పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

పెలికాన్ పక్షులు

పెలికాన్ పక్షి గురించి తెలుసుకుందాం.

peliconbirdsహాయ్ చిన్నారులూ! ఈ పెలికాన్ పక్షి రొమేనియా దేశపు జాతీయపక్షి అంతేకాక కరీబియన్ దేశాలైన సెయింట్ కిట్స్ నెవిన్, బార్చడాస్, సెయింట్ మార్టిన్ అనే మూడు దేశాలకు కూడా జాతీయ పక్షిగా ఎన్నుకోబడింది. ఇంకా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమేరికాలోని లూసియానా రాష్ట్ర పక్షి కూడా ఇది. పెలికాన్ల వలన లూసియానాను పెలికాన్ రాష్టం' అని కూడా పిలుస్తారు. లూసియానా రాష్ట్ర జెండా మీద, రాష్ట్ర ముద్రలోనూ ఈ పెలికాన్ పక్షి బొమ్మ ఉంటుంది. ఇన్ని దేశాలకు జాతీయ పక్షిగా ఉన్నది పెలికాన్లే అయినప్పటికీ వాటి రంగుల్లో తేడా ఉంది. రొమేనియన్ దేశపు జాతీయ పక్షి తెల్ల పెలికాన్. కరీబియన్ దేశాల జాతీయ పక్షి గోధుమ రంగు పెలికాన్.

ఈ పెలికాన్ పక్షులు సంఘజీవులు. ఇవి గుంపులు గుంపులుగా ప్రయాణం చేస్తాయి అన్నీ కలసి కట్టుగానే ఉండి ఆహారాన్ని వేటాడుతాయి. గుడ్లు పెట్టటం కూడా ఒకే ప్రదేశంలో పెట్టుకుంటాయి. ప్రస్తుతం జీవించి ఉన్న పెలికాన్లలో 8 రకాల బాతులు ఉన్నాయి. వీటిలో నాలుగు రకాలు తెలుపు రంగు జాతులు. నేల మీద గూళ్ళు కట్టుకొని జీవిస్తాయి. మరో నాలుగు రకాల గోధుమ రంగు జాతులైన పెలికాను ప్రధానంగా చెట్ల మీద గూళ్ళు కట్టుకొని జీవిస్తాయి.

పెలికాన్ల మెడ పొడుగా ఉంటుంది. కాళ్ళు చిన్నవిగా బలిష్టంగా ఉంటాయి. కాళ్ళు పెలికాన్ మన వాళ్ళు గూడ కొంగలనీ, గూడ బాతులని పిలుస్తారు. కాళ్ళు పొడవుగా ఉంటే కొల్లేటి కొంగలని దేవరాయి కొంగలనీ పిలుస్తారు. నీటిలో నివసించేందుకు వీలుగా కాలి వేళ్ళను కలుపుతూ చర్మం ఉంటుంది. ఎగరగలిగే బరువైన పక్షిజాతుల్లో పెలికాన్ జాతి కూడా ఒకటి. ధృవ ప్రాంతాలలోనూ, సముద్రాలలోనూ, దక్షిణ అమెరికా లోతట్టు ప్రాంతాలలోనూ పెలికాన్లు ఎక్కువగా ఉండవు. వ్ర వంచంలోని అన్ని నమశీతోష్ణ ప్రాంతాలలోనూ అక్కడక్కడా వ్యాపించి ఉంటాయి. అన్ని ఖండాలలోనూ అక్కడక్కడా వ్యాపించి ఉంటాయి. అన్ని ఖండాలలోను ఇవి కనిపించినప్పటికీ అంటార్కిటికా ఖండంలో ఎక్కడా కనిపించవు. భారతదేశంలోనూ స్పాట్ బిల్డ్ (Spot - Billed) పెలికాన్స్ ఉంటాయి. వీటిని మనవాళ్ళు చింకబాతులని పిలుస్తారు. శాస్త్రీయనామము పెలికానస్ ఫిలిప్పెనీ ఈ రకమైన పక్షులు భారతదేశంతో పాటు పాకిస్తాన్, శ్రీలంక, నేపాల్ దేశాలలో కూడా ఉన్నాయి. ఈ స్పాట్ బిల్డ్ పెలికాన్లను గ్రే పెలికాను అని కూడా పిలుస్తారు. ఈ గ్రే పెలికాను మన తెలుగు రాష్ట్రాల్లోనూ ఉన్నాయి. వలస పక్షులకు ప్రాధాన్యత పొందిన కొల్లేరు సరస్సులో కూడా ఇవి ఉన్నాయి. ప్రతి ఏటా వలస వచ్చే సైబీరియన్ కొంగలు, ఐబిన్లు, పెయింటెడ్ స్టార్క్లతో పాటు స్పాట్ బిల్డ్ పెలికాను (కొల్లేటి కొంగలు) కూడా వస్తాయి.

పెలికాన్ల రెక్కలు పొడుగా విశాలంగా ఉంటాయి. వీటి తోక చిన్నగా చతురస్రాకారంగా ఉంటుంది. పెలికాన్ల మక్కు 1.6 అడుగుల వరకు పెరుగుతుంది. పెలికాన్లలో అన్నింటికన్నాచిన్నదైన జాతి గోధుమ రంగు పెలికాన్. వీటిబరువు 2.7 కిలోల లోపే ఉంటుంది. మీటరు పొడవు వరకు పెరుగుతాయి. రెక్క విప్పితే ఆరడుగుల పొడవు ఉంటుంది. పెలికాన్లంటిలోనూ పెద్దదైన జాతి దాల్మేషియన్ పెలికాన్ (పెలికానస్ క్రిస్తృస్) లో రెక్క విప్పినపుడు పదడుగుల పొడవు ఉంటుంది. ఇది 15 కిలోల బరువు ఉంటుంది. ఆరడుగులపొడవు ఉంటుంది.

పెలికాన్ పక్షులు పెలికానిడే కుటుంబానికి పెలికాని ఫార్మెస్ క్రమానికి, పెలికానస్ ప్రజాతికి చెందినటువంటివి. వీటికి పొడవైన ముక్కుతోపాటు గొంతుదగ్గర ఒక సంచి ఉంటుంది. ఇవి చేపల్ని చిన్న కప్పల్ని క్రస్టేషియన్స్నూ తింటాయి. అప్పడప్పుడూ తాబేళ్ళను కూడా తింటాయి. ఇవి ఆహారాన్ని తీసుకునేటపుడు వాటితో పాటు నీళ్ళను కూడా తీసుకుంటుంది. గొంతు దగ్గర ఉన్న సంచిలో పెట్టుకొని నీళ్ళను వంపేసి చేపను మాత్రం లోపలికి మింగుతుంది. మధ్యధరా సముద్ర ప్రాంతం నుండి దక్షిణాఫ్రికా వరకు విస్తరించి ఉన్న తెల్లటి పెలికాన్ల శాస్త్రీయ నామము మెలికానస్ ఓనోక్రోటాలన్• పూబిల్, హేమర్కాప్ (Hamerkop) అనే పక్షులకు ఈ పెలికాన్లకు దగ్గర సంబంధాలున్నాయి.

ఆడ పెలికాన్ల కన్నా మగ పెలికాను ఆకారంలో పెద్దవిగా ఉంటాయి. అంతేకాదు ముక్కుకూడా పెద్దదిగా ఉంటుంది. వీటి ఈకలన్ని లేత రంగులో ఉంటాయి. పిల్లల్ని పెట్టే కాలంలో ఈ పెలికాన్ల ముక్కులు, గొంతు దగ్గరి సంచులు ముఖం మీద చర్మం ముదురు రంగులోకి మారతాయి. కాలిఫోర్నియన్ ఉపజాతులలోని గోధుమ రంగు పెలికాన్ గొంతు సంచి ముదురు ఎరుపు రంగులోకి మారుతుంది. అదే విధంగా గుడ్లు పెట్టిన తరువాత ముదురు ఎరుపు రంగు నుంచి పసుపురంగులోకి మారిపోతుంది. అదేవిధంగా పెరూవియన్ పెలికాన్ (పెలికానస్థాగస్) పక్షి గొంతు సంచి బూడిద రంగులోకి మారిపోతుంది. పెలికాన్లకు మనుష్యులకు మధ్య సంబంధాలు తరచుగా కొట్లాటలుగానే ఉంటాయి. ఇవి మనుష్యులతో స్నేహం చేయవు. ప్రాచీన ఈజిపు దేశంలో మరణానికి, పునర్జన్మలకు సంకేతంగా పెలికాన్లను చెపుతారు. సమాధుల గోడలమీద, శ్మశానాలలోనూ పెలికాన్ల బొమ్మల్ని పాములు రాకుండా ఉండేందుకు వేసేవారు. పెలికాన్ ఒక నల్లటి పక్షి అనీ, అది వరదల్లో కొట్టుకుపోయే ప్రజల్ని కాపాడుతుందనీ అక్కడి ప్రజలు విశ్వసించేవారు. హిందూ పురాణాలలో వీటి ప్రస్తావన ఉంది. పెలికాన్ పక్షులు కూడా ప్రస్తుత సమయంలో తగ్గిపోతున్నాయి. కాబట్టి ప్రభుత్వం వీటిని రక్షించే ఆలోచనలో ఉన్నది. పెలికాన్ల సంఖ్య తగ్గిపోకుండా కాపాడేందుకు అనేక రక్షణ చర్యలు తీసుకుంటున్నారు. మనం క్రూడాం చేంు అందించి పెలికాన్లను రక్షించుకుందాం.

రచయిత: -డా. కందేపి రాణీప్రసాద్, సెల్: 9866160378

3.00584795322
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు