హోమ్ / విద్య / బాలల ప్రపంచం / బాలల సైన్స్ విభాగం / అడిగి తెలుసుకుందాం / తలకు మించిన ఆహారాన్ని మింగడం పాములకు ఎలాసాధ్యం?
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

తలకు మించిన ఆహారాన్ని మింగడం పాములకు ఎలాసాధ్యం?

పాము నోటిలో జరిగే కోన్ని అనుకూలమైన మార్పుల వలనే అవి తలకు మించిన ఆహారాన్ని తీసుకుంటాయి. ఆ మార్పులు ఏంటో తెలుసుకుందాం.

snakeoneపెద్ద జీవి, చిన్న జీవినితినడం ప్రకృతి సహజం. ఒకవేళ పెద్దజీవిని తినాల్సిన అవసరం వస్తే ముక్కలుగా చేసుకొని నమిలి మింగడం సహజం. కాని పాములు అలా కాదు. దాని నోటిలో పళ్లున్నప్పటరీ అవి నమలడానికి ఉపయోగించవు. అందుకే తన ఆహారాన్ని అమాంతంగా ఒకేసారి మింగేస్తుంది. ఏ జీవైనా తన తలసైజుకు మించిన ఆహారాన్ని ఒకేసారి మింగలేదు. కానీ పాము మాత్రం తన తలసైజుకాదు కదా తనబరువుకు పదింతల బరువున్న ఆహారాన్ని కూడా ఒకేసారి మింగేయగలదు. మనం తరచుగా చూసే నాగుపాము, కట్లపాము లాంటివి కోడిగుడ్డును, ఎలుకలను తొండలను మింగేయగలిగితే, కొండచిలువలు లాంటివి పెద్దపెద్ద జింకలను, లేగదూడలను మింగేస్తుంది. ఇది పాముకు ఎలాసాధ్యమవుతుంది. మనుగడ కోసం జరిగిన పోరాటంలో, పరిణామక్రమంలో పాము నోటిలో జరిగిన కోన్ని అనుకూలమైన మార్పుల వలనే ఇది సాధ్యమైంది.

ఏమిటి మార్పులు...

పైదవడ, కింద దవడల మధ్యవున్న చర్మానికి (బుగ్గ) బాగా సాగే లక్షణం వుంది. ముడతబడివుండి నోరు పెద్దదిగా తెరుచుకోవడానికి అనుకూలంగా వుంది. పామునోటికి మనలాగే రెండు దవడలుంటాయి. పైదవడ పుర్రెలో భాగం. క్రింది దవడ పుర్రెలో భాగం. క్రింది దవడ పుర్రెతో ఒక కీలుద్వారా అతకబడి వుంటుంది. ఈ కీలు సాగే లక్షణమున్న లిగమెంటులద్వారా బిగించబడి వుంటాయి. snaketwoబాగానోరు తెరుచుకోవలసి వచ్చినప్పుడు ఈ లిగమెంటు బాగా సాగి సుమారు 150º వరకు నోరు తెరుచుకోగలదు. (మనిషిలో 45º మాత్రమే సాధ్యం) మరీ అవసరమైతే దవడకీలు తొలిగి పోతుంది. ఇంకా అవసరమైతే పైదవడ ఎముక రెండుగా, క్రింది దవడ ఎముక రెండుగా మధ్యలో చీలి రెండుదవడ ఎముకలు కాస్చా నాలుగు ఎముకలుగా మారి నోరు వెడల్పవుతుంది నాలుగు భాగాలైన దవడ ఎముకలలో ఒకవైపున వున్న పైదవడ ఎముక, క్రిందిదవడ ఎముకలు, రెండూ ఒక యూనిట్ గానూ, ఇంకొక వైపున్న రెండు దవడ ఎముకలు ఒక యూనిట్ గానూ పనిచేస్తాయి. ఎడమ యూనిట్ పంటి సహాయంతో ఆహారాన్ని లోనికి లాక్కుంటూ కుడి యూనిట్ ను ముందుకు నెట్టి ఆహారాన్ని పట్టి లోనికి లాక్కుంటుంది. యిలా మార్చి మార్చి దవడ ఎముకల సహాయంతో ఆహారాన్ని లోనికి లాక్కొంటుంది. పొట్టమీద బోర్లా పడుకొని మోచేతుల మీదుగా మనిషి పాకడం చేస్తే ఎలావుంటుందో అలా వుంటుందన్నమాట.

snakethreeనోటినిండా ఆహారం పెట్టుకుంటే మింగడానికి మనం చాలా కష్టపడతాం. కాని పాముకు ఆ కష్టం లేదు. చాలా సునాయాసంగా మింగేస్తుంది. కూచిగా అంగిలి వైపుకు వంగి వున్న పళ్లు నమలడానికి, ఉపయోగపడతాయి. శత్రువును కాటువేయడానికి ఆహారాన్ని అంగిటిలోనికి నెట్టడానికి ఉపయోగపడతాయి.

నోటిలోనే కాదు ఆహారవాహికలో కూడా పాముకు ఒక ప్రత్యేకతవ ఉంది. నోరు ఎంతపెద్దదిగా సాగగలదో అంతే పెద్దదిగా సాగే లక్షణం ఆహార వాహికకు కూడా ఉంది. అందుకే పాముకు గొంతు పట్టుకునే సమస్యేరాదు.

మనం నోటినిండా ఆహారం పెట్టుకుంటే ఊపిరాడక అల్లాడిపోతాం.మరి పాముకు సమస్యే లేదు. తలకు మింగిన ఆహారాన్ని మింగుతున్న గంటలతరబడి నింపాదిగా మింగుతుంది. తనకేం ఊపిరి ఆడని సమస్యవుండదు. ఎందుకంటే మనలా శ్వాస గొట్టాలు అంగిలిలోకి తెరుచుకుని వుండక దవడ దగ్గర ప్రక్కకు తెరుచుకుని వుంటాయి.

ఇంతకూ ఆహారం మింగిన తరువాత సాగిన లిగమెంట్లు ముక్కలు అయిన దవడ ఎముకలు, తొలిగిన క్రిందిదవడ కీలు సంగతేమిటి మింగడం పూర్తికాగానే మనం ఆవులించినట్లుగా ఒక్కసారిగా అంటే అన్నా యధాస్థానానికి చేరుకుంటాయి.

snakefourనోటిలోనే యిన్ని మార్పులుంటే మరి పెంకుతో సహా మింగిన గుడ్లు, ఎముకలతో సహా మింగిన జింకలు మొదలైనవి మెత్తనైన పాముశరీరంలో ఎలా జీర్ణం కాగలవు. దీనికోసం పరిణామక్రమంలో జరిగిన మార్పులెన్నో వచ్చే సంచికలో తెలుసుకుందాం.

రచన : డా,, ఎం.వి. రమణయ్య

2.97663551402
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు