పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

నదులు

మన భారతదేశంలో ఉన్న నదుల గురించి తెలుసుకుందాం.

మన భారతదేశంలో ఉన్న నదుల గురించి కొంత ముచ్చటించుకోవడం సముచితం. దక్షిణ భారత దేశం కన్నా ఉత్తర భారతదేశం వెడల్పుగా ఉండటం వల్ల ఎక్కువ నదుల పుట్టుకకు, పారికకు వీలయింది. అందుకే దక్షిణ భారతదేశంలో కన్నా ఉత్తర భారతదేశంలో ఎక్కువ నదులు, పొడవైన మార్గాలు ఉన్నాయి. పైగా హిమాలయ పర్వతాలు నుంచి మంచు కరిగి నీరుగా మారడం వల్ల వర్గాలకు తోడుగా జీవ నదుల ఉనికికి అవకాశం ఏర్పడింది.

సింధు నది

భారత ఉప ఖండంలో అత్యంత పొడవైన (సుమారు 3200 కి.మీ.) నది సింధు నది. దీనిలో అధిక మోతాదు పాకిస్తాన్ లో ఉంది. అయినా కాశ్మీరులో దీని ఉపనదులు, దీని ప్రవాహ నిడివి కొంత ఉన్నాయి. కాబట్టి సింధునదిలో కొంత మనకు అధిపత్యం ఉన్నట్లే అర్థం. ఇది హిమాలయ పర్వతాలలో సము మట్టానికి సుమారు 6000 మీటర్ల ఎత్తున అవిర్భవించి చివరికి అరేబియా సముద్రంలో కలుస్తుంది. పరివాహక ప్రాంతం సుమారు 322000 చ.కి.మీ. ఉంటుంది.

గంగా నది

సింధునది తర్వాత అత్యంత పొడవు (సుమారు 2500 కి.మీ.) నది గంగానది. ఇది కూడా హిమాలయ పర్వతాలలో గంగోత్రి అనే ప్రాంతం అవిర్భవించి తూర్పు బంగ్లాదేశంలో ప్రవహిస్తూ బంగాళాఖాతంలో కలుస్తుంది. దీని పరివాహ సుమారు 340000 చ.కి.మీ.

యమునా నది

ఇది పుట్టుక రీత్యా గంగానది సంబంధం లేకున్నా మధ్యలో ఉత్తరప్రదేశ్ లో గంగానది సమాగమమవుతుంది. దీని వ్యక్తిగత పొడవు సుమారు 1400 కి.మీ. దీని పరివాహకత సుమారు 3600 కి.మీ

గోదావరి నది

గంగానది తర్వాత అత్యంత అందమైన నది గోదావరి నది. ఇది మహారాష్ట్రలోని నాసిక్ లో ప్రారంభమై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది. దీని పొడవు సుమారు 1500 కి.మీ. కాగా పరివాహకత సుమారురు 313000 చ.కి.మీ.

కృష్ణా నది

గోదావరి తర్వాత పొడవైన (సుమారు 400 కి.మీ.) నది కృష్ణానది. ఇది కూడా మహారాష్ట్రలో ప్రారంభించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గుండా బంగాళాఖాతంలో కలుస్తుంది. దీని క్రింద రు 260000 చ.కి.మీ. పరివాహకత ఉంది.

నర్మదా నది

దీని పొడవు సుమారు 1300 కి.మీ. ఉపఖండంలో ప్రధానమైన నదులు కేవలం  అరేబియా సముద్రంలో కలుస్తాయి. అందులో నది కూడా ఒకటి. ఇది మధ్యప్రదేశ్లో పుట్టి మహారాష్ట్రలో ప్రవహించి తుదకు అరేబియాలో వస్తుంది. దీని పరివాహకత సుమారు 100000 చ.కి.మీ మాత్రమే.

కావేరి నది

దీని పొడవు వెయ్యి కి.మీ.లోపే (సుమారు 500 కి.మీ.) ఉన్నా పరివాహకత కూడా లక్ష చ.కి.మీ. లోపే సుమారు 90000 ఉన్నా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య నీటి పంపిణీ గొడవల్లో సజీవంగా ఉంది. ఇది కర్ణాటకలోని కూర్గ్ కొండల్లో పట్టి తమిళనాడు గుండా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది.

మిగిలిన నదులన్నీ చాలానే ఉన్నా అవన్నీ వెయ్యి కి.మీ. కన్నా తక్కువ పొడవులోను, మహానది మినహాయించి సుమారు 140000 చ.కి.మీ మిగిలిన నదులు పరివాహకత కూడా తక్కువే ఉంది. కొన్ని నదులు పెద్ద నదులకు ఉప నదులు (tributories) గా ఉంటున్నాయి.

రచన: ప్రొఫెసర్ ఎ. రామచంద్రయ్య

3.01229508197
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు