অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

నవంబర్ నెల సైన్స్ సంగతులు

నవంబర్ నెల సైన్స్ సంగతులు

నవంబర్ - 1 – 1919

విశ్వం పుట్టుకకు సంబంధించి Steady State Theory ని ప్రతిపాదించిన గణిత శాస్త్రవేత్త హెర్మన్ బాండి జన్మదినం ఈ రోజే.

నవంబర్ - 2 – 1833

Indian Association of Cultivation of Science సంస్థాపకులు మహేంద్రలాల్ సర్కార్ జన్మదినం.

నవంబర్ - 3 – 1957

లైకా అనే కుక్క అంతరిక్షయానం చేసిన స్పుత్నిక్-2 ను అప్పటి రష్యా దేశం ఈరోజు నాడే ప్రయోగించింది.

నవంబర్ - 7 – 1867

ఈ రోజు మేరీక్యూరీ జన్మించిన రేజు. రేడియో ధార్మికతకు సంబంధించి 1903లో భర్త పియరీ క్యూరీ మరియు హెన్రీ బెక్రల్ లతో కలిసి భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని పొందారు. రేడియం, పోలోనియం మూలకాలను ఆవిష్కరించినందుకు 1911లో రెండవసారి రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతిని పొందారు.

నవంబర్ - 8 – 1895

ఈరోజు Wilhelm Konrad Roantgen ఎక్స్ కిరణాలను ఆవిష్కరించారు.

నవంబర్ - 9 – 1919

పుష్పించే మొక్కలకు సంబంధించి విస్తృతమైన పరిశోధనలు చేసి, Discovery of Economic Plants in India అనే పుస్తకాన్ని రచించిన భారతీయ వృక్షశాస్త్రవేత్త పంచానన్ మహేశ్వరి జన్మించిన రోజు.

నవంబర్ - 12 – 1896

భారత ఉపఖండంలో పక్షులకు సంబంధించిన అనేక పరిశోధనలు చేసి, బొంబాయిలో National History Society ఏర్పడటానికి కృషి చేసిన ప్రఖ్యాత శాస్త్రవేత్త సలీం అలీ జన్మించిన రోజు.

నవంబర్ - 14 – 1891

భారతీయ వృక్ష శాస్త్రవేత్త బీర్బల్ సహానీ జన్మించిన రోజు.

నవంబర్ - 15 – 1640

ఖగోళ శాస్త్రంలో అనేక పరిశోధనలు చేసి, గ్రహగతులకు సంబంధించి కెప్లర్ గ్రహ గమన సూత్రాలను నిర్వచించిన జోహాన్నెస్ కెప్లర్ మరణించిన రోజు.

నవంబర్ - 16 – 1965

అప్పటి రష్యా మానవ రహిత అంతరిక్ష నౌక పెనీరా-3 ని శుక్రగ్రహం వైపు ప్రయోగించిన రోజు.

నవంబర్ - 18 – 1962

పరమాణు నిర్మాణానికి సంబంధించి, వికిరణానికి సంబంధించి చేసిన పరిశోధనలకు గాను 1922లో భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని పొందిన నీల్స్ బోర్ మరణించిన రోజు.

నవంబర్ - 20 – 1889

అమెరికా ఖగోళ శాస్త్రవేత్త  ఎడ్విన్ పి. హబుల్ జన్మించిన రోజు. వీరు పాలపుంతకు సంబంధించి చేసిన పరిశోధనలు విశ్వ నిర్మాణం, పరిమాణం, పరిణామం గురించి వివరించడానికి దోహదపడ్డాయి.

నవంబర్ – 21 - 1970

రామన్ ఫలితం ఆవిష్కరించి నోబెల్ పురస్కారం పొందిన భారతీయ భౌతిక శాస్త్రవేత్త సి.వి.రామన్ మరణించిన రోజు. వీరు ఇదే నెలలో 1888లో 7వ తేదీన జన్మించారు.

నవంబర్ - 23 – 1937

భారతీయ శాస్త్రవేత్త, బహుముఖ ప్రజ్ఞశాలి జగదీశ్ చంద్రబోస్ మరణించిన రోజు. వారు వృక్ష నిర్మాణం, వాటి ప్రపృతికి సంబందించి ప్రయోగాలు చేశారు. క్రెస్కోగ్రాఫ్ అనే పరికరాన్ని కనుగొన్నాడు.

నవంబర్ - 24 – 1859

మానవ చరిత్రలో ఒక మలుపు. మన ఆలోచనా క్రమాన్ని మార్చిన గ్రంథం On the Origin of Species ఈ రోజే ప్రచూరింపబడింది. దీనిని చార్లెస్ డార్విన్ రచించారు.

నవంబర్ - 26 - 1885

కాస్మిక్ కిరణాలు, కృత్రిమ రేడియోధార్మికతలకు సంబంధించి పరిశోధనలు చేసిన దేబేంద్ర మోహన్ బోస్ ఈ రోజునే జన్మించారు.

నవంబర్ - 27 – 1971

మానవ రహిత అంతరిక్ష నౌక మార్స్-2 కుజగ్రహం చుట్టూ ఒక ప్రదక్షిణ చేసింది. దీనిని అప్పటి రష్యా దేశం ప్రయోగించింది.

నవంబర్ - 28 – 1854

ధర్మల్ న్యూట్రాన్స్ కు సంబంధించి పరిశోధనలు చేసి, 1938లో నోబెల్ బహుమతిని పొందిన అమెరికా భౌతిక శాస్త్రవేత్త ఎన్రికో ఫెర్మి మరణించిన రోజు.

ఆధారం: బి. మోక్షానందం

చివరిసారిగా మార్పు చేయబడిన : 1/22/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate