অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

డిసెంబరు నెల సైన్స్ సంగతులు

డిసెంబరు నెల సైన్స్ సంగతులు

1.12.1971: భారతదేశంలో మొట్టమొదటి మూత్రపిండాల మార్పిడి శస్త్రచికిత్స జరిగింది.

02.12.1901: సేప్టేరేజర్ పేటెంట్ చేయబడింది. అమెరికాలోని బోస్టన్ లో కింగ్ క్యాప్ గిల్లెట్ చేశారు.

03.12.1984: భోపాల్ లోని యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీలో మిథైల్ ఐసోసయనేట్ (MIC) వాయువు లీకై దాదాపు 2500 మంది చనిపోయారు.

04.12.1898: రామన్ ఎఫెక్ట్ ఆవిష్కరణలో సి.వి.రామన్ కు సహకరించిన నేషనల్ ఫిజికల్ లేబారేటరీ మొదటి డైరెక్టర్ డా. కె.ఎస్. కృష్ణన్ జన్మదినం.

06.12.1877: మానవ స్వరాన్ని ధామస్ అల్వా ఎడిసన్ మొట్టమొదటగా రికార్డ్ చేసిన రోజు. తన మాటలు తానే రికార్డ్ చేశాడు. ఆ మాటలు “Mark had a little lamb”.

07.12.1972: చంద్రుడు మీదకు పంపబడిన అపోలో ప్రయోగాలలో చివరిది అపోలో-17 ప్రయోగించబడిన రోజు.

08.12.1993: అంతరిక్ష కక్ష్యయలోగల హబుల్ స్పేస్ టెలిస్కోపును, అంతరిక్షనౌక ఎండీవర్ సిబ్బంది రిపేర్ చేసిన రోజు.

09.12.1868: వాతావరణపు నైట్రోజన్ నుండి అమ్మోనియంను తయారు చేసిన నోబెల్ బహుమతి (1918 – రసాయనశాస్త్రం) గ్రహిత ఫ్రిడ్జ్ హేబర్ జన్మదినం.

10.12.1896: డైనమైట్ ను తయారు చేసిన స్వీడిష్ ఇండనీర్, రసాయన శాస్త్రవేత్త అల్ఫ్రైడ్ నోబెల్ (Alfred Nobel) మరణించిన రోజు.

11.12.1848: క్షయకు (TB) మందు కనుగొన్న రాబర్ట్ కోచ్ (జర్మనీ) జన్మదినం.

12.12.1901: అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా మొట్టమొదటి వైర్ లెస్ సంకేతాలు ప్రసారం అయినరోజు. ఈ వైర్ లెస్ సంకేతాలు గుగ్లీల్మో మార్కోని పంపారు.

14.12.1549: తోకచుక్కలకు, సూపర్ నోవాకు, విశ్వాంతరాశ వస్తువులకు సంబంధించి పరిశోధనలు చేసిన డేనిష్ ఖగోళ శాస్త్రవోత్త టైకోబ్రాహి జననం.

15.12.1654: ప్రపంచంలోని మొట్టమొదటి వాతావరణ కేంద్రం ఇటలీలోని టుస్కానిలో ఏర్పడింది.

16.12.1985: కల్పాక్కంలోని ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చీలో ప్రయోగాత్మక ఫాస్ట్ బ్రీడర్ ను దేశానికి అంకితం చేశారు.

17.12.1778: గని కార్మికులకు సేఫ్టీ ల్యాంపును రూపొందించిన బ్రిటీష్ రసాయన శాస్త్రవేత్త హంప్రీడేవి జననం.

18.12.1856: ఎలక్ట్రాన్ ను కొనుగొన్న జె.జె.థాంసన్ జన్మించిన రోజు.

19.12.1852: వర్ణపట అధ్యయనానికి 1907లో భౌతికశాస్త్రవేత్త నోబెల్ బహుమతి అందుకున్న ఆల్బర్ట్ అబ్రహాం పుట్టిన తేది.

20.12.1967: మొట్టమొదటి మానవ హృదయ మార్పిడి ద్వారా గుండెను పొందిన లూయూస్ వాష్ కానిష్కి మరణం.

21.12.1969: చంద్రుని వైపు అంతరిక్షనౌక అపోలో-8 ప్రయోగించబడిన రోజు.

22.12.1887: ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన భారతీయ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజం జన్మదినం.

23.12.1947: విలియం షాక్లీ, వాల్టర్ బ్రిటన్ మరియు జాన్ బ్రర్థీన్ అనే ముగ్గురు శాస్త్రవేత్తలు ట్రాన్సిస్టర్ ఆవిష్కరించారు.

24.12.1843: అణుచలన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన జేమ్స్ పి.బౌల్ జననం.

25.12.1642: యాంత్రిక శాస్త్రం, కాంతి, కలన గణితం ఇలాంటి శాఖాలలో గొప్ప పరిశేధనలు చేసిన ఐజాక్ న్యూటన్ జన్మదినం.

26.12.1792: గణిత శాస్త్రవేత్త చార్లెస్ బాబేజ్ జననం. ఈయన మొట్టమొదట మెకానికల్ కంప్యూటర్ తయారుచేశారు.

27.12.1571: గ్రహగతులను వివరించిన ఖగోళ శాస్త్రవేత్త, గణిత శాస్త్రవేత్త జోహెన్నస్ కెప్లర్ జననం.

28.12.1882: ఐన్స్టీన్ సాధారణ సాపేక్షతా సిద్ధాంతానికి ప్రయోగ రుజువులు చూపిన ఆర్థర్ స్టాన్లీ ఎడ్డింగ్ టెన్.

29.12.1800: రబ్బరుకు సంబంధించి వల్కనైజేషన్ ప్రక్రియను రూపొందించిన ఛార్లెస్ గుడ్ ఇయర్ పుట్టినరోజు.

31.12.1968: అప్పటి రష్యా మొట్టమొదటి సూపర్ సానిక్ ఎయిర్ లైనర్ T.V-144 ను ప్రయోగించింది.

ఆధారం: బి. మోక్షానందం, చందా శ్రీనివాస రావు

చివరిసారిగా మార్పు చేయబడిన : 4/26/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate