పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

దూసుకుపోతున్న చైనా

చైనా ప్రపంచ అభివృద్ధి పటంలో దూసుకుపోతుంది.

మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రెండు సంవత్సరాల తరువాత స్వాతంత్ర్యం పొందిన చైనా ప్రపంచ అభివృద్ధి పటంలో దూసుకుపోతుంది. ప్రపంచంలో ఏ మూల చూసిన చైనా వస్తు సముదాయం మార్కెట్ లో కనిపిస్తుంది. ప్రపంచంలో అత్యదిక జనాభా 9130 కోట్లు)  ఉన్న దేశమే అయినా ప్రజలందరికీ ఆహారం అందించడంలో, ఆరోగ్య వసతులు కల్పించడంలో ఆదర్శంగా నిలుస్తుంది. దాదాపు కోటి చ.కి.మీ. వైశాల్యం కలిగిన చైనా ఉత్తరాన మనకు పొరుగు దేశమని మీకు చెప్పనవసరంలేదు. చైనాకు ఉత్తరాన మంగోలియా, ఆగ్నేయంగా కజకిస్థాన్, ఈశాన్యంలో రష్యా, పడమట కొరియా, దక్షిణంగా థాయ్ లాండ్, నైరుతిలో పాకిస్తాన్ దేశాలు దీని సరిహద్దులు. ఇవి పసిఫిక్ మహాసముద్ర తీరం కూడా గమనీయంగా ఉంది. చైనా రాజధాని బీజింగ్ కాగా అతి పెద్ద పట్టణం ఫాంగై 91.5% ప్రజలు హాన్ తెగకు చెందిన వారు. ఈ దేశ భాష మాండరిన్. చైనా కరెన్సీని యువాన్ గా వ్యవహరిస్తారు.

రాజధాని బీజింగ్ సమీపంలో 3 లక్షల సంవత్సరాల నాటి మానవ అవశేశాలు లభ్యమవటం ఈ దేశ ప్రాచీనతను తెలియజేస్తుంది. అతి ప్రాచీన కాలంలోనే దిక్సూచి, తుపాకి మందు, చెక్క అచ్చుదిమ్మెలు, కాగితం తయారుచేసిన చరిత్ర ఉంది. 1000 సంవత్సరాలకు ముందే కాగితం డబ్బు కూడా చలామణిలో ఉండేది. ఈనాటికి బాణాసంచా తయారీలో అగ్రస్థానం చైనాదే. మన దేశంలో తోలుబొమ్మలాట చేతితో ఆడిస్తాం కదా, చైనాలో 11వ శతాబ్దానికే యంత్రాలతో తోలుబొమ్మలాండించే సాంకేతికత ఉంది.

క్రీస్తు పూర్వమే యూరప్ దేశాలు, పశ్చిమాసియాకు వ్యాపార నిమిత్తం ఆ రోజుల్లో వాడే రహదారిని “సిల్క్ రూట్” గా పేర్కొన్నారు. విదేశీ దండయాత్రలను తట్టుకోవడానికి 8,851 కి.మీ. పొడవునా “గ్రేట్ వాల్”ని క్రీస్తు పూర్వమే నిర్మించారు. గ్రేట్ వాల్ ప్రపంచ అద్భుతాల్లో ఒకటి. కాగా ఈ కాలంలో చైనా నిర్మించిన ‘3 గోర్జెస్’ ఆనకట్ట నిర్మాణం మరో గొప్ప ఇంజనీరింగ్ అద్భుతం.

3.00714285714
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు