అంటువ్యాధి కాదు కానీ ఏ కారణం చేత జ్వరం వచ్చిందన్న దాన్ని బట్టి అది ఆధారపడి వుంటుంది. జ్వరంతో బాధపడుతున్న పిల్లలు ఇతర పిల్లలతో కలిసి భోంచేయడం, పడుకోవడం చెయ్యకూడదు. తీవ్రమైన జ్వరం ప్రాధమిక చికిత్సతో తగ్గకపోతే అత్యవసరంగా వైద్యసహాయం అందిచాల్సి వుంటుంది.

ఆధారం: డా. ఎం. రమాదేవి

3.01201201201
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు