పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

నీటి తలతన్యత కనుగొనడం

నీటి పై ప్రయోగం చేసి చూద్దాం.

aug06.jpgనీటికి ఊర్ధ్వ పీడనముందని గత మాసం తెలుసుకున్నాం కదా. నీటికి మరొక లక్షణం వుంది. దోమలు నీటిపై వాలి గ్రుడ్లు పెడతాయి కదా. చిన్న చిన్న కీటకాలు నీటి పైన హాయిగా వాలి తేలుతూ వుంటాయి. నీటి బిందువులు గోళాకారంగా వుంటాయి. వర్షపు చినుకులు అప్పడంలా కాక గోళాకారంలా వుంటాయి. తామరాకుపై నీటి బిందువు గోళాకారంగా వుంటుంది. ఇవన్నీ ఎలా సాధ్యం. కారణం ఏమిటి? అన్నిటికీ ఒకటే సమాధానం. అదే, తలతన్యత (Surface Tension). నీటికే కాదు అన్ని ద్రవాలకూ ఈ తలతన్యత లక్షణం వుంటుంది. అసలు తలతన్యత అంటే ఏమిటో తెలుసుకుందాం.

నీటిలో అణువులు వుంటాయి కదా. ఈ అణువుల మధ్య ఆకర్షణ బలం వుంటుంది. ఈ బలాన్ని సంసంజన బలం (Cohesion) అంటారు. అదేవిధంగా నీటి ఉపరితలంపై వున్న నీటి అణువులకు దాని పై వున్న గాలి అణువులకు మధ్య కూడా ఆకర్షణ బలం వుంటుంది. ఆ బలాన్ని అసంజనబలం (adhesion) అంటారు. నీటికి సంబంధించి అసంజన బలం కంటే సంసంజన బలం ఎక్కువ. అందువల్ల నీటిపై పొరపై లోపలి అణువుల ఆకర్షణ ఎక్కువగా వుంటుంది. ఇంకా పొరలోని అణువులు పరస్పరం ఆకర్షించుకొని నీటి ఉపరితలం ఒక సాగదీసిన రబ్బరుపొరలాగా (streached elastic membrane) ప్రవర్తిస్తుంది. దీనినే తలతన్యత అంటాము. దీనివల్లే దోమలు వాలి వాటి కాళ్ళ వద్ద ఈ పొర కాస్త క్రిందికి వంగుతుంది కానీ నీటిలోపలకు వెళ్ళదు.

ఇక అసలు విషయానికి వస్తాం. ఈనాటి చేసి చూద్దాంలో నీటి తలతన్యతను కొలుస్తాం. ఎలాగంటారా? రండి చేసి చూద్దాం. పటంలో చూపిన విధంగా ఒక త్రాసులాంటి అమరిక తయారుచేసుకోవాలి. నిలువుచెక్కముక్క 'A'కి అడ్డు చెక్కముక్క 'B' ని చీల సహాయంతో అమర్చాలి. B చెక్కముక్క సులభంగా ఎడమ, కుడివైపుకు వంగేలా వుండాలి. తరువాత ఓ ప్లాస్టిక్ షీటు తీసుకొని, 2x2 అంగుళాల వైశాల్యంతో కత్తిరించుకోవాలి. దానికి సరిగ్గా మధ్యలో సూదితో రంధ్రం చేసి, దారం దూర్చి ముడివేయాలి. దారం రెండవ కొనను అడ చెక్కముక్క B కి ఎడమవైపున వేలాడదీయాలి.

కాగితాన్ని పొట్లం లాగ చుట్టి దానికి మూడు దారాలు 3 చోట్ల ముడివేసి తొట్టెలాగ చేసి అడ్డు లే చెక్కముక్క Bకి కుడివైపున వేలాడదీయాలి. B చెక్కముక్క నీ సమాంతరంగా వుండేలా కాగితపు తొట్టిలో కొంత ఇసుక వేసి సరిచూసుకోండి. ఇపుడు ఒక వెడల్పాటి పాత్రలో నీరుపోసి దానిని ప్లాస్టిక్ ముక్క క్రిందకు తీసుకువచ్చి మెల్లగా పైకి ఎత్తుతూ ప్లాస్టిక్ ముక్క నీటి ఉపరితలాన్ని తాకేలా అమర్చి, పాత్ర క్రింద ఏదైనా పుస్తకాలు దొంతలా పెట్టండి. జాగ్రత్త సుమా. ప్లాస్టిక్ ముక్క నీటిలో మునగకూడదు. నీటి తలాన్ని తాకాలి అంతే. (అంటే నీటి పొరను ప్లాస్టిక్ చింపకూడదన్న మాట)

ఇపుడు కుడివైపున వున్న కాగితపు తొట్టిలో క్కొక్క జామ్ క్లిప్స్ ల క్లిప్స్ మెల్ల మెల్లగా వేయండి. కుడివైపు బరువు పెరిగి ఎడమవైపు ప్లాస్టిక్ ముక్క పైకి లేవాలి. కానీ నీటి తలతన్యత వల్ల ప్లాస్టిక్ ముక్క నీటిపొరకు అంటుకొని వుంటుంది. జమ్ క్లిప్లు ఇంకా వేస్తూ వుంటే ఒక స్థితిలో బరువు పెరిగి ప్లాస్టిక్ ముక్క నీటి నుండి వెలువడుతుంది. అంటే కుడివైపు వేసిన జిమ్ క్లిప్పుల భారానికి నీటి తలతన్యత సమానం అన్నమాట. జిమ్ క్లిపుల భారాన్ని తూకం వేయండి. నీటి తలతన్యత కనుక్కోండి అంతే.

నీటి తలతన్యత 72.8 మిల్లీ న్యూటన్లు మీటరుకు గా వుంటుంది. నీటి తలతన్యత వల్ల నిర్దిష్ట ఘనపరిమాణానికి తక్కువ ఉపరితల వైశాల్యం గల ఆకారం గోళాకారం మాత్రమే. కాబట్టి నీటి బిందువులు గోళాకారలో వుంటాయి అదన్నమాట సరేనా.

ఆధారం: యుగంధర్ బాబు.

2.99719101124
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు