పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

పాముల గురించి తెలుసుకుందాం....

పాము విష సర్పమా కాదా తెలుసుకునేందుకు

336.jpgఏదైనా ఒక పాము విష సర్పమా కాదా అన్న విషయం తెలుసుకునేందుకు అనేక పద్ధతులు ఉన్నాయి. వాటిలో అతి ముఖ్యమైన అంశం ఆ పాము తాలూకూ తలను, తోకను, నోటినీ పరిశీలించడం..

విష సర్పాలు

 1. తల భాగం దాదాపుగా ఓ త్రికోణాకృతిలో ఉంటుంది.
 2. 337.jpgపెద్దపెద్ద కోరలు ఉంటాయి. కనుపాపలు అండాకృతిలో ఉంటాయి. ఇలాంటి పాములు ఎవరినైనా కాటేసినప్పుడు వారి శరీరం మీద విషపు కోరల గుర్తులు స్పష్టంగా కన్పిస్తాయి.
 3. తోక దగ్గరి భాగం చిన్నచిన్న వలయాలతో వుంటుంది. ఈ వలయాలపై నులువుగా ఎలాంటి చీలికా ఉండదు.
 4. విషం లేని పాములు

 5. 339.jpgతల భాగం గుండ్రంగా లేదా అండాకృతిలో వుంటుంది.
 6. 338.jpgవిషపు కోరలు వుండవు. కనుపాపలు గుండ్రంగా ఉంటాయి. ఇలాంటి పాములు ఎవరికైనా కాటేసినప్పుడు వారి శరీరం మీద ఆ ప్రదేశంలో చిన్నచిన్న వరుసకు సంబంధించిన గుర్తులు వుంటాయి.
 7. తోక దగ్గరి భాగం వలయాలు వలయాలుగా ఉన్నప్పటికీ, అవి రెండుగా చీలి ఉంటాయి.
 8. పాము కాటేసినప్పుడు

 9. ఎవరికైనా పాము కరిచినప్పుడు ఏం చేయాలంటే...
 • పాము కాటు తిన్న మనిషికి మరేం ఫరవాలేదని ముందుగా ధైర్యం చెప్పండి.340.jpg
 • కాటేసిన ప్రాంతాన్ని సబ్బుతో రుద్ది నీళ్ళతో శుభ్రంగా కడగండి.
 • పాము కాటు తిన్న మనిషి నడవడం ఏ మాత్రం మంచిది కాదు. అందుకని వెంటనే అతడ్ని పడుకోబెట్టండి, తల, గుండె ఎక్కువ ఎత్తులో ఉండేలా చూడండి. గుండె కన్నా తక్కువ ఎత్తులో ఉండాలి.
 • ఆ మనిషిని అలా పడుకోబెట్టిన పొజిషన్ లోనే ఉంచి, ఆసుపత్రికి తీసుకుపోండి
 • 341.jpgకరచిన పాము ఏ కోవకు చెందినదో పరిశీలించండి. దానికి సంబంధించిన వివరాలను వైద్యుడికి చెప్పండి.
3.0
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు