పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

ప్రకృతిలో వింతైన జీవన భాగస్వామ్యం

ప్రకృతిలో పరస్పరం సహకరించుకొంటూ జీవించే కొన్ని జీవాలు వున్నాయి.

aug15మనము కుక్కలను పెంచుకొంటాం. అవి మన ఇంటిని కాపలా కాస్తాయి. గుడ్డివారు తమతో కూడా కుక్కను తీసికేళుతూ వుంటారు. అది వారికి దారి చూపిస్తుంది. కుక్కలను పెంచుకోనేవారు వాటికి ఆహారాన్ని ఇస్తారు. కుక్కలు వాటి పెంపకం దారులు వరస్పరం సహకరించుకొంటూ జీవించడం మనం సర్వసామాన్యంగా చూస్తూ వుంటాం. ప్రకృతిలో పరస్పరం సహకరించుకొంటూ జీవించే కొన్ని జీవాలు వున్నాయి. వీటి జీవిత భాగస్వామ్యం గురించిన వింత విషయాలు పట్యభాగంలో తెలుసుకొని పజిల్ పూరిద్దాం. ఈ రకమైన జీవనాన్ని ఏమంటారో తలుసుకొందాం.

ఒక రకం జాతికి చెందిన రొయ్యను ఫ్రెంచ్ (shrimp) అంటారు. ఇది నీటి అడుగున ఇసుకలో బొరియ (burrow) ను చేస్తుంది. ఈ కన్నాన్ని తనూ తనతోపాటు గోబీ చేప (goby fish) కూడా కలిసి వుండగలిగేటంత పెద్దదిగా చేస్తుంది. గోబీ చేప బాగా చూడగలదు. రొయ్యకి సరియైన కంటి చూపు లేదు. ఇవి రెండూ ఒకదానితో ఒకటి అంటిపేట్టుకొనే వుంటాయి. ష్రింప్ వేటాడాలనుకొన్నప్పుడు  తన పంజాల (Claws) తో వేగంగా గోబిని లాగి పట్టుకొంటుంది. గోబీదానికి దారి చూపిస్తూ సహకరిస్తుంది. ప్రమాదం పొంచివున్నప్పుడు తన తోకతో రొయ్యని కొట్టి చెపుతుంది. గోబీ బొరియలోకి దారి తీయగా ష్రింప్ కూడా దాని వెంటే వెళ్ళిపోతుంది. గోబీ చేప చూపులేని ష్రింప్ జీవించడానికి తన సహాకారాన్ని అందిస్తూ ష్రింప్ వల్ల తాను వుండడానికి గుడ్లు పెట్టుకోవడానికి అనువైన నివాసాన్ని పొందుతుంది. శాంత మహాసముద్రపు రాతికట్టి భాగాలలో (Pacific ocean reef) మరో రకం ష్రింప్ లు నివసిస్తూ ఉంటాయి. ఇవి మోర్ ఈల్ (morayeel) ల శరీరాలపై నివసించే పరాన్న భుక్కులను తింటాయి. ఈల్ శరీరం శుభ్రపడుతుంది. పరాన్న భుక్కులు వల్ల ఈల్ లు అంటురోగాల (infectons) బారిన పడి అనారోగ్యపాలౌతాయి. ఈల్ ష్రింప్ ను తనపై నున్న జీవాలను తినడానికి సంతోషంగా వప్పు కొంటుంది. తన నోరు తెరచి అక్కడి పరాన్న భుక్కులనూ తినమని ఆహ్వనిస్తుంది (Invite). ఈల్ సహకరించడం వల్ల ష్రింప్ కి ఆహారం దొరుకుతుంది.

aug16ఎడ్లకొమ్మల్లాంటి పెద్దపెద్ద ముల్లు వున్న ఒక జాతి తమ్మచెట్టు (Bullhorn acacia) మెక్సికో, అమెరికా మధ్యభూభాగాలజాతీయ చెట్టు. సుమారు 33 అడుగుల ఎత్తుకి పెరుగుతాయి. యాక్టేన్ (Yucatan) ప్రాంతానికి చెందిన ప్రజలు ఈ చెట్టుని సూబిన్ (subbing) అంటారు. విటిముల్లు బోలుగా వుంటూ ఒకానొక జాతి చీమ (Psedudomyrmex Ant) లకి ఆవాసాన్ని ఇస్తాయి. చీమలు ఈ చెట్లు స్రవించే రసాన్ని (Sap) తింటూ జీవిస్తాయి. చెట్ల ఆకుల చివరి భాగాలు కూడా వీటికి మంచి పోషక విలువలు గల ఆహారం. ఈ చెట్టు పూవుల మకరందం ప్రత్యెకమైనది (special). కేవలం ఎ చీమలకు ప్రీతిపాత్రమైనది. అందువల్ల ఆకుల కోసలనూ తింటూ పూతేనెను త్రాగుతూ బతుకుతాయి. వాటి జీవితం మొత్తం కులాసాగా సాగిపోతుంది. వేరొక చోట నుండి వెతుక్కోవలసిన పని లేదు. చెట్ల ఆకులను తినే పెద్ద పెద్ద జంతువులు, పురుగులు ఆకసియా చెట్టు ఆకులు తినడానికి రాగానే ఈ చీమలు ఒక్కసారిగా వాటిపైకి దండెత్తుతూవెళ్ళి కరుస్తాయి. ఎంత పెద్ద జంతువైనా పారిపోవల్సిందే !  అలా చీమలు చెట్టుకు రక్షణ కల్పిస్తాయి.

ఉప్పు నీటిలో నివసించే ఒక రకం జాతిచేప క్లౌన్ (clown fish) సి అనెమొన్ (sea anemone) జ్పైన చేరే (invertebrates) తింటూ బతుకుతుంది. క్లౌన్ ఫిష్ వదిలి పెట్టె మలాన్ని తింటూ సి అనెమోన్ పోషకపదార్ధాలు గల ఆహారాన్ని పొందుతుంది. అనెమోన్ తన కొండేలలాంటి గట్టి ముళ్లతో (stinging cells) క్లౌన్ ఫిష్ని దాని శత్రువల నుండి కాపాడుతుంది. క్లౌన్ ఫిష్ అనెమోన్ కొండేలకు అలవాటు పడి పోయి అందుకు కావలసిన నిరోధశక్తిని కలిగి వుంటుంది.

ఈ విధంగా భిన్న జాతులకు చెందిన రెండు ప్రాణులు (organisms) పరస్పర సహకారాలతో అన్యోన్యం గా మెలుగుతూ జీవన భాగస్వామ్య౦ కలిగి వుండడాన్ని ఇంగ్లీషులో (mutualism) అంటారు.

ఆధారం: చాగంటి కృష్ణకుమారి

3.00297619048
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు