పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

నిజం.. నిజం... డార్వినిజం

డార్వినిజం గురించి తెలుసుకుందాం.

mar12మనం నివసించే ఈ భూమి ఏర్పడి సుమారు 4.6 బిలియన్ సం. అయింది. ప్రపంచం మొత్తంలో ఇక్కడ ఒక్క చోటే నీరు ఉంది. అందుకే దీనికి నీలిగ్రహం అనే పేరు వచ్చింది. భూమి ఏర్పడినపుడు నేడు మనం చూస్తున్నట్లుగా లేదు. అప్పుడది ఒక మండే గోళం. అది క్రమంగా చల్లారి, చల్లారి జీవం ఏర్పడటానికి అనుకూల వాతావరణం ఒకటి వచ్చింది ఒక రోజులోనో, ఒక సంవత్సరంలోనో గాక మిలియన్లకొద్దీ సంవత్సరాలు పట్టింది. జీవులు లేదా జీవం బలి స్థితి రావటానికి భూమి ఏర్పడిన నాటి నుండి యుగం వరకు జరిగిన పరిణామాన్ని అర చేసుకోవటానికి భూమి వయస్సులను మహాయుగాలుగా యుగాలుగా, పీరియడ్లుగా విభజించి అధ్యయనం చేస్తారు. దీన్నే భౌమ కాలపట్టిక (Geological Time Scale) అంటారు. ఇటీవల లభించిన ఆధారాలను పరిశీలిస్తే భూమి ఏర్పడిన ఒక బిలియన్ సంవత్సరాలకు జీవం ఏర్పడిందని తెలుస్తోంది. జీవం దాని పరిణామం గురించి మాట్లాడుకునే ముందు భూమి ఏర్పడటం, నేడున్న స్థితికి రావటానికి అనేక మార్పుటు జరగటం గమనించవచ్చు. చెకుముకి చిన్నారి మిత్రులారా... మీతో ఎవరైనా ఈ భూమి ఏర్పడినప్పటి నుండి ఇలానే ఉండిందంటే మీరే మంటారు? మనిషి పుట్టినరోజే మీసాలు గడ్డాలతో పుట్టాడా లేక శిశువుగా పుట్టి పెరిగి పెద్దవాడైనాడా? ఏది సత్యం? ఆలోచించండి!

భూమైనా, మనిషైనా, మరొకటైనా ప్రతిదీ నిరంతరం మార్పు చెందుతుంది. చెందుతూనే మంటుంది. మార్పు అనేది ప్రకృతి సహజమైనది. పరిణామం అనేది ఒక వాస్తవం, ఒక సైన్సు. “ప్రపంచం ఎప్పుడూ మారదు, మారకూడదు” అనుకునే వాళ్లు కొందరుంటారు. వాళ్లు కోరుకున్నంత మాత్రానో, ఎవరో కాలు అడ్డం పెట్టినంత మాత్రానో మార్పుజరగకుండా ఆగదు. పరిణామాన్ని లేదా మార్పును చూడలేని వాళ్ళు కళ్ళు మూసుకుంటారు. అందరూ అలాగే చీకటిలో ఉండిపోవాలని కోరుకుంటారు. ఎవడో అమాయకుడో, మూర్ఖుడో అలా కోరుకుంటే పెద్దగా పట్టించుకోనవసరం లేదు. కానీ ఇటీవల మన దేశాన్ని పాలించే చిన్న మంత్రి ఒకాయన “కోతి నుండి మనిషి పుట్టాడని ఎవరు చూశారు? మీ తాతనా, మా తాతనా? ఎవరూ అలా జరిగిందని కథ కూడా చెప్పలేదే? దీన్ని మనం ఎందుకు నమ్మాలి?” అంటూ కొత్త కథ ఎత్తుకున్నాడు. మన తాత ముత్తాలు చేప్పే కథలనూ, పుక్కిటి పురాణాలనూ, వాస్తవాలని నమ్మింపజేసే ఇటువంటి వాళ్లకు సైన్సు పట్ల నమ్మకం ఉంటుందని అనుకోలేము. జీవపరిణామాన్ని మన బడిలో, కళాశాలల్లో ఎక్కడా బోధించరాదనే కొత్తపల్లవి అందుకున్నాడు.

జీవపరిణామం ఏం చెబుతున్నది?

mar7దేశవ్యాప్తంగా వేలాది మంది శాస్త్రజ్ఞులు, విజ్ఞులు దీన్ని నిర్ద్వందంగా ఖండించి సైన్సుపట్ల, వాస్తవాలపట్ల వారికున్న గౌరవాన్ని చాటారు. జీవులు పరిణామం చెందాయనీ, ఏకణజీవుల నుండి బహుకణజీవులు రూపొందాయని జీవపరిణామం చెబుతుంది. వాటి నుండి వెన్నెముక లేని జంతువులు వచ్చాయి. నీటిలో జీవించే చేపల నుండి - భూమి మీద అలాగే నీళ్ళలో కూడ జీవించగలిగే కప్పల వంటి ఉభయచర జీవులు వచ్చాయి. వాటి నుండి పాకే జంతువులు, వాటి నుండి స్తన్యజీవులు" (పాలిచ్చే జంతువులు) వచ్చాయనీ డార్వినిజం చెబుతుంది. స్తన్యజీవుల్లో అనేక రకాల జంతువులున్నాయి. వాటిలో ప్రాథమికమైనవీ, కొంత పరిణితి చెందినవీ, వాటి నుండి బాగా పరిణితి చెందినవీ అంటే మనుషి జాతి వంట వచ్చాయన్నది సారాంశం. విఠలాచార్య సినిమాలో ఉన్నట్టుండి కోతి కాస్తా మారిపోయి మానవుడు ఉద్భవించాడని డార్విన్ గానీ, జీవపరిణామ సిద్ధాంతంగానీ ఎక్కడా చెప్పలేదు. పరిణామం అనేది కొన్ని వందల వేల సంవత్సరాల మార్పుల ఫలితం, ఒక మనిషి మహా అయితే వందేళ్ళు బతుకుతాడనుకుందాం. మరి ఈ వందేళ్ల కాలంలో నీ తాతో, నా తాతో లేక వీళ్లందరి ముత్తాతలో పరిణామాన్ని చూడటం సాధ్యమవుతుందా? ఆలోచించండి! కథల్లోనో, పురాణాల్లోనో రాయలేదు, చెప్పలేదు కాబట్టి సైన్సు అబద్ధంకాదు. “బాగానే ఉంది కానీ, సైన్సును మాత్రం ఎందుకు నమ్మాలి?” అనే ప్రశ్న మీరు వేయవచ్చు. వేయాలి కూడా!

దేన్నైనా ఎందుకు నమ్మాలి?

తాతలు చెప్పే కథలు నమ్మటం, నమ్మక పోవటం మీ ఇష్టం. ఎందుకంటే అది కథేకాబట్టి. కానీ సైన్సు అలాకాదు. రుజువులు కోరుతుంది. ఆధారాలు ఉండాలి. తగిన ఆధారాలతో నిరూపితమైనదే సైన్సు అవుతుంది. నిరూపణకై నిలబడలేకపోతే అది సైన్సు కానేరదు. డార్విన్ చెప్పిన జీవపరిణామ సిద్ధాంతానికి అనేక రుజువులను చూపించాడు. ఆయన తదనంతరం లభించిన ఆధారాలు, సాక్ష్యాలు కూడ డార్విన్ "ప్రకృతివరణ సిద్ధాంతాన్ని" (Natural Selection Theory) బలపరిచాయి. ఈ సిద్ధాంతానికి తొలినాళ్లలో సవాళ్లు ఎదురైనా, శాస్త్రవేత్తలు చూపిన అనేక రుజువు జీవపరిణామాన్ని విజేతగా నిలబెట్టాయి. చూసేందు కళ్ళుండాలిగాని నిత్యజీవితంలోనే పరిణామానికి ఉదాహరణలు కొల్లలుగా దొరుకుతాయి. మనం చూసే మర్రి చెట్టు చిన్న విత్తనం నుండి మొలిచి, పెరిగి ఊడల దించి, మహావృక్షంగా మారటాన్ని గమనించే ఉంటారు గదా! అలాగే కీటకాలు గుడ్డు నుండి లార్వాదశలను దాటుకుని సీతాకోక చిలుకలుగా మారటం, ఇలా ఒకటేమిటి ఈ భూమిపై జీవులన్ని కూడా పరిణామానికి లోబడే జీవిస్తున్నాయి. అందుకే మనం ఆధారాలు చూపే సైన్సును నమ్ముతాం.

మనిషికి సన్నిహితులు

ప్రాథమిక స్తన్యజంతువుల నుండి ప్రైమేట్లు అంటే తొలివానరాలు పరిణితి చెందాయి. ఇవి ఇతర పాలిచ్చే జంతువుల కంటే అభివృద్ధి చెందినది. వీటి ముందు, వెనుక కాళ్ళ నిర్మాణం ఇతర జంతువుల కంటే భిన్నంగా ఉంటుంది. కళ్ళు ముఖం ముందు భాగంలో ఉండి రెండుకళ్ళూ ఒకే దృశ్యాన్ని చూసే లక్షణాన్ని కలిగి ఉంటాయి. ఈ రకం జంతువుల్లో రెండవ శ్రేణి ‘ఆంథ్రోపాయిడే' దీనిలో మూడు మహాకుటుంబాలుంటే, మొదటి రెండు కుటుంబాల్లో కోతులు ఉంటాయి. మూడవ కుటుంబం ‘హెూమినాయిడీ'. దీనిలో తోకలు లేని కోతులు ఒక కుటుంబంలో ఉంటే, మానవ జాతి మాత్రమే ఉన్న కుటుంబం హెూమినాయిడి. చింపాంజీలు, గొరిల్లాల వంటి తోకలేని పెద్దకోతులు మనిషికి చాలా దగ్గర సంబంధం ఉన్న జంతువులు. కాని మానవజాతి ఇటువంటి ఏ ఒక్క జంతువు నుండీ అవతరించలేదు. మానవుడికి ముందు నివసించిన జంతువుల అవశేషాలు శిలాజాల (Fossils) రూపంలో మనకు లభించటంతో జీవపరిణామానికి రుజువులు దొరికాయి. హెూమినిడి కుటుంబానికి చెందిన రామాపితికస్, ఆస్టలోపితికస్ వంటి నాటి జంతువుల దవడ ఎముకలు, పుర్రెలు వీటికి తిరుగులేని సాక్ష్యాలు. నియాండ్రతల్ మనిషి, పెకింగ్ మనిషి, క్రోమాగ్నాన్ (Cro-Magnon) మనుషుల పూర్వజీవుల అవశేషాలు తవ్వకాల్లో లభించాయి. అందుకే జీవపరిణామ సిద్ధాంతం ఒక విజ్ఞానశాస్త్రమైంది.

శిలాజ రుజువులే కాదు. పిండోత్పతి శాస్త్ర (Embryology) సాక్ష్యాలు కూడ ఈ సిద్ధాంతానికి గొప్ప బలాన్ని చేకూర్చాయి. ఉదాహరణకు ముందు పేజీలో చూపిన పిండాలు ఏ జంతువులవో చెప్పండి చూద్దాం! ఇందులో రకరకాల జంతువుల పిండాలు ఉన్నాయి. అవన్నీ ఒకే రకంగా ఉండటాన్ని గమనించారు కదా! ఎందుకని వివిధ జంతువులు పిండదశలో ఒక రకంగా ఉన్నాయి? ఆలోచించండి! ఇది పరిణామ సిద్ధాంతానికి తిరుగులేని సాక్ష్యం. ఇంతే కాదు ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలు. వీటిని ముందు ముందు మన చెకుముకిలో వివరంగా చూద్దాం!

ఆధారాల పై నిలబడిన సిద్ధాంతం కాబట్టే డార్వినిజం ప్రపంచ వ్యాపితంగా తిరుగులేని గొప్ప సిద్ధాంతంగా వెలుగొందుతున్నది. ఒక వేళ డార్వినిజం తప్పని, ఆధారాలతో, శాస్త్రీయంగా రుజువుచేస్తే తప్పకుండా సైన్సు అందుకు అంగీకారం తెలుపుతుంది. కాని కాకమ్మ కబుర్లతో, సైన్సును భ్రష్టు పట్టించాలనుకునే వాళ్లు బురద చల్లాలనుకంటే ముందుగా ఆ బురద వారి చేతులకే కదా అంటేది!

ఆధారం: డాక్టర్ కట్టా సత్యప్రసాద్

2.98872180451
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు