హోమ్ / విద్య / బాలల ప్రపంచం / బాలల సైన్స్ విభాగం / అడిగి తెలుసుకుందాం / పులుపు వస్తువులు తిన్నప్పుడు రక్తం ఎందుకు విరిగిపోతుంది?
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

పులుపు వస్తువులు తిన్నప్పుడు రక్తం ఎందుకు విరిగిపోతుంది?

పులుపు వస్తువులు తింటే రక్తం విరిగిపోవడం అంటూ ఏమీ ఉండదు.

nov13పులుపు వస్తువులు తింటే రక్తం విరిగిపోవడం అంటూ ఏమీ ఉండదు. కాని రక్తంలో పులుపు వస్తువులు కలిసినా, పాలలో ఉప్పు లేదా పులుపు వస్తువులయిన నిమ్మరసం లేదా ఇతర ఆమ్లాలు ఏవైనా కలిసినా రక్తం, పాలు విరిగిపోతాయి. ఇక్కడ విరిగి పోవడం అంటే కర్రపుల్ల విరిగిపోవడం లాగానో, దెబ్బతగిలితే చేతివ్రేలు విరిగిపోవడం లాగా భావించకూడదు. రక్తం దాదాపు ఓ కొల్లాయిడ్ పదార్థం. పాలు కూడా అంతే. కొల్లాయిడ్ అంటే అందులో ద్రావణి (solvent) ఉంటుంది. ఇది ఎక్కువ పరిమాణంలో ఉంటుంది. దీనిని మాధ్యమం లేదా disperse medium అంటారు. ఇందులో ద్రావితం (solute) అణురూపంలోనో, పరమాణు రూపంలోనో, అయాను రూపంలోనో కాకుండా కొన్ని పరమాణువులు, లేదా కొన్ని అణువుల సమూహాలుగా ఉన్న కణాలు ఇందులో ద్రావితం లాగా ఉంటాయి. వీటి సైజు సుమారు 2 నుంచి 20 మైక్రోన్ల వరకు ఉంటుంది. ఈ విధంగా ఉన్న ద్రావితసమాని (solute equivalent) ని ప్రావస్థ (లేదా disperse phase) అంటారు. మాధ్యమంలో ఒకటికి మించి కూడా ప్రావస్థలు ఉండవచ్చును. ఇలా తటస్థం (neutral) గా మాధ్యమకణాలు కలిసిపోయి అవక్షేపం (prepitate) లాగా సెటిల్ కాకుండా మాధ్యమ మొత్తం విస్తరించి ఉండడానికి కారణం ఆయా ప్రావస్థా కణాల మీద విద్యుదావేశం ఎంతో కొంత ఉండటమే.

మీరు మాధ్యమం కాగా అందులో ఉన్న తెల్ల రక్తకణాలు, ఎర్ర రక్తకణాలు (Red Blood Cells), ప్లేట్లెట్లు వివిధ జీవరసాయన బృహరణువులు (bio macro-molecules) ప్రావస్థలుగా ఉన్న క్లోలాయిడ్ రక్తం. ఇందులో ఉప్పు లేదా నిమ్మరసం లాంటివి పడ్డప్పుడు వెంటనే ప్రావస్థ కణాల మీద ఉన్న విద్యుదావేశాలను ఈ లవణాయన్లు లేదా ఆమ్లపు ప్రొటాన్లు తటస్థికరిస్తాయి. లేదా ప్రావస్థ కణాల మధ్య మునుకున్న వికర్షిణను పోగొడ్తాయి. తద్వారా ప్రొవస్థా కణాల మధ్య ఆకర్షణ పెరిగి అవక్షేపంలాగా అడుగుభాగాన చెరడమో లేదా పేలికలుగా ద్రావితం లాగా ఈ కొల్లాయిడ్ పదర్థాలు బయటపడడమో సంభవిస్తుంది. ఇలాంటి ప్రక్రియే పాలవిషయంలో కూడా సంభవిస్తుంది. అప్పుడు పాలు విరిగిపోయాయంటాము. రక్తం శరీరంలోనే ఉంటుంది కాబట్టి దానికి ప్రత్యక్షంగా సరాసరి పులుపు పదార్థాలు సోకడం సాధారణంగా అసాధ్యం. పనిగట్టుకుని అమ్లాన్ని ఇంజెక్ట్ చేస్తేనే ఆ ప్రమాదం ఉంటుంది. అపుడు మరణం కూడా సంభవించే విపత్తు ఉంటుంది.

ఆధారం: ప్రొ. ఎ. రామచంద్రయ్య

3.01238390093
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు