పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

ద్విగత చర్య

రసాయన శాస్త్రంలో ద్విగత చర్య ఎలా జరుగుతుందో ప్రయోగం చేసి చూద్దామా.

రసాయన శాస్త్రంలో ద్విగత చర్య ఎలా జరుగుతుందో ప్రయోగం చేసి చూద్దామా, ఈ ప్రయోగానికి లేడ్ నైట్రేట్ Pb(NO3)2 అనే రసాయనిక సమ్మేళనం, పరీక్షనాళిక, సారాయి దీపం, పరీక్షనాళిక హెల్డర్, గ్లాసు, ఐస్ ముక్కలు, ఉప్పు, అగ్గిపెట్టె, అగరుబత్తి అవసరం.

రెండు లేక మూడు లెడ్ నైట్రేట్ స్ఫటికాలను పరీక్షనాళికలో తీసికొని, పరీక్ష నాళికను హూల్డర్ తో పట్టుకొని సారాయి దీపం పై వేడి చేయాలి. మొదట పట్ పట్ మని శబ్దం చేస్తూ, లెడ్ నైట్రేట్ నుంచి ముదురు గోధుమరంగు వాయువు పరీక్షనాళిక అంతా వ్యాపిస్తుంది. ఇది నైట్రోజన్ డై ఆక్సైడ్ వాయువు.

నేస్తాలూ, పరీక్షనాళికలో వాయువులు వెలువడేటప్పుడు అగరుబత్తిని వెలిగించి నిప్పు కలిగిన అగరుబత్తిని పరీక్ష నాళికలోకి చొప్పించి గమనించండి. నిప్పు కలిగిన అగరుబత్తి మంటతో మండటం మీరు చూస్తారు. అంటే మండుటకు దోహదపడే ఆక్సిజన్ కూడ వెలువడుతుందన్నమాట. మరొక క్రియా జన్యువు (Product) లెడ్ ఆక్సైడ్ పరీక్షనాళీక అడుగున మిగులుతుంది. ఈ రసాయన చర్య సమీకరణం.

2 Pb(NO3)2 → 2PbO + 4NO2 + O2

(ఘ)                 (ఘ) (వా) (వా)

లెడ్ నైట్రేట్లు వేడిచేయుట వలన లెడ్ ఆక్సైడ్, నైట్రోజన్ డై ఆక్సైడ్, ఆక్సిజన్గా విడిపోయింది. అందుకే ఈ చర్యను రసాయన వియోగం (Chemical Decomposition) అంటారు.

నేస్తాలూ, ఇప్పుడు ఒక మ్యాజిక్ చేసి చూడండి, ముదురు గోధుమరంగు వాయువున్న పరీక్షనాళికను బిరడాతో మూయండి. ఒక గ్లాసులో కొంచెం ఐస్ ముక్కలు వేయండి. కొన్ని నీళ్ళు తీసుకోండి. అందులో రెండు చెంచాల ఉప్పు వేసి కలపండి. దీనినే హిమీకరణ మిశ్రమం (Freezing Mixture) వస్తుంది. ఈ మిశ్రమంలో పరీక్ష నాళికను ఉంచి శ్రద్ధగా గమనించండి. ముదురు గోధుమరంగు క్రమేణ రంగులేని వాయువుగా మారుతుంది. తిరిగి పరీక్షనాళికలను గది ఉష్ణోగ్రత వద్ద కొద్ది నిమిషాలు ఉంచండి. ముదురు గోధుమరంగు వాయువు తిరిగి ఏర్పడుతుంది. అంటే ముదురు గోధుమరంగు వాయువు, రంగులేని వాయువుగా మారుతుందన్నమాట. ఈ రంగే లేని వాయువు నైట్రోజన్ టెట్రాక్సైడ్. గది ఉష్ణోగ్రత వద్ద NO2 ఎక్కువగా ఉండి, ఉష్ణోగ్రత తగ్గే కొద్ది N2O4 గా మారుతుంది. హిమీకరణ మిశ్రమం ఉష్ణోగ్రతకు చేరేసరికి మొత్తం N2O4 గా మారటం వలన ముదురు గోధుమరంగు మాయమౌతుంది.

ఈ విధంగా క్రియాజనకాలు (NO2) క్రియాజన్యాలు (N2O4) గా, క్రియాజన్యాలు క్రియాజనకాలుగా మారేచర్యను ద్విగత చర్య అంటారు. ఆ చర్యలను ఈ విధంగా రాస్తాము.

2NO (వా) ⇌ N2O2 (వా)

2NO2→ N2O4 గా మారేది పురోగామి చర్య (Forward Reaction)

N2O4 → 2NO2 , గా మారేది తిరోగామి చర్య (Backward Reaction)

ఈ రెండు చర్యా వేగాలు సమానమయినప్పుడు ఆ చర్య సమతాస్థితి (Equilibrium) కి చేరిందంటాము.

నేస్తాలూ..ఇలా మీరు ప్రయోగాలు చేస్తే ఎన్నో కొత్త కొత్త విషయాలు మీరే పరిశీలించి నేర్చుకొంటారు కదూ!

ఆధారం: ప్రొ. యం. ఆదినారాయణ

3.00290697674
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు