অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

నదులు

నదులు

nov19భూమి మీద జీవం ఏర్పడి 450 కోట్ల సంవత్సరాలు అయివుంటుందని శాస్త్ర పరిశోధనలు తెలియజేస్తున్నాయి. ఈ విధంగా జీవం ఏర్పడడానికి కారణం సరైన భౌతిక రసాయనిక స్థితులు మన భూమి ఉపరితలం మీద ఉండడమే! అలాంటి రసాయనాలలో నీరు ఒకటని మీకు తెలుసు.

నీరు నిలకడగా ఉండకుండా జలచక్రంలో గతిస్థితి (dynamic) లో ఉంటుంది. ఆ జలచక్రంలో ఎక్కువ గతిలో ప్రవాహిగా ఉన్న దశ నదుల్లో నీటిరూపంలో ఉంటుంది. భూగోళం మూడింట రెండు వంతులు నీరు, అదే సముద్రంగా ఉంటుందని మీకు తెలుసు. ఒక వంతుగా ఉన్న నేల పై నదులు ఉంటాయి. సముద్రాల అడుగున నదులు ఉండవు.

సౌరశక్తితో ఉత్తేజితమైన సముద్రాల నీరు మేఘాలుగా మారి వర్షాలుగా నేలపై కురుస్తాయి. ప్రపంచవ్యాప్తంగా వర్షం రూపంలో కురిసే నీటిలో 80 శాతం నదుల్లోకి చేరుతుంది. నేల పర్వతాలుగా, కొండలుగా, లోయలుగా ఎగుడుదిగుడుగా ఉంటుంది కదా. నేలమీద, కొండచరియల్లో కురిసిన వర్షపు నీరు పర్వతాల అడుగున చేరి ప్రోగుపడి ఏటవాలుగా క్రింది వైపుకు భూమ్యాకర్షణ ద్వారా ప్రవహిస్తాయి. నీరు తన ప్రవాహగతిలో నేలను కోసుకుంటూ వెళ్లడం వల్ల నదుల అడుగు భాగాలు తీరప్రాంతాల కన్నా క్రింటు ఉంటాయి. కాబట్టి నదీ ప్రవాహం అనుదైర్యంగా ఒక వైపు తెరుచుకుంటున్న గొట్టాల్లోని ప్రవాహంగా భావించాలి. ఇలా ప్రవహించే నది నీరు చివరకు సముద్రంలో       కలుస్తుంది.

నదులు నేలకున్న కాఠిన్యం, మృదుత్వం ఆధారంగా నేలను తొలవడం వల్ల నదీ ప్రవాహగతి లేదా నదట దర్గం ఏర్పడింది. అందుకే నదులు వంకరటింకరగా ఎక్కువ నేల ప్రాంతాల్లో ప్రవహిస్తాయి. అదే సందర్భంలో నదుల్లో అడుగు భాగాల్లోని చరియల ద్వారా కొంత నీరు భూగర్భజలాన్ని సంపన్నం చేస్తుంది.

నదుల్లో ప్రవహించేది స్వచ్ఛమైన నీరు కాబట్టి నదీ తీరాల్లో పంటలు, చెట్లు, అడవులు ఎక్కువగా అభివృద్ధి చెందాయి. అందుకే మానవ నాగరికత అధికంగానదీతీర ప్రాంతాల్లోనే అభివృద్ధి చెందింది. నదులు నేలప్రాంతాల్ని సారవంతం చేస్తాయి. ఎక్కువ మందికి ఉపయోగపడ్డాయి. జీవుల దాహం తీర్చేందుకు, పంటలు పెరగడానికి, చెట్లు కిరణజన్యసంయోగ క్రియ జరిపేందుకు నదీ నీరే ప్రధాన వనరు. నదులు వరదలసమయంలో తప్ప మిగిలిన సమయాల్లో మందకొడిగా ప్రవహించడం వల్ల వాటిలో ఎన్నో రకాలయిన 'ఉలజీపులు పెరుగుతాయి. చేపలు, రొయ్యలు, తామర..., జల శాకాహార దినుసులకు నదులు ఆవాసాన్ని యిస్తున్నాయి. పెద్ద పెద్ద దుంగలు, వస్తువుల రవాణాకు నదులు దారుల్లాగా సహకరిస్తున్నాయి. పడవలు, నావలు, తెప్పల ద్వారా నదీమార్గ జలాపరితల రవాణా కొన్ని సహస్రాబ్దాలుగా మానవ నాగరికతలు అంతర్భాగం. నదులు అడ్డంగా ఉండడం వల్ల చరిత్రలో యుద్దాలు తగ్గాయని చరిత్రకారులు ప్రస్తావిస్తారు. అటు యిటు ఉన్న మానవ సమాజాల్ని నదులు కలవకుండా చేయడం వల్ల విభిన్న సంస్కృతులు ఏర్పడమే కాకుండా సమకాలీన శాంతియుత వాతావరణాల్లో జాతుల వైవిధ్యం ఏర్పడిందని కూడా చెబుతారు. నివాసప్రాంతాల్లో పడ్డ వర్షపు నీరు అక్కడున్న మలినాల్ని, వ్యర్థాల్ని తీసుకెళ్లి నదుల్లో పరోక్షంగానో, ప్రత్యక్షంగానో కలిపేయడం వల్ల నదులు నివాసప్రాంతాల్ని... చేయించే జలధారలు అని కూడా పరిగణిస్తారు. నదుల ప్రవాహానికి అక్కడక్కడ అనువయిన చోట ఆనకట్టలు కట్టుకోవం వల్ల జలవిద్యుత్తును పొందడమే కాకుండా పై ప్రాంతాల పొలాలకు సేద్యపు నీటిని సరవరా చేయగలుగుతున్నాము.

నేల తాపాన్ని తగ్గించేలా కూడా నదులు - నివాస ప్రాంతాల మధ్య ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరిస్తున్నాయి.

నదుల అడుగుభాగాన పెద్ద పెద్ద రాళ్ళు కూడా ముక్కలు కావడం వల్ల క్రమేపీ ఇసుక ఏర్పడుతుంది. కొన్ని చోట్ల సారవంతమైన బంకమన్ను ఏర్పడింది. ఇసుకను భవన తదితర నిర్మాణాలకు, బంకమన్నును ఏ పంట పొలాల నేలల సారాన్ని యినుమడింపజేసేందుకు వాడుతున్నాము. జలపాతాలు, అడవులు, జీవవైవిధ్యానికి నదీపరివాహక ప్రాంతాలే కావడం వల్ల పర్యాటక వ్యవస్థ... ప్రపంచ వ్యాప్తంగా నదులతో సంధానమై ఎక్కువగా ఉంది. దేశాల మధ్య దేశాల్లో రాష్ట్రాల మధ్య, రాష్ట్రాల్లో జిల్లాల మధ్య నదుల ప్రవాహమార్గాలు సరిహద్దులుగా ఉన్నాయి. ఆ మేరకు పరస్పర ఒప్పందాలు కుదురుతున్నాయి. కుదిరాయి.

కొండప్రాంతాల్లో ఉన్న ఖనిజాల్లోని సారాన్ని పెకిలించి నేలనలుచరుగులా వెదజల్లేలా కూడా నదులు వితరణ వ్యవస్థ..గా భాసిల్లుతున్నాయి. కొండల మధ్య లోయల్ని, చొరికల్ని చేయడం వల్ల పర్వతారోహణ... నదుల వల్లనే గుహలు, సొరంగాలు ఏర్పడ్డాయి. నదులు సాధారణంగా సముద్రంలో కలుస్తాయి. ఎన్నో చిన్న చిన్న నదులు కలిసి ప్రధాననది ఏర్పడుతుంది. నదులు సముద్రాల్లో కలిసే ప్రాంతాల్ని డెల్టాలు అంటారు. గ్రీకు అక్షరం... రూపంలో నదులు సముద్రాల్లో కలిసే దగ్గర పాయలుగా చీలడం వల్ల ఆ ప్రాంతానికి ఆ పేరు వచ్చింది. పై సంచికల్లో నదుల గురించి మరింత ఎక్కువగా తెలుసుకుందాం.

ఆధారం: ప్రొ. ఎ. రామచంద్రయ్య© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate