పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

టెలివిజన్ రిమోట్ కంట్రోల్

శ్రమ తగించిన రిమోట్ కంట్రోల్.

మనం టివి చూస్తున్నపుడు ఛానెల్ మార్చాలన్నా, వాల్యూమ్ పెంచడం లేదా తగ్గించడం చేయాలన్నా టివి' సెట్ దగ్గరగా వెళ్ళి వాటికి సంబంధించిన బటన్ లను నొక్కాలంటే, చిరాకు పడతాం. ఆ అవసరం లేకుండా, దూరంగా మనం కూర్చున్న చోటి నుంచే రిమోట్ కంట్రోల్ ను ఉపయోగించి మనం కోరుకున్న మార్పులు చేయగలుగుతున్నాం. రిమోట్ కంట్రోల్ తో ఆయా బటన్ లు నొక్కినప్పుడు మన కంటికి కనిపించకపోయినా సంబంధిత ఆదేశాలు టివి సెట్ కు ప్రసారం కావటం వలన మనకు కావల్సిన ఛానెల్ ప్రత్యక్షమౌతుంది లేదా వాల్యూమ్ లో మార్పు వస్తుంది. మన చేతిలో ఇమిడి పోయి మనకు ఉపయోగపడుతున్న ఈ రిమోట్ కంట్రోల్ ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం.

నిజానికి రిమోట్ కంట్రోల్స్ లో రెండు రకాలున్నాaug029.jpgయి. ఒక రకం పరారుణ కాంతి (Infrared light) ని ఉపయోగించుకునేవి. రెండో రకం రేడియో తరంగాల (radio waves) ని ఉపయోగించుకునేవి.

మనం మన ఇళ్ళలో ఉపయోగించుకునే చాలా రకాల రిమోట్ కంట్రోల్స్ లాగే టివి రిమోట్ కంట్రోల్ కూడా మనకంటికి అగుపడని పరారుణ సంకేతాలను (infrared signals) ఉపయోగించుకుని పనిచేస్తుంది. ఈ సంకేతాలు రిమోట్ నుంచి టివి సెట్ కు ప్రసారం అవుతాయి. టివి ఈ సంకేతాలను బైనరీ డేటా (binary data) రూపంలో అందుకుంటుంది. ఈ సంకేతాలు ముఖ్యంగా ఒకట్లు (1s) సున్నలు (Os) లతో ఏర్పడే సమూహాలు (sets) గా ఉంటాయి. వీటిని టివి వేర్వేరు ఆదేశాలుగా గ్రహిస్తుంది. ఉదాహరణకు రిమోట్ కంట్రోల్ మీద వాల్యూమ్ కు బటaug028.jpgన్ ను నొక్కామనుకుందాం. ఇప్పుడు రిమోట్ నుంచి టివీకి ఒక ఖచ్చితమైన సంకేతం ప్రసారం అవుతుంది. దానికి అనుగుణంగా వాల్యూమ్ మారుతుంది. అలాగే చానెల్ బటన్ ను నొకామనుకుందాం. అప్పుడు పూర్తిగా భిన్నమైన సంకేతం ప్రసారం కాబడి ఛానెల్ లో మనం కోరుకున్న మార్పు వస్తుంది. సోనీ టివిల్లో 0, 1లతో ఏర్పడే ఏడు అంకెల బైనరీ కమాండ్స్ ఉండే సోని-s కంట్రోల్ వ్యవస్థ ఉంటుంది.

రిమోట్ కంట్రోల్ చివర ఒక ఎల్.ఇ.డి. (Light Emiting Diode, LED) ఉంటుంది. టి.విలో ఉండే L.E.D. రిసీవర్తో ఇది అనుసంధానంగా పనిచేస్తుంది. రిమోట్ మీద చాలా బటన్ లను మనం చూస్తుంటాం కదా. ఈ బటన్లలో ఏదైనా ఒకదానిని నొక్కితే, అది సర్క్యూట్ బోర్డ్ లోపల వుండే ఒక కాంటాక్ట్ పాయింట్ ను స్పృశిస్తుంది. ఆ సర్క్యూట్ పూర్తవుతుంది. దానికి సంబంధించిన కమాండ్ ను LED ఉద్గారిణి (emitter) ద్వారా పంపిస్తుంది. టెలివిజన్ సెట్ దీనిని అందుకుని దానికి అనుగుణంగా స్పందిస్తుంది. ఆ బటన్ నొక్కి ఉంచినంత సేపు వాల్యూమ్ పెరిగిపోతూ ఉండడం లేదా ఛానెల్స్ వరుసగా మారిపోతూ ఉండడం మనం గమనిస్తూ ఉంటాం.

ఈ రోజుల్లో యూనివర్సల్ రిమోట్ కంట్రోల్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇవి ఎన్నో రకాల టివిలు, విసిఆర్లు, డివిడి ప్లేయర్లు, ఇంకా అనేక ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలకు ఉపయోగపడతాయి. ఈ రిమోట్స్ మీద ఎన్నో 'కోడ్'ల జాబితా ఉంటుంది. మనం ఏ ఎలక్ట్రానిక్ పరికరాన్ని కంట్రోల్ చేయాలనుకుంటామో దానికి సంబంధించిన 'కోడ్'ను ఎంచుకోవాలి. అది ఏదైనా బ్రాండ్ కి చెందిన టెలివిజన్ అయితే, ఆ 'కోడ్' ఆ బ్రాండ్ కి సరిపోయే పరారుణ పల్స్ ని కంట్రోల్ బోర్డ్ కి పంపుతుంది. ఇలాంటి కోడ్ లు ఎన్నో యూనివర్సల్ రిమోట్ లో ఉండడం వల్ల, ఎన్నో రకాల ఎలక్ట్రానిక్ పరాకరాలకు దీనిని ఉపయోగించుకోవచ్చు.

రిమోట్ కంట్రోల్ పనిచేయాలంటే, విద్యుత్ అవసరం. సాధారణంగా ఇవి బ్యాటరీలతో పనిచేస్తాయి. బ్యాటరీ ఖర్చయిపోతే, రిమోట్ పనిచేయడం ఆగిపోతుంది. పరారుణ కాంతికి టివిలోని రిసీవర్ నేరుగా కన్పించినప్పుడే రిమోట్ పనిచేస్తుంది. పరారుణ కిరణాలు గోడలు, ఫర్నీచర్, మనుషులు ఇలాంటి వాటిగుండా ప్రయాణించవు. కాబట్టి రిమోటకు టివికి మధ్య ఇలాంటివి అడ్డుగా వుంటే రిమోట్ సంకేతాలు టీవికి చేరవు కాబట్టి రిమోట్ పనిచేయదు.

రెండో రకం రిమోట్ కంట్రోల్స్ రేడియో ఫ్రీక్వెన్సీ (RF) ని ఉపయోగించుకుని పనిచేస్తాయి. గరాజ్ డోర్ ఓపెనర్స్, అలారం వ్యవస్థలు, కార్లకు పవర్ డోర్ లాక్స్ ని పనిచేయించే రిమోట్ కంట్రోల్స్ వంటివి రేడియో ఫ్రీక్వెన్సీని ఉపయోగించుకుంటాయి. ఇవి గోడలు, ఇతర ప్రతిబంధకాల గుండా కూడా పనిచేస్తాయి. IR లేదా RF రకాల మధ్య తేడా వాటి రేంజిలోనే ఉంది. IR రిమోట్స్ రేంజి 30 అడుగులు కాగా, RF రిమోట్స్ రేండి 100 అడుగులు ఉంటుంది.

ఆధారం: డా.ఇ.ఆర్.సుబ్రహ్మణ్యం.

3.01436781609
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు