పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

పొగ పెట్టేస్తున్న పొగాకు

పొగ త్రాగుట ఆరోగ్యానికి హానికరం.

పొగత్రాగడం మానేస్తున్నారు! ఔను నిజంగానే మానేయండి. ఎవరు అడక్కుండానే మానేస్తున్నారు. ఒకరా? ఇద్దరా? అంటే ప్రతీ 5 సెకన్లకు ఒకరు చొప్పున సంవత్సరానికి 60 లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా ధూమపానాన్ని త్యజిస్తున్నారు. మానేస్తున్న వారిలో పదిశాతం మంది 30-40 సం||ల మధ్య వయసున్నవారే. ఈ దుర్వసనమును త్యజిస్తున్న ప్రతి పదిమందిలో ఏడుగురు భారతీయులే తెలుసా? 2030 నాటికి పొగత్రాగడం మానేసే వారి సంఖ్య సంవత్సరానికి 80 లక్షలకు చేరుకుంటుందని అంచనా. వీరంతా స్వచ్ఛందంగా ధూమపానాన్ని త్యజిస్తున్నారు. అంతమంచి బుద్ది ఎలా వచ్చిందనుకుంటున్నారా? మరణించడం ద్వారా వ్యనన విముక్తిని పొందుతున్నారు. అవాక్కయినారా? అవును అవాక్కవ్వాల్సిందే.

సరదా సరదా చుట్ట, బీడి,సిగరెట్టు: మన మరణానికి తొలిమెట్టు

ప్రపంచంలో మొత్తం మీద సంభవిస్తున్న అకాలమరణాలకు రెండో కారణం పొగాకు ఉత్పత్తులు సేవించడం. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా జరుగుచున్న మరణాలలో ప్రథమస్థానంలో ధూమపాన ప్రియులున్నారు. ధూమపానం 20వ శతాబ్దంలో 10 కోట్ల మందిని పొట్టన పెట్టుకుంటే ఆ సంఖ్య 21వ శతాబ్దంలో వందకోట్లకు చేరుకుంటుందని అంచనా.

ధూమపాన ప్రియులా? దుర్గంధ ప్రియులా?

ధూమపాన ప్రియుల నోటి నుంచి దుర్గంధమే కదా వచ్చేది. వారి నోరు వారి పరిసరాలు గబ్బే కదా! ప్రపంచ వ్యాప్తంగా 115 కోట్ల మంది ధూమపాన ప్రియులుంటే అందులో 25 కోట్ల మంది అంటే 21% మంది భారతీయులే. నిమిషానికి కోటి చొప్పున రోజుకి 1440 కోట్ల సిగరెట్లను ప్రపంచవ్యాప్త పొగాకు ప్రియులు కాలుస్తున్నారు. అంటే రోజుకు సుమారు 14000 కోట్ల రూపాయలు తగలేస్తున్నారు. చైనా తరువాత ధూమపాన ప్రియులు ఎక్కువగా ఉన్న దేశం మనది. మనదేశంలో 48% మగవారికి, 10% మంది ఆడవారికి పొగత్రాగే అలవాటున్నది. 15 సంవత్సరాలు దాటిన పురుషులలో 50% మందికి స్మోకింగ్ అలవాటున్నది. ఏముంది? ఏమైద్ది?

సిగరేట్లో ఏముంది? పొగాకే కదా! పైగా ఫిల్టర్ సిగరేట్! త్రాగితే ఏమైది? ... హాయిగా... తేలిపోయినట్లు ఉంటుంది అని పొగచుట్ట ప్రియులు తేలిగ్గా తీసిపారేస్తుంటారు. అవునుకదా? నిజానికి సిగరేట్ పొగలో 4000 రకాల రసాయనాలుంటే అందులో 250 రకాలు విషపూరితమైనవి. 43 రకాలు క్యాన్సర్ కారకాలు. నికోటిన్, కార్బన్ మోనాక్సైడ్ (CO), తారు, ఆర్శనిక్ (As), అన్ టోన్, డి.డి.టి., బెంజీన్, అమ్మోనియా, రేడాన్, ఫార్మాల్డిహైడ్ మొదలైన ముఖ్యమైన రసాయనాలు ఉంటాయి. వీటి కారణంగా 25 రకాలైన జబ్బులు సంక్రమిస్తాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెల్లడించింది అంటే ధూమపాన తీవ్రత ఎంతో అర్థం చేసుకోవచ్చు.

గుండె జబ్బులతో చనిపోయే ప్రతి 5 మందిలో ఒకరు ధూమపాన ప్రియులే. భారతదేశంలోని క్యాన్సర్ బాధితుల్లో మూడింట ఒకవంతు పొగధీరులే. మనదేశంలో 40% క్యాన్సర్ జబ్బులకు ధూమపానమే ప్రధానకారణం. క్రానిక్ అబ్స్టక్టివ్ పలమనరీ డిసీజ్ (COPD)గా చెప్పబడే క్రానిక్ బ్రాంకైటీస్, ఎంఫైసిమా అనే వ్యాధులకు కారణం కూmay012.jpgడా ధూమపానమే. ఏటా లక్షల మంది పొగాకు ఉత్పత్తుల బానిసత్వం కారణంగా చనిపోతుండడం అమితంగా బాధించే అంశం. రోజుకి రెండు పెట్టెలు సిగరెట్లు తాగేవారిలో 25% మందికి ఊపిరితిత్తుల క్యాన్సర్ సోకే ప్రమాదం ఉంది. స్పష్టంగా చెప్పాలంటే ఒక సిగరేట్ / బీడి త్రాగితే సగటున 14 నిమిషాల ఆయుషు తగ్గిపోతుంది. దేశంలోని 35% మంది పెద్దలు, 14% మంది యువకులు పొగరాని పొగాకు ప్రియులు అంటే పొగాకు ఉత్పత్తులన నమిలేవారు వీరిలో ఎక్కువమంది నోటి క్యాన్సర్ రోగులు. పొగాకు కారణంగా వస్తున్న జబ్బులకు వైద్యం కోసం పెడ్తున్న ఖర్చు 2002-03 సంవత్సరంలో 5 కోట్ల డాలర్లు. ఈ మొత్తం ప్రజారోగ్యం, వైద్యం, నీటిసరఫరా, పరిశుభ్రత కొరకు రాష్ట్ర ప్రభుత్వాలు వెచ్చిస్తున్న మొత్తం కన్నా ఎక్కువ. Smoking is slow sucide.

అంతకన్నా ఎక్కువ ప్రమాదకరం!!

పరోక్ష ధూమపానం Second hand smoking (SHS) అని పర్యావరణ పొగాకు పొగ (ETS) అని ప్యాసివ్ స్మోకింగ్ అని అంటుంటారు. అంటే ధూమపాన ప్రియులు వదలిన పొగని ఆ పరిసరాలలో ఉన్న అలవాటు లేని వారు పీల్చుకోడాన్ని పరోక్ష ధూమపానం అంటారు. ఇవి అత్యంత ప్రమాదకరం.

may011.jpgపొగప్రియులు వదిలే పొగలో క్యాన్సర్ కారక రసాయనాలు ఎక్కువగా ఉంటాయి. ధూమపానం చేసేవారిలో 60% మంది పొగను మింగరు. కాని వారి ప్రక్కనుండే నాన్ స్మోకర్స్ నూరుశాతం పీల్చుకుని త్వరగా అనారోగ్యం పాలౌతారు. ప్రపంచవ్యాప్తంగా మరణిస్తున్న 60 లక్షల మందిలో 6 లక్షల మంది పరోక్ష ధూమపాన సేవికులే. SHS బాధితులలో ఎక్కువ మంది చిన్నారులే. ధూమపానం అలవాటున్న తల్లిదండ్రులను కలిగియున్న శిశువులను శాండియాగో విశ్వవిద్యాలయం ఆచార్యులైన జార్జ్ మర్, అతని శిష్యబృందం అధ్యయనం చేసినపుడు ఆ శిశువుల మూత్రాలలో, వెంట్రుకలలో నికోటిన్ ఛాయలు కన్పించాయి. ధూమపానం చేయని తల్లిదండ్రులను కలిగియున్న పిల్లలలో కన్నా 7 రెట్లు అధికంగా ఈ పిల్లలు కలిగియున్నారు. ఈ మోతాదు చాలు ఉబ్బసం, చర్మరోగాలు, శ్వాసకోశ జబ్బులు లాంటి 25 రకాల జబ్బులు సంక్రమించడానికని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

SHS కారణంగా అమెరికాలో ఏటా 53000 మంది మరణిస్తున్నారు. 2004లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న చిన్నారులలో 28% మంది మరణించారు. ఇంటిబయటే కాక ఇంట్లో కూడా ప్రతి 10 మందిలో 8 మంది SHS బాధితులే. 40% మంది చిన్నారుల తల్లిదండ్రులలో కనీసం ఒకరు ధూమపానం అలవాటు కలిగియున్నారు. చిన్నారులకు పొగాకు రహిత గాలిని అందించాల్సిన బాధ్యత పౌర సమాజానిది 'ధూమరహిత పరిసరం- ప్రపంచ ప్రజల ఆరోగ్య రహస్యం' అన్న నిజాన్ని మరువకూడదు. నిషేదించొచ్చు కదా!!

ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా సంభవిస్తున్న నివారించగలిగిన అకాల మరణాలకు ఏకైక ముఖ్యకారణం పొగాకు ఉత్పత్తుల వాడకమని గుర్తించిన ఐక్యరాజ్య సమితి (UNO) అనుబంధ WHO, ప్రపంచ వ్యాప్తంగా పొగాకు వాడకాన్ని నియంత్రించాలని 2003 మే 21న జెనీవాలో "Frame work convention on Tobacco Control" అనే ఒప్పందం చేసింది. ప్రపంచంలోనే ప్రజారోగ్య సంబంధ తొలి ఒప్పందం ఇది. దీనికి అనుగుణంగా వివిధ దేశాలు నిషేధ, నియంత్రణ ఒప్పందాలు చేశాయి.

నేడు ప్రపంచ దేశాలలో 16% మంది వారివారి దేశాలలోని సమగ్రపొగాకు నియంత్రణ చట్టాల కారణంగా రక్షణ పొందుచున్నారు. 14% జనాభాను కలిగియున్న 30 దేశాలలో నియంత్రణ చట్టాలపై బాగా అవగాహన కలిగియుంటే, 10% జనాభాకు ప్రాతినిధ్యం వహించే 24 దేశాలు సంపూర్ణ నిషేధ చట్టాలను రూపొందించుకొనినారు. కనిష్ట మధ్యస్థ ఆదాయ వనరులున్న దేశాలలోనే 80% మంది ధూమపాన ప్రియులున్నారు.

మనదేశం కూడా 2003లో చట్టం చేసి 27 ఫిబ్రవరి 2005 నుంచి అమలులోకి తెచ్చారు. ఈ చట్టం ప్రకారం పొగాకు ఉత్పత్తుల అమ్మకాలు పెంచుకోవడానికి ప్రచారం నిర్వహించ రాదు. పాఠశాలలకు, ప్రార్థనాలయాలకు 100 మీటర్ల పరిధిలో విక్రయాలు ఉండకూడదు. మైనర్లకు ఎట్టి పరిస్థితులలో అమ్మకూడదు, రాజ్యాంగంలోని 47వ అధికరణం స్ఫూర్తితో దేశవ్యాప్తంగా రైళ్ళల్లో, పబ్లిక్ రవాణా సాధనాలలో, ఆసుపత్రులు, ఆరోగ్యకేంద్రాలు, కోర్టులు, విద్యాసంస్థలు, గాంధాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, క్రీడా ప్రాంగణాలు లాంటి బహిరంగ ప్రదేశాలలో పొగత్రాగడాన్ని సుప్రీంకోర్టు నిషేదించింది. పొగాకు వినియోగం పాపం అంటూ ధూమపానాన్ని నిషేదించిన ఏకైకమతం సిక్కు మతం. పొగాకు ఉత్పత్తుల ద్వారా ప్రభుత్వం సంవత్సరానికి 6000 కోట్ల రూపాయల ఆదాయాన్ని పొందుతుంటే, ధూమపానం ద్వారా వస్తున్న జబ్బులకు ప్రజానీకం పెడ్తున్న ఖర్చు 13500 కోట్లు. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే 15 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నారు. అంటే ధూమపాన ప్రియులు ఆర్థికంగా ఇంటిని, వంటిని గుల్ల చేస్తూ ప్రభుత్వాల, కంపెనీల, ఆసుపత్రుల ఆదాయాన్ని పెంచుతున్నారు.

నెదర్లాండ్స్స మాస్టిచ్ విశ్వవిద్యాలయ ఆరోగ్య కేంద్రానికి చెందిన డా. జస్వీర్ బీన్ బృందం చేసిన అధ్యయనంలో ధూమపానం నిషేదించిన ప్రాంతాలలో నెలలు నిండకుండా పుట్టే పిల్లల సంఖ్య, శ్వాససంబంధ వ్యాధుల బారిన పడని చిన్నారుల సంఖ్య దాదాపు 10% తగ్గినట్లు ప్రముఖ లాన్సెట్ పత్రిక ప్రచురించింది. నిజంగానే సంతోషించాల్సిన విషయం.

వినోదంతో మొదలు - విషాదంతో ముగింపు:

దమ్ముకొట్టడం అంటే చుట్ట/ బీడి/ సిగరేట్/ హుక్కాల పొగత్రాగడం అనేది సరదాగా అనుకరణతో ప్రారంభమౌతుంది. కుటుంబంలోని పెద్దలుగాని, బంధువులుగాని, పరిసరాలలోని వారు గాని పొగప్రియులున్నట్లయితే వారిని చూచి బాల్యం నుంచే పుల్లలు, బలపాలు, బాకీపీసులు, దంటు పుల్లలు లాంటివి నోట్లో పెట్టుకొని అనుకరిస్తూంటారు. కొంత ఎదిగాక స్నేహితుల పత్తిడితో అలవాటు చేసుకుంటారు. ఇంకొందరు స్నేహితులను వదులుకోలేక వారి ప్రోద్భలంతో వ్యసనపరులుగా మారుతారు. యాక్టర్లను, క్రీడాకారులు, అధ్యాపకులు, ఆచార్యులు లాంటి సెలిబ్రిటీలను చూచి అనుకరిస్తూ అలవాటుగా మార్చుకొంటారు. మరికొంతమంది. అందం పెరుగుతుందని, హీరోయిజాన్ని చాటుతుందని, స్వతంత్ర్యను వ్యక్తీకరించడమని, ప్రశాంతి స్వభావాన్ని సూచిస్తుందని, మంచి ఆలోచనలు వస్తాయనే అపోహలతో ధూమపాన ప్రియులుగా మారతారు. స్టేటస్ సింబల్ గా కూడా చూస్తుంటారు కొంతమంది.

అభద్రతా భావం, ఒంటరితనం, వత్తిడి అనుభవించేవారు, ఆతృత, ఆందోళన స్వభావం కలిగినవారు, తల్లిదండ్రుల అజమాయిషీ లేనివారు, నిరాదరణకు గురౌతున్నవారు త్వరగా ఈ అలవాటును అలవర్చుకుంటారు. నిజానికి పొగతాగితే వత్తిడి పెరుగుతుంది. కాని తగ్గదని పరిశోధనలు చెప్తున్నాయి. నూనుగు మీసాలప్రాయంలో సిగరెట్ పొగతో పెదాల్ని పావనం చేసుకోవడం ప్రారంభించిన మగధీరుల్లో 50% మంది మద్యపానానికి కూడా అలవాటు పడినట్లు అధ్యయనాలు వకోషిస్తున్నాయి. అంటే వ్యసన సంక్రమణం అన్నమాట. ఇంకా దొంగతనాలు అలవాటు చేసుకోవడం, ఎంగిలి పీకలు కాల్చడం లాంటి చెడు అలవాట్లకు బానిసలౌతారు, ధూమపానం శారీరక అందాన్ని పాడుచేస్తుంది. రక్తప్రసరణను మందగింప చేస్తుంది. కావున సరదాకి ఈ అలవాటును ప్రారంభిస్తే అది యమపురికి బాటవే సుందన్న విషయం మరువకూడదు.

ధూమపానం మానినట్లయితే!

జీవితం పై నమ్మకం పెరుగుతుంది. శరీరధార్ద్యత పెరుగుతుంది. వ్యాధి నిరోధకశక్తి పెరుగుతుంది. అందం వికసిస్తుంది. కుటుంబ, సంసార సంబంధాలు ఇంకా బలపడ్డాయి. మానసిక చురుకుదనం ఉంటుంది. సొమ్ము ఆదా అవుతుంది. ధూమపానం మానిన

 • 20 నిమిషాల్లోపే రక్తపోటు, గుండెకొట్టుకోవడం లాంటివి సాధారణ స్థితిలోకి వస్తాయి.
 • 128 గంటల్లోపు రక్తంలోని ..లు స్థాయి సాధారణ స్థితికి వచ్చేస్తుంది.
 • 24 గంటల్లో నికోటిన్ శరీరం నుంచి వైదొలుగుతుంది.
 • 48 గంటల్లో వాసన, రుచి చూడటం వల్ల బాగా మెరుగౌతుంది.
 • 78 గంటల్లో శ్వాసక్రియ బాగా అభివృద్ది చెందుతుంది.
 • 78 గంటల్లో శ్వాసక్రియ బాగా అభివృద్ది చెందుతుంది.
 • 9 నెలలలోపు దగ్గు 10% తగ్గిపోతుంది.
 • 12 నెలలలోపు గుండె జబ్బుల ప్రమాదం 50% తగ్గిపోతుంది.
 • 10 సంవత్సరాలలోపు ఊపిరితిత్తుల క్యాన్సర్ 50% తగ్గిపోతుంది.
 • మానేసిన వెంటనే చిరాకు, కోపం, మలబద్ధకం, మగత నిద్ర వంటి ఇబ్బందులు ఉంటాయి. కాని అవి తాత్కాలికమే అన్న విషయం మరువకూడదు. సిగరేట్ మాన్పించండి-కొత్త ఉత్సాహంతో ఉరకలెత్తించండి.

  31 మే ప్రపంచ పొగాకు వ్యతిరేకదినం:

  UN పిలుపుమేరకు ప్రతి సంవత్సరం మే 31న ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం జరిపడం ఆనవాయితీ. ప్రత్యేక నినాదంలో కార్యాచరణను WHO సూచిస్తుంది. “పొగాకుపై పన్నులు వేయండి - వినియోగం తగ్గించి - జీవితాలను నిలబెట్టండి" అనేది ఈ సంవత్సరము ఇచ్చిన పిలుపు. పొగాకు ఉత్పత్తులపై పన్నులు పెంచితే ధనికదేశాలలో 4% మూడో ప్రపంచ దేశాలలో 8% పొగాకు వినియోగం తగ్గినట్లు గణాంకాలు చెప్తున్నాయి. ధనిక దేశాలలో పోగాకు పై 50% వెన్నులు పెంచినట్లయితే 22 అల్పాదాయ దేశాలకు 14 కోట్ల డాలర్ల నిధులు అందుబాటులోకి వచ్చి వారి ఆరోగ్యబడ్జెటీని 50% పెంచుకోగలుగుతారు. ఈ వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకొని వ్యక్తులు, పౌరసమాజం, స్వచ్చంధ సంస్థలు, రాజకీయపార్టీలు మొదలైన వారు - పొగాకు ఉత్పత్తులపై పన్నులు పెంచే విధంగా ప్రభుత్వంపై వత్తిడి తెచ్చే కార్యక్రమాలు చేపట్టాలి. ప్రభుత్వాలు స్వచ్చందంగా పన్నులు పెంచుతున్నట్లయితే వారికి సహకరించాలి. పొగాకు నియంత్రణ కొరకు WHO కార్యక్రమం “MPOWER”

  WHO కార్యక్రమం “MPOWER”

  M-Monitor tobacco use and prevention polices

  P-Project people from  tobacco use

  O-Offer help to quit tobacco use

  W-Warn about the dangers of tobacco E-Enforce bans on tobacco advertisements, promotions and sponsorship R- Rise taxes on tobacco.

  ఎవరికి వారు మానరు - మనమే మన్నించాలి.

  నేను పొగత్రాగను, పొగాకు ఉత్పత్తులను సేవించను. మా బంధువులలో కూడా ఎవరికి ఈ వ్యసనం లేదు. ఎలా అనుకుంటున్నారు. నాకు 15-16 సంవత్సరాల వయస్సులో ఉన్న బంధువుల పిల్లలం అందరూ ఓ శుభకార్యంలో కలిసి ఆనుకొని ఈ వ్యసనం అలవాటున్న పెద్దలను బతిమాలి, అలకలో, కొన్నిసార్లు తన్నులు కూడా తిని రకరకాల మొండి ప్రయత్నం చేసి అందరిచే వ్యసనాన్ని మాన్పించాము. మేమందరం నేటికి ఈ విషయాన్ని గర్వంగా చెప్పుకుంటాము. ఘాటుకు అలవాటుపడిన వారికి ఘాటుగా అయినా చెప్పి దమ్ముకొట్టడం మాన్పిద్దాం. దమ్ముకొట్టనందుకు ధన్యవాదాలు తెలపండి. పొగాకు ఉత్పత్తులను కాని శీతల పానీయాలను (కూల్ డ్రింక్స్) కాని సేవించmay014.jpgడం ఒళ్ళు, ఇల్లు గుల్ల తప్ప మరొక ప్రయోజనం లేదనే వాస్తవాన్ని అందరికి చాటి చెబుతాం. అందరం కలిసి పొగాకు పొగలేని భవిషత్తును భావితరాలకు అందిద్దాం. ఇదే అందరి తక్షణ కర్తవ్యం.

  ఆధారం: షేక్ గౌస్ బాష అధ్యాపకులు.

3.0
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు