పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

డోనాల్డ్ డక్ కు డెబ్బై ఏళ్ళు

వాల్ట్ డిస్నీ 1934 జూన్ లో తెలివైన కోడిపెట్ట అనే పొట్టి ఫిల్మ్ లో మన డోనాల్డ్ డక్ ని ప్రవేశపెట్టారు.

donaldduckప్రపంచంలోని పిల్లలందరికీ (పెద్దలకి మాత్రం కాదేం) ప్రియాతిప్రియమైన నేస్తం డోనాల్డ్ డక్ కు జూన్ 9 నాటికి కి 70 ఏళ్ళు వచ్చాయి. కార్టూన్ ఆనిమేషన్ లోకాన్ని డోనాల్డ్ డక్ కు ఈ 70 ఏళ్ళు ఏలిందనే చెప్పాలి. ఎంతగా ఏలిందంటే ఇప్పటికీ దానికి ఎదురులేదు. డోనాల్డ్ డక్ హంస కాదు. నెమలి కాదు. వొట్టి బాతు. ఈ బాతుకి చరిత్రలో ఇంత కీర్తి దక్కడం నభూతో నభవిష్యతి అని లోకమంతా ముక్కున వేలేసుకొంటోంది.

వాల్ట్ డిస్నీ 1934 జూన్ లో తెలివైన కోడిపెట్ట అనే పొట్టి ఫిల్మ్ లో మన డోనాల్డ్ డక్ ని ప్రవేశపెట్టారు. మన డక్ క్వాక్ క్వాక్ మంటూ తన ఇంటిల్లిపాదినీ వెంటబెట్టుకొని ఈ ఫిల్మ్ లో కన్పించగానే ప్రపంచంలోని పిల్లలంతా దాన్ని స్వంతం చేసుకొన్నారు.

వాల్ట్ డిస్నీ మిక్కీ మౌస్ కి కూడా ఇంత పేరు రాలేదు. ఇంత ప్రచారం జరగలేదు.

ఓ తమాషా కథ. ఒక కోడి పెట్ట పాపం ఒంటరిగా తన పొలంలో పనిచేసుకుంటూ తోడురమ్మని డోనాల్డ్ డక్ ని, పీటర్ రిగ్ నీ పిలుస్తుంది. వచ్చినట్టే వచ్చి ఈ డక్ గారు కూసే గాడిద మేసే గాడిదను చెరిపినట్టు పనిమానేసి డాన్స్ చేస్తూ ఉంటారు. కోడిపెట్టకు ఒళ్ళు మండి వీటిని విందుకు పిలుస్తుంది. విందులో రెండింటికీ బుద్ధి చెబుతుంది. ఈ కథని ఆనిమేషన్ లో తెరకెక్కించినపుడు వాల్ట్ డిస్నీ పీటర్ పిగ్ బ్రహ్మాండంగా వెలిగిపోతుంది. బోలెడు ఆశలు పెట్టుకొన్నాడు. డోనాల్డ్ డక్ చరిత్రని తిరగవేస్తుందని ఆయన కలలోకూడా అనుకోలేదు. కానీ పిగ్ బోళ్ళపడింది. డక్ క్వాక్ లతో పిల్లల గండెల్ని దోచేసుకొంది.

అంతే అప్పటి నుంచి అదే సూట్ తో (ప్యాంటు లేకుండా) డోనాల్డ్ డక్ ఎన్ని ఫిల్మ్ ల్లో కన్పించిందో లెక్కలేదు. ఎన్ని దేశాల్లో తిరిగిందో లెక్కలేదు. అయితే పాపం మన డక్ గార్కి స్వీడన్ లో ఎక్కడాలేని చిక్కొచ్చిపడింది. ప్యాంటు వేసుకోకుండా ఎక్కడపడితే అక్కడ తిరుగుతావా భడవా అని సెన్సార్ వాళ్ళు చీవాట్లేశారు.

ఇంతకీ డోనాల్ట్ డక్ కి ఇంత పేరు ఎలా వచ్చినట్టు ? నిజానికి డోనాల్ట్ కి రూపమిచ్చింది వాల్ట్ డిస్నీ కాదు. కార్ల్ బర్కృ (1901 – 200) అనే కళాకారుడు. ఆయన మాటల్లోనే డొనాల్ట్ డక్ విజయానికి కారణాలేమిటో గమనిందాం.

డొనాల్ట్ చేష్టలేమీ కల్పితాలూ, కనీవినీ ఎరగని అద్భుతాలు కాదు. మనం రోజూ ఎన్నో సమస్యల్ని ఎదుర్కొంటాం. దానికితగ్గట్టు మన చేష్టలుంటాయి. డొనాల్ట్ కూడా అలాంటిదే. మనం చేసిన తప్పులే అది చేస్తుంది. అప్పుడది విలన్ గావచ్చు. మంచి ఎదురైనపుడు మంచిదైపోవచ్చు. సగటు మనిషిలాగే తెలిసీ తెలియక తప్పులు చేయొచ్చు. మంచి చెయ్యొచ్చు. అచ్చం అది మనలాంటిదే. అందుకనే లోకమంతా దానికి జేజేలు పలికారు.

1943 డొనాల్డ్ డక్ కి ఆస్కార్ అవార్ట్ లభించింది. ప్రపంచమంతా తనకు వ్యతిరేకమైనా, అడుగడుగునా తనని పాతాళానికి తొక్కెయ్యాలని చూచినా గుండె నిబ్బరంతో నిలబడ్డ ఒక సామాన్యుడి పాత్రని ఇందులో డొనాల్డ్ పోషిస్తుంది.

ఇదీ డొనాల్డ్ అసలు రూపం. అది సాదాసీదా పాత్ర. మనలాంటి పాత్ర అందులో మనం మనల్నే చూసుకొన్నాం. అందుకే డెబ్బై ఏళ్ళు నిండినా దాని వాసి ఏ మాత్రం తగ్గలేదు.

చరిత్రలో చార్లీ చాప్లీన్ నుంచి గొప్ప పాత్రలన్నీ ఇలానే ఉంటాయి. అలాంటివే చిరస్థాయిగా నిల్చిపోతాయి. డొనాల్ట్ పాత్ర అలా నిలిచిపోవాలని ఆశిద్దా.

2.98214285714
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు