పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

ఫిబ్రవరి నెలలో సైన్సు సంగతులు

ఫిబ్రవరి నెల సైన్సు సంగతులు తెలుసుకుందాం.

feb0021.jpgఫిబ్రవరి-1-1976 : క్వాంటం మెకానిక్స్ రంగంలో కృషి చేసి 1932 లో భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతిని పొందిన జర్మనీ శాస్త్రవేత్త వెర్నర్ కార్ల్ హైసన్ బర్గ్ మరణించిన రోజు.

 

feb0022.jpg

ఫిబ్రవరి-2-1907 : ప్రకృతిలో లభించే మూలకాల ధర్మాలను క్రోడీకరించి, ఆవర్తన పట్టిక (Periodic Table) ను తయారు చేసిన రష్యన్ రసాయన శాస్త్రవేత్త మెండలివ్ (Mendaleev) మరణించిన రోజు.

 

feb0024.jpgఫిబ్రవరి-3-1468: అచ్చుయంత్రాన్ని కనుగొన్న జర్మనీశాస్త్రవేత్త జూన్గూట్ న్ బర్గ్ (Johann Gutenberg) మరణించిన రోజు

 

feb0025.jpgఫిబ్రవరి-4-1974: ఐన్ స్టీన్ తో కలిసి పరిశోధనలు చేసిన భారతీయ భౌతిక శాస్త్రవేత్త సత్యేంధ్రనాద బోస్ మరణించిన రోజు.

 

 

feb0026.jpgఫిబ్రవరి-5-1974: అమెరికా అంతరిక్ష నౌక మేరినర్ – 10 శుక్రగ్రహం దగ్గరగా వెళ్లి శుక్రహపు మేఘాల ఛాయా చిత్రాలు తీసి పంపిన రోజు.

 

feb0027.jpgఫిబ్రవరి-6-1804: ఆక్సిజన్ తో పాటు హైడ్రోక్లోరికామ్లం, సల్ఫ్యూరికామ్లం వంటి ఎన్నో ఆమ్లాలను కనుగొన్న జోసేఫ్ ప్రిస్టి (Joseph Priestly) మరణించిన రోజు.

 

feb0028.jpgఫిబ్రవరి-11-1847: అమెరికా శాస్త్రవేత్త ధామస్ ఆల్వా ఎడినన్ జన్మించిన రోజు. ఎలక్ట్రిక్ బల్బు, ఫోనోగ్రాఫ లతోపాటు మైనింగ్, బ్యాటరి, రబ్బర్, సిమెంట్, రక్షణ ఉత్పత్తులు మానవ జీవితాన్ని నాగరికత వైపు మళ్ళించాయి. 1300 ఆవిష్కరణలపై పేటెంట్ హక్కులను పొందాడు. అయన అంత్యక్రియల రోజున అయన గౌరవార్ధం అమెరికా ప్రజలు తమ గృహల్లో లైట్లను అర్పివేసి ఆయనకు నివాళి అర్పించారు.

 

feb0029.jpgఫిబ్రవరి-12-1809: పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన బ్రిటిష్ ప్రకృతి శాస్త్రవేత్త చార్లస్ రాబర్ట్ డార్విన్ జన్మించిన రోజు.

 

ఫిబ్రవరి-15-1564: టెలిస్కోపును వాడి మొట్టమొదట ఖగోళ వస్తువులను పరిశీలించిన ఇటలీకి చెందిన ఖగోళ భౌతిక శాస్త్రవేత్త గెలీలియో గేలిలీ జన్మించిన రోజు.

 

ఫిబ్రవరి-15-1880: అలెగ్జాండర్ గ్రాహంబెల్, చార్లెస్ సమ్మర్ టేయి౦టర్ తో కలిసి మొదటిసారిగా రేడియో టెలిఫోన్ ను ప్రయోగత్మకంగా చూపిన రోజు.

 

feb0032.jpgఫిబ్రవరి-16-1956 : భారతీయ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త మేఘనాధ సాహ మరణించిన రోజు. ఈయన ధర్మల్ అయనైజేషన్ సమికర్నామును రూపొందించారు. అయన సైన్స్ అండ్ కల్చర్ అనే ప్రతికను స్ధహించారు.

 

ఫిబ్రవరి-17-1548: విశ్వానికి కేంద్రంగా సూర్యుడు అని సూర్యకేంద్ర సిద్ధాంతం చెబితే, సూర్యుడు లాంటి నక్షత్రాలు ఎన్నో వున్నాయని, ఈ గ్రహకూటమికి మాత్రమే సూర్యుడు కేంద్రకమని బ్రూనో ప్రతిపాదించాడు. సూర్యుని పోలిన మిగతా నక్షత్రాల చుట్టూ కూడా గ్రహ వ్యవస్థ వుండి వుండవచ్చని, ఈ విధంగా గ్రహాలు నక్షత్రాల చుట్టూ పరిభ్రమిస్తాయే తప్ప నక్షత్రాలు గ్రహాల చుట్టూ తిరగవని ఖరాఖండిగా చెప్పాడు. విశ్వంలోని గ్రహాలు, నక్షత్రాలు ఆయా అక్షాలపై తన చుట్టూ తాను పరిభ్రమిస్తాయని, అదే విధంగా సూర్యుడు కూడా స్థిరంగా వుండక తన చుట్టూ తాను పరిభ్రమిస్తాడని మరొక ప్రతిపాదన కూడా చేశాడు. విశ్వంలోని గ్రహం, ఉపగ్రహ, నక్షత్రాలు అన్నింటికీ ఆరంభం, అంతం వున్నాయనీ, ఇవి నిరంతరం మార్పునకు లోనవుతూ ఉంటాయని తెలిపాడు. ఈ సిద్ధాంతం ప్రకారం విశ్వానికి కేంద్రం దానికి సరిహద్దు అంటూ ఏమీ ఉండవని, ఇది అనంతదూరం వరకు వ్యాపించి ఉంటుందని బ్రూనో ప్రతిపాదించాడు.

 

feb0033.jpgఫిబ్రవరి-19-1473 : మొట్ట మొదటిగా సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించి, గెలీలియో టెలిస్కోపుతో నిరూపించిన 'కోపర్నికస్' జన్మదినం నేడే.

 

feb0034.jpgఫిబ్రవరి-21-1894 : భారతదేశంలో పారిశ్రామిక పరిశోధనలకు పునాదులు వేసిన 'శాంతి స్వరూప్ భట్నాగర్' జన్మించిన రోజు.

 

 

feb0035.jpgఫిబ్రవరి-24-1810 : హైడ్రోజన్, ఆర్గాన్ మొదలైన వాయువులను కనుగొన్న ఇంగ్లీషు రసాయన, భౌతిక శాస్త్రవేత్త 'హెన్రీ కావెండిష్ మరణించిన రోజు.

 

feb0036.jpgఫిబ్రవరి-27-1939 : జీర్ణ ప్రక్రియను వివరించి 1904లో వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతిని అందుకొన్న రష్యన్ పరిశోధకుడు 'ఇవాన్ పావ్లోవ్' మరణించిన రోజు.

 

feb0037.jpgఫిబ్రవరి-28-1928: సి.వి రామన్ తన రామన్ ఎఫెక్ట్ ను ప్రకటించిన రోజు. ఈ రోజున మనం జాతీయ సైన్స్ దినోత్సవమును జరుపు కుంటున్నాము.

 

ఫిబ్రవరి-29-1892: రుడాల్ఫ్ డీజల్ అనే శాస్త్రవేత్త అధిక పిదనంతో నడిచే డీజల్ ఇంజన్ కు పేటెంట్ చేశారు.

ఆధారం: బి. మోక్షానందం.

3.01253132832
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు