హోమ్ / విద్య / బాలల ప్రపంచం / బాలల సైన్స్ విభాగం / అడిగి తెలుసుకుందాం / పరిణామవాదానికి నిలువెత్తు నిదర్శనాలు
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

పరిణామవాదానికి నిలువెత్తు నిదర్శనాలు

డార్వినిజం అనేది జాతులు ఎలా ఉద్భవిస్తాయో చెప్పింది.

may7డార్వినిజం ప్రపంచ వ్యాపితంగా సర్వజనామోదం పొందింది. డార్వినిజం అనేది జాతులు ఎలా ఉద్భవిస్తాయో చెప్పింది. నూతన జాతి పుట్టుకలో ప్రకృతి ఏ రకమైన పాత్రపోషిస్తోందో డార్విన్ తన Origin of Species (జాతుల పుట్టుక) అనే గ్రంథంలో 1859 లో వివరించాడు. డార్విన్ చెప్పిన ప్రకృతి ఎంపిక (Natural Selection) సిద్ధాంతం వాస్తవానికి జీవపరిణామానికి సంబంధించినది కాదు. కానీ ప్రకృతిలో పరిణామం ఎలా సంభవించిందో విడమర్చి చెప్పింది.

జీవులు పునరుత్పత్తి చెంది అపరిమితంగా ఈ భూమ్మీదికి వస్తాయి. కానీ అవి జీవించడానికి అవసరమైన ఆహారం వంటి వనరులు పరిమితంగా ఉండటంతో బతకటానికి అవి ఒకదానితో ఒకటి నిరంతరం పోటీ పడతాయనే వాస్తవాన్ని డార్విన్ గ్రహించాడు. ఉనికికోసం బతుకు పోరాటం అనివార్యం అని చెప్పాడు. అంతేకాదు ఈ పోరాటంలో ముందున్న జాతులే బతికి బట్టకడతాయనీ సూత్రీకరించాడు. ఇలా వర్తమాన పరిస్థితుల్ని తట్టుకునే శక్తి కలిగిన జీవులను ప్రకృతి ఎంపిక చేస్తుందని చెప్పాడు. అంటే వర్తమాన ప్రకృతి పరిస్థితులకు అలవాటు పడిన జీవులే పునరుత్పత్తి జరిపి భవిష్యత్తరాలు వస్తాయన్నాడు. ఈ క్రమంలోనే

మార్పులు నిరంతరం వస్తాయి. ఈ మార్పులే అవి నెగ్గుకు రావటానికి కావలసిన అనుకూలనాలకు (adaptations) బీజం వేస్తాయన్నది సారాంశం.

వాస్తవాలపై ఆధారపడి డార్విన్ చేసిన ఈ సూత్రీకరణలు పండిత, పామరుల మెప్పును పొందాయి. ఆయా వాతావరణాల్ని తట్టుకునేందుకు జీవుల్లో వచ్చిన మార్పులు ఒక తరం నుండి మరొక తరానికి బదిలీ అవటం వలన ఆ జీవులు బతుకుపోరాటంలో విజయం సాధిస్తాయని డార్వినిజం చెబుతోంది. ఇలా నిరంతరం జరిగే మార్పులే అనువంశికంగా బదిలీ అయి నూతన జాతుల పుట్టుకకు కారణమవుతాయి. డార్విన్ విస్తృత సమాచారాన్ని సేకరించి రుజువులుగా చూపుతూ తన సిద్ధాంతాన్ని బలంగా ప్రపంచం ముందు ఉంచాడు. వైజ్ఞానిక ప్రపంచంలో అత్యధిక శాస్త్రవేత్తలు, సామాన్యులు కూడా దీన్ని ఆమోదించారు. కానీ కొద్దిమంది శాస్త్రవేత్తలు, మత పెద్దలు మాత్రం అభ్యంతర పెట్టారు. వారి అభ్యంతరాలను, పటాపంచలు చేస్తూ డార్విన్ తర్వాత తరం శాస్త్రవేత్తలు తిరుగులేని రుజువులు చూపించారు. వీరిని నియోడార్వినిస్టులు (Neo-Darwinists) గా పిలుస్తారు. వీరిలో వాలెస్, థామస్ హక్సలే, ఎర్నెస్ట్ హెకెల్, వైజ్మన్, జెబియస్ హాల్డేన్, సెవెల్ రైట్, డొబజాన్ సీ, హెర్బర్ట్ స్పెన్సర్, మెండల్ చెప్పుకోదగిన వారు. వీరు అనేక ప్రయోగాలు చేసి డార్విన్ సిద్ధాంతానికి . రుజువులు చూపించారు. ఇందులో ప్రముఖంగా పేర్కొనదగిన సాక్ష్యం 'పారిశ్రామికంగా నలుపెక్కిన సీతాకోక చిలుకలు” (Industrial Melanism in Moths)

Industrial Melanism

పారిశ్రామికీకరణ ముందు బ్రిటన్ లో చెట్ల బోదెలపై తెల్లని, ఊదా రంగులో ఉండే లైకెన్లు విరివిగా ఉండేవి. వీటిపై Biston betularia అనే ఊదారంగు సీతాకోక చిలుకలు జీవిస్తూ ఉండేవి. చెట్ల బోదెలు, సీతాకోక చిలుకలు దాదాపు ఒకే రంగులో ఉండటంతో సీతాకోక చిలుకలను తినే పక్షుల బారి నుండి రక్షించబడేవి. కానీ 1848 తర్వాత మాంచెస్టర్ వంటి నగరాలతోపాటు ఐరోపా ఖండంలో పారిశ్రామిక విప్లవం వచ్చిన పొగతో, పరిసరాలు నల్లగా మసిబారిపోయాం దీనితో తెల్లగా, ఊదారంగులో ఉండే సీతాకోక చిలుక నల్లని చెట్ల బోదెల పై స్పష్టంగా కనబడటంతో అవి పక్షులకు ఆహారంగా దొరికి పోయాయి? క్రమంగా వాటి సంఖ్య పడిపోయింది. అదే సీతాకోక చిలుకల జనాభాలో కొద్ది సంఖ్యలో ఉన్న నల్లనివి మాత్రం శత్రువు నుండి తప్పించుకోవటం జరిగింది. ఇప్పుడు మారిన వాతావరణ పరిస్థితుల్లో నల్లని సీతాకోక చిలుకలకు లాభం చేకూరి వాటి జనాభా క్రమంగా పెరిగింది. విచిత్రం చూడండి! 1845 లో తెల్ల సీతాకోకచిలుకల జనాభాలో కనిపించిన ఒకే ఒక నల్ల కీటకం (దీన్నే కార్బనేరియా అంటారు) 1848 నాటికి జనాభాలో 10 శాతానికి వాటితో నిండి పోయింది. అంటే ఏమిటి దీనర్థం? ప్రకృతిలో వచ్చే మార్పులు, అందుకు అనుకూలంగా జీవించగలిగే జీవులకు లాభసాటిగా ఉంటాయి. అటువంటి జీవులే బతికి బట్టకడతాయి. వాటి జనాభా వృద్ధిచెందుతుంది. ఇదే ప్రకృతి ఎంపిక (Natural Selection) సిద్ధాంతానికి తిరుగులేని ఉదాహరణ. ఈ పరిశోధనలను ఫిషర్, ఫోర్డ్, కెటిల్ వెల్లు నిర్వహించి విఖ్యాతి పొందారు. ప్రయోగాత్మకంగా నిరూపించబడిన రుజువులను ఇలా ఎన్నైనా ఇవ్వవచ్చు. కానీ కొన్ని ముఖ్యమైన వాటిని మన చెకుముకిలో ముందు ముందు చెల్సుకుందాం?

పిండోత్పత్తి శాస్త్ర రుజువులు

may8మార్చి సంచికలో డార్వినిజం వ్యాసంలో పిండోత్పత్తి శాస్త్ర ఫోటోను ఇచ్చి ఆయా పిండాలు ఏ. జంతువులతో పోల్చి చూడమన్నాం . కానీ కfi స్పందన కొంత Tail పరిమితంగానే ఉంది. ఏ ఒక్కరూ అన్నింటినీ సరిగ్గా పోల్చుకోలేక పోయారు. ఎందుకు అలా జరిగింది. ఇందులో వారి తప్పేమీ లేదు. ఎందుకంటే పిండం పెరిగే తొలిదినాల్లో అన్ని రకాల జంతువుల పిండాలు ఒకే రకంగా ఉంటాయి. కాబట్టి. మొడటివరుస చేప పిండాభివృద్ది దశలు. దీని వరకు బాగానే పోల్చుకున్నారు. పిండాల బొమ్మలను అడ్డంగా కాకుండా నిలువుగా పరిశీలించండి. కనీసం మూడుదశల వరకు అన్ని జంతువులూ, అది చేపయినా, పక్షి అయినా, మనిషైనా ఒకే రకంగా ఉన్నాయి. కదా! ఆలోచించండి! చేపకు పక్షికి ఏమి సంబంధం? కప్పకూ మనిషికి ఏమిటి చుట్టరికం? సకల జీవులు ఒకానొక దశలో ఒకే రకమైన పరిణామానికి లోనైనాయి. అత్యంత అభివృద్ధి చెందినాడనుకునే మనిషి కూడా పిండస్థదశలో తన పూర్వీకులు లక్షణాలను చూపిస్తాడు. దీన్నే పిండాల అభివృద్దిలో సారూప్యత, పిండాల సారూప్యతగా పిలుస్తారు.

వెన్నుముక కలిగిన జంతువులు పిండదశ తొలి రోజుల్లో గొప్ప సారూప్యతను కనబరుస్తాయి. అందుకే కోడిపిల్ల పిండం కప్ప, చేప, బల్లి పిండాలకంటే తొలినాళ్లలో భిన్నంగా ఉండదు. రూపంలో, నిర్మాణంలో, మొప్పలు, నోటోకార్డ్ (వెన్నుముక తొలిరూపం) తోక, కన్ను, చెవి ఆనవాళ్లు మనకు కన్పిస్తాయి. రానురాను నోట్కేర్ వెన్నుముకగా రూపాంతరం చెందుతుంది. ఇవన్నీ ఏమి సూచిస్తున్నాయి. వీటిన్నింటి పూర్వీకులూ ఒకరే అయి ఉండటం వల్లనే ఈ రకమైన సారూప్యత పిండాల మధ్య సాధ్యమైంది. జీవుల మధ్య ఎంత వైవిధ్యం ఉన్నా అన్నీ కూడా ఒకే రకం అభివృద్ధిని చూపుతున్నాయంటే అవి ఒకే మూలం నుండి పరిణామం చెందాయని అర్థం. ఈ పిండాలు, వాటి అభివృద్ధి పరిణామ వాదానికి తిరుగులేని నిదర్శనాలు.

ఆయా పరిస్థితుల్లో ప్రకృతిలో నచ్చే సూర్చులను తట్టుకునే ఆ యంత్రాంగం ఉన్న జీవులే బతికి బట్టకడతాయనీ అటువంటి జీవులే తమ సంతతిని పెంచుకుని అనువంశికంగా నాటి లక్షణాలను ముందు తరాలకు బదిలీచేస్తాయనీ పారిశ్రామిక మెలనిజం తేటతెల్లం చేసింది. జలలో నివసించే చేపలు, ఉభయచరాలైన కప్పలు వంటి జీవులనుండి పాలిచ్చే జంతువుల (Mammals) వరకు పిండ దశలో సారూప్యత చూపించటం తెలిసింది. వివిధ జీవజాతులు పైకి చూడటానికి భిన్నంగా కనిపించినా ఆరంభంలో అన్నీ ఒకే మూలం నుండి వచ్చాయనేందుకు పిండాభివృద్ధి దశలు తిరుగులేని ఉదాహరణ.

jun10అలాగే చేప, కప్ప, పాము, పక్షి వంటి జంతువులు స్వరూపరీత్యా చూస్తే ఒకదానితో ఇంకొక దానికి ఏరకంగానూ పోలిక కనిపించదు. తిమింగలం ఖారీ శరీరంతో పెద్దగా ఉంటే, గబ్బిలం ఎగురుతూ పక్షి కంటే కూడ చిన్నగా ఉంటుంది. ఎక్కడి తిమింగలం! ఎక్కడి గబ్బిలం! రెంటికీ సారూప్యతా? నవ్వురావటం లేదూ! కానీ వాటి శరీరం నిర్మాణంలో మరీ మాట్లాడితే అవయవాల నిర్మాణంలో పోలికలెన్నో వున్నాయి. ఆ మాటకొస్తే వెన్నెముక గలిగిన వివిధ జంతువుల అవయవ నిర్మాణాల్లో ఎంతో సారూప్యత కనిపిస్తుంది. చలనాంగాలైన ముందు, వెనుక కాళ్ళు (మనుషుల్లో కాళ్లు, చేతులు) పక్షి రెక్కలు, గబ్బిలం రెక్కలతో ఏ విధమైన సారూప్యతను చూపిస్తాయో చూద్దాం.

గబ్బిలం రెక్కలు, సముద్రజంతువైన సీల్లో వుండే తెడ్లు (Flippers) భూగర్భంలో బొరియల్లో నివసించే మోల్ (Mole) ముందు కాళ్లు, గుర్రం ముందు కాళ్లు, మనిషి చేయి రకరకాల పనులకోసం ప్రత్యేకతలను సంతరించుకున్నాయి. అంటే విధుల రీత్యా చూస్తే వైవిధ్యం కనబరుస్తాయి. గబ్బిలంలో ఎగిరేందుకు రెక్కలు, భూమిని తొలచటానికి మోల్కు బలమైన ముందు కాళ్ళు సీల్ కు ఈదటానికి తెడ్డువంటి అవయవం అనుకూలనం చెందాయి. పక్షి రెక్కలు కూడ ఎగిరేందుకు వృద్ధిచెందిన అవయవాలే. గుర్రం ముందు కాళ్లు నడకకు, పరుగెత్తడానికి తీర్చిదిద్దబడినాయి. మనిషి చేయి ఏదో ఒక పని కాకుండా అనేక పనులను నిర్వర్తించే అవయవంగా రూపుదిద్దుకుంది. ఇలా ప్రతి అవయవమూ ఒక ప్రత్యేకమైన వనికోసం వినియోగించడుతూ గొప్ప వైవిధ్యాన్ని చూపుతున్నాయి. ఆకారంలో, పనిలో వైవిధ్యం కనబరిచే ఈ అవయవాల నిర్మాణ నమూనా లేదా ఎముకల పొందికలో ఏకత్వాన్ని ప్రదర్శిస్తాయి. ఒకే విధమైన ఎముకలను, నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. పనిని బట్టి రూపాంతరం చెందుతాయి. రూపాంతరాలు ప్రధానంగా ఎముకలు పొట్టిగా కావటం లేదా పాడువు పెరగటం, ఆకారంలో మార్పులు, ఎముకల సంఖ్య తగ్గటం చెప్పుకోదగినవి. అవి నిర్వహించే విధిని బట్టి ఒకోసారి కొన్ని ఎముకలు కలసి ఒక్కటిగా ఏర్పడతాయి.

jun11మీరు ఎప్పుడైనా మన చేతి ఎక్స్ రే చిత్రాన్ని గమనించారా? సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినపుడు వైద్యులు ఎక్స్ రే తీస్తారు. తద్వారా ఎముకలు విరిగిందీ లేనిదీ కనిపెడతారు. వీలైతే మీకు లభించిన చేతి ఎక్స్రేను పరిశీలించి చూడండి! ఎముకలు ఎలా అమరి ఉండేదీ అర్థమవుతుంది. భుజం నుండి మోచేతి వరకు ఉండే ఎముకను భుజాస్తి (Humerus). మోచేతి నుండి మణికట్టు వరకు రెండు ఎముకలుంటాయి. వాటిని రత్రి, అరత్రి (Radio and Ulna) అంటారు. మణికట్టులో ఉండే ఎముకలను మణిబంధాస్థికలు (Carpals), కరభాస్థికలు (Meta Carpals) అంటారు. ఇకవేళ్ల ఎముకలను అంగుళ్యాస్తికలు (Phalanges) గా పేర్కొంటారు. ఈ ఎముకలు మనిషి చేతిలోనే కాదు, సీల్ తెడ్డులో, పక్షిరెక్కలో, గబ్బిలం రెక్కలో, గుర్రం ముంగాలిలో కూడా ఉంటాయి. ప్రశ్న ఏమిటంటే వీటన్నింటిలో ఒకేరకం ఎముకలే ఎందుకున్నాయి. వాటి మధ్య సారూప్యత ఎందుకు నెలకొంది? ఎందుకంటే ఈ జంతువులన్నింటికీ పూర్వీకులు ఒకరే అయి ఉండాలి. అటువంటి జంతువులో ఈ రకమైన ప్రాథమిక నిర్మాణం ఉండి ఉంటుంది. విధి నిర్వహణ రీత్యా ఈ అవయవం రకరకాల రూపాంతరాలు చెందినా ప్రాథమిక స్వరూపం మారకపోవటమే ఇందుకు కారణం. ప్రాథమిక దశ నుండి మనిషి వరకు వివిధ రూపాల్లో జంతు పరిణామం జరిగిందని అర్థం చేసుకోవటానికి అవయవ నిర్మాణ సారూప్యత మంచి ఉదాహరణ.

ఆధారం: డా. కట్టా సత్యప్రసాద్

2.99609375
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు