অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

బాబా సాహేబ్ అంబేడ్కర్

బాబా సాహేబ్ అంబేడ్కర్

ambedkarమనదేశంలో అత్యున్నత గౌరవాన్ని పొందే వారిలో మొదటి వ్యక్తిగా జాతిపిత మహాత్మాగాంధీని పేర్కొంటాము. ఆ తర్వాత లేదా అదే స్థాయిలో గౌరవాన్ని, ప్రశంశాన్ని పొందిన మహనీయుడు బాబా సాహెబ్ అంబేడ్కర్. ప్రపంచ దేశాలన్నింటిలో కన్నా అత్యంత పెద్ద ప్రజాస్వామ్య రాజకీయ వ్యవస్థ కలిగిన భారతదేశం భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతూ స్థిరంగా సుస్థిరంగా ఇన్ని దశాబ్దాల పాటు మనగలగడానికి కారణం రాజ్యాంగంలో ఉన్న ప్రమాణాలే! భారతదేశం బ్రిటీష్ సామ్రాజ్యవాదుల కబంధ హస్తాల నుంచి స్వాతంత్ర్యం సిద్ధించుకున్నాక 29 ఆగష్టు, 1947 నాడు అంబేడ్కర్ అధ్యక్షతన రాజ్యాంగ ముసాయిదా తయారీ సంఘం (Constitution Drafting Committee) ఏర్పడింది. బాబా పేదరికంలో మగ్గిన దళిత కుటుంబంలోనే పుట్టినా, పట్టుదల, దీక్షలలో ఎవరితోనూ తీసిపోని విజ్ఞానగరిమ. క్రియాత్మకత, సృజనాత్మకత మూర్తీభవించిన అంబేద్కర్ ఆలోచనలతో భారత రాజ్యాంగం రూపొందింది. గ్రావిల్ ఆస్టిన్ వంటి అంతర్జాతీయ రాజకీయ చరిత్ర రచయితల వివరణ ప్రకారం భారత రాజ్యాంగంలో ప్రత్యక్షంగాను, పరోక్షంగాను, సామాజిక విప్లవానికి అనువైన విధంగా ప్రజా సంస్కృతికి తావిచ్చే అంశాలు ఉన్నాయి. స్వతహాగా సమసమాజాన్ని అభిలషించే విధంగా అందులో అంశాలు పేర్కొనబడ్డాయి. ముఖ్యంగా వందలాది భాషలు, వేలాది ఆచార వ్యవహారాలు, కులాలు, మతాలు ఉన్న వైవిధ్యభరితమైన భారత సమాజాన్ని ఒక్కబాటన నడపాలంటే పౌర స్వేచ్ఛ (Civil liberties). చాలా ముఖ్యమైన అంబేడ్కర్ భావించాడు. అంతేకాదు ప్రజల్లో నూటికి 90 పై వరకు ఏదో ఒక మతాన్ని అభిమానించే వారే కాబట్టి దేశంలో మతపరమైన విద్వేషాలు రాకుండా ఉండేలా మతాన్ని కేవలం వ్యక్తిగత అంశంగా మన్నింపబడేలా రాజకీయ సామాజిక ప్రక్రియల్లో మతప్రసక్తి లేని విధంగా రాజ్యాంగ సూత్రాలు పేర్కొనబడ్డాయి. మతప్రసక్తి లేని లౌకికరాజ్యం (Secular) గాను ఉత్తరోత్తరా (1976) వరణలకు అనువైన విధంగా రాజ్యాంగపు పీఠిక (Preamble) లో చెప్పబడింది. రాజ్యాంగపు మొదటి పేజీని పరిశీలించండి.

constitutionWe the People of India, having Solemnly resolved to Constitute India into a Sovereign, Socialist, Secular, Democratic, Republic and to secure to all its citizens:

Justice, social, economic and political liberty of thought, expression, belief, faith and worship

Equality of status and of opportunity and to promote among them all

Fraternity assuming the dignity of the individual and the unity and integrity of the Nation...

ఇలాంటి విలువలుగల రాజ్యాంగం మరేదేశంలోను లేదని రాజకీయ కోవిదులు అంటుంటారు. మతప్రసక్తి లేని లౌకికరాజ్యం అంటే అర్ధం మతాన్ని నమ్మకూడదని కాదు. ఎవరికి నచ్చిన మతాన్ని వారు స్వీకరించేహక్కు వారికి ఉంది. అలాగని ఒక మతం మరోమతం మీద దాడి చేయడంగానీ, కించపర్చడం గానీ చేయకూడదు. అది ఎపుడు వీలవుతుంది? సామాజిక, ఆర్థిక, రాజకీయ కార్యకలాపాలలో మతప్రసక్తి రాకూడదు. కానీ ఎక్కడబడితే అక్కడ ప్రతి రాజకీయ నాయకుడు, పాలకులు తాము నమ్మే మత విధానాల్ని సామాజిక వేదికల మీద సామాజిక కార్యకలాపాలలో చొప్పిస్తున్నారు. ఇది వాస్తవానికి రాజ్యాంగ విరుద్ధం. అంతేకాదు బావ స్వేచ్ఛ కూడా రాజ్యాంగం ఇచ్చింది. Freedom of expression అంటే అర్ధం అదే. ఈ దేశంలో ‘ఉరి శిక్ష' ఉండవచ్చా లేదా అన్న చర్చలో ఎవరికి నచ్చిన అభిప్రాయాలు వారికి ఉంటాయి. అలాంటి చర్చకు దేశభక్తి అంశాన్ని జోడించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్దం. ఎవరి విశ్వాసాలు వారికి ఉంటాయి. వాటిని పాటించే హక్కు స్వతంత్రత రాజ్యాంగం కల్పించింది. ఇతరుల అలవాట్ల మీద దాడి చేయడం అంటే రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే! ఒకవేళ స్వేచ్ఛ పేరుతో ఎవరయినా పరిధిని దాటి ప్రవర్తిస్తే న్యాయవ్యవస్థను ఆశ్రయించాలి గానీ చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోకూడదు.

కులాల మధ్య వివక్ష ఉండడాన్నీ అంబేడ్కర్ తీవ్రంగా వ్యతిరేకించారు. వర్ణవ్యవస్థకు మూలమైన మనువాదాన్ని ఆయన తిరస్కరించారు. మనుషులందరూ శాస్త్రీయంగా ఒకేలాగా ఉండే హెూమో శాపియన్స్ (Homo sapians).

అలాంటి ఒకేవిధమైన జీనోమ్ (క్రోమోజోముల వరుస) ఉన్న మనుషుల మధ్య పుట్టుకకు ముందే ఫలానా వ్యక్తి అగ్రస్తుడు, ఫలాని వ్యక్తి నిమ్నస్తుడు అని తీర్మానించే తాత్వికత అశాస్త్రీయమని అంబేడ్కర్ ఉద్భోదించాడు. భారతీయ సమాజంలో ఉన్న సాంస్కృతిక ఆర్థిక, రాజకీయ వైషమ్యాల్ని ప్రస్తావించడంలోను వాటి నివృత్తికి సూచనలు యివ్వడంలోను అంబేద్కర్ ను మించిన వారెవరూ లేదు.

Caste in India their Mechanism, Genesis and Devolopment,

Philosophy of Hinduism; India and Pre rerequistities of Communism... Riddles of Hinduism,

Essays on untouchables and untouchability,

The annihilation of Caste,

The Buddha and His Dharma,

untouchables of the children of India,

Communal Deadlock and a way to solve it. Which is worse? Slavery or untouchability?,

1891 సంవత్సర ఏప్రిల్ 14 నాడు (నేటికి 125 సంవత్సరాలు) నాటి బొంబాయి నేటి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మావు అనే గ్రామంలో అంబేడ్కర్ జన్మించాడు. చిన్నప్పటి నుంచి చదువుల్లో చాలా ప్రతిభాశాలిగా ఉండేవాడు. తన 19వ ఏట ఆర్థికశాస్త్రంలో డిగ్రీ సాధించాడు. అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఎ పట్టా పొందాడు. 1977 సంవత్సరంలో పి.హెచ్.డి పూర్తయింది. భారతదేశంలో డాక్టరేట్ డిగ్రీ పొంది తొలిదళిత విద్యార్థిగా అందరికీ స్ఫూర్తిని యిచ్చాడు.

సామాజిక న్యాయం కోసం శ్రమించాడు కులవివక్షత ఎంత తీవ్రంగా మనో వేదననిసుం అనుభవించిన వారికే తెలుస్తుందని అందరికీ గురు చేశాడు. 'Worshipping the lesser Gods' అంటూ ఆయనను ఎద్దేవా చేసిన వ్యక్తులే, కులవ్యవస్థను కాపాడే మనువాదులే ఆయనకున్న ఆదరణపట్ల అసూయతో ఆయనను తమవారీగా ప్రకటించుకుంటున్నా ప్రధానంగా అంబేద్కర్ అణగారిన వర్గాలస్ఫూర్తి దాత, ఆయన అందరివాడు. శాస్త్రీయదృక్పదం దానికి తావిచ్చేలా రాజ్యాంగంలో పొందుపర్చిన అవకాశాలు ఆయన సమకూర్చినవే. నేడు రాజ్యాంగంలో శాస్త్రీయదృక్పదం, ప్రశ్నించేతత్వం, మానవత్వం వంటివి కలిగి ఉండడం ప్రతి భారతీయుడి ప్రాథమిక కర్తవ్యం' అని పొందపర్చబడి ఉంది. ఇలాంటి రాజ్యాంగాన్ని మనకందించిన బాబాసాహెబ్ అంబేడ్కర్ అందరికీ ఆదర్శప్రాయుడు.

ఆధారం: ప్రొ. ఎ. రామచంద్రయ్య© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate