పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

నాడు ఫ్యాషన్ - నేడు పరేషన్

ధూమపానం ఆరోగ్యానికి హానికరం.

soneప్రతి అభివృద్ధి వెనుక వెలుగునీడలు అనుసరించే ఉంటాయి. ముఖ్యంగా పారిశ్రామిక అభివృద్ది అనేక రంగాలలో వినూత్న అభివృద్ధిని సాధించడంతో పాటు అనేక రకాల సమస్యలనూ తెచ్చి పెట్టింది. అభివృద్ధి చెందుతున్న సమాజాలు ఇప్పటికే వాటిని తిరస్కరించుకోలేక సతమతమవుతున్నాయి. పర్యావరణం మానవ హక్కుల పరిరక్షణ వంటి విషయాల్లో విఫలం కావల్సివస్తుంది. రకరకాల కాలుష్యాలు సగటు మనిషి ఆరోగ్యాన్ని హరించి వేస్తున్నాయి. ఈ పర్యావరణ కాలుష్య కారకాల్లో పొగ ఒకటి. సిగరెట్లకు సంబంధించిన పొగ అతి ప్రమాద కరమైనది. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి నిమిషానికి కోటి సిగరెట్లకు పైగా వినియోగిస్తున్నట్లు అంచనా. అంటే ప్రతి రోజూ దాదాపు 1440 కోట్ల సిగరెట్లు కాల్చబడుతున్నాయి !

ఈ ఫ్యాషలైన సిగరెట్లలో ప్రమాదకరమైన నికోటిన్, చెంజాపైరిన్వంటి క్యాన్సర్ కారక రసాయనిక పదార్థాలు వందల సంఖ్యలో ఉంటాయి. సిగరెట్, చుట్టలు, బీడీలే కాకుండా ప్రస్తుతం పొగాకు సంబంధిత గుట్కా. జర్దా వంటి ఉత్పత్తులు కూడా ప్రజారోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. ఏటా 30 లక్షల మంది పొగాకు సంబంధ వ్యాధుల వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రస్తుతం ఈ అలవాటు ఇలాగే కొనసాగితే 2020 సంవత్సరానికల్లా పొగాకు బారినపడి ఏడాదికి కోటి మంది చనిపోవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తుంది. “వ్యవనాలు మొదట సాలెగుళ్లు ఆ పైన ఇనుప సంకెళ్లు ! అన్న చందంగా ప్యాషన్ గా....... హుందా కొరకు అలవర్చుకున్న ఈ అలవాటు నేటి యువతకు తీవ్ర ప్రతిబంధకంగా తయారయ్యింది. పల్లె - పట్టణం అనే తేడా లేకుండా వయోభేదం అనే మాటే కరువై అన్ని వర్గాలవారిని ఈ పొగాకు ఉత్పత్తులు ఆవహించి ఆరోగ్యాన్ని చాపక్రింద నీరులా నిర్వీర్యం చేస్తున్నాయి. ముఖ్యంగా టీనేజీ వారిని మత్తెక్కించే ఇంద్రజాలపు వ్యాపార ప్రకటనలు కూడా ఒక కారణం అని ఒక సర్వేలో వెల్లడయ్యింది. సినీతారలు, క్రికెటర్లు సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులు వాడకం వల్ల విజయాలు సాధిస్తున్నట్లు ప్రకటనలు రూపొందుతున్నాయి. stwoఇవి యువత మీద విశేష ప్రభావాన్ని చూపుతున్నాయి. కొన్ని వందల కోట్ల రూపాయలను ఈ ప్రకటనల కోసం వెచ్చిస్తున్నారు. ప్రకటనల్లో సంయమనం పాటించకపోవడం. సామాజిక బాధ్యతను గుర్తెరగకపోవడం ఆందోళన కలిగిస్తుంది. ఇలాంటి పెడదోరణులను అరికట్టేందుకు అడ్వర్టెజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఒక నియమావళిని రూపొందించినా అమలులో జరుగుతున్న అలసత్వం ప్రజల్లో ఉన్న సహాయనికరణత్వం వెరసి సమాజంలో ధూమపాన నిషేధం పట్ల రావాల్సిన మార్పు రావడం లేదు. ఈ విషయం ఆరోగ్యానికి సంబందించినది కావడం వల్ల అందరం ఆందోళన చెందాల్సి ఉంది.

భారతదేశంలో 33 కోట్ల మంది పొగాకు వాడకం దారులు ఉన్నారని, హార్ట్ కేర్ ఫౌండేషన్ అనే సంస్థ వెల్లడించింది. పొగాకు సంబంధ వ్యాధుల వల్ల బాధపడుతున్న లక్షల మంది ఏటా కొన్ని వేల కోట్లరూపాయలు వ్యాధుల నివారణ కోసం ఖర్చు చేస్తున్నారు. పొగాకును ప్రత్యక్షంగా వినియోగించకపోయినా పరోక్షంగా ఆ పొగపీల్చే వారిని కూడా ఆ దుష్పలితాలు సంక్రమిస్తాయి. ఈ విధంగా దేశంలో చాలా మంది చేయని తప్పుకు ఆరోగ్యపరంగా పరిహారం చెల్లించాల్సి వస్తోంది.ఇది అత్యంత దారుణం చెడు అలవాటు లేని వ్యక్తి ఆ అలవాటు ఉన్న వారి వల్ల నష్టానికి గురి అయినట్లైతే ఆ బాధ్యత ఎవరిది ? అందుకు పరిష్కార మార్గాలేమిటి ? స్వేచ్ఛగా స్వచ్ఛమైన గాలిని పీల్చుకునే అవకాశం లేకుండా చేస్తున్న వారిపట్ల చర్లలు చేపట్టడం ప్రజా ప్రభుత్వాల తక్షణ కర్తవ్యం !

sfourమన రాష్ట్రంలో ప్రజలనుంచి వచ్చిన వత్తిళ్ల కారణంగా పొగాకు ఉత్పత్తులను నిర్వీర్యం చేయడంలో భాగంగా అమ్మకం పన్నును 10 శాతం నుంచి 50 శాతం వరకు పెంచారు. కాని దొంగ లెక్కలు చూపడం వల్ల ఆ విధానం వల్ల ఆశించిన సత్పలితాలు రాలేదు. అనంతరం పొగాకు ఉత్పత్తులైన గుట్కా, జర్దా వంటి వాటితో పాటు బహిరంగ ధూమపానాన్ని నిషేధించారు. అయినా ఆ నిషేధపు ఛాయలు కూడా అంతగా అందడం లేదు ప్రభుత్వాలు ఎంత కఠినమైన చర్యలు చేపట్టడం సమాజంలో మనుషుల ఆలోచనల్లో మానవత్వపు ఆలోచనలు సహకరింపుల సమన్వయం కొరవడినపుడు ఎంతటి కఠినమైన ఉత్తర్వులైన ఉపయోగం లేకుండా పోతాయి.

ముఖ్యంగా చిన్న పిల్లలకు ఆదర్శం గా ఉండాల్సిన పెద్దలు, యువకులు ఈ పొగాకు వ్యసనాలపట్ల జాగ్రత్త వహించి భావి సమాజాన్ని భద్రపర్చుకోవాల్సిన అవసరముంది. ఆ అలవాటు ఎంతటి ప్రాణాపాయకరమైనది అయినా సరే దానిని మానలేము. ఎప్పటి నుండో అలవాటు కలవాట్లను అంటూ చెప్పే. అది వ్యసనపరులకు ఒక్కటే సమాధానం ఆరోగ్యం వున్నప్పుడే అనుభూతి పొందేది అది లేనప్పుడు ఎంతవున్నా శూన్యమే. అలవాట్లను ఆరోగ్యం కోసం మార్చుకునే తెలివైన వారిని అతి వ్యసనపరులైన బలహీనులు ఆదర్శంగా తీసుకొని మానవత్వంతో ఆలోచించుకున్నప్పుడు. ఆ వ్యసనం బారి నుండి బయటపడడం ఎంత మాత్రం కష్టం కాదు. ఇక అలవాట్లకు ఇప్పడిప్పుడే దగ్గరవుతున్న యువత మరింత మానవతా దృక్పథంతో ప్రవర్తించాలి. వాటిని వినయోగించడం అనారోగ్యం హేతువుగానే గాక అదొక నీచాతినీచమైన మానవేతర జంతు చర్యగా భావించాలనేగాని అదొక ఉన్నతమైన పనిగా ప్యాషన్ గా నాగరికతా చిహ్నంగా ఎంత మాత్రం ఆలోచించకూడదు. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ ప్రధాన కర్తవ్యంగా భావించి పొగాకు ఉత్పత్తులను మన మానవ సమాజం నుండి వెలివేయాలి. అందుకోసం ప్రతి ఒక్కరూ ప్రతి రోజూ పాటుపడాలి. అంతేగాని ప్రపంచ ఆరోగ్య సంస్థకు మొక్కబడిగా ప్రతిఏటా మే 31 న ధూమపాన వ్యతిరేక దినోత్సవం అని గుర్తుచేస్తూ ప్రత్యేక వ్యాసాలు ప్రత్యేక సెమినార్లు అని పొగాకు ఉత్పత్తుల వల్ల కలిగే వ్యాధుల జబ్బులు, వాటివల్ల మరణిస్తున్న వారి లెక్కలు చెప్పేసి చేతులు దులిపేస్తే ఈ సమస్యకు పరిష్కారం ఇప్పట్లో తీరదు అనే విషయం అందరూ మానవతా దృక్పథంతో ఆలోచించాలి.

sfiveప్రధానంగా యువత ఈ ప్రాణాంతక వ్యవస్థ పిశాచాన్ని ధైర్యంగా ఎదురొడ్డి అంత మొందించాలి. ప్రజారోగ్యం దృష్ట్యా ప్రభుత్వం పొగాకు ఉత్పత్తుల నిరోధ విషయంలో తగిన విధంగా స్పందించాలి. ఈ దురలవాట్ల కారణంగా ప్రజలు అకాల మరణం పాలు కాకుండా నిరోధించాలి. ప్రాణాంతకమైన దుర్వ్యసనాల బారి నుండి భవిష్యత్తురాలను కాపాడుకుందాం

రచన: అమ్మిన శ్రీనివాసరాజు

2.97787610619
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు