పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

పిడుగు పడుటకు వైజ్ఞానిక కారణము.

పిడుగుపడుటకు ప్రధాన కారణము విద్యుత్ ప్రవాహము మరియు విద్యుద్ఘాతం.

thunderఆకాశంలో అర్జునుడి రథం పోతుంటే ఊడిపడిన మేకులే పిడుగులనీ, భయం పోవటానికి అర్జునా, అర్జునా ........ అనమనీ మన తాతలు చెప్పటం వినే వుంటారు. పిడుగుపాటు అనేది వాస్తవానికి ఒక విద్యుత్ ప్రవాహం, విద్యుద్ఘాతం. రెండు వ్యతిరేక విద్యుదావేశాలు కలిగిన పదార్థాలు లేక పరమాణువులు పరస్పరం ఆకర్షింబడటం వలన స్థిర విద్యుత్తు వంటి విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. కాకపోతే దీనితో వ్యతిరేకంగా పనిచేసే రుణ లేక ధన విద్యుదావేశం చాలా ఎక్కువ కావటంతో గొప్ప విద్యుత్ ఘాతం ఏర్పడుతుంది. పిడుగుపాటు ఎలా జరుగుతుందో చూద్దాం...

విశ్వంలో ప్రతి వస్తువూ లేక పదార్థము పరమాణువుల చేత నిర్మించబడేవి. ప్రతి పరమాణువు కూడా మరింత సూక్ష్మమైన ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూటాన్లు కూడి వుంటుంది. ఎలక్ట్రాన్లుతో రుణావేశం (-) కలిగి వుంటే ప్రోటాన్లు, ధనావేసం (+) కలిగి వుంటాయి. ప్రతి వస్తువులో యీ రెండి మధ్య ఒక సంతులనం లేక సమతాస్థితి వుంటుంది. ఒక వేళ ఆసంతులనం దెబ్బతింటే మరల ఆ స్థితికి రావటానికి సత్వర ప్రయత్నం చేస్తాయి. కారుమేఘాల్లో వుండే యీ చిరుపరమాణువులు అటూత ఇటూ తిరుగుతూ రుణాత్మక లేక ధనాత్మక శక్తిని సంపాదిస్తాయి. ధనావేశ పూరితాలైన పరమాణువులు (రేణువులు) తేలికగా వుండే మేఘం పై భాగానికి చేరుకుంటాయి. రుణాత్మక రేణువులు బరువుగా వుండటం వలన మేఘం దిగువ భాగాన జమవుతాయి. ఇలా అనేకానేక రేణువులు అపరిమితంగా రుణలేక ధనావేశపూరితం అయినప్పుడు మేఘంలో రెండు వ్యతిరేక శక్తులు కలిగిన రేణువులు సమూహాలుగా విడిపోతాయి.

విజాతి ధృవాలు ఆకర్షించుకుంటాయనీ, సజాతివి వికర్షించుకుంటాయని మనకు తెలిసిందే గదా... ఈ వ్యతిరేక ఆవేశాలు ఉన్న రేణువుల మధ్య ఆకర్షణ బలీయమైనప్పుడు అవి తమ శక్తిని పరస్పరం విడుదల చేస్తాయి. ఇలా విడుదలైన శక్తి లేక విద్యుత్తు గాలి ద్వారా ప్రసారం కావటానికి శక్తి లేక విద్యుత్తు గాలి ద్వారా ప్రసారం కావటానికి ఒక మార్గం ఏర్పడుతుంది. ఈ విద్యుత్ ప్రసరించే మార్గమే మనం చూసే మెరుపు.

మెరుపులు భూమికి చేరుకోవటానికి మూలకారణం మేఘం దిగువ భాగాన జమయిన రుణావేశం కలిగిన రేణువులే. రుణావేశ పూరితాలైన రేణువులు పెద్ద సంఖ్యలో గుమికూడినపుడు అవి ధనావేశ రేణువులను భూమి అందించటంలో ఆకాశం నుండి భూమికి మెరుపుల నిచ్చెన ఏర్పడుతుంది. అదే సమయంలో భూమి నుండి పలు ఆవేశ పూరిత రేణువులు పాయలు జిమ్మి పైనుండి వచ్చే రుణావేశ రేణువుల వెలుగు బాటను ఆహ్వానిస్తాయి. దీనితో గొప్ప ఆఘాతం విద్యుధ్ఘాతం ఏర్పడుతుంది. అంటే మేఘం మైనస్ గా, భూమి ప్లస్ గా పనిచేసి విద్యుత్ ప్రసరణ జరిగిందన్నమాట. ఎత్తైన చెట్లపై పిడుగులు అందుకనే పడతాయి. విద్యుద్గాతం లేక పిడుగుపాటు వలన కళ్లు జిగేల్ మనే మెరుపు, భయంకరమైన శబ్ధం వస్తాయి ఒక్క పిడుగుపాటుకు 30 మిల్లీ సెకన్లు పడుతుంది. అంటే రెప్పపాటులో నాలుగైదు పిడుగులు పడవచ్చునన్నమాట.

3.02127659574
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు