పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

దోమలు

ప్రపంచంలో దాదాపు 2000ల రకాల దోమ జాతులు ఉన్నాయట.

15అబ్బబ్బా దోమలు భలే కుడుతున్నాయి కదూ, అంటారు ఒకరు. అంత ఎక్కువగా లేవే అంటారు ఇంకొకరు. ఎందుకు? ఎందుకంటే కొందరిని దోమలు ఎక్కువగా కుడుతాయి, కొందరిని తక్కువగా కుడుతాయి మరీ. ఒకే ఇంట్లో ఉండే వ్యక్తుల్లో కొందరిని కుడితే కొందరిని వదిలేస్తుంటాయి. ఎందుకు? దీనిమీద నేదర్లాండ్స్ లో జరిగిన పరిశోధనలో ఒక కొత్త విషయం కనుగొన్నారు శాస్త్రజ్ఞులు. దోమలు మనుషుల చెమటకు ఆకర్షించబడ్డాయి అన్న కొత్త విషయం కనుగొన్నారు శాస్త్రజ్ఞులు. దోమలు మనుషుల చెమటకు ఆకర్షించబడ్డాయి అన్న కొత్త విషయం వీరు కనుగొన్నారు. నలుగురు స్నేహితులు ఒక దగ్గర నిలబడి మాట్లాడుకుంటుంటే ఒకరిద్దరి నెత్తి మీద దోమలు విపరీతంగా గుమిగూడి తిరుగుతున్నట్లు మనం గమనించి ఉంటాం కదూ, కారణం వారు తలస్నానం చేసి కొన్ని రోజులైన అయ్యుంటుంది. మనం రోజు స్నానం చేస్తాం గానీ తలస్నానం రెండు మూడు రోజులకు గానీ చేయం. అందువల్ల తలలో చెమట పట్టి వాసన వస్తుంటుంది. ఆ చెమట వాసన దోమల్ని ఆకర్షిస్తుంది. అందుకే వారి తల మీద దోమలు గుమికూడతాయి. ఇక ఒకరి చెమట వాసనకు ఆకర్షించబడిన దోమ పదే పదే ఆ వ్యక్తిని కుడుతు ఉంటాయట.

అసలు దోమలు మనిషి రక్తం ప్రధాన ఆహారం కాదు. కానీ అవి గుడ్లు పెట్టడానికి అవసరమైన ఐసోలుసీన్ అనబడే పదార్థం మన రక్తంలో ఉంటుంది. ఈ పదార్థం కోసం మనల్ని ఆడ దోమలు కుడుతుంటాయి. మగ దోమలు గుడ్లు పెట్టవు. కాబట్టి అవి మనుషుల జోలికి రావు. మగ దోమలు పువ్వలలోని రసాలను తాగుతుంటాయి.

ప్రపంచంలో దాదాపు 2000ల రకాల దోమ జాతులు ఉన్నాయట. దోమలు లేని ప్రదేశం భూమి మీద లేదట. ఇవి ద్రువాల నుంచి భూమధ్యరేఖ దాకా అన్ని ఖండాలలో అన్ని వాతావరణాల్లో ఇవి జీవిస్తుంటాయి. దోమలు కుడుతున్నప్పుడు మన రక్తం పీల్చుకోవడంతో పాటు దాని లాలాజలాన్ని మన శరీరంలోకి వదులుతుంది. అందులో మలేరియా, బోధకాలు, డెంగ్యూ లాంటి ప్రమాదకర వ్యాధులు కలిగించే సూక్ష్మజీవుల్ని మన శరీరంలోకి విడుదల చేస్తుంటాయి.

రాత్రులు దోమలు కుడితే నిద్ర పాడవుతుంది. పగలు పనులు చేసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. అంతేకాదు రోగాలు కూడ వస్తుంటాయి. దోమల నుంచి    రక్షణ పొందాలంటే జెట్ కాయిల్స్, గుడ్ నైట్ లిక్విడ్ వంటివి వాడుకుంటాం. కానీ అవి కూడా మన ఆరోగ్యానికి అంత మంచిదేమీ కాదు. కాబట్టి కనీసం రెండు రోజులకి ఒకసారి తలస్నానం చేయటం అవసరం. అలాగే దోమ తెరలు వాడటం శ్రేయస్కరం.

3.01123595506
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు