హోమ్ / విద్య / బాలల ప్రపంచం / బాలల సైన్స్ విభాగం / అడిగి తెలుసుకుందాం / నిద్రనుంచి లేవగానే నోటి దుర్వాసన ఎందుకు వస్తుంది?
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

నిద్రనుంచి లేవగానే నోటి దుర్వాసన ఎందుకు వస్తుంది?

లోటి దుర్వాసనకు కారణాలు, వాటి నివారణ చర్యలు తెలుసుకుంాం.

manఅనేక రకాల సూక్ష్మజీవులు నోటిలో మనతో సహజీవనం చేస్తుంటాయి. సాధారణంగా యివి మనకెటువంటి వ్యాధిని కల్గించవు. నోటిలో మిగిలిపోయిన ఆహార పదార్థాలను కుళ్ళింపజేయటం వీటిపని. ఈ విధంగా కుళ్ళిన వ్యర్థ పదార్థాలనుంచి విడుదలయ్యే అనేక రకాలయిన వాయువులే ఈ దుర్వాసనకు కారణం.

నోటిలో మిగిలిపోయిన ఆహార పదార్థాలు కుళ్ళడానికి, నిద్రపోవడం, మేల్కోనడంతో సంబంధం లేదు. అది నిరంతరం జరిగే చర్య. మేల్కొని ఉన్నపుడు నోటితో వూరే లాలాజలం ద్వారా, మనం తాగే నీటిద్వారా నోటిలో తయారైన వ్యర్థ పదార్థాలు మనకు తెలియకుండానే ఎప్పటికప్పుడు తొలిగించబడతాయి. అదే మనం నిద్రపోతున్నప్పుడు నోటితో లాలాజలం వూరదు. మనం నీళ్ళు తాగే పరిస్థితి ఉండదు. యిలా కొన్ని గంటలు గడుస్తుంది. కావున, నిద్ర నుంచి లేవగానే నోటినుంచి దుర్వాసన వస్తుంది.

కొందరిలో ఈ దుర్వాసన ఎక్కువగా ఉంటుంది. దీనికి కొన్ని ప్రత్యేక ఆరోగ్య పరిస్థితి కారణం కావచ్చు.

చిగుళ్ళ నుంచి రక్తం లేక చీము వస్తుండుట టాన్సిళ్ళకు ఇన్ఫెక్షన్ రావడం, జీర్ణాశయంలో వుండి అందులోనుంచి రక్తం కారుతుండడం ఊపిరితిత్తులలో క్యాన్సర్ లాంటి వ్యాధులుండడం లాంటి ప్రత్యేక పరిస్థితులలో నోటి దుర్వాసన ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

పంటి మీద గార ఏర్పడటం వల్ల కూడా నోరు దుర్వాసన ఉంటుంది. పళ్ళమీద ఏర్పడిన గార తొలగించేందుకు డెంటిస్ట్ ను సంప్రదించాలి.

నోటి దుర్వాసన తగ్గడానికి మనమేం చేయవచ్చు?

  1. brushingరాత్రి నిద్రపోయే ముందు పళ్ళు తోముకోవాలి.
  2. నిద్ర లోవగానే  పళ్ళు తోముకోవాలి.
  3. ఆహారం తీసుకున్న ప్రతిసారీ ఆఖరుగా నీళ్ళతో పుక్కిలించాలి.

రచన: డా. ఎం. వి. రమణయ్య.

2.99431818182
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు