పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

ప్లాస్లిక్ సర్జరీ అంటే ?

ప్లాస్టిక్ సర్జరీలో శరీర అవయవ లోపాలను సరిచేయడం, తిరిగి వాటిని అందంగా తీర్చిదిద్దడం జరుగుతుంది.

plasticsurgeryప్లాస్లిక్ సర్జరీ అంటే ఏవో ప్లాస్టిక్ వస్తువులతోనే, ప్లాస్టిక్ పనిముట్లతోనే చేసే ఆపరేషన్ అనుకుంటే పొరపాటే. మరి ప్లాస్లిక్ సర్జరీ అంటే ? ఇది కూడా ఆపరేషన్ లో ఒక భాగమే. ఈ ప్లాస్టిక్ సర్జరీలో శరీర అవయవ లోపాలను సరిచేయడం, తిరిగి వాటిని అందంగా తీర్చిదిద్దడం జరుగుతుంది. దీనినే వైద్య పరిభాషలో ప్లాస్టిక్ సర్జరీ అని అంటారు.

ఈ సర్జరీలో అనేక రకాలు ఉన్నాయి. వాటిలో కొన్ని కాస్మోటిక్ ప్లాస్టిక్ సర్జరీ, మేనేజ్ మెంట్ ఆఫ్ కాన్ జెనిటాల్ డిఫెక్ట్స్, బర్న్ ఊండ్స్ మొదలైన సర్జరీలుగా విభజించారు.

కాస్మోటిక్ సర్జరీలో శరీర అవయవాలను అందంగా తీర్చి మార్చడానికి ఈ సర్జరీని చేస్తారు. దీనిలో ముక్కు, యొక్క ఆకారం, ముఖంలోని ముడతలు, కండ్ల రెప్పలు, కనుబొమ్మల ఆకారాలను పెదవుల ఆకారాలను మరియు స్త్రీల వక్షోజాలను సరిజేసి తిరిగి అందంగా మార్చడానికి చేసే సర్జరీలనే కాస్మోటిక్ సర్జరీస్ అని అంటారు.

పుట్టుకతోనే వచ్చే అవయవ లోపాలను సరిజేసే ఆ భాగాలను సరియైన ఆకారంలోకి మార్చడాన్నే మేనేజ్ మెంట్ ఆఫ్ డిఫెక్ట్స్ అంటారు. ఉదా : తొర్రి పెదవి.

అలా కాకుండా వ్యాధుల వల్ల వచ్చే అవయవ లోపాలు, శరీరాలు కాలిపోవడం, గాయాలు, దెబ్బలు తగలడం, యాక్సి డెంట్స్ మొదలైన వాటి వల్ల ఏర్పడే అవయవ లోపాలను ఈ ప్లాస్టిక్ సర్జరీ ద్వారానే సరిజేసి తిరిగి వాటిని సక్రమంగా పనిచేసేటట్లుగా చేయటం జరుగుతుంది. కొన్ని సందర్భాలలో చెడిపోయిన భాగాలను తొలగించి ఆ ప్రదేశంలో ఆ వ్యక్తి యొక్క ఆరోగ్యవంతమైన భాగం నుండి కండరాలను గాని, రక్తనాళాలను గాని, కణజాలాలను గాని, ఎముకలను గాని వేరుచేసి తిరిగి వాటిని చెడిపోయిన లేదా అవసరమైన చోట జోడించి తిరిగి అందంగా అవయవాలను అమర్చడం జరుగుతుంది.

ఉదాహరణకు ఎవరికైన ప్రమాదంలో చెయ్యి విరిగి వేరుకాబడినది. అనుకోండి. వెంటనే ఆ వేరు కాబడిన ఆ అవయవ భాగాన్ని ఒక పరిశుభ్రమైన పాలిథిన్ సంచిలో వేసి గాలి పోకుండా మూతి బిగించి కట్టువేసి, దానిని ఒక చెక్క పెట్టెలోగాని ఏ ఇతర పెట్టెలో గాని పెట్టి ఐస్ ముక్కలు గాని లేక చల్లని నీటిని పోసి మూత పెట్టాలి. వెంటనే ఆలస్యం చేయకుండా ఆ వ్యక్తిని, ఆ భాగాన్ని హస్పిటల్ కు తీసుకు వెళ్ళాలి. అక్కడ ఉండే ప్లాస్టిక్ సర్జన్లు, డాక్టర్లు విడిపోయిన ఆ భాగాన్ని ఆ వ్యక్తికి ఈ ప్లాస్టిక్ సర్జరీ ద్వారానే అమర్చడం జరుగుతుంది.

ఈ ప్లాస్టిక్ సర్జరీ గురించి 100 సంవత్సరాల క్రితమే మన భారతీయులు. చైనీయులు కూడా పరిశోధన చేయడం జరిగినది. తర్వాత కాలంలో ముక్కు, పెదవులను వాటి ఆకారాలను అందంగా మార్చడంలో వీరు సఫలీకృతులయ్యారు.

ఇక చిట్టచివరిగా చెప్పేది ఏమిటంటే ఈ ప్లాస్టిక్ సర్జరీ వల్ల ప్రమాదశాత్తు అవయవాలు కోల్పోతే సకాలంలో వారికి వైద్యం అందించగల్గినట్లయితే వారు జీవితాంతం అంగవైకల్యం లేకుండా హాయిగా ఆనందంగా జీవించగల్గుతారు. అదృష్టమేమిటంటే ప్రస్తుతం ప్రతీ పట్టణంలోని హాస్పిటల్ లో ఈ ప్లాస్టిక్ సర్జరీ చేసే స్పెషల్ డాక్టర్లు అందుబాటులోఉంటున్నారు.

రచన: సి.హెచ్.పెద్దిరాజు, P.T.C.T.E.College, Warangal.

3.05172413793
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు