অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ఎలా పనిచేస్తుంది?

ఫైర్ ఎక్స్టింగ్విషర్

fire1అపారమైన అస్తినష్టం, ప్రాణనష్టం కలిగించే విపత్తుల్లో అగ్ని ప్రమాదాలు కూడా ఒకటి. కొన్ని ప్రకృతి పరంగా సంభవించేవయితే, మరికొన్ని మానవ తప్పిదాల వల్లే జరిగేవి. వేర్వేరు కర్మాగారాల్లో, బాణాసంచా ఫ్యాక్టరీల్లో, ఇంకా అనేక చోట్ల అగ్ని ప్రమాదాలు జరుగటం మనం చూస్తున్నాం.

భారీ అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ఫైర్ ఇంజన్ల సహాయంతో అగ్ని మాపక దళం మంటలను అదుపు చేయడం జరుగుతుంది. ప్రయోగశాలలు, రెస్టారెంట్లు, షాపులు, భవనాలు, ఇలా చాలా చోట్ల ఎరుపురంగు అగ్నిమాపక పరికరాలు (Fire Extinguishers) ను మనం చూస్తుంటాం. ఎప్పుడైనా ఏ కారణం చేతనైనా అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఈ ఫైర్ ఎక్స్టింగ్విషర్ల సాయంతో మంటలను అదుపు చేసుకుని ప్రాణనష్టం, ఆస్థి నష్టం జరగకుండా కాపాడుకోవచ్చు. కాని అన్ని సందర్భాల్లోను మంటలనార్పేందుకు ఒకేరకం ఎక్స్టింగ్విషర్ పనికిరాదు. మండే వస్తువు వర్గం ఆధారంగా సరైన ఎక్స్టింగ్విషర్ ను వాడాలి. అలా కాకుండా పొరపాటు చేస్తే ప్రాణానికే ప్రమాదం. అగ్ని కీలలు మరింతగా వ్యాపించి ప్రమాదం మరింతగా పెరుగుతుంది. అందుచేతనే, ఈ విషయంలో అందరికీ సరైన అవగాహన అవసరం.

కర్ర, కాగితం, బొగ్గు, సహజవాయువు, పెట్రోల్ _వంటివి మండే స్వభావంను కలిగి ఉంటాయి. ఇవి మండినప్పుడు గాలిలోని ఆక్సిజన్ తో కలిసి నీరు, కార్బన్ డై ఆక్సైడ్, వ్యర్థ వాయువులే కాకుండా ఎక్కువ ఉష్ణాన్ని అంటే వేడిని కూడా ఏర్పరుస్తాయి. మంటలు చెలరేగి చుట్బ వక్కల ప్రాంతాలను భస్మీపటలం చేస్తాయి. అసలు వస్తువులు మండడం వెనుక శాస్త్రీయమైన విషయాలను క్లుప్తంగా తెలుసుకుందాం.

fire2ఏదైనా వస్తువు మండేందుకు మూడు వన వులు/రాశులు ఒకేసారి, ఒకేచోట ఉండాలి. 1. ఇంధనం (అంటే మండే పదార్థం, ఉదా: బొగ్గు), 2. ఆక్సిజన్ (సాధారణంగా చుట్టు ఉన్న గాలి నుంచి), 3. ఉష్ణం. ఈ మూడింటిని అగ్గి త్రిభుజం (Fire Triangle) అంటారు. ఈ మూడూ ఉన్నప్పుడు మంటలు ఏర్పడుతాయి. వీటిలో కనీసం ఒక దానిని తీసివేసినా మంట ఆరిపోతుంది. అంటే త్రిభుజాన్ని ఛేదించాలన్నమాట. ఉదాహరణకు ఎలక్ట్రిక్ సౌ మీదున్న పెనం మీద ఆయిల్ అంటుకుని మంట వచ్చిందనుకొందాం. ముందుగా స్విచ్ ఆఫ్ చేసి వేడి సరఫరాను నిలిపివేయాలి. అప్పటికీ మంట ఆరకపోతే తువ్వాలు/దుప్పటి/గోనెసంచి తడిపి ఆ పెనం మీద జాగ్రత్తగా కప్పాలి. ఇలా చేస్తే మంటకు ఆక్సిజన్ అందకుండా అడు కోవచ్చు. అప్పుడు మంట ఆరిపోతుంది. గుడ్డను తడపకపోతే ఆ గుడ్డ అంటుకుని మరింత ప్రమాదం జరుగుతుంది.

మంటల వర్గీకరణను గురించి ముందుగా తెలుసుకుందాం, మంటలను 5 రకాలుగా వర్గీకరించారు. ఇవి A, B, C, D, K లు. మండే వస్తువు లేదా పదార్థం స్వభావం ఆధారంగా ఈ వర్గీకరణ జరిగింది. వీటికి వేర్వేరు సంజ్ఞలు కూడా ఉన్నాయి.

 • A వర్గం: సాధారణంగా మండే వస్తువులు ఘన స్థితిలో ఉండే కర్ర, కాగితం, గుడ్డ వంటివి ఈ వర్గానికి చెందినవి. ఇవి మండి నప్పుడు బూడిదను ఏర్పరుస్తాయి. ఈ వర్గానికి చెందిన మంటలను అదుపు చేసేందుకు నీరు, నురుగు స్త్రీ, ఏబిసి చూర్ణం, తడి రసాయనం వాడతారు.
 • B వర్గం: మండే ద్రవాలు, వాయువులు అంటే పెట్రోల్, కిరోసిన్, సేంద్రీయ ద్రావణాలు వంటివి ఈ వర్గానికి చెందినవి. ఈ వర్గం మంటలను అదుపు చేసేందుకు నురుగు ప్ర్పే, ఏబిసి చూర్ణం, కార్బన్ డై ఆక్సైడ్ లు ఉపయోగపడతాయి.
 • C వర్గం: పని చేస్తున్న విద్యుత్ పరికరాలు అంటే కంప్యూటర్లు, ఫాక్స్ మెషిన్ మొదలైనవి ఈ వర్గానికి చెందినవి. ఈ మంటలను అదుపుచేసేందుకు ఏబిసి చూర్ణం వాడవచ్చు. నీటిని ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు.
 • D వర్గం: మెగ్నీషియం, లిథియం, టైటానియం వంటి మండే లోహాలు ఈ వర్గానికి చెందినవి. వీటిని అదుపు చేసేందుకు ఏబిసి చూర్ణం, కార్బన్ డై ఆక్సైడ్ వాయువులు ఉపయోగపడతాయి.
 • K వర్గం: వంటింట్లో వంటకు వాడే వంటనూనెలు, కొవ్వులు ఈ వర్గానికి చెందినవి. ఈ మంటలను అదుపుచేసేందుకు తడి రసాయనం (Wet Chemical) ను ఉపయోగిస్తారు.

fire3అగ్గి త్రిభుజాన్ని విచ్ఛిన్నం చేయడం అనే సూత్రం మీదనే ఫైర్ ఎక్స్టింగ్విషర్లు పనిచేస్తాయి. వీటి బాడీ ఉక్కుతో చేయబడి ఉంటుంది. వీటి లోపల సాధారణంగా రెండు వేర్వేరు పదార్థాలుంటాయి. ఒకటి మంటను ఆర్పేందుకు వాడే ఘనపదార్థం, ద్రవం లేదా వాయువు. రెండోది ఎక్కువ పీడనంలో ఉండే ప్రొపెలెంట్, ఇదొక రసాయనం, ఇది ఎక్స్టింగ్విషర్ పైభాగంలో ఏన్ను లేదా లివర్ ను నొక్కినప్పుడు మంటనార్పే పదార్థం చిమ్ముకుంటూ బయటికి వచ్చేలా చేస్తుంది.

ఫైర్ ఎక్స్టింగ్విషర్లు ప్రధానంగా మూడు రకాలు.

 1. వాటర్ ఎక్స్టింగ్విషర్లు: తరుచుగా చాలా చోట్ల వాడబడేవి ఇవే. వీటి బాడీ నిండా నీరు, దానితోపాటు అణచబడి ఉన్న గాలి (ప్రొపెలెంట్) ఉంటాయి. గొట్టం ద్వారా చాలా వేగంగా నీరు మంట మీదికి చిమ్మేలా పొ పెలెంట్ సాయపడుతుంది. మంట నుంచి వేడిని తీసివేయడం ద్వారా ఇదీ మంటను ఆర్పేస్తుంది. విద్యుత్ మంటలనార్పేందుకు వాటర్ ఎక్స్టింగ్విషను ఎప్పుడూ వాడకూడదు.
 2. డ్రో కెమికల్ ఎక్స్టింగ్విషర్: దీని బాడిలో నురుగు లేదాపొడి చూర్ణం ఉంటుంది. అధిక పీడనంతో అణచబడి ఉన్న నైట్రోజన్ వాయువు ప్రొ పెలెంట్ గా ఉపయోగపడుతుంది. వీటిలో వాడే పొడి చూర్ణాన్ని ఏబిసి చూర్ణం అంటారు. ఇది పసుపు రంగులో ఉంటుంది. ఇది సాధారణంగా మోనో అమ్మోనియం ఫాస్పేట్, అమ్మోనియం, సల్పేట్ల మిశ్రమం.
 3. A, B, C వర్గాల మంటలు మూడింటికి ఇది పనిచేస్తుంది

 4. కార్బన్ డై ఆక్సైడ్ ఎక్స్టింగ్విషర్: దీంట్లో ద్రవస్థితిలోని కార్బన్ డై ఆక్సైడ్ ఉంటుంది. సాధారణ ఉష్ణోగ్రతల వద్ద కార్బన్ డై ఆక్సైడ్ ఒక వాయువు కదా. ఇది తాను మండదు.
 5. వస్తువులను తనలో మండనీయదు. దీన్ని ద్రవస్థితిలో నిల్వ చేయాలంటే అత్యధిక పీడనంలో ఉంచాలి. పీడనాన్ని విడుదల చేసినప్పుడు, వాయువు తీవ్రంగా వ్యాకోచిసూ చల్లబడి తెల్లని పొరను చిమ్ముతుంది. ఇది అగ్గి త్రిభుజాన్ని రెండు విధాలుగా ఎదుర్కొంటుంది. ఆక్సిజన్ అందకుండా చేయడం ఒకటైతే, అది చాలా చల్లగా ఉండడం వల్ల మంట నుంచి వేడిని తీసేయడం రెండోది.

  సాధారణంగా మంటలనార్పేందుకు వాడే పొడి రసాయనాలు (Dry chemicals) సోడియం బై కార్బోనేట్, పొటాషియం బై కార్బోనేట్, మోనో అమ్మోనియం ఫాస్పేట్. సోడియం బై కార్బోనేట్ అంటే బేకింగ్ సోడా, ఇది 70 డిగ్రీల సెల్సియస్ వద్ద విఘటనం చెంది కార్బన్ డై ఆక్సైడ్ వాయువును విడుదల చేస్తుంది. ఈ వాయుపు మంటకు ఆక్సిజన్ అందకుండా చేసి దాన్ని ఆర్పివేస్తుంది.

వాటర్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఎలా పనిచేస్తుంది?

 • దీని హాండిల్ మీద ఒక రింగ్ లేదా పిన్ ఉంటుంది. పొరపాటున ఎక్స్టింగ్విషర్ 'ఆన్' కాకుండా ఈ రింగ్ అడ్డుకుంటుంది.
 • ఉక్కుతో చేయబడిన బాడీ లోపల అధిక పీడనంలో ఏ వాయువు ఉంటుంది.
 • ఎక్స్టింగ్విషనర్ చాలా వరకు నీటితో నింపబడి ఉంటుంది.
 • ఒక గొట్టం చాలా వరకు బాడీ లోపలకు ఉండి దాని రెండో భాగం అంటే నాజిల్ బాడీ బయటకు ఉంటుంది.
 • నాజిల్ చివరి ఒక ప్లాస్టిక్ అమరిక ద్వారా నీటిని మంట అడుగుకు చిమ్మేలా చేయవచ్చు.
 • ఎక్స్టింగ్విషర్ ను పనిచేయించడానికి హాండిల్ కు ఉన్న రింగ్‌ను తొలగించి హాండిలను నొక్కాలి.
 • హాండిల్ ను నొక్కితే, ఒక వాల్ఫ్ తెరుచకుని ఒక చిన్న సీలిండర్లో అణచబడి ఉన్న వాయువును విదుదల చేస్తుంది.
 • ఈ వాయువు వెంటనే వ్యాకోచించి ఎక్స్టింగ్విషర్ లోపలి భాగాన్ని నింపుతుంది. నీటిని కిందికి తోస్తుంది.
 • ఇలా కిందికి తోసివేయబడిన నీరు బాడీ లోపల ఉన్న గొట్టంలోకి ఎగబాకి, నాజిల్ గుండా బయటికి వేగంగా చిమ్ముతుంది.

డిజిటల్ కెమెరా

cam1నిన్న మొన్నటిదాకా ఉపయోగించిన ఫిల్మ్ కెమెరాల స్థానంలో ఈ రోజు డిజిటల్ కేమెరాలు వాడుకలోకి వచ్చి ఎంతో పాపులర్ అయ్యాయి. ఏదైనా ఒక దృశ్యాన్ని లేదా ఇమేజ్ ని పట్టుకుని రికార్డు చేసేందుకు పాతరకం ఫిల్ కెమెరాలకు భిన్నంగా డిజిటల్ టెక్నాలజీని డిజిటల్ కేమెరాలు ఉపయోగించుకుంటాయి. అంటే కేవలం అంకెలతో ఏర్పడిన పొడవైన దారాలన్నమాట. క్షణాల్లో ఫోటో తీసి ఇవ్వడమే కాదు తీసిన ఫోటోలను ఎడిట్ చేసేందకు, సెల్ ఫోన్ల ద్వారా వాటిని ఇతరులతో ఇ-మెయిల్ లేదా వెబ్ సైట్లలో పంచుకునేందుకు డిజిటల్ కేమెరాలు వీలు కల్పిస్తున్నాయి అందుకే ఇవి అంత పాపులర్ అయ్యాయి.

సి.డి.లు, డి.వి.డిలు, హెచ్.డి. టివిలు, డి.వి.ఆర్ల వంటి ఎలక్ట్రానిక్ పరికరాలెన్నింటినో మనం ఉపయోగించుకుంటున్నాం. పేరేదైనా ఇవన్నీ ఒకే మౌలికసూత్రం మీద ఆధారపడి పనిచేస్తాయి. మామూలు అనలాగ్ సమాచారాన్ని డిజిటల్ సమాచారంగా మార్పు చేయడమే వీటి ప్రత్యేకత. డిజిటల్ సమాచారం ఒకట్లు (1), సున్నలు (0) లేదా బిట్లు (bits) తో నిండి ఉంటుంది. ఏమైనా టెక్నాలజీలో వచ్చిన * ఈ మార్పు ఒక గొప్ప సాంకేతిక విప్లవానికే తెరతీసింది.

పాతరకం ఫిల్మ్ కెమెరాలు రసాయన, యాంత్రిక ప్రక్రియలతో పనిచేసేవి. వీటికి విద్యుత్‌తో పనిలేదు. కాని డిజిటల్ కెమెరాలు చూడ్డానికి మామూలు కెమెరాల్లాగే ఉన్నా అవి పనిచేసే పద్ధతి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. వీటిలో ఒక కంప్యూటర్ ఉంటుంది. ఇది ఇమేజ్‌లను ఎలక్ట్రానిక్‌గా రికార్డుచేస్తుంది.

cam2టి.వి. తెరమీద బొమ్మని చాలా దగ్గరగా ఎప్పుడైనా చూశారా! ఒకసారి చూస్తే మనకో విషయం అర్ధమౌతుంది. ఆ పిక్చర్ కొన్ని మిలియన్ల అతిచిన్న రంగుచుక్కలు (colored dots) లేదా చతురస్రాలు (squares)తో ఏర్పడిందని. వీటినే పిక్సెల్స్ (pixels) అంటాం. లాప్ టాప్ LCD కంప్యూటర్ స్క్రీన్ మీద కన్పించే ఇమేజ్‌లు కూడా పిక్సెల్తోనే ఏర్పడతాయి. కాని అవి చాలా సూక్ష్మంగా ఉండడం వల్ల మనం గుర్తించలేం. టి.వి. లేదా కంప్యూటర్ స్క్రీన్ మీద ఈ రంగు పిక్సెల్స్ ఒక ఎలక్ట్రానిక్ పరికరం చాలా వేగంగా వెలగడం, ఆరిపోవడం జరిగేలా చేస్తుంది. వేగంగా జరిగే ఈ మార్పుని మన మెదడు గుర్తించకపోవడంతో మనం కదులుతున్న పెద్ద ఇమేజీనే చూస్తాం.

డిజిటల్ కెమెరాలో దీనికి పూర్తిగా వ్యతిరేకంగా జరుగుతుంది. మనం ఫోటో తీస్తున్న దృశ్యం నుంచి వచ్చే కాంతి కెమెరా కటకం మీదికి జూమ్ (200m). అయి కెమెరాలోని సెన్సాను తాకుతుంది. సెన్సార్ డిజిటల్ కేమెరాకు గుండెకాయలాంటిది. ఇది ఇమేజ్ నుంచి వచ్చిన కాంతిని విద్యుత్ ఛార్జిగా మారుస్తుంది. డిజిటల్ కెమెరాల్లో వాడే సెన్సార్లు రెండు రకాలు. చాలావాటిలో చార్టికపుల్డ్ డివైస్ (CCD) సెన్సార్ ను ఉపయోగిస్తారు. కొన్నింటిలో కాంప్లిమెంటరీ మెటల్ ఆక్సైడ్ సెమీకండక్టర్ (CMOS) టెక్నాలజీని ఉపయోగిస్తారు. ఈ రెండు సెన్సార్లు కాంతిని ఎలక్ట్రానులుగా మారుస్తాయి. అప్పుడు పోగుపడిన ఛార్జిని సెన్సార్ గుర్తిస్తుంది. CCD తో పోలిస్తే CMOS సెన్సార్ చిన్నదిగా ఉంటుంది. తక్కువ విద్యుత్తు

ఉపయోగిస్తుంది. మామూలు డిజిటల్ కెమెరాలకన్నా స్మార్ట్ ఫోన్ తక్కువ సైజులో ఉంటుంది. తక్కువ జాగాలో ఎక్కువ భాగాలను అమర్చాలి కాబట్టి చిన్నదిగా ఉండే CMOS సెన్సార్ ను ఉపయోగిస్తారు.

cam3కెమెరా ఇవేజ్ తాలూకు నమాచారాన్ని ఎంత వివరంగా రాబడుతుంది అనే దాన్ని దాని రిజల్యూషన్ అంటారు. దీన్ని పిక్సెల్‌లో చెబుతారు. కెమెరా పిక్సెల్స్ ఎంత ఎక్కువైతే అది తీసే ఫోటో అంత ఎక్కువ నష్టంగా ఉంటుంది. ఫోటోను మరింత పెద్దది (enlarge) చేసినా స్పష్టతలో తేడా రాదు. కెమెరా పిక్సెల్ తక్కువైతే ఇమేజీలో స్పష్టత లోపిస్తుంది. పెద్దది చేస్తే అతికినట్లు లేదా చుక్కలతో కన్పిస్తుంది. ఇప్పుడొస్తున్న స్మార్ట్ ఫోన్లలో 16 mp. 13 mp, 8 mp, 5 mp కెమెరాలున్నాయి,

కలర్ ఫోటోను తీసేందుకు డిజిటల్ కేమెరాలో ప్రత్యేకమైన టెక్నాలజీ ఉంటుంది. సెన్సార్ తనకు చేరే ఇమేజ్ కాంతిని మూడు ప్రాథమిక వర్గాలు (ఎరుపు, నీలం, ఆకుపచ్చుగా ఫిల్టరింగ్ చేస్తుంది. వీటిని తిరిగి మిళితం చేసి పూర్తి కలర్ ఫోటోను ఏర్పరుస్తుంది. ఇలా మూడురంగుల్ని రికార్డు చేసేందుకు కెమెరాకు వేర్వేరు మార్గాలున్నాయి. ఎక్కువ క్వాలిటీ ఉంటే కెమెరాల్లో మూడు వేర్వేరరు సెన్సార్లు, వేర్వేరు ఫిల్టర్లతో ఉంటాయి. కాంతిని ఆయా సెన్సార్లలోకి పంపించేందుకు ఒక బీమ్స్టిటర్ (beam splitter) ఉంటుంది. ఒక సెన్సార్ ఒక నిర్దిష్టమైన ప్రాథమిక వర్షాన్నే గుర్తిస్తుంది. ఈ పద్ధతిని ఉపయోగించే కెమెరాలో సైజులో పెద్దవిగా ఉంటాయి. ఖరీదు కూడా ఎక్కువే. ఇంకో పద్ధతిలో ఒకే సెన్సార్ ఉంటుంది. దానికి ఎదురుగా ఎరుపు, trans నీలం, ఆకుపచ్చ, ఫిల్టర్లను ఒక శ్రేణిలో తిరిగేటట్లు చేస్తారు. సెన్సార్ వెంటవెంటనే మూడు వేర్వేరు. ఇమేజ్‌లను రికార్డు చేస్తుంది. మనకు పూర్తి కలర్ ఇమేజీను అందిస్తుంది. ఈ పద్ధతులు స్టూడియోల్లో వాడే ప్రొఫెషనల్ కెమెరాలకు పనికివస్తాయి. కాని మామూలుగా మనం వాడే చిన్న సైజు డిజిటల్ కేమెరాల్లో బేయర్ ఫిల్టర్ పేటర్స్ (Bayer Filter Pattern) ను ఉపయోగిస్తారు. దీంట్లో సెన్సార్ ను ఎరుపు, నీలం, ఆకుపచ్చ పిక్సెల్స్‌గా విడగొట్టడం జరుగుతుంది. ఎరుపు ఆకుపచ్చల వరస, నీలం, ఆకుపచ్చ ఫిల్టర్ల వరుసలు ఒకదాని తర్వాత ఒకటిగా ఉంటాయి. కాని ఈ పిక్సెల్స్ సమానంగా విడగొట్టబడి ఉండవు. ఎరుపు, నీలం ఫిక్సెల్స్ కలిపితే ఎన్ని ఉంటాయో ఆకుపచ్చ పిక్సెల్స్ అన్ని ఉంటాయి. ఎందుకంటే మన కన్నూ ఈ మూడు రంగుల్ని ఒకే స్థాయిలో గుర్తించలేదు. ఆకుపచ్చను గుర్తించే శక్తి తక్కువ కాబట్టి ఈ రంగు పిక్సెల్స్ ఎక్కువ అవసరం.

సెన్సార్‌ను చేరే కాంతిని నియంత్రించేందుకు డిజిటల్ కెమెరాలో రెండు ఏర్పాట్లు ఉంటాయి. ఒకటి ఎపర్చర్ (aperture). రెండోది షటర్ వేగం (shutter speed), ఎపర్చర్ (తెరిచిన మార్గం గుండా ఎంత కాంతి ప్రవేశిస్తుందనేది షటర్ వేగం మీద ఆధారపడి ఉంటుంది. డిజిటల్ కెమెరాలో డిజిటల్ షటర్ ఉంటుంది. దీన్ని ఎలక్ట్రానిక్‌గా రీసెట్ చేయవచ్చు. డిజిటల్ కేమెరాకు ఉంటే LCD స్క్రీన్ మీద ఇమేజ్ ని చూస్తాం.

డిజిటల్ కెమెరాకు సంబంధించి ప్రాథమిక అవగాహనకు ఈ వివరాలు సరిపోవచ్చును.

ఫ్యాక్స్ మెషిన్

fax1ఫ్యాక్స్ మెషిన్ మీరు చాలా కార్యాలయాల్లోనూ, వాణిజ్య, వ్యాపార సంస్థల్లోనూ చూసే ఉంటారు. ఇంటర్నెట్, ఈ-మెయిల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత సాధారణ ఫ్యాక్స్ మెషిన్లకు కొంత ప్రాధాన్యత తగ్గిందనుకోండి. అయినా, కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లను అంటే లీగల్ డాక్యుమెంట్ల లాంటి వాటిని, వాటికి సంబంధించిన వ్యక్తులకు పంపించేందుకు ఫ్యాక్స్ మెషిన్లు ఇంకా వాడుకలోనే ఉన్నాయి. ఒక డాక్యుమెంట్ ను క్షణాల్లో ఎంతదూరంలో ఉన్న వ్యక్తులకైనా పంపించేందుకు పనికి వస్తున్నాయి. అలాగే తిరిగి వారు పంపించే డాక్యుమెంట్లను అందుకునేందుకు కూడా వీలు కల్గిస్తున్నాయి. కాలక్రమేణా, ఫ్యాక్స్ మెషిన్ టెక్నాలజీ మెరుగుపడి ఆధునికత చోటు చేసుకుంది. కలర్ డాక్యుమెంట్లను కూడా పంపించే వీలుకలిగింది. ఈ-ఫ్యాక్స్, ఇంటర్నెట్ అనేవి, ఫ్యాక్సింగ్ ఆధునికత ఫలితాలే.

సాధారణంగా ఈ ప్యాక్స్ మెషిన్ లో ముఖ్యంగా రెండు భాగాలుంటాయి. ఒకటి డాక్యుమెంట్‌ను పంపించే భాగం (సెండర్ పార్ట్). రెండోది ఎవరైనా పంపించిన డాక్యుమెంట్ ను అందుకునే భాగం (రిసీవర్ పార్ట్).

fax2సెండర్ పార్ట్ ఒక కంప్యూటర్ స్కానర్ మాదిరిగా ఉంటుంది. దీంట్లో ఒక ఛార్జ్డ్-కపుల్డ్ డివైస్ (CCD) ఉంటుంది. ఇది డాక్యుమెంట్ లోని ఒక లైన్ తర్వాత మరో లైన్‌గా నలుపు, తెలుపుల్లో స్కానింగ్ చేస్తుంది. అంటే ప్రతిలైన్లు వేరుగా చూస్తూ నలుపు ప్రాంతాలు, తెలుపు ప్రాంతాలుగా గుర్తిస్తుంది. వీటిని ఫోన్‌లైన్ ద్వారా ధ్వనులుగా లేదా ఒక తరహా విద్యుత్ సంకేతాలుగా పంపిస్తుంది. ఫోన్‌లైన్ ఈ సమాచారాన్ని క్షణాల్లో ఆవలివై వున ఉన్న ఫ్యాన్స్ మెషిన్ కు అంటే రిసీవర్ ఫ్యాక్స్ కు చేరవేస్తుంది. రిసీవర్ ఫ్యాక్స్ ఈ సంకేతాలను అందుకుని డీకోడ్ చేసి ప్రింటర్ కు అందిస్తుంది. రిసీవర్ ఫ్యాక్స్ నలుపు సంకేతం వింటే కాగితం మీద నలుపు చుక్కను గీస్తుంది. తెలుపు సంకేతం వింటే ముందుకు జరిగి ఖాళీ వదులుతుంది. ఇలా ఒక పేజీ డాక్యుమెంట్ ను కేవలం ఒక్క నిమిషం లోనే సెండర్ నుంచి రిసీవర్ కు చేరవేస్తుంది.

అసలు ఫ్యాక్స్ మెషిన్ లోపల ఏం జరుగుతుందో తెలుసుకుందాం. ఒక డాక్యుమెంట్ ను ఫ్యాక్స్ చేయాలనుకోండి. ఆ పేజీని ఫ్యాక్స్ మెషిన్లోని అందుకు నిర్దేశించిన స్థలంలో ఉంచుతాం. దీన్నే ఇన్ పుట్ స్లాట్ అంటారు. ఈ పేజీ అనేక రోలర్ జంటల మధ్యకు లాక్కోబడి క్రిందికి కదులుతుంది. పెద్ద సైజు ఫ్యాక్స్ మెషిన్లలో అనేక పేజీల డాక్యుమెంట్‌ను ఒకదానితర్వాత ఒకటిగా ఆటోమెటిక్‌గా తీసుకునే ఏర్పాటు ఉంటుంది. కాగితం మీద అక్షరాలున్నాయి కదా ! తెల్లని భాగాలు ఎక్కువ కాంతిని పరావర్తనం చేస్తాయి. నల్లటి భాగాలు కాంతిని స్వల్పంగా పరావర్తనం చేయడమో లేదా అసలు ఎమాత్రం చేయకపోవడమో జరుగుతుంది. ఫ్యాక్స్ మెషిన్లో కొన్ని వందల లేదా వేలసంఖ్యలో ఫోటోడయోడ్ సెన్సార్లు ఉంటాయి. fax3అవి డాక్యుమెంట్‌లోని అక్షరాలు ఆదా బొమ్మను కొన్ని తెలుపు, నలుపు చుక్కల సముదాయంగా గుర్తిస్తాయి. నలుపు, తెలుపు చుక్కలు ఫ్యాక్స్ మెషిన్ భాష అన్నమాట. పరావర్తనమైన కాంతి, కాంతిని గుర్తించే CCD లోకి చేరుతుంది. నలుపు తెలుపు చుక్కలుగా అనలాగ్ పద్దతిలో ఉన్న డాక్యుమెంట్‌లోని సమాచారాన్ని CCD డిజిటల్ పద్దతిలోకి అంటే సున్నాలు, ఒకట్లుగా మార్చి ఎలక్ట్రానిక్ సర్క్యూట్‌లోకి అందిస్తుంది. ఈ సర్క్యూట్ డిజిటల్ సమాచారాన్ని టెలిఫోన్ లైన్ ద్వారా ఆవతల వైపున అంటే రిసీవర్ దగ్గర ఉన్న ఫ్యాక్స్ మెషిన్ కు అందిస్తుంది.

అందుతున్న సమాచారాన్ని అక్కడి ఫ్యాక్స్ మెషిన్లోని సర్క్యూట్ ,ఫోన్‌లైన్ ద్వారా తీసుకుని మెషిన్లోనే ఉన్న ప్రింటర్ కు చేరవేస్తుంది. ప్రింట్ చేసేందుకు అవసరమైన కాగితాన్ని మిషన్ లోపల ఉన్న రోల్ నుంచి తీసుకుంటుంది. ప్రింటర్ ఆ కాగితం మీద అవతలి వ్యక్తి పంపిస్తున్న డాక్యుమెంట్‌ను ప్రింట్ చేస్తుంది. ఒక ఆటోమేటిక్ బ్లేడు ఆ పేజీని కత్తిరిస్తుంది. ప్రింట్ అయిన డాక్యుమెంటు బయటి మార్గం ఔట్ పుట్ స్లాట్ ద్వారా బయటికి వస్తుంది.

ఏమైనా ఒక డాక్యుమెంట్‌ను ధ్వని సంకేతాలుగా మార్చడం. దాన్ని తిరిగి డాక్యుమెంట్‌గా మార్చి ఒక చోటనుంచి మరోచోటుకి పంపడం నిజంగా అద్భుతమే కదా.

fax4సాధారణ ఫ్యాక్స్ వెషిన్ లో కొన్ని ఇబ్బందులున్న మాట వాస్తవం. ఇప్పుడు ఫోన్లైస్తో కాకుండా, ఇంటర్నెట్లోను ఉపయోగించుకుని ఫ్యాను పంపించే, అందుకునే మిషన్లు వచ్చాయి. దీన్ని ఉపయోగించడం తేలికే. కానీ, ఫోస్ ఆధారిత ఫ్యాక్స్ మెషినికి భిన్నంగా ఉంటుంది. దీన్ని ఉపయోగించేందుకు ఫోన్‌లైన్ అవసరం లేదు కాబట్టి ప్రింటర్‌ను ఫోన్ జాక్లున్న చోటే పెట్టుకోవాల్సిన పనిలేదు. మనకు కావల్సినచోట పెట్టుకోవచ్చు. మనకిచ్చే ఫ్యాక్స్ నంబర్ స్థానిక సంబర్ కానక్కరలేదు. వేరే దేశానిది కూడా కావచ్చు. ఈ-ఫాక్స్ సర్వీసుతో నెలకు మనం 20 ఫాక్స్లను ఉచితంగా పంపుకోవచ్చు. 20 ఫ్యాక్స్ లను ఉచితంగా అందుకోవచ్చు. అంతకంటే ఎక్కువ అవసరమైతే చందా చెల్లించాలి,

ఫ్యాక్స్ పంపించేందుకు, అందుకునేందుకు ప్రింటర్ ఇంటర్నెట్ కనెక్షన్ ను ఈ-ప్యాక్స్ ఉపయోగించుకుంటుంది. ఒక ఫ్యాక్స్ ను పంపినప్పుడు, అది ఇంటర్నెట్ ద్వారా ఈ-ఫ్యాక్స్ సర్వరోకు వెళుతుంది. ఈ-ఫ్యాక్స్ దీనిని ఒక ప్రామాణిక ఫోన్‌లైన్ ద్వారా అందుకునే వ్యక్తికి చెందిన ఫ్యాక్స్ మెషిన్ కు పంపుతుంది.

ఎ.టి.ఎమ్

june17ఎ.టి.ఎమ్. అంటే ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్, ఇది ఒక కంప్యూటర్ వంటిదే. నగరాలు, పట్టణాలు, పెద్ద గ్రామాలే కాకుండా జనం ఉండే స్థలాల్లో అంటే షాపింగ్ మాల్స్, రెస్టారెంటులు, పెట్రోలు బంక్‌లు, ఎయిర్ పోర్టులు ఇలా చాలా చోట్ల వేర్వేరు బ్యాంకులు ఎ.టి.ఎమ్‌లను మనం ఉపయోగించుకుంటున్నాం. బ్యాంకు ఉద్యోగి అవసరం లేకుండా బ్యాంకు లావాదేవీలు జరుపుకోడానికి ఖాతాదార్లకు (కష్టమర్లకు) ఇవి అవకాశం కన్పిస్తాయి. బ్యాంకు ఖాతా (ఎకౌంట్) నుంచి డబ్బు తీసుకోవడానికి, మదుపు (డిపాజిట్ చేయడానికి, ఎకౌంట్ నిల్వ (బాలెన్సు) వివరాలు తెలుసుకోడానికి బ్యాంకుకు వెళ్ళనవసరం లేకుండానే ఎ.టి.ఎమను ఉపయోగించుకోవాలంటే, కస్టమర్ తన దగ్గరున్న ప్లాస్టిక్ క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డును మేషిన్‌లో చొప్పించాలి. ఎ.టి.ఎమ్. కార్డు మన జేబులో ఉందంటే మన ఖాతాలోని డబ్బు మన జేబుల్లో ఉన్నట్టే. ఎక్కడికి వెళ్ళినా ఆ బ్యాంక్ ఎ.టి.ఎమ్. నుంచే కాకుండా వేరే బ్యాంకు ఎ.టి.ఎమ్. నుంచి కూడా డబ్బును తీసుకోవచ్చు. ఎ.డి.ఎమ్. దగ్గరకు వెళ్ళి కార్డును కార్డురీడర్లో ఉంచి స్క్రీన్ మీద కన్పించే సూచనలు పాటిస్తూ వివరాలను అందిస్తే ఒక్క నిమిషంలోనే డబ్బుతో బాటు రసీదు కూడా చేతికొస్తుంది.

ఎ.టి.ఎమ్.లు ఇంటర్ బ్యాంక్ నెట్వర్క్ లకు కలుపబడి ఉంటాయి. ఈ నెట్వర్క్ లు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేర్వేరు బ్యాంకులను అనుసంధానంగా చేస్తాయి. వీటి ద్వారా కస్టమర్ల ఖాతావివరాలను బ్యాంకులు పరస్పరం పంచుకుంటాయి. కస్టమర్ లావాదేవీని ముందుకు కదల్చాలంటే, ఆ కస్టమర్ బ్యాంకు నుంచి ఎ.టి.ఎమ్. ను అనుమతి రావాలి. డబ్బును తీసుకోవాలంటే, ఆ కస్టమర్ ఖాతాలో తగినంత నిల్వ ఉండాలి కదా, ఈ అనుమతి అందుకుని ఆ లావాదేవీని పూర్తి చేసేందుకు కొన్ని సెకన్ల వ్యవధి సరిపోతుంది.

june18ఎ.టి.ఎమ్.లు అధునాతనమైన హార్డ్ వేర్, సాఫ్టవేర్లతో పనిచేసే కంప్యూటర్ వ్యవస్థలను కలిగి ఉంటాయి. ఎ.టి.ఎమ్‌లో రెండు ఇన్ పుట్ (input), నాలుగు ఔట్ పుట్ (output) సాధనాలుంటాయి. ఎ.టి.ఎమ్ ఒక హూస్ట్ ప్రాసెసర్ (host processor) కు కలుపబడి దాని ద్వారానే పనిచేస్తుంది. ఇది ఒక కేంద్రీయ కంప్యూటర్, ఒక ప్రమాణ ఆపరేటింగ్ సిస్టం. (RMX, OS/2 లేదా మైక్రోసాఫ్ట్ విండోస్) ఇంటర్ బ్యాంక్ నెట్‌వర్క్‌తో కలిసి పనిచేసి హెస్ట్ ప్రాసెసర్ ఆ లావాదేవీని పూర్తి చేసే వీలు కల్పిస్తుంది. హెస్ట్ ప్రాసెసరీను ఒక బ్యాంకు స్వంతంగా నిర్వహించవచ్చు. ఇది బ్యాంకులకు చెందిన మెషిన్లలో అందుబాటులో ఉంటుంది. వ్యాపార సంస్థలు లేదా స్వతంత్రంగా సేవలందించే సంస్థలు హెూస్ట్ ప్రాసెసర్లను స్వంతంగా నిర్వహించుకుంటాయి.

ఎ.టి.ఎమ్ లో ఉండే ఇన్ పుట్ సాధనాలు రెండు. ఇది మెషీన్ కు ఖాతాదారు వివరాలను అందిస్తాయి. ఒకటి కార్డురీడర్, రెండోది కీప్యాడ్, క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు వెనకవైపున వున్న అయస్కాంత పట్టీ (magnetic strip) లో నిక్షిప్తమైన ఖాతా వివరాలను కార్డ్ రీడర్ గ్రహిస్తుంది. హెూస్ట్ ప్రాసెసర్ ఈ సమాచారాన్ని ఉపయోగించుకుని ఆ ఖాతా ఉన్న బ్యాంకుకు అప్పటి వ్యవహారాన్ని చేరవేస్తుంది. ఇక కీపాడ్ కార్ట్ హెల్టర్లు అవసరమైన వ్యవహారం ఎటువంటిదో తెలియజేస్తుంది. అంటే డబ్బు తీసుకునేది కార్డ్ హెరాల్డర్ కీపాడ్ ద్వారానే తెలియజేయాలి. ఇందుకు కార్ట్ హెల్టర్ కస్టమర్ పిన్ (Personal Identification Number - PIN) ను అడుగుతుంది. నాలుగంకెల పిన్ ఒక కోడ్ ' రూపంలో హెస్ట్ ప్రాసెసర్‌కు చేరుతుంది.

june19ఎ.టి.ఎమ్ లో ఉండే ఔట్ పుట్ సాధనాలు నాలుగు. అవి స్పీకర్, డిస్ప్లే స్క్రీన్ (టచ్ స్క్రీన్), రిసీట్ ప్రింటర్, క్యాష్ డిస్పెన్సర్, కీప్యాడ్ మీద ఒక మీట (key) ని నొక్కినప్పుడు కార్డ్ హెరాల్డర్ గ్రహించేలా ఒక శబ్దం స్పీకర్ ద్వారా విన్పిస్తుంది. వివరాలు అడిగే తెర మీద వేర్వేరు దశల్లో ఇవ్వాల్సిన సమాచారం కన్పిస్తుంది. వివరాలు అడిగే తెర మీద వేర్వేరుదశల్లో ఇవ్వాల్సిన అమాచారం కన్పిస్తుంది. ఇదే డిస్ప్లే స్క్రీన్, టచ్ స్క్రీన్ అయితే చూపుడువేలితో టచ్ చేస్తూ అడిగిన సమాచారం ఇవ్వగలం. రిసీట్ ప్రింటర్ లావాదేవీకి సంబంధించిన కాగితపు రసీదును ముద్రించి అందజేస్తుంది. ఇక క్యాష్ డి స్పెన్సర్ (cash dispenser) ఎ.టి.ఎమ్ కు గుండెకాయ లాంటిది. ఇది కార్డ్ హెల్టర్ అడిగిన డబ్బును అందిస్తుంది. ఇది ఒక ఖజానా లేదా ఇనప్పెట్టె అనుకుందాం. ఇది ఎ.టి.ఎమ్ అడుగుభాగంలో ఉంటుంది. దీంట్లోనే కరెన్సీ నోట్లు ఉంటాయి. కస్టమర్‌కు అందచేసే డబ్బు లేదా కస్టమర్ డిపాజిట్ చేస్తే డబ్బు ఇందులోకే చేరుతుంది. క్యాష్ డిస్పెన్సర్లె ఒక విద్యుత్ నేత్రం (electric eye) ఉంటుంది. ఇది మెషిన్ నుంచి బయటికి వచ్చే ప్రతి కరెన్సీ నోట్లను లెక్కపెడుతుంది. దీనితో బాటు ఒక సెన్సార్ కూడా ఉంటుంది. ఇది ఆ నోట్ల మందాన్ని గుర్తిస్తుంది. రెండు నోట్లు అతుక్కుపోయి వుంటే మందంలో తేడా వస్తుంది. ఈ తేడాను సెన్సార్ గుర్తిస్తుంది. వాటిని కస్టమర్ కు అందించకుండా మెషీన్‌లోనే ఉన్న ఒక బుట్టలోకి తోసివేస్తుంది. దీన్నే రిజెక్ట్ బిన్ (reject bin) అంటారు. కరెన్సీ నోట్లు బాగా నలిగినా, చిరిగినా లేదా ముడతలు పడినా కూడా అవి రిజెక్ట్ బిన్లోకే పోతాయి. ఒక లావాదేవీకి సంబంధించిన సమాచారం ఒక జర్నల్‌లో నమోదవుతుంది. ఈ జర్నల్ను నిర్దిష్ట కాలవ్యవధుల్లో ముద్రించి రెండేళ్ళపాటు భద్రపరుస్తారు. ఎప్పుడైనా ఒక లావాదేవీకి సంబంధించి ఏదైనా వివాదం తలెత్తితే ఈ జర్నల్‌లోని వివరాలు తోడ్పడతాయి.

రోబో

aug10రోబో సినిమాలో చిట్టి ఎన్ని అద్భుతమైన పనులు చేసిందో, ఎంత జ్ఞాపకశక్తిని ప్రదర్శించిందో మనమంతా చేశాం. ఇలాంటి రోబోలు లేదా మర మనుషులు చాలా పనుల్ని తమంతతాముగా చేయగలవు. ఇందుకు మనుషుల నియంత్రణ కొద్దిగా ఉండొచ్చు లేదా ఏమాత్రం ఉండకపోవచ్చు. మనుషులకున్నట్లే చాలా లక్షణాలు ఈ రోబోలకు కూడా ఉంటాయి. ముఖ్యంగా చాలా రోబోలకు కదల్చడానికి వీలయ్యే శరీరం ఉంటుంది. డజన్లకొద్దీ కదిలే భాగాలు లోహం లేదా ప్లాస్టిక్ తో చేయబడి ఉంటాయి. మన శరీరంలో ఎముకలు కలపబడినట్లే రోబోలోని వేర్వేరు భాగాలు జాయింట్ లతో కలపబడి ఉంటాయి. ఈ భాగాలను కదిల్చేందుకు శక్తి అవసరం కదా, ఇందుకు ఆక్టుయేటర్స్ ఉపయోగపడతాయి. ఇవి విద్యుత్ మోటారు. సాలినాయిడ్లు కావచ్చు. కొన్ని రోబోలు హైడ్రాలిక్ వ్యవన ను మరికొన్ని సంపీడ్య వాయువులను (compressed gases) ఉపయోగించుకుంటాయి. రోబోలో తన పరిసరాలకు సంబంధించిన సమాచారం గ్రహించేందుకు సెన్సార్ లు ఉపయోగపడతాయి. ఈ సమాచారం రోబో ప్రవర్తనకు వీలుకల్గిస్తాయి. కెమెరాలు రోబో పరిసరాలను చూసేలా సాయపడతాయి. పరిసరాల్లో ఉన్న వస్తువుల రంగు, ఆకృతి, సైజు, దూరం వంటి లక్షణాలు అర్థమవుతాయి. ధ్వనులను గుర్తించేందుకు మైక్రోఫోన్ లు సాయపడతాయి. కొన్ని రోబోల్లో ధర్మామీటర్లు, బెరామీటర్లు కూడా ఉంటాయి. ఉష్ణోగ్రత, పీడనంలను గ్రహించేందుకు ఇవి తోడ్పడతాయి. ఇవేకాకుండా మరెన్నో క్లిష్టమైన సెన్సారీలు కూడా ఉంటాయి. లైట్ డిటెక్షన్ అండ్ రేంజింగ్ (LIDAR) సెన్సార్‌లో పరిసరాల 3D మ్యాప్‌లను చిత్రీకరిస్తాయి. ఇవి లేజర్ ను ఉపయోగించుకుంటాయి. లేజర్ అవసరం లేని సూపర్ సానిక్ సెన్సార్లు అధిక ఫ్రీక్వెన్సీ ధ్వనులను ఉపయోగించుకుంటాయి. కొన్ని రోబోల్లో ప్రత్యేకమైన సెన్సార్లు ఉంటాయి. ఆక్సెలరోమీటర్లు, మేగ్నెటోమీటర్లు ఇలాంటివే.

రోబోలో అసలు పనిచేసే భాగాలను ఎఫెక్టర్స్ (effectors) అంటారు. రోబోలోని కంప్యూటర్ సాయంతో నియంత్రించే సాధనాలు ఇవి. రోటో చేతికి ఉండే గ్రిప్పర్ దేనినైనా పట్టుకునేందుకు తోడ్పడుతుంది. సుత్తులు, స్క్రూడైవర్లు, లైట్లు వంటి సాధనాలు ఎన్నో రోబోలో ఉంటాయి. మెడికల్ రోబోలు సర్జరీకి అవసరమైన ప్రత్యేకమైన పనిముట్లు కలిగి ఉంటాయి. రోబో మనతో మాట్లాడేందుకు, ఇతర శబ్దాలను పుట్టించేందుకు 'స్పీకర్లు' ఉంటాయి.

aug11రోబోలోని నియంత్రణ వ్యవస్థలు (Control Systems), మెదడు (brain) లాగా పనిచేస్తాయి. రోబో ప్రవర్తనను ఇవే నియంత్రిస్తాయి. కొన్ని ముందుగానే ప్రోగ్రామ్ చేయబడిన (pre programmed) రోబోలు. ఇవి ఒకే పనిని మళ్ళీ మళ్ళీ చేస్తాయి. వీటికి నియంత్రణ పెద్దగా అవసరం ఉండదు. మరి కొన్ని స్వయంప్రతిపత్తి రోబోలు (autonomous robots) ఇవి క్లిష్టమైన పనులను నిర్వర్తిస్తాయి. తమ పరిసరాల్లో మారుతున్న పరిస్థితులను పసిగట్టి వాటికి తగినట్లుగా పనితీరును మార్చుకుంటూ వనిచేస్తాయి. ఇందుకు నియంత్రణ వ్యవస్థలు రోబతోడ్పడతాయి.

అంగారక గ్రహం అన్వేషణకు నాసా ప్రయోగించిన రోవర్లు 'స్పిరిట్', 'ఆపర్ట్యూనిటీ' కూడా రోబోలే. ఇవి తమతో సుత్తులు, పారలు, మాస్ స్పెక్ట్రోమీటర్ వంటి పనిముట్లను అరుణ గ్రహం మట్టిని విశ్లేషించేందుకు తమతో కూడా తీసుకెళ్ళాయి.

రోబో అనే మాట ‘రోబోటా' అనే చెక్ పదం నుంచి వచ్చింది. దీని అర్థం బలవంతంగా పనిచేయడం (forced labour) చాలా రోబోల విషయంలో ఇది నిజమే. ప్రపంచవ్యాప్తంగా ఫాక్టరీలు, పరిశ్రమలు వంటి చోట్ల బరువు పనులు చేసేందుకు రోబోలు రూపొందించబడ్డాయి. ఇలాంటి చోట్ల కొన్ని పనులు మనుషులు చేయాలంటే చాలా క్లిష్టమైనవే కాకుండా ప్రమాదంతో కూడుకుని ఉంటాయి. ఈ 'రిస్క్’ ను తప్పించుకోడానికి రోబోలను ఉపయోగిస్తారు. రోబోల చేతులు యాంత్రికమైనవే కాబట్టి ఇలాంటి పనులకు అవి పనికొస్తాయి. ఈ చేతులకు ఎన్నో పనిముట్లు లేదా సాధనాలు ఉంటాయి. వేటినైనా పట్టుకునేందుకు గ్రిప్పర్లు, అలాగే డ్రిల్లింగ్,  కటింగ్, వెల్డింగ్, పెయింటింగ్ వంటి రకరకాల పనులను రోబో తన చేతులతో చేస్తుంది. రోబో మనుషుల్లాగే రోబో ఆట వస్తువులు కూడా చాలా పాపులర్ అయ్యాయి. రోబోలో ఉండే సెన్సార్లు ధ్వనికి, ఒక్కొక్కప్పుడు స్పర్శకు కూడా స్పందిస్తాయి. కొన్ని రోబోలు మాటలను కూడా అర్ధం చేసుకుంటాయి. జంతువుల ఆకారాల్లో ఉండే ఆటవస్తువులు సరళమైన కృత్రిమ మేధస్సుతో పని చేస్తాయి. రోబోడాగ్స్, రోబోరెప్టైల్ ఇలాంటివే.

మరింత ముందుకుపోయి ఇంకా అధునాతనమైన రోబోలను అంటే మనుషుల్లాగా చూడడం, వినడం, నేర్చుకోవడం, స్వంతంగా నిర్ణయాలు తీసుకోవడం వంటి లక్షణాలుండే వాటిని సృష్టించేందుకు శాస్త్రజ్ఞులు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి ఒక అధునాతనమైన మరమనిషిని జపాన్ కు చెందిన హెూండా కంపెనీ తయారుచేసింది. దీని పేరు ఆసిమో (ASIMO) అంటే అడ్వాన్స్డ్ స్టెప్ ఇక ఇన్నోవేటివ్ మొబిలిటీ ఇది ఒక నల్లటి మోపును నడుముకు బిగించుకున్న ఒక అంతరిక్ష నావికుడులాగా ఉంటుంది. ఆసిమో నడుస్తుంది. మాట్లాడుతుంది. బరువుల్ని మోస్తుంది, పరిచయస్తుల్ని గుర్తిస్తుంది. పేరుతో పిలిస్తే పలుకుతుంది. స్వతహాగా నడవడమే కాదు, మేడ మెట్లను కూడా ఎక్క గలిగిన మొట్టమొదటి రోబో ఇదే. రోబో నిర్మాణంలో ముఖ్యమైనది దాని చేయి. ఇది సాధారణంగా 7 లోహభాగాలతో చేయబడి అరు జాయింట్లతో కలపబడి ఉంటుంది. ప్రతి జాయింట్ కు కలపబడిన స్టెప్ మోటార్స్ ను ఒక కంప్యూటర్ పనిచేయిస్తుంది. చేయి నిర్దేశించిన విధంగా ఏమాత్రం పొరపాటు లేకుండా కదిలే విధంగా కంప్యూటర్ నియంత్రిస్తుంది. ఒక కార్లు తయారుచేసే కంపెనీలో కంప్యూటర్ ఆర్మ్ (computer arm) చాలా ముఖ్యమైన సాధనం, నిజానికి ఇది ఆ కంపెనీ ఉన్న చోట ఒక పరిమితమైన ప్రదేశంలో పనిచేస్తుంది. ఇలాంటి రోబోను నిర్మించడం తేలికే. కాని భూమికి బయట వేరే గ్రహం మీదనో లేదా మరెక్కడైనా పనిచేసే రోబోను నిర్మించడం చాలా కష్టం. ముఖ్యంగా ఇలాంటి రోబోలకు కదలిక వ్యవస్థను ఏర్పాటు చేయడం చాలా ఇబ్బంది. రోబో సాఫీగా ఉండే ప్రాంతంలోనైనా, గతుకుల మార్గం మీదనైనా సంచరించాలంటే వాటికి కదిలే చక్రాలను లేదా టైర్లను అమర్చాలి. వీటి కన్నా కాళ్ళను అమర్చడమే తేలిక అని కొందరు భావన. రోబోలకు కృత్రిమ మేధస్సును అందించడానికి సంబంధించి తర్జన భర్జనలు జరుగుతున్నాయి.

వాకీ - టాకీ

sep16ఈ రోజుల్లో సెల్ ఫోన్లు బాగా వాడుకలోకి వచ్చాయి. కాని సెల్ ఫోన్ పనిచేయాలంటే దగ్గరలోని సెట్ టవర్ నెట్ వర్క్ పరిధిలో ఉండాలి. అడవులు, కొండలు, మారుమూల ప్రాంతాలు మొదలైన చోట్ల సాధారణంగా సెల్ ఫోన్ సిగ్నల్స్ ఉండవు. అటువంటి చోట్ల ఒక బృందంలోని సభ్యుల మధ్య వైర్లేస్ కమ్యూనికేషన్స్ కు వాకీ -టాకీలు బాగా ఉపయోగపడతాయి.

వాకీటాకీలు చేతిలో పట్టుకుని ఎక్కడికైనా తీసుకుపోవడానికి వీలయ్యే రేడియోలు. ఇవి మన ఇళ్ళలో వాడే కార్ట్ లెస్ ఫోన్ హాండ్ సెట్‌లా ఉంటాయి. వీటి బరువు 100 - 200 గ్రా. ఉంటుంది. తక్కువ బరువుతో తేలిగ్గా ఉండడం వల్ల వీటిని పట్టుకెళ్ళడం సులభం. ఇవి 5 - 10 చ.కి.మీ. రేంజిలో పనిచేస్తాయి. వీటి బ్యాటరీలు సుమారు 20 గంటలు పనిచేస్తాయి, ఈ బ్యాటరీలను రీచార్జి చేసుకోవచ్చు. వాకీ-టాకీలు సాధారణంగా 8 నుంచి 25 చానెల్స్ ను కలిగి ఉంటాయి. ఇవి నిర్దిష్టమైన రేడియో ఫ్రీక్వెన్సీలలో వనిచే స్తాయి. సాధారణ ప్రజలు ఉపయోగించుకునేందుకు కేటాయించిన ఫ్రీక్వెన్సీలను FRS (Family Radio Service), GMRS (General Mobile Radio Service) అంటారు. ఇవి 460 MHz రేంజిలో పనిచేస్తాయి. వ్యాపాల వర్గాల వారి కోసం కేటాయించిన ఫ్రీక్వెన్సీలను బిజినెస్ బాండ్ అంటారు. ఏదైనా ఒక ఛానెల్ ను ఉపయోగిస్తున్నప్పుడు ఆ క్షణంలో వాకీ-టాకీ పనిచేసే రేంజిలో ఉంటూ అదే ఛానెల్లో మాట్లాడుతున్న వారి మాటలు వినగలం. అడవుల్లో గాలింపు చర్యలు చేపట్టే సైనికులు లేదా పోలీసులు, పర్వతారోహకులు, తమ బృందంలో ఒకరితో ఒకరు మాట్లాడుకునేందుకు, సమాచారం అందించుకునేందుకు వాకీ టాకీలు బాగా ఉపయోగపడతాయి.

వాకీ -టాకీని వాడడం చాలా సులభం. ఇతరులతో మాట్లాడాలనుకున్న ప్రతిసారి నంబర్ డయల్ చేయాల్సిన పనిలేదు. వాకీ-టాకీ రేంజిలో ఉన్న ఇతర వ్యక్తులతో మాట్లాడాలనుకుంటే PTI (Push to talk) బటన్ ను నొక్కాలి. అప్పుడు రిసీవర్ టర్న్ ఆఫ్ (turn off) అయి, ట్రాన్స్ మీటర్ ఆన్ (on) అవుతుంది. ఏకకాలంలో సందేశాలను పంపించడం, స్వీకరించడం  సాధ్యం కాదు. అంటే మనం వాకీటాకీని వాడే సమయంలో మాట్లాడడమో, వినడమో ఏదో ఒకటి మాత్రం చేయగలం,

బటన్ ను నొక్కి మాట్లాడడం అయిపోయిన తర్వాత ఓవర్ (over) అని చెప్పి బటనను రిలీజ్ చేసే అవతలి వ్యక్తి మాటలు మనకు విన్పిస్తాయి. మాట్లాడుతున్నప్పుడు ఆ మాటల్ని వాకీ-టాకీ రేడియో సంకేతాలుగా మార్చి ప్రసారం చేస్తుంది. ఈ సంకేతాలు విద్యుదయస్కాంత వర్ణపటంలో భాగమే కాబట్టి కాంతి వేగంతో అంటే సెకనుకు 299,338 కి.మీ. వేగంతో ప్రయాణిస్తాయి. వాకీ-టాకీ రేంజిలో అదే ఛానల్లో ఉన్న ఇతర వాకీటాకీలు ఈ సంకేతాలను గ్రహిస్తాయి. స్పీకర్ ద్వారా ఈ మాటలు బిగ్గరగా పక్కనున్న వారికి కూడా విన్పించేలా ఉంటాయి.

sep17వాకీ-టాకీలో ప్రధానంగా స్పీకర్, మైక్రోఫోన్, బ్యాటరీ, ఆంటెనా, సర్క్యూట్ అమరిక, PIT బటన్, ఆన్-ఆఫ్ స్విచ్, వాల్యూమ్ కంట్రోల్, LCD డిస్ప్లే వంటి భాగాలుంటాయి. ఆంటెనా రేడియో తరంగాలను పంపించడం, స్వీకరించడం చేస్తుంది. LCD డిస్ప్లే ఛానెల్ నంబర్, బ్యాటరీ ఎంత సేపు పనిచేస్తుంది , మొదలైన సమాచారాన్ని చూపిస్తుంది. మెను బటన్ సాయంతో సెట్టింగ్స్ మార్చుకోవచ్చు. సాధారణంగా స్పీకర్, మైక్రోఫోన్ పక్కపక్కనే ఉంటాయి. ఒకే ఛానెల్ దగ్గరలో ఉండే వేర్వేరు బృందాల వారు ఉపయోగిస్తుంటే ఒకేసారి చాలా సిగ్నల్స్ వస్తాయి. అప్పుడు ఒక బృందంలోని సభ్యుల సంభాషణల్లోకి ఇతరుల మాటలు చొరబడి అసౌకర్యం కలుగుతుంది. కొన్ని వాకీ-టాకీల్లో అనవసర సిగ్నల్స్ ను ఫిల్టర్ చేసే సదుపాయం కూడా ఉంటుంది.

కొన్ని వాకీ-టాకీల్లో శాడిస్పీకర్, మైక్రోఫోస్లాగ కూడా పనిచేస్తుంది. PIT బటన్ నొక్కినప్పుడు స్పీకర్ మైక్రోఫోన్ లాగ పనిచేయడం ప్రారంభిస్తుంది. అంటే లౌడ్ స్పీకర్ మైక్రోఫోన్ 'ఇంటర్‌కమ్' (intercom) లాగ పనిచేస్తుంది. స్పీకర్, మైక్రోఫోన్ రెండింటిలోను ముఖ్యమైన భాగాలు సమానం. ఇవి ఒక తీగ చుట్ట, ఒక అయస్కాంతం, సిగ్నల్స్ ని స్వీకరించడం లేదా ఏర్పరచడం చేసేందుకు కాగితం లేదా ప్లాస్టిక్ కోన్ విద్యుత్ వలయాన్ని 'స్విచ్ ఆన్ చేసి కరెంట్ ను వెనక్కి మళ్ళించడం (reverse) ద్వారా స్పీకర్, మైక్రోఫోన్లు కలిసి ఉండేలా ఏర్పాటు చేస్తారు. మోటారోలా వంటి కొన్ని మోడల్స్ లో లౌడ్ స్పీకర్, మైక్రోఫోన్ వేర్వేరుగా ఉంటాయి.

ఎయిర్ ప్యూరిఫయర్

dec13ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో నగరాల్లో గాలి కాలుష్యం ఒక సమస్యగా మారిపోయింది. నవంబర్ రెండో వారంలో మనదేశ రాజధాని ఢిల్లీలో స్మాగ్ పరిస్థితులు ఏర్పడి ప్రజాజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. ఇల్లు విడిచి బయటికి రాలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. రోడ్లపై వాహనాలు తిరగలేదు. పాఠశాలలకు చాలా రోజులు శెలవులు ప్రకటించారు. గుండె జబ్బులు, ఊపిరితిత్తుల వ్యాధులున్న వారు ఇళ్ళలోనే ఉండిపోవాలని డాక్టర్లు సలహా ఇచ్చారు. మాస్క్‌లకు, ఎయిర్ ప్యూరిఫయర్స్ (గాలిని శుభ్రం చేసే యంత్రాలు)కు గిరాకీ ఏర్పడింది. అసలు ఏం జరిగింది? మోటారు వాహనాలు, ఫ్యాక్టరీలు విడిచిపెట్టే వ్యర్ధ వాయువులకు దీపావళి బాణసంచా తోడయింది. గాలిలో కార్బన్ డై ఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్లు, సల్ఫర్ డై ఆక్సైడ్ తో బాటు దుమ్ముకణాలు, పొగమంచు తోడయ్యాయి. స్మాగ్ పరిస్థితులు ఏర్పడి ఊపిరితీసుకోవడం కష్టమైపోయింది. సాధారణంగా గాలిలో 10 మైక్రాన్ల (ఒక మైక్రాన్ = 10-6 మీ) సైజు ధూళికణాలు (particulate matter) 100 దాకా ఉండవచ్చును. కాని ఢిల్లీలో వీటి స్థాయి 100 నుంచి 1700 దాకా పెరిగిపోయింది. ఇంతకంటే చిన్న సైజు కణాలు నేరుగా ఊపిరితిత్తులలోకి పోయి అక్కడ తిష్టవేస్తాయి. ఎన్నో శ్వాస వ్యాధులకు కారణమవుతాయి. ఇక కళ్ళు మంటలు సరేసరి. ఈ పరిస్థితుల్లో ఇళ్ళల్లో సైతం గాలిని శుభ్రం చేసుకునేందుకు ఎయిర్ ఫ్యూరిఫైయర్స్ కు గిరాకీ ఏర్పడింది. ఫిలిప్స్, అట్లాంటా, పనాసోనిక్, కెంట్ ఆవురా, యురేకా ఫోర్టిస్ వంటి కంపెనీల ఎయిర్ఫిల్టర్లు వేర్వేరు సైజుల్లో రూ. 12,000 నుండి రూ. 40,000 దాకా ధర పలికాయి.

ఎయిర్ ప్యూరిఫైయర్ లేదా ఎయిర్ క్లీనర్ ఎలా పనిచేస్తుంది? ఈ పరికరంలో ఫిల్టర్ అనేది ముఖ్యమైనది. ఈ ఫిల్టర్ లో ఫోమ్, దూది, ఫైబర్ గ్లాస్ లేదా సంక్షేషిత ఫైబర్లను వాడతారు. ఈ ఫిల్టర్ పదార్థం సాంద్రత ఆ ఫిల్టర్ తనగుండా పోనిచ్చే ధూళికణాల సైజును నిర్ణయిస్తుంది. అంతకంటే పెద్ద సైజు కణాలను అడ్డుకుని గాలి నుండి తొలగిస్తుంది. ఈ ఫిల్టర్ ల ఖరీదు ఎక్కువ. వీటిని తరచుగా మారుస్తుండాలి. కాని కొన్ని ఫిల్టర్లను వాషింగ్ చేసుకునే వీలుంటుంది.

dec14ఫిల్టర్లలో రకాలున్నాయి. HEPA (హై-ఎఫిసియన్సీ పార్టిక్యులేట్ అరెస్టెన్స్) అనేది ఒక రకం ఎయిర్ ఫిల్టర్. ఇది అమెరికా ప్రభుత్వపు ప్రమాణాల కనుగుణంగా పనిచేస్తుంది. గాలిలోని అతి సూక్ష్మ ధూళికణాలను అంటే 0.3 మైక్రాన్ సైజు కణాలను కూడా తొలగిస్తుంది. మన తలవెంట్రుక వ్యాసం సుమారు 50 నుంచి 150 మైక్రాన్లు ఉంటుంది. దీన్ని బట్టి ఆలోచిస్తే, HEPA ఫిల్టర్ గాలి నుంచి తొలగించే దుమ్ముకణాల సైజు ఎంత తక్కువో అర్ధమవుతుంది. ఎయిర్ కండీషనర్‌లోని ఫిల్టర్ మాదిరిగా హెపా(HEPA) ఫిల్టర్ తోబాటుగా ఒక ఫ్రీఫిల్టర్ (Prefilter)కూడా ఉంటే అది ముందుగా గాలిలోని పెద్ద సైజు కణరూప పదార్థాలను అంటే 10 మైక్రాన్లు అంతకన్న పెద్దవి తొలగించి ఆ గాలిని హెపాఫిల్టర్ గుండా పంపిస్తుంది. ఇది 2.5 మైక్రాన్ - 0.3 మైక్రాన్ సైజు ధూళికణాలను తొలగిస్తుంది. ఫ్రీఫిల్టర్ వల్ల హెపాఫిల్టర్ మన్నిక పెరుగుతుంది. ఈ హెపాఫిల్టర్లను ధూళి ఎక్కువగా వచ్చే భారీ పరిశ్రమలు, అణువిద్యుత్ కేంద్రాల్లో ఉపయోగిస్తారు. ULPA (ఆల్ట్రా లోపెనిట్రేషన్ ఎయిర్) ఫిల్టర్లు ఇంకా సమర్ధంగా పనిచేస్తాయి. ఇవి ఇంకో రకం ఫిల్టర్లు.

అయోనైజింగ్ ఫ్యూరిఫైయర్లు అనేవి ఎయిర్ ఫ్యూరిఫైయర్లలో మరో రకం. ఇవి కరోనా డిశ్చార్జి అనే పద్ధతిలో ధూళికణాలను అయాన్లుగా మారుస్తాయి. గాలిలో ఉండే ధూళికణాలు విద్యుదావేశం పరంగా తటస్థంగా (neutral) ఉంటాయి. వీటి పరమాణువుల్లో ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు సమానసంఖ్యలో ఉంటాయి. కరోనా డిశ్చార్జి అనేది ఒక బలమైన విద్యుత్ క్షేత్రం. కలుషితమైన గాలిని దీనిగుండా పంపిస్తే ధూళికణాలు ఒక ఎలక్ట్రాన్ ను గ్రహించి ఆనయాన్ గా  (అంటే రుణావేశం గల) అయాన్ గా మారతాయి లేదా ఒక ఎలక్ట్రాన్ ను కోల్పోయి కేటయాన్ (అంటే ధనావేశం గల) అయాన్ గా మారతాయి లేదా ఒక. ఎయిర్ ప్యూరిఫైయర్ లోపల రెండు లోహపు పలకలు ఉంటాయి. ఒకటి ధనావేశం, రెండోది రుణావేశం కలిగి ఉంటాయి. ఇవి గాలి నుంచి వాటికి విరుద్ధ ఆవేశాలున్న అయాన్లను గ్రహించడం ద్వారా వాటిని తొలగిస్తాయి. అలాగే విరుద్ధావేశాలున్న గాలికణాలు ఒకదానితో ఒకటి అతుక్కుని బరువెక్కి గాలి నుంచి వేరుపడతాయి.

dec15కొన్ని ఎయిర్ ఫ్యూరిఫయర్స్ లో గాలి నుంచి వాసనలు, రసాయనాలు, పొగలను తొలగించేందుకు అధిశోషకాలను (adsorbants) వాడతారు. సాధారణంగా ఉత్తేజిత బొగ్గు (activated charcoal) ఇందుకు ఉపయోగపడుతుంది. ఇది రంధ్రయుతం (porous) గా ఉంటుంది. దీంట్లోని రంద్రాల్లో పెద్ద సైజు ధూళికణాలు అతుక్కుపోతాయి. స్థిర విద్యుదాకర్షణ బలాల వల్ల కొన్ని కణాలు రంద్రాల్లోకి లాక్కోబడతాయి. కొన్ని పదార్థాలు బొగ్గుతో రసాయనికంగా చర్య జరిపి దానికి బంధించబడతాయి.

కొన్ని ఎయిర్ ఫ్యూరిఫైయర్స్ లో అల్ట్రావయోలేట్ (UV) కాంతి జనకం ఉంటుంది. ఫిల్టర్ గుండా బయటికి పోయేగాలి UV కాంతికి గురి అయినప్పుడు దానిలోని హానికర బాక్టీరియా, వైరస్ లు నశిస్తాయి.

ఎయిర్ ఫిల్టర్ లో ఒక పంకా శక్తివంతమైన మోటార్ సహాయంతో తిరుగుతుంది. ఇది గాలిని లోనికి లాక్కుంటుంది. ఫ్యూరిఫైయర్ రకాన్ని బట్టి దానిలోపల వేర్వేరు ఫిల్టర్లు ఉంటాయి. ప్రీఫిల్టర్, హెపాఫిల్టర్, కార్బన్ ఫిల్టర్, UV కాంతి జనకం ఇలా వేర్వేరు ఫిల్టర్ల గుండా కలుషితమైన గాలి పోయినప్పుడు గాలిలోని ధూళికణాలు, వాయువులు పుప్పొడి రేణువులు, బాక్టీరియా, వైరస్లు తొలగించబడతాయి. స్వచ్ఛమైన గాలిని ఒక పంకా ఫ్యూరిఫయిర్ నుంచి గదిలోపలికి పంపిస్తుంది.

గ్యాస్ స్టౌ

oct16కట్టెల పొయ్యి లేదా కుంపటిని వంట చేసుకోవడానికి, ఇతర అవసరాలకు వాడడం ఎంతో ఇబ్బందిని, అసౌకర్యాన్ని కలిగిస్తుంది. పొగ వల్ల ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు కూడా వస్తాయి. కాని ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో కూడా గ్యాస్ స్టౌలు వాడుకలోకి రావడంతో చాలా ఇబ్బందులు తొలగిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో పైప్ లైన్ ల ద్వారా ఇంటింటికి సరఫరా చేసే సహజ వాయువును గ్యాస్ స్టౌలకు ఇంధనంగా వాడతారు. చాలా ప్రాంతాల్లో గ్యాస్ సిలిండర్ల ద్వారా ఎల్.పి.జి.ని గ్యాస్ కంపెనీలు సరఫరా చేస్తున్నాయి. వీటిని వంటింటిలో గ్యాస్ స్టౌలకు, పరిశ్రమల్లో, ప్రయోగశాలల్లో గ్యాస్ బర్నర్లకు ఇంధనంగా ఉపయోగిస్తున్నాం. ఎల్.పి.జి. అంటే లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్, చమురు మంత్రిత్వశాఖ లెక్కల ప్రకారం ప్రస్తుతం మనదేశంలో సుమారు 16 కోట్ల ఎల్.పి.జి. కనెక్షన్స్ ఉన్నాయి.

గ్యాస్ స్టాల వల్ల ఎంతో సౌకర్యం ఉన్న మాట వాస్తవమే అయినా, వాటి వల్ల కలిగే ప్రమాదాలను గురించి మనం తరచుగా వింటూనే ఉన్నాం. వినియోగదారుల్లో ఎల్.పి.జి. స్టాకు సంబంధించిన సాంకేతిక అవగాహన లోపించడం, దానిని సక్రమంగా ఉపయోగించపోవడం ఈ ప్రమాదాలకు ఎక్కువగా కారణమవుతున్నాయి. ఎల్.పి.జి. స్వభావం, గ్యాస్ స్టా నిర్మాణం గురించి తెలుసుకుందాం...

oct18ఎల్.పి.జి.లో 80 శాతం బ్యుటేన్, 20 శాతం ప్రొపేన్ ఉంటాయి. ఇది విషవాయువు కానప్పటికీ కొద్దిగా మత్తును కలిగిస్తుంది. ఎల్.పి.జి. కలిసిన గాలిలో ఆక్సిజన్ శాతం 19 కన్నా తక్కువైతే ఉక్కిరిబిక్కిరవుతాం. ఎల్.పి.జి.ని పీల్చినా, కళ్లు లేదా చర్మంతో స్పర్శలోకి వచ్చినా శరీరం మీద ప్రభావం కన్పిస్తుంది. ఈ వాయువుకు చాలా ఎక్కువగా గురయితే స్పృహ కోల్పోవడంతో బాటు ఒక్కొక్కప్పుడు మరణం కూడా సంభవించవచ్చు. ఒక కిలోగ్రామ్ ఎల్.పి.జి. 12,000 కేలరీల ఉష్ణశక్తిని కలిగి ఉంటుంది. ఒక కిలోగ్రామ్ ఎల్.పి.జి. సాధారణ ఉష్ణోగ్రత వద్ద వాయుస్థితిలో ఉంటుంది. కాని సిలిండర్లలో దీన్ని అధిక పీడనం వద్ద ద్రవస్థితిలో నిల్వచేస్తారు. ఈ గ్యాస్ కు రంగు, వాసన లేవు. గ్యాస్ లీకయితే కనిపెట్టేందుకు వీలుగా దుర్వాసన గల మెర్కాప్టాన్లు అనే సల్ఫర్ సమ్మేళనాలను కలుపుతారు.

గ్యాస్ స్టౌ ఎలా పనిచేస్తుంది?

oct17గ్యాస్ స్టౌలో ఒక సిలిండర్, ఒక రబ్బర్ గొట్టం ద్వారా కలపబడిన చోట సిలిండర్ వాల్వ్, ప్రెషర్ రెగ్యులేటర్ వుంటాయి. సిలిండర్ నుంచి గ్యాస్ లీక్ కాకుండా సిలిండర్ వాల్వ్ నిరోధిస్తుంది. ఈ వాల్వ్ పైభాగంలో వుండే రబ్బర్ రింగ్ వాల్వ్, రెగ్యులేటర్ జాయింట్ దగ్గర గ్యాస్ లీక్ కాకుండా కాపాడుతుంది. ప్రెషర్ రెగ్యులేటర్ చాలా ముఖ్యమైన భాగం. సిలిండర్ నుంచి బయటకు వచ్చి బర్నర్ కు పోయే గ్యాస్ పీడనాన్ని తగ్గించి, ఒక స్థిరమైన స్థాయికి వీడనాన్ని క్రమబద్ధీకరించడం రెగ్యులేటర్ చేసే పని. రెగ్యులేటర్ పైన ఒక లెవర్ ఉంటుంది. ఇది గ్యాస్ ను ఆన్ చేయడానికి లేదా ఆఫ్ చేయడానికి ఉపయోగపడుతుంది. రెగ్యులేటర్ నిర్గమమార్గం (Outlet) నుంచి ఒక పొడవైన రబ్బర్ గొట్టం ద్వారా స్టౌ తాలూకు గ్యాస్ ప్రవేశ ద్వారానికి (inlet) కలుపుతారు. ఈ గొట్టాన్ని ప్రత్యేకమైన రబ్బర్ తో కొన్ని ప్రమాణాలకు అనుగుణంగా తయారు చేస్తారు. మన ఇళ్లలో వాడే గ్యాస్ స్టౌకు 2 లేదా 4 బర్నర్లు ఉంటాయి. వీటికి మానిఫోల్డ్ అనే గొట్టం ద్వారా ఎక్కువ వేగంతో గ్యాస్ సరఫరా అవుతుంది. ఒక్కొక్క బర్నర్ కు గ్యాస్ ను పంపడానికి లేదా కట్టివేయడానికి విడివిడిగా నాబ్ లు లేదా టాప్ హ్యాండిల్స్ ఉంటాయి. గ్యాస్ ను వదిలినప్పుడు ఎక్కువ వేగంతో గొట్టం ద్వారా బర్నర్ లోనికి ప్రవేశిస్తుంది. పటంలో చూపినట్లు B దగ్గర ఉన్న రంధ్రాల ద్వారా బర్నర్ లోకి గాలి ప్రవేశిస్తుంది. C గొట్టంతో గ్యాస్ గాలితో కలిసిపోతుంది. ఈ మిశ్రమం బర్నర్ హెడ్ కి ఉన్న రంధ్రాలకు (D) చేరుతుంది. గ్యాస్ లైటర్ లేదా అగ్గిపుల్లతో అంటిస్తే గ్యాస్ మండుతుంది. నీలం రంగు మంట వస్తుంది.

సిలిండర్ ను ఎల్.పి.జి. ద్రవంతో నింపేటప్పుడు గాలిని పూర్తిగా తొలగిస్తారు. గ్యాస్ లీకైనప్పుడు అది గాలితో కలుస్తుంది. అప్పుడు దానికి ప్రేలుడు స్వభావం వస్తుంది. గాలిలో ఎల్.పి.జి. అతి తక్కువగా అంటే 1.8 శాతం ఉన్నప్పుడు కూడా ఒక్క నిప్పు రవ్వ తాకినా ప్రేలుడు సంభవిస్తుంది. మంటలు అన్ని దిక్కులకు వ్యాపిస్తాయి. ద్రవరూపంలో ఎల్.పి.జి. లీకయితే మరీ ప్రమాదం. గ్యాస్ సిలిండర్ ను ఎప్పుడూ నిటారుగానే ఉంచాలి. అడ్డంగా ఉంచడం ప్రమాదకరం. అందుచేతనే సైకిల్ లేదా మోటార్ బైక్ ల మీద సిలిండర్ ను అడ్డంగా ఉంచి తీసుకువెళ్లడం ప్రమాదమని గుర్తించాలి. వంటింటిలో సిలిండర్ నుంచి గ్యాస్ లీకయితే గ్యాస్ నేలబారుగా ఉంటూ వంటింట్లోని కన్నాలు, డ్రెయిన్ లలోకి చేరుతుంది. ఎందుకంటే వాయుస్థితిలోని ఎల్.పి.జి. గాలికంటే బరువైంది.

oct19సిలిండర్ ను గ్యాస్ తో నింపేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటిస్తారు. సిలిండర్ పరిమాణంలో 85 శాతం కంటే ఎక్కువగా నింపరు. ఎందుకంటే, సిలిండర్‌లో ఉండవలసిన గరిష్ట పరిమాణం కంటే ఎక్కువ గ్యాస్ నింపబడి ఉంటే అలాంటి సిలిండర్ల వల్ల ప్రమాదాలకు అవకాశం ఎక్కువ. అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ఆ ప్రాంతాల్లో ఉన్న గ్యాస్ సిలిండర్ ప్రేలితే ఎంత ప్రమాదమో ఊహించుకోవచ్చు.

ఇళ్లలో గ్యాన్ స్టౌలతో ప్రమాదాలు జరుగుతుంటాయి. చాలా ప్రమాదాలు పాడైపోయిన రబ్బరు గొట్టాల వల్ల జరుగుతుంటాయి. గొట్టంలో కంటికి కనిపించని రంధ్రాలు ఉండవచ్చు. వీటి ద్వారా గ్యాస్ లీకవుతుంది. అందుచేత వీటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అప్పుడప్పుడు సబ్బు, ద్రావణంతో పరీక్షిస్తుండాలి. సబ్బుద్రావణంలో నానబెట్టిన దూది పట్టీతో రబ్బరుగొట్టాన్ని రుద్దాలి. ఎక్కడైనా గ్యాస్ లీకవుతుంటే అక్కడ బుడగలు కన్పిస్తాయి. ఏమైన రెండేళ్లకొకసారి రబ్బరుగొట్టాన్ని మార్చడం మంచిది.

మొత్తం మీద గ్యాస్ స్టౌను వాడేటప్పుడు అజాగ్రత్తగా ఉండకూడదు. తగిన జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాలు జరగవు.

సెల్ ఫోన్

nov14సైన్సు, టెక్నాలజీ రంగాల్లో ఎంతో అభివృద్ది జరిగింది. ఎన్నో సౌకర్యాలు మనకు అందుబాటులోకి వచ్చాయి. నేటి మన ఆధునిక జీవనంలో సెల్ ఫోన్ ఒక భాగమైపోయింది. ప్రపంచ వ్యాప్తంగా ఈనాడు దాదాపు 7 బిలియన్లకు పైగా సెల్ ఫోన్లున్నాయని ఒక అంచనా. సమాజంలో ప్రతి వ్యక్తికీ సెల్ ఫోన్ ఉపయోగించడం తప్పనిసరి అయిపోయింది. దాదాపుగా అన్ని వర్గాల వారు పేద, ధనిక తేడా లేకుండా సెల్ ఫోన్ లేదా మొబైల్ ఫోన్ ను ఉపయోగిస్తున్నారు. ఒక రకంగా ఇది అందరికీ ఒక ఆప్తమిత్రుడుగా మారిపోయింది. అధునాతనంగా వచ్చిన స్మార్ట్ ఫోన్ తో ఎన్నో రకాల ప్రయోజనాలు అందుబాటులోకి రావడంతో ఈ ఫోన్ దగ్గరుంటే ప్రపంచంలో సమాచారమంతా మన గుప్పెట్లో ఉన్నట్లే... మీరు కూడా సెల్ ఫోన్ ను ఉపయోగిస్తున్నవారే. అయినా, ఈ సెల్ ఫోన్ ఎలా పనిచేస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా? దీనిని గురించి క్లుప్తంగా తెలుసుకుందాం.

ఇంతకుముందు రేడియో ఎలా పనిచేస్తుందో తెలుసుకున్నాం. సెల్ ఫోన్ అనేది ప్రాథమికంగా రెండు దిశల్లో అంటే ముందుకు, వెనక్కు కూడా పనిచేసే రేడియో అన్నమాట. దీంట్లో రేడియో ట్రాన్స్ మిటర్, రేడియో రిసీవర్ రెండూ ఉంటాయి. మనం ఎవరితోనైనా మాట్లాడుతున్నామనుకోండి సెల్ ఫోన్ మన మాటల్ని విద్యుత్ సంకేతాలుగా మార్చి వాటిని రేడియో తరంగాల ద్వారా దగ్గరలో ఉన్ననెట్వర్క్ కు చేరుస్తుంది. ఒక నెట్వర్క్ నుంచి మరో దానికి అలా సెల్ టవర్ల నెట్వర్క్ ద్వారా మనం మాట్లాడుతున్న వ్యక్తి సెల్ ఫోన్ కు ఈ విద్యుత్ సంకేతాలు చేరతాయి. ఆ సెల్ ఫోన్ అంటే రిసీవర్ ఈ విద్యుత్ సంకేతాలను తిరిగి శబ్దంగా మారుస్తుంది.

nov13మనం మాట్లాడే వ్యక్తి ఎంత దూరంగా ఉన్నా మాట్లాడడం వీలుపడేలా సెల్యులార్ నెట్ వర్క్ పనిచేస్తుంది. ఇందుకు భూభాగాన్ని కొన్ని ‘సెల్స్’గా విభజిస్తారు. షడ్భూజాకారంలో ఉండే ఈ సెల్స్ లో ప్రతిదానికి ఒక బేస్ స్టేషన్ ఉంటుంది. అంటే సెల్‌టవర్ - అన్నమాట. సెల్ ఫోన్ నుంచి వచ్చే బలహీనమైన సిగ్నలను సెల్‌టవర్ గ్రహించి మనం మాట్లాడాలనుకునే వ్యక్తికి దగ్గరలో ఉన్న మరో సెల్ టవర్ కు చేరవేస్తుంది. ఒకవేళ మనం ఒక చోట స్థిరంగా ఉండకుండా కదులుతూ మాట్లాడుతుంటే, మన చేతిలోని ఫోన్ సెల్ టవర్లను మార్చుకుంటూ సంభాషణకు అంతరాయం కలగకుండా చేస్తుంది.

స్మార్ట్ ఫోన్ ల ఉపయోగాలు అన్నీ ఇన్నీ కావు. కేవలం వాయిస్ కాల్స్ మాత్రమే కాకుండా మరెన్నో రకాలుగా ఇవి ఉపయోగపడుతున్నాయి. ఇంటర్నెట్ ద్వారా ఎన్నో వెబ్ సైట్ లను దర్శించగలుగుతున్నాం. కెమెరాతో ఫోటోలు, సెల్ఫీలు, వీడియోలు తీసుకుంటున్నాం. పిల్లల చేతిలోకి సెల్ ఫోన్ వచ్చిందంటే చాలు వీడియోగేమ్స్ లో లీనమైపోతున్నారు. వీడియో కాల్స్, ఇ-మెయిల్స్, మెసేజీలు ఇలా ఒకటేమిటి ఎన్నో ఫీచర్స్ తో వస్తున్నాయి ఈ ఫోన్లు. అంటే ఒక స్మార్ట్ ఫోన్ ఒక పోర్టబుల్ కంప్యూటర్ అన్నమాట.

సెల్ ఫోన్ రేడియో తరంగాలను అన్ని దిశల్లోను ప్రసారం చేస్తుంది. దగ్గరలో ఉన్న సెల్ టవర్ ను చేరుకునే లోపల ఈ తరంగాలను అడ్డువచ్చే కొన్ని వస్తువులు శోషణం చేసుకోవడమో లేదా పరావర్తనం చేయడమో జరగవచ్చు. ఇలా జరగడం వల్ల సెల్ ఫోన్ ఉపయోగించుకునే శక్తి కొంత వృధా అవుతుంది.

సెల్ ఫోన్ లో రేడియో సంకేతాలను ప్రసారం చేసేందుకు లేదా స్వీకరించేందుకు కనీసం ఒక రేడియో యాంటెనా ఉంటుంది. ఈ యాంటెనా విద్యుత్ సంకేతాలను రేడియో సంకేతాలుగాను (ట్రాన్స్ మిటర్) మార్చడమే కాకుండా రేడియో సంకేతాలను విద్యుత్ సంకేతాలుగా (రిసీవర్) కూడా మార్చగలదు. కొన్ని సెల్ ఫోన్ లలో ట్రాన్స్ మిటర్ గాను రిసీవర్ గాను కూడా పని చేసేందుకు ఒకే యాంటెనా ఉంటుంది. కాని ఐఫోన్ వంటి మొబైల్ ఫోన్లలో ట్రాన్స్‌మిటింగ్ యాంటెనాలు, రిసీవింగ్ యాంటెనాలు అనేకం ఉంటాయి. యాంటెనా రాగి వంటి ఒక లోహంతో చేయబడి నిర్దిష్టమైన పౌనఃపున్యం (ఫ్రీక్వెన్సీ) ఉన్న రేడియో తరంగాలను ప్రసారం చేసేందుకు, స్వీకరించేందుకు తగిన పరిమాణం (సైజు), ఆకారంలో ఉంటాయి. పాతరకం సెల్ ఫోన్లలో యాంటెనా పైకి ఉండేది. కాని ఇప్పుడు మనం వాడుతున్న సెల్ ఫోన్లలో యాంటెనాలు ఫోన్ లోపలే ఉంటున్నాయి. ఆధునిక సెల్ ఫోన్లలో వైఫై, బ్లూటూత్, జీపీఎస్ యాంటెనాలు కూడా ఉంటాయి.

సెల్ ఫోన్ పనిచేయాలంటే లోపలికి వచ్చే సిగ్నల్ తో బాటు బయటికి పోయే సిగ్నల్ కూడా అవసరం. సెల్ టవర్ నుంచి అందుకునే సిగ్నల్ పరిమాణాన్ని సిగ్నల్ బలం (సిగ్నల్ స్ట్రెంగ్త్) అంటారు. సెల్ ఫోన్ ను ఆన్ చేసి గమనించండి. సిగ్నల్ స్ట్రెంగ్త్ ను సూచించే పట్టీలు కన్పిస్తాయి. సెల్ టవర్ నుంచి ఫోన్ కు ఉండే దూరం, మధ్యలో ఉండే ఆటంకాలు, ఉపయోగిస్తున్న వైర్లెస్ టెక్నాలజీ వీటన్నింటి మీదా సిగ్నల్ స్ట్రెంగ్త్ ఆధారపడి ఉంటుంది. బ్యాటరీ జీవితకాలం (బ్యాటరీ లైఫ్)ను కాపాడుకునేందుకు సెల్ ఫోన్ అవసరమైన కనీసపు శక్తితోనే సిగ్నల్ ను ప్రసారం చేస్తుంది. సెల్ టవర్ తో అనుసంధానం (కనెక్టివిటీ) బలహీనంగా ఉంటే దానితో అనుసంధానం అయ్యేందుకు ఎక్కువ శక్తితో సిగ్నల్ ను పంపిస్తుంది. అలాంటప్పుడు బ్యాటరీ తొందరగా ఖాళీ అయిపోతుంది.

ఏ సెల్ ఫోన్ లోనైనా కొన్ని పెద్ద భాగాలు, కొన్ని చిన్న భాగాలు ఉంటాయి. ఈ భాగాలన్నింటిని నెట్వర్క్ విభాగం, పవర్ విభాగంగా మనం అర్థం చేసుకోవచ్చు.

సర్క్యూట్ బోర్డ్ సెల్ ఫోన్ లోపల ఉంటుంది. దీంట్లో చాలా కంప్యూటర్ చిప్స్, మైక్రోప్రాసెసర్లు ఉంటాయి. సర్క్యూట్ బోర్డ్ సెల్ ఫోన్ కు గుండెకాయలాంటిది. కాల్ చేసేందుకు, వచ్చి కాల్ తీసుకునేందుకు ఇది. సాయపడుతుంది. సెల్ ఫోన్ వాడేందుకు సిమ్ కార్డు అవసరం. సిమ్(SIM) అంటే సబ్ స్క్రైబర్ ఐడెంటిటీ మాడ్యూల్ అన్న మాట. సెల్ ఫోన్ స్ర్కీన్ ఒక ఎల్.సి.డి. దీనికి దిగువన కీబోర్డ్ ఉంటుంది. ఇప్పుడు టచ్ స్క్రీన్ అందుబాటులోకి వచ్చింది. టచ్ స్క్రీన్ తో పాటు కెమెరా, కాలిక్యులేటర్, కాల్ రికార్డింగ్, ఫ్లాష్ లైట్ ఇలా ఎన్నో మనకు ఉపయోగపడే ఆకర్షణలు సెల్ ఫోన్లలో ఉ ంటున్నాయి. మాట్లాడేందుకు మైక్రోఫోన్, వినేందుకు స్పీకర్ ఉంటాయి.

సెల్ ఫోన్ పని చేసేందుకు శక్తి ఎక్కడిది? సెల్ ఫోన్ లో ఉండే చిన్న బ్యాటరీ దానికి శక్తినిస్తుంది. దీనిలో ఛార్జి తగ్గిపోతే రిఛార్జి చేసుకోవచ్చు.

రేడియో

july11రేడియోకు పాత పేరు వైర్లెస్ (wireless). ఇలా పిలవడానికి కూడా కారణం ఉంది. బ్రాడ్ కాస్టింగ్ స్టేషన్ నుంచి ప్రసారమయ్యే కార్యక్రమాలను మన ఇంట్లో రేడియో లేదా ట్రాన్సిస్టర్ ద్వారా వింటుంటాం. ఈ కార్యక్రమాలకు సంబంధించిన సిగ్నల్స్ రేడియో కేంద్రానికి, రిసీవింగ్ సెట్ కు మధ్య అనుసంధానం చేసే తీగలు (wires) ఏవీ లేకుండానే ప్రయాణిస్తాయి. అందుచేతనే రేడియోను వైర్ లెస్ అంటారు. ఇదెలా సాధ్యపడుతుంది? ఈ సిగ్నల్స్ రేడియో తరంగాల ద్వారా ప్రయాణించడం వల్లనే ఇది సాధ్యపడుతుంది. రేడియో తరంగాలు విద్యుదయస్కాంత వర్ణ వటం (electromagnetic spectrum)లో ఒక భాగం. ఘమో కిరణాలు, X- కిరణాలు, UV కిరణాలు, దృశ్య కాంతి, పరారుణ (Infrared) కిరణాలు, మైక్రో తరంగాలు వంటివి కూడా విద్యుదయస్కాంత వర్ణపటంలోని భాగాలే. రేడియో తరంగాలు (radio waves) శూన్యం గుండా అంటే ఖాళీ జాగా (empty space) గుండా ప్రయాణించగలవు. కృత్రిమ ఉపగ్రహాలు, అంతరిక్ష పరిశోధనశాలలు, భూమికి దూరంగా నిర్దేశిత కక్ష్యలో పరిభ్రమిస్తుంటాయి. వాటి చేత పనిచేయించడానికి తగిన ఆదేశాలను రేడియో సిగ్నల్స్ ద్వారా పంపి అవి తిరిగి వెనక్కి పంపే సిగ్నల్స్ ను గ్రహించగలుగుతున్నాం. ఇందుకు కారణం ఈ రేడియో తరంగాలు. ఎటువంటి వైర్లు అవసరం లేకుండా శూన్యం గుండా ప్రయాణించడమే. రేడియో తరంగాలను మన కంటితో చూడలేము కాని రేడియో రిసీవర్ తో వాటిని గ్రహించగలం. రేడియో తరంగాల ముఖ్య లక్షణం పౌనఃపున్యం (frequency). ఒక సెకనులో ఒక బిందువును దాటిపోయే తరంగాల సంఖ్యను ఫ్రీక్వెన్సీ అంటారు. దీన్ని హెర్ట్జ్(Hertz)లో సూచిస్తారు. రేడియో తరంగాల ఫ్రీక్వెన్సీ సెకనుకు ఒక మిలియన్ లేదా వంద మిలియన్ తరంగాలుగా ఉంటుంది.

రేడియో ఏర్పాటులో ముఖ్యంగా రెండు భాగాలుంటాయి. రేడియో కేంద్రం. లేదా బ్రాడ్ కాస్టింగ్ స్టేషన్ లో ట్రాన్స్ మీటర్ ఉంటుంది. రేడియో కేంద్రంలో మాటలు, పాటలు, సంగీతం వంటి కార్యక్రమాలు వినిపిస్తారు. ట్రాన్స్ మీటర్ ఈ శబ్దాలను గ్రహించి వాటిని సైన్ తరంగాలు (sine waves)గా మార్చి రేడియో తరంగాలలో ప్రసారం చేస్తుంది. రిసీవర్ ఈ రేడియో తరంగాలను గ్రహించి సైన్ తరంగాల్లోని శబ్దాన్ని డీ కోడ్ చేస్తుంది. ట్రాన్స్ మీటర్, రిసీవర్ రెండూ కూడా రేడియో సిగ్నల్స్ ని ప్రసారం చేసేందుకు, గ్రహించేందుకు యాంటీనాలను ఉపయోగించుకుంటాయి. బ్రాడ్ కాస్టింగ్ స్టేషన్ దగ్గర పెద్ద యాంటెనా ఉంటుంది. దీన్ని ఏరియల్ (ariel) అని కూడా అంటారు. ఈ యాంటెనా నుంచి తరంగాలు అన్ని దిశల్లో ప్రయాణిస్తాయి. వీటిని రేడియో రిసీవర్ యాంటెనా గుర్తిస్తుంది. లేదా గ్రహిస్తుంది. ఈ యాంటెనా రేడియో రిసీవర్ లో ఒక లోహపు కడ్డి కావచ్చు. కారులో పనిచేసే రేడియోకయితే, యాంటెనా కారు లోపల కాకుండా బయట ఉంటుంది. ఎందుకంటే రేడియో తరంగాలు కారు లోహపు బాడీ గుండా ప్రయాణించలేవు. రేడియో తరంగాలు యాంటెనాను తాకినప్పుడు లోహం గుండా స్వల్పమైన విద్యుత్ ప్రవహిస్తుంది. ఈ విద్యుత్ ఒక తీగ ద్వారా రేడియో రిసీవర్ కు చేరుతుంది. రేడియో ఈ విద్యుత్ ప్రవాహాలను శబ్దంగా మారుస్తుంది.

july12రేడియో ఎలా పనిచేస్తుందో మరింత వివరంగా తెలుసుకుందాం. రేడియో ట్రాన్స్ మీటర్ ప్రసారం చేసే రేడియో తరంగం రెండు రకాలైన తరంగాల సమ్మేళనం. ఒకటి స్థిరమైన కారియర్ తరంగం (carrier Wave). ఈ తరంగం ఫ్రీక్వెన్సీనే ట్రాన్స్ మీటర్ ఫ్రీక్వెన్సీ అంటాం. రేడియో రిసీవర్ ను ఈ ఫ్రీక్వెన్సీకి ట్యూన్ చేసుకోవాలి. రేడియో డయలను తిప్పి వేరే ఫ్రీక్వెన్సీకి ట్యూన్ చేస్తే వేరే స్టేషన్ ప్రసారాలు వినిపిస్తాయి.

రేడియో తరంగం రెండో భాగం శబ్దాలను సంబంధించిన సిగ్నల్ ను మోసుకుపోయే సైన్ తరంగం. బ్రాడ్ కాస్టింగ్ స్టేషన్ లో శబ్దాలను మైక్రోఫోన్ లు విద్యుత్ ప్రవాహాలుగా మారుస్తాయి. శబ్దాల తీవ్రతకు అనుగుణంగా ఈ విద్యుత్ ప్రవాహాలు వేగంగా మారుతుంటాయి. ఈ విద్యుత్ తరంగాలు కారియర్ రేడియో తరంగాలకు కలుస్తాయి.

మాడ్యులేషన్ (Modulation): మాడ్యులేషన్ అంటే మార్పు అని అర్థం. రేడియో ప్రసారాలకు సంబంధించి ఇది రెండు రకాలు.

ఎ.ఎమ్(AM), ఎఫ్.ఎమ్(FM). ఎ.ఎమ్ అంటే యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్. ఎఫ్.ఎమ్ అంటే ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం మొదలైన ఆకాశవాణి ఎ.ఎమ్ కేంద్రాలు మన దేశంలో 414 దాకా ఉన్నాయి. ముఖ్యమైన పట్టణాల్లో ఎఫ్.ఎమ్. కేంద్రాలు కూడా ఉన్నాయి. ఎ.ఎమ్ కారియర్ ఫ్రీక్వెన్సీలు 535-1705 KHz (కిలో హెర్ట్జ్) రేంజిలో ఉంటాయి. ఎఫ్.ఎమ్ రేడియో బాండ్ 88 నుండి 108 MHz (మెగాహెర్ట్జ్జ్) వరకు ఉంటుంది. ఎ.ఎమ్ రేడియో ప్రసారాల్లో శబ్దం నాణ్యత ఎఫ్.ఎమ్ ప్రసారాలతో పోల్చినప్పుడు తక్కువగా ఉంటుంది. ఉరుములతో కూడిన వర్షం పడినప్పుడు, ఇతరత్రా చప్పుళ్లు ఎ.ఎమ్ ప్రసారాలతో మిళితమై ప్రసారాల్లో రణగొణ ధ్వనులు చోటుచేసుకుంటాయి. ఎఫ్.ఎమ్ ప్రసారాల్లో ఈ ప్రతి బంధకాలు ఉండవు కాబట్టి ప్రసారాల్లో నాణ్యత ఎక్కువ. కానీ ఎ.ఎమ్ ప్రసారాలు సాపేక్షంగా ఎక్కువ దూరాలకు అందుబాటులో ఉంటాయి. ఎఫ్.ఎమ్ ప్రసారాల రేంజి తక్కువ. అందుచేతనే ఏదైనా ఒక పట్టణం లేదా ప్రాంతానికి స్థానికంగా ఎఫ్.ఎమ్ రేడియో ప్రసారాలు అందుతాయి.

ఎ.ఎమ్ పద్ధతిలో ప్రసారం కావల్సిన శబ్ద సంకేతాన్ని కారియర్ తరంగం శక్తి లేదా విస్తారాన్ని (amplitude) మార్పు చేసేందుకు ఉపయోగిస్తారు. శబ్దం బిగ్గరగా ఉండడాన్ని బట్టి కారియర్ తరంగం ఆంప్లిట్యూడ్ లో మార్పు ఆధారపడి ఉంటుంది. ఫ్రీక్వెన్సీతో మార్పు ఉండదు.

ఎఫ్.ఎమ్ పద్దతిలో ప్రసారం కావల్సిన శబ్ద సంకేతం కారియర్ తరంగం యొక్క పౌనఃపున్యాన్ని స్వల్పంగా మారుతుంది. కానీ ఆంప్లీట్యూడ్ లో మార్పు ఉండదు. ఆడియో సిగ్నల్ తో కారియర్ తరంగాన్ని మాడ్యులేషన్ చేసిన తర్వాత ఆంప్లిఫైయిర్ ఈ సిగ్నల్ ను 50వేల వాట్స్ (50కె.వి)కు పెంచుతుంది. యాంటెనా ఈ రేడియో తరంగాలను బయటకి పంపుతుంది. అవి గాలిలో అన్ని దిశల్లో వ్యాప్తి చెందుతూ బలహీనపడతాయి. ఇలా బలహీనపడిన తరంగాలను రిసీవర్ తాలూకు యాంటెనా పట్టుకుంటుంది. రేడియో రిసీవర్ కు ఒక ట్యూనర్ అవసరం. ఎందుకంటే యాంటెనాను వేలకొలది రేడియో సిగ్నల్స్ చుట్టుముట్టి ఉంటాయి. వాటిలో మనం కోరుకున్న స్టేషన్ తాలూకు సిగ్నల్ నే గ్రహించి మిగతా వాటిని వదిలివేసేందుకు ట్యూనర్ అవసరం. ఇందుకు రేడియోలో డిటెక్టర్ అనే ఒక భాగం ఉంటుంది. ఇది డయోడ్ (diode) ఒనే ఒక ఎలక్ట్రానిక్ సాధనంతో తయారవుతుంది. రేడియో ట్యూనర్ పంపే సిగ్నల్ ను యాంప్లీఫైచేసి స్పీకర్ కు పంపిస్తుంది. ఈ విధంగా రేడియో స్టేషన్ ప్రసారం చేసే అసలు శబ్దాలను మనం వినగలుగుతున్నాము.

లిఫ్ట్

may8ఈ రోజుల్లో నగరాల్లోనే కాదు చిన్న పట్టణాల్లో కూడా ఎన్నో అంతస్థులున్న భవనాలు ఎక్కువగానే ఉన్నాయి. ఆకాశ హర్మ్యాల్లో పై అంతస్థులుకు మెట్లెక్కి వెళ్లాలంటే ఎంతో కష్టం. కాళ్ళ నొప్పులుంటే ఆ బాధ మరీ ఎక్కువ. ఇలాంటి భవనాలకు లిఫ్ట్ అనేదే లేకపోతే ఈ భవనాల నిర్మాణాలకు ఎవరూ సాహసించే వారు కాదు. లిఫ్ట్ మెట్లు ఎక్కే శ్రమను తప్పించి ఈ భవనాల్లో నివసించే వారికి ఎంతో ఉపయోగపడుతోంది. లిఫ్ట్ లేకపోతే 2 లేదా 3 అంతస్థుల భవనాలకే మనం పరిమితం కావలసి వచ్చేది.

లిఫ్ట్ ను అమెరికాలో ఎలివేటర్ (elevator) అంటారు. లిఫ్ట్ ను ఉపయోగించే వ్యక్తులు ప్రవేశించేందుకు ఒక కేబిన్ ఉంటుంది. దీన్ని పైభాగాన ఉన్న ఒక ఉక్కు కేబుల్ పట్టుకుని ఉంటుంది. ఈ కేబుల్ ఒక కప్పీ చక్రం మీదుగా పోతూ క్రింది వైపున ఒక బరువుకు కలపబడి ఉంటుంది. ఈ బరువును కౌంటర్ వెయిట్ (Conuter Weight) అంటారు. ఇది కేబిన్ బరువును దానిలోని వ్యక్తుల బరువుతో సహా దాదాపుగా తుల్యం చేస్తుంది. అందుచేత లిఫ్టును కదిలేందుకు ఎక్కువ శక్తి అవసరం ఉండదు. లిష్ట్ కేబిన్ వెనుక కౌంటర్ వెయిట్ కదులుతుంటుంది. లిఫ్ట్ ఎక్కేందుకు వేచి చూస్తున్నప్పుడు కౌంటర్ వెయిట్ కదులుతుండడం మనం గమనించవచ్చు.

కేబిన్ పైన ఉన్న కప్పీ చక్రం మీద ఒక శక్తివంతమైన విద్యుత్ మోటార్ లిఫ్ట్ ను కదుపుతుంది. లిఫ్ట్ లోపలికి వెళ్లిన తర్వాత అక్కడ కొన్ని మీటలు (Buttons) మనకి కన్పిస్తాయి. లిఫ్ట్ బయట ప్రతి ఫ్లోర్ కు కూడా మీటలు ఉంటాయి. ఈ మీటల సాయంతో లిఫ్ట్ ను మనం కంట్రోల్ చేస్తుంటాం.

లిఫ్ట్ లు సురక్షితమైనవే. ఎందుకంటే, ఎప్పుడైనా విద్యుత్ సరఫరా ఆగిపోతే లిఫ్ట్ కు ఉండే ఆటోమేటిక్ బ్రేకులు కప్పీ చక్రాన్ని కదలనీకుండా ఆపుతాయి. అదే విధంగా లిఫ్ట్ తలుపులు తెరిచి ఉన్నప్పుడు లిఫ్ట్ ను కదలనీయకుండా ఆటోమేటిక్ బ్రేకులు తాళం వేస్తాయి. ముఖ్యమైన భద్రతా ఏర్పాటు ఇంకోటి ఉంది. అదేమంటే, లిఫ్ట్ కు అమర్చిన కొన్ని డెక్కలు లేదా గిట్టలు(Claws). ప్రమాదవశాత్తు లిఫ్ట్ తాలూకు కేబుల్ తెగిపోతే, ఈ గిట్టలు ఎలివేటర్ కదిలే మార్గంలోని జాడలు (Tracks)ని గట్టిగా పట్టుకొని ఎలివేటర్ నేలను ఢీకొట్టకుండా ఆపుతాయి. ఇది పనిచేయకపోయినా షాఫ్ట్ అడుగున ఉండే షాక్ ఎబ్సార్బర్ ఒక కుషన్ లా పనిచేసి రక్షణ కలగజేస్తుంది.

ఒకే ఎలివేటర్ ఉన్నప్పుడు, దాని కోసం వేచి ఉండాల్సి వస్తే సమయం వృధా అవుతుంది. దీన్ని అదిగమించేందుకు ఇంజనీర్లు 'కంటిన్యూయస్ ఎలివేటర్'ను కనుగొన్నా రు. వీటిలో రెండు పొడవాటి కర్రలు (Shafts) పక్కపక్కనే ఉంటాయి. ఒక కేబుల్ కు చాలా ఎలివేటర్లు కలపబడి ఉంటాయి. ఒకవైపున ఎలివేటర్లు పైకి కదులుతుంటే, మరో వైపున కిందికి దిగుతుంటాయి. ప్రతి ఎలివేటర్ ముందువైపున తెరిచి ఉండి నెమ్మదిగా కదులుతుంటుంది. ప్రయాణించే వారు పైకి లేదా కిందికి కదిలే ఏదో ఒక లిఫ్ట్ లో ప్రవేశించి వారు కోరుకున్న ఫ్లోర్ దగ్గర బయటికి వస్తారు.

ఎస్కలేటర్లు:

చాలా షాపింగ్ మాల్స్ లోను, పెద్ద రైల్వేస్టేషన్లలోను, విమానాశ్రయాల్లోను ఎస్కలేటర్లను చూస్తుంటాం. ఎస్కలేటర్ అంటే కదిలే మెట్లు (Moving Staircase) అని అర్థం. ఎస్కలేటర్ లో మేడకు ఉన్నట్లుగానే మెట్లు ఒక దాని తర్వాత ఒకటిగా ఉంటాయి. ఆ మెట్ల మీద నిలబడితే చాలు ఆ మెట్లే కదులుతాయి. ఈ మెట్లు పొడవైన బెల్టుతో కలపబడి యంత్రాలసాయంతో కదులుతాయి. ఆ మెట్ల దారి పైకి లేదా కిందికి చేరినప్పుడు అవి సాఫీగా సర్దుకుంటాయి. మెట్టు మీదున్న వ్యక్తి సాఫీగా దిగిపోవచ్చు. ఎస్కలేటర్ కదులుతున్నప్పుడు కూడా మెట్టు మీద నిల్చున్న వ్యక్తి ఇతరత్రా మెట్ల మీదికి పైకి లేదా కిందికి కదలడానికి వీలుంటుంది.

may11ఎస్కలేటర్ కు రెండువైపులా చేతులు ఆన్చుకునేందుకు పట్టాలుంటాయి. ఎస్కలేటర్ మీద ఏదైనా ప్రమాదం జరిగితే దానిని ఆపేందుకు అత్యవసర మీటలు ఉంటాయి. ఎస్కలేటర్ లోని వరుసగా ఉండే వేర్వేరు మెట్లు సైకిల్ గొలుసుల్లాంటి రెండు గొలుసులతో ఒక వరుసలో బంధింపబడి ఉంటాయి. ఎస్కలేటర్ పైన కింద ఉండే గేర్ వకాల వల్ల ఈ గొలుసులు కదులుతాయి. ఈ అమరిక వల్ల మెట్లు ఒక నిరంతర బెల్టు మాదిరిగా కదులుతుంటాయి. ప్రతి మెట్టుకి ఒక జత రోలర్లు ఉండడం వల్ల అది ఒకే స్థాయిలో నిలదొక్కుకుంటుంది.

చాలా విమానాశ్రయాల్లో ట్రావెలేటర్లను చూస్తుంటాం. ఇది కదిలే రోడ్లన్నమాట. వీటికి ఎస్కలేటర్ల మాదిగా మెట్లు ఉండవు. కాని అవి పనిచేసే పద్ధతిలోనే ఇవి కూడా పనిచేస్తాయి. ఒక గేట్ నుంచి మరో గేట్! లేదా విమానం ఎక్కే ముందు లేదా దిగిన తర్వాత ఒక చోటు నుంచి మరో చోటుకి ఎక్కువ దూరాలు నడవాల్సి వస్తుంది. ఇలాంటప్పుడు ఈ ట్రావెలేటర్లు శ్రమను తగ్గించి చాలా సాయపడుతుంటాయి.

భవిష్యత్తుల్లో లిస్ట్ లు చాలా మార్పులతో రానున్నాయి. కేబుల్ లేని మల్టిఎలివేటర్లు రానున్నాయి. ఇవి మాగ్నటిక్ లెవిగేషన్ టెక్నాలజీని, వీనియర్ మోటార్ ను ఉపయోగించుకుంటాయి. పైకి లేదా కిందికి అలాగే ఒక పక్క నుంచి మరో పక్కకి కదిలేందుకు ఇవి ఉపయోగపడతాయి. మెగీలెవ్ రైళ్ళలో మాగ్నటిక్ లెవిగేషన్ టెక్నాలజీని ఇప్పటికే ఉపయోగిస్తున్నారు.

ఆధారం: డా. ఇ.ఆర్. సుబ్రహ్మణ్యం© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate