హోమ్ / విద్య / బాలల ప్రపంచం / బాలల సైన్స్ విభాగం / అడిగి తెలుసుకుందాం / బెర్ముడా ట్రయాంగిల్ దగ్గరకు వెళ్ళిన ఓడలు, హెలీకాప్టర్లు మాయమవుతున్నాయి. ఎందుకు?
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

బెర్ముడా ట్రయాంగిల్ దగ్గరకు వెళ్ళిన ఓడలు, హెలీకాప్టర్లు మాయమవుతున్నాయి. ఎందుకు?

బెర్ముడా ట్రయాంగిల్ దగ్గర దరిగిన ప్రమాదలన్నింటిలో శాస్త్రీయ ఋజువులు దొరికాయి.

a8సమతలంలో (plane)లో మూడు విభిన్న బిందువుల (points in space)ను కలిపే రేఖాచిత్రాన్ని (geo metric object) త్రిభుజం (trigon) లేదా త్రికోణం (triangle) అంటారు. ప్రపంచపటంలో అమెరికా దేశపు ఫ్లొరిడా రాష్ట్రంలో దక్షిణ తూర్పుభాగాన ఉన్న మియామి ఒడరేవు (1), మధ్య అమెరికా క్యూబా, జమైకా దేశాల క్రింద అమెరికాకే చెందిన పోర్టోరికో (2), మధ్య అట్లాంటిక్ మహా సముద్రంలో  ఉన్న చిన్నపాటి బ్రిటీఫ్ దేశపు బెర్ముడా ద్వీపం (island)(3)లకు మధ్య ఉన్న భాగాన్ని బెర్ముడా ట్రాంగిల్ అంటున్నాము.

  • డిసెంబర్ 30, 1512 నాడి పాట్రిమేట్ అనే నావ అక్కడ గల్లంతయ్యింది. అందులో ఉన్న ఓ రాకుమార్తె థియోరేషియో జాడ తెలియరాలేదు.
  • మార్చి 4, 1918 నాడు అమెరికా దేశపు సైక్లాప్స్ అనే నౌకాదళ యుద్ధనావ అక్కడ ప్రమాదానికి గురయ్యింది. నావతో పాటు అందులో ఉన్న 309 మంది సిబ్బంది జాడ తెలియలేదు.
  • కోరోల్ తరంగ్ అనే చిన్ననావను 9నవరి 31, 1919 నాడు కొందరు సముద్ర దొంగలు (pirates) నార్త్ కారోలినా నుండి తీసుకెళ్తుండగా బర్ముడా ట్రయాంగిల్ ప్రాంతంలో ప్రమాదానికి గురయ్యింది.
  • డిసెంబర్ 5, 1945 నాడు ఫ్లైట్ 19 అనే శిక్షణ యుద్ధవిమానం (triaining flight) ఫ్లోరిడా నుండి బయలుదేరి తిరిగి రాలేదు. దాని ఆనవాళ్ళ కోసం గాలింపు చేసేందుకు 13 సిబ్బందితో పంపిన PBM మారినర్ అనే విమానము పేలిపోయింది,
  • జనవరి 30, 1948 నాడు G-AHNP స్టార్ టైగర్ అనే విమానం ఆజోర్స్ (Azores) నుండి బెర్ముడాకు వెళ్తుండగా కూలిపోయింది. ఆ తదుపరి సంవత్సరం (1949) జనవరి 17 నాడు మరో విమానం (స్టార్ ఏరియల్) బెర్ముడా నుండి జమైకాకు వెళ్తుండగా కూడా కూలిపోయింది.
  • డిసెంబర్ 28, 1948 నాడు డల్లస్ DC-3 అనే విమానం పోర్టోరికా నుంచి, ఓమను వెళ్తుండగా మార్గమధ్యంలో ప్రమాదానికి గురయ్యింది.
  • ఆగష్టు 28, 1963 నాడు రెండు KC-135 అనే అమెరికా యుద్ధవిమానాలు గాల్లోనే ఢీ కొట్టుకున్నాయి. సైనికులు ఎవరూ బతకలేదు.
  • సెప్టెంబర్ 5, 1955 నాడు కన్నెమెరా (Connemara IV) అనే విహారయాత్ర పదవ దారితప్పి బర్ముడా ట్రయాగింల్ కు దూసుకెళ్లి అక్కడ తునాతునకైంది అందరూ చనిపోయారు.

ఇలా బర్ముడా ట్రయాంగిల్ గురించిన వార్తలు మీడియా ద్వారా ప్రపంచం యావత్తు చేరడం ద్వారా ఈ ప్రమాదాలకు, బర్ముడా ట్రయాంగిల్ కు ఏదో లింకు ఉందని కథలు అల్లారు. బర్ముడా ట్రయాంగిల్ దగ్గర గ్రహాంతరవాసులు ఉన్నారని వారు అప్పుడప్పుడు సరదాగా మన నావల్ని, విమానాల్ని వేటాడుతుంటారని కల్పితాలు చేశారు. పలు విధాలయిన ఛాందస పురాణాల్ని బెర్ముడా ట్రయాంగిల్ కు అంటగట్టి అక్కడ మానవాతీత శక్తులు ఆవాసం ఉంటున్నట్లు చిత్రీకరించారు. అయితే ప్రోరికో నుండి ఒయామి మధ్యలో అంత తక్కువ దూరంలో మరెక్కడా ప్రపంచంలో మరెక్కడా అన్ని దేసాలు లేవు. అందువల్లో ఆ ప్రాంతంలో ఏం జరిగిన అదో వింతగా రికార్డయ్యింది. కానీ శాస్త్రీయ పరిశోధనలు చేశాక పైన పేర్కొన్న ప్రమాదలన్నింటిలో శాస్త్రీయ ఋజువులు దొరికాయి. రాడార్ సంకోతాన్ని సరిగ్గా గమనించకపోవడం, పరిమితికి మించి అధిక బరువుతో వాహనాలు వెళ్లడం, అప్పటికే డిశ్చార్జి అవుతున్న బ్యాటరీలను ఛార్జింగ్ చేసుకోకుండానే ప్రయాణం చేయడం, బెర్ముడా వంటి చిన్న ద్వీపంలో విమానాశ్రయ నిర్మాణం సరిగా లేకపోవడం, సిబ్బందికి సరియైన అనుభవం లేకపోవడం వంటి సాధారణ కారణాలే పూర్తి ఆధారాలతో దొరికాయి. కాబట్టి బెర్ముడా ట్రయాంగిల్ కు, ప్రమాదాలకు పొంతన లేదని తేల్చారు.

పైగా మరో విషయముంది. ఇంతే వైశాల్యమున్న ప్రపంచంలోమరేదయ్యిన ప్రాంతాల్లో కూడా ఇంతకన్న ఎక్కువ ప్రమాదాలే జరిగాయని ఋజువయ్యింది. అంటే ప్రపంచంలో చాలా చోట్ల జరిగినట్లే అక్కడ ప్రమాదాలు జరిగాయన్నమాట. మియామికి, పోర్టోరికాకు మధ్య దాదాపు 1950 కి.మీ. దూరం ఉంది. ఈ మద్యలో దాదాపు 10 చిన్నా చితికా దేశాలున్నాయి. ఇంతే దూరమున్న సముద్ర భాగంలో ఖండాలున్నయితే అక్కడ జరిగిన ప్రమాదాల సంఖ్యను గమనిస్తే బెర్ముడా ప్రమాదాల సంఖ్యకు ఏమాత్రం తీసిపోదు. ఉదాహరణకు డిల్లీ నుండి హైదరాబాద్ కు మధ్య 1500 కి.మీ. దూరం ఉంది. పైన పేర్కొన్న తారీఖుల మధ్య 1812 నుండి 2012 (200 సంవత్సరాల) కాలంలో జరిగిన ప్రమాదాలన్నింటిని లెక్కిస్తే బెర్ముడా ట్రయాంగిల్ ఘోరాల కన్నా 10 రేట్లు ఎక్కువ ఉంటాయన్నది వాస్తవం. ఇక్కడే కాదు ఇలాంటి దూరమున్న ప్రపంచంలో మరెక్కడయినా తేడా లేదు. కాబట్టి బెర్ముడా ట్రయాంగిల్ కు ప్రత్యేకత అంటూ లేదు. అయితే అక్కడ కూడా ఏదీ మాయం కాలేదు. ప్రపంచంలో ఎక్కడా పదార్థాల్ని మాయం (disappear) చేయలేము. రోడ్డు మీద రెండు లారీలు ఢీకొని ప్రమాదానికి లోనయి నుజ్జు నుజ్జయితే లారీలు మాయమయ్యాయని అంటామా?

ఆధారం: ప్రొ. రామచంద్రయ్య

3.00666666667
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు