పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

బ్లాక్ బాక్స్

బ్లాక్ బాక్స్ అనేది విమానానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరించి తనలో నిక్షిప్తం చేసుకుంటూ ఉంటుంది.

39ఎప్పుడు విమాన ప్రమాదం జరిగిన మనకు మెదట వినిపించే పదం బ్లాక్ బాక్స్. టివివార్తల్లో బ్లాక్ బాక్స్ కోసం నిపుణులు వెతుకుతున్నారు. అది దొరికితే గానీ విమాప్రమాదానికి గల అసలైన కారణం తెలియదు. అంటూ చెప్పడం మనం తరచూ చూస్తుంటాం. మన ముఖ్యమంత్రి శ్రీ రాజశేఖర్ రెడ్డిగారు పావురాల గుట్టలో హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయినప్పుడు కూడా బ్లాక్ బాక్స్ కోసం వెతికి పట్టుకున్నారు.

అసలు ఈ బ్లాక్ బాక్స్ అంటే ఏమిటి అందులో ఏముంటుంది. అని మనకు సందేహం వస్తుంటుంది కదూ?

బ్లాక్ బాక్స్ అనేది విమానానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరించి తనలో నిక్షిప్తం చేసుకుంటూ ఉంటుంది. నిజానికి విమానాల్లో రెండు బ్లాక్ బాక్స్ లు ఉంటాయి. ఒకటి “ఫ్లైట్ జెటా రికార్డర్” (Flight data recorder)ఇందులో విమానం ఎంత ఎత్తులో ప్రయాణిస్తుంది, దిశలో ప్రయాణిస్తుంది. ఏ దిశలో ప్రయాణిస్తుంది, ఎంత వేగంగా ప్రయాణిస్తుంది లాంటి సమాచారం రికార్డ్ అవుతుంటుంది. రెండవది “కాక్ పిట్ రికార్డర్” అంటే విమానం నడిపే పైలెట్ తన సహా పైలెట్ తో మాట్లాడే మాటలను, గ్రౌండ్ కంట్రోల్ రూమ్ తో మాట్లాడే మాటలను రికార్డ్ చేస్తుంది.

ఈ బ్లాక్ బాక్స్ ను ప్రత్యేకమైన పదార్థంతో తయారు చేస్తారు. విమాన ప్రమాదం జరిగితే ఎక్కువ సార్లు విమానంలో మంటలు రేగుతుంటాయి. మంటలు బ్లాక్ బాక్స్ ను ఏమి నష్టపరచకుండా (Fire proof) ఉండేలా దాన్ని తయారు చేస్తారు. అలాగే ఒకవేళ విమానం సముద్రంలో పడితే ఈ బాక్స్ ని తయారుచేస్తారు (Water proof). ఇంకా విమానం ఏదైనా కొండకు గుద్దుకొన్న ఈ బ్లాక్ బాక్స్ పగలకుండా ఉండేలా తయారుచేస్తారు. ఇందులోని టేపులో ప్రమాదానికి ఒక గంట నుండి 8 గంటల ముందు వరకు జరిగిన సమాచారం నిక్షిప్తమై ఉంటుంది. అందువలన ప్రమాదానికి ముందు ఏం జరిగిందో సులభంగా  టేపుల నుండి సేకరించిన సమాచారం ద్వారా ప్రమాదానికి గల కారణాలను విశ్లేషిస్తాయి.

విమానంలో సాధారణంగా ఈ బ్లాక్ బాక్స్ ని విమానం వెనుక భాగంలో (తోక భాగంలో) ఉంచుతారు. ఎందుకంటే ప్రమాదానికి గురైన విమానం వెనుక భాగం తక్కువగా నష్టపోతుంది కాబట్టి. నిజానికి బ్లాక్ బాక్స్ నల్లగా మాత్రం ఉండదు అది ముదురు నారింజ రంగులో ఉంటుంది. ఎందుకంటే ప్రమాదం జరిగినప్పుడు ఈ బాక్స్ ను సులభంగా గుర్తించడానికి ఈ రంగు పూస్తారు.

రాబోయే రోజుల్లో బుల్లెట్ బ్రెయిన్స్ లో స్పీడ్ రేస్ కార్లలో కూడా బ్లాక్ బాక్స్ ని ఉంచాల్సివస్తుంది కాబోలు.

2.99601593625
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు