పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

పెన్ డ్రైవ్

పెన్ డ్రైవ్ యొక్క ఉపయోగకరం తెలుసుకుందాం.

ఎంతో సమాచారాన్ని తనలో ఇముడ్చుకున్న చిన్న మెమరీకార్డు పెన్ డ్రైవ్. ఇదొకరకం USB ఫ్లాష్ డ్రైవ్. యూనివర్సల్ సీరియల్ బస్ కు సంక్షిప్తనామం USB. పెన్ డ్రైవ్ కంప్యూటర్ కి ఉండే USB పోర్ట్ లోకి చొప్పించేందుకు వీలుగా ఉంటుంది. దీని సైజు కారణంగా దీన్ని పెన్ డ్రైవ్ అంటారు. ఇది గుప్పెట్లో పట్టేటంత చిన్నది. మన జేబులో పెట్టుకోవచ్చు లేదా కీచైన్ కు తగిలించుకోవచ్చు. కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న స్కూలు విద్యార్థులు కూడా ఈ రోజుల్లో పెన్ డ్రైవ్ లను ఉపయోగిస్తున్నారు.

ఒక కంప్యూటర్ లో ఉన్న ఏదైనా సమాచారాన్ని పెన్ డ్రైవ్ లోకి, అలాగే పెన్ డ్రైవ్ లోని సమాచారాన్ని కంప్యూటర్ లోకి కాపీ చేసుకోవచ్చు. సాధారణంగా పెన్ డ్రైవ్ బల్లపరుపుగా, దీర్ఘచతురస్రాకారంలో ఉంటుంది. దీని స్టోరేజీ కెపాసిటీ అంటే సమాచారాన్ని తనలో దాచిపెట్టుకునే సామర్థ్యం 64 MB (మెగాబిట్స్) నుంచి 32GB (గిగా బిట్స్) దాకా ఉంటుంది.

పెన్ డ్రైవ్ లో చిన్న ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ ఉంటుంది. ఇది పెన్ డ్రైవ్ కి సమాచారం సేకరించేందుకు ఉపయోగపడుతుంది. దీంట్లో చిన్న మైక్రోచిప్ ఉంటుంది. ఈ మైక్రోచిప్ డేటాను తీసుకునేందుకు లేదా బదిలీ చేసేందుకు ఉపయోగపడుతుంది. CD ROM లేదా ఫ్లాపీతో పోలిస్తే ఈ ప్రక్రియకు విద్యుత్ అవసరం తక్కువ. ఇది EEP-ROM (Electrically Erasable - Programmable Read Only Memory) టెక్నాలజీ మీద ఆధారపడి ఉంటుంది. కంప్యూటర్ వ్యవస్థలో రాసేందుకు లేదా చెరిపి వేసేందుకు ఈ టెక్నాలజీనే కి ఉపయోగిస్తారు.

పెన్ డ్రైవ్ ని USB పోర్ట్ కు కలిపినప్పుడు అది ఉత్తేజితం (activate) అవుతుంది. చాలా పెన్ డ్రైవ్ లు కంప్యూటర్ మీద ఏ USB పోర్ట్ మీదనైనా సరిపోయేలా డిజైన్ చేయబడతాయి. కంప్యూటర్ మీద సమాచారం ( పెన్ డ్రైవ్ కు అందుబాటులోకి వచ్చేలా USB పోర్ట్ పనిచేస్తుంది. బదిలీ చేయాల్సిన డేటా కంప్యూటర్ ప్రోగ్రాం ద్వారా అనుసంధానం చేయబడుతుంది. పెన్ డ్రైవ్ నుంచి ఆ డేటాను చదవడం, చేరవేయడం లేదా తిరిగి రాయడం మరోవైపు కంప్యూటర్ నుంచి ఒకేవిధంగా పెన్ డ్రైవ్ కి కూడా జరుగుతుంది. ఈ విధంగా మనకు కావలసిన డేటా పెన్ డ్రైవ్ నుంచి కంప్యూటర్ లో ఎంచుకున్న డిస్క్ కు కాపీ అవుతాయి.

పెన్ డ్రైవ్ వంటి USB ఫ్లాష్ డ్రైవ్ లో బయటి నుంచి విద్యుత్తు అవసరం లేకుండా అవి కలపబడిన కంప్యూటర్ నుంచే విద్యుత్ ను తీసుకుంటాయి. పెన్ డ్రైవ్ ను కంప్యూటర్ కు కలిపినప్పుడు అది. కంప్యూటర్ తో విద్యుత్ పరంగా కూడా అనుసంధానం అవుతుంది. పెన్ డ్రైవ్ నుంచి కంప్యూటర్ కు లేదా - కంప్యూటర్ నుంచి పెన్ డ్రైవ్ కు డేటా మార్పిడి జరిగిన తర్వాత, పెన్ డ్రైవ్ ను వెంటనే బయటికి లాగేయకూడదు. ఎందుకంటే, పెన్ డ్రైవ్ కంప్యూటర్ నుంచే విద్యుత్తు తీసుకుంటుంది కదా! అందుచేత, దాన్ని బయటికి ఒక్కసారిగా లాగివేస్తే అది కాలిపోవచ్చు. అందుచేత జాగ్రత్త తీసుకోవాలి. Safely to remove hardware మీద క్లిక్ చేస్తే విద్యుత్ పరంగా సంబంధం విచ్ఛిన్నమవుతుంది. అప్పుడు 'Safe to remove hardware' అనే సంకేతం వస్తుంది. ఇప్పుడు పెన్ డ్రైవ్ ని బయటికి తీసివేయవచ్చు.

పెన్ డ్రైవ్ లోపల ముఖ్యంగా 8 భాగాలుంటాయి. అవి

1. USB కనెక్టర్, 2. USB మాస్ స్టోరేజీ కంట్రోల్ డివైస్, 3. టెస్ట్ పాయింట్లు, 4. ఫ్లాష్ మెమరీ చిప్, 5. క్రిష్టల్ ఆసిలేటర్, 6. ఎల్.ఇ.డి. ఇండికేటర్ లైట్, 7. రైట్-ప్రొటెక్ట్ స్విచ్, 8. రెండో ఫ్లాష్ మెమరీ చిప్ కు ఖాళీ జాగా, ఈ భాగాలన్నీ బోర్డ్ లో ఇమిడి ఉంటాయి.

USB కనెక్టర్: ఇది ఫ్లాష్ మెమరీచిప్ కు, కంప్యూటర్ కు మధ్య వారధిలా పనిచేస్తుంది.

USB మాస్ స్టోరేజీ కంట్రోల్ (కంట్రోలర్ చిప్): ఇది ఫ్లాష్ డ్రైవ్ కు మెదడులాంటిది. డ్రైవ్ నుంచి సమాచారాన్ని బయటికి తీయడం, కంప్యూటర్ నుంచి సమాచారాన్ని చిప్ లో భద్రపరచడం చేస్తుంది.

టెస్ట్ పాయింట్లు : ఇవి విద్యుత్ నంధానికి ఉపయోగపడతాయి. బోర్డ్ లో ఏమైనా లోపాలుంటే వాటిని గుర్తించేందుకు వీటిద్వారా వీలుపడుతుంది.

ఫ్లాష్ వెమరీ చిప్: ఫైల్స్ అన్నీ దీంట్లోనే భద్రపరచబడతాయి.

క్రిష్టల్ ఆసిలేటర్: ఇది ఒక నిర్దిష్ట పౌనఃపున్యం (frequency) తో కంపించే క్వార్ట్ స్పటికం.

ఇది 'డిజిటల్ క్లాక్'లా ఉపయోగపడుతుంది.

L.E.D. ఇండికేటర్ లైట్: ఇది ఫ్లాష్ డ్రైవ్ పనిచేస్తోందీ క లేనిదీ తెలియజేస్తుంది.

రైట్-ప్రొటెక్ట్ స్విచ్: ఫ్లాష్ డ్రైవ్ లో నిక్షిప్తం చేయబడిన సమాచారాన్ని (డాక్యుమెంట్లు, ఫోటోలు వగైరా) భద్రంగా ఉంచేందుకు ఉపయోగపడుతుంది.

రెండో ఫ్లాష్ మెమరీ చిప్పకు ఖాళీజాగా: స్టోరేజ్ కెపాసిటీని పెంచేందుకు ఇంకొక మెరీచిప్ ను ఉంచేందుకు వేరొకజాగా.

ఈ ఫ్లాష్ డ్రైవ్ (పెన్ డ్రైవ్) ను విద్యున్నిరోధం చేసి ఒక ప్లాస్టిక్ లేదా లోహపు లేదా రబ్బరు తొడుగున్న పెట్టెలో ఉంచుతారు. పెన్ డ్రైవ్ లో కదిలే భాగాలేవీ లేవు కాబట్టి మన్నిక ఎక్కువ. సుమారు 10 సంవత్సరాలు దీనిలో సమాచారం భద్రంగా ఉంటుంది. పెన్ డ్రైవ్ లు లేదా ఫ్లాష్ డ్రైవ్ లు అయస్కాంత ప్రభావాలకు గురికావు. USB ఫ్లాష్ డ్రైవ్ లతో పోల్చినప్పుడు ఫ్లోపీడిస్క్ ల సామర్థ్యం తక్కువ కాబట్టి అవి ఇప్పుడు దాదాపు కనుమరుగై పోయాయి.

sep015.jpgపెన్ డ్రైవ్ ల మెమరీ పెంచేందుకు వాటి తయారీదారులు కృషి చేస్తున్నారు. 2013 జనవరి నాటికి 512 GB దాకా మెమరీ అంటే స్టోరేజీ సామర్థ్యం ఉన్న పెన్ డ్రైవ్ లు అందుబాటులోకి వచ్చాయి. అదే ఏడాది కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ షో' సందర్భంగా ఒక టెరాబైట్ (1 TB) పెన్ డ్రైవ్ ను విడుదల చేశారు. 2 TB స్టోరేజీ సామర్థ్యం ఉన్న పెన్ డ్రైవ్ లు రూపొందించేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందుకు అనుగుణంగా పెన్ డ్రైవ్ సైజు, ఖరీదు కూడా పెరుగుతాయి.

పెన్ డ్రైవ్, ఫ్లాష్ డ్రైవ్ రెండూ కూడా ప్రధానంగా ఒకే పనిని చేస్తాయి. కానీ రెండూ ఒకటే అని తికమకపడకూడదు. పెన్ డ్రైవ్ చేయగలిగిన పనులకంటే, ఫ్లాష్ డ్రైవ్ చేసే పనులు మిన్నగా ఉంటాయి.

ఈ రోజుల్లో iPod లు, MP3 ప్లేయర్లు, డిజిటల్ కేమరాలు బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఇవన్నీ పెన్ డ్రైవ్ల వేర్వేరు రూపాలే. వీటి సర్యూట్ బోర్డ్స్ లోనే వాటి విజయరహస్యం దాగి వుంది.

ఆధారం: డా.ఇ.ఆర్. సుబ్రహ్మణ్యం.

3.00285714286
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు