హోమ్ / విద్య / బాలల ప్రపంచం / బాలల సైన్స్ విభాగం / అడిగి తెలుసుకుందాం / భూమి ఏర్పడిన తొలిరోజుల్లో వర్షాలు పడ్డానికి కారణం ఏమిటి?
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

భూమి ఏర్పడిన తొలిరోజుల్లో వర్షాలు పడ్డానికి కారణం ఏమిటి?

భూమి ఏర్పడిన తొలిరోజుల్లో అది చాలా అగ్నిగోళంలాగా ఉండేదని తర్వాత చల్లబడిందని ఆ క్రమంలో వర్షాలు పడ్డాయి.

sep10దాదాపు 600 కోట్ల సంవత్సరాల క్రితం సూర్యుడు తదితర గ్రహాల్ని బాగా పొంగిన పూరిలాగా మధ్యలో ఉబ్బుగా అంచుల్లో సన్నగా ఉండే ఒక డిస్క్ లో బాగంగా ఉండేవి. అప్పటికీ సూర్యుడు, గ్రహాలు విడిపడలేదు. ఆ డిస్కు తీవ్రమైన వేగంతో గిరగిరా తిరుగుతున్నప్పుడు అంచు భాగాలు అధిక అపలంబ బలానికి లోనయి మరింత దూరంగా జరిగాయి. అంటే మధ్యలో ఉన్న కుంభాకారతనం (convexity) క్రమేపి తగ్గింది. మొత్తం డిస్కులో తీవ్రమైన రీతిలో కేంద్రక సంలీన చర్యల ద్వారా హైడ్రోజన్ వాయువు హీలియం వాయువుగా మారే క్రమంలో విపరీతమైన ఉష్ణశక్తి ఏర్పడేది.

ఓ వైపు గిరగిరా తిరగడంతో పాటు మరోవైపు ఉష్ణశక్తి ఎక్కువ కావడం వల్ల డిస్కు బాగా పలుచనయి అంచు భాగాలు విడిపోతాయి. అవి గ్రహాలుగా రూపుదిద్దుకున్నాయి. గ్రహాలు ఏర్పడక ముందు భూచక్రంలాగా తిరిగే సమయంలో దాన్ని ప్లానిటరీ డిస్కు అంటారు. ప్లానిటరీ డిస్కు అంచులు నుంచే గ్రహాలు ఏర్పడ్డాయి. మద్యలో ఉన్న భాగం మీద ఏమాత్రం అపకేంద్రబలం పని చేయదు కాబట్టి సూర్యుడు గ్రహాలు ఒకే ప్లానిటరీ డిస్కులో భాగాలే తప్ప సూర్యుడి నుంచి ఇతర గ్రహాలు బయటి పడ్డట్టు భావించకూడదు. అంటే ,సూర్యుడు, గ్రహాల మద్య సోదర సంబంధమే ఉంది గానీ తల్లీబిడ్డల సంబంధం కాదని అర్థం చేసుకోవాలి.

ఒకే పదార్థం నుంచి రావడం వల్ల మొదట్లో గ్రహాలలో కూడా కేంద్రక సంలీన చర్యలు జరిగేవి. అంటే ప్రతి గ్రహము ఓ బుల్లి సూర్యుడేనన్నమాట. అయితే గ్రహాల్లో హైడ్రోజన్ హీలియం లాగా మారిపోయాక కేంద్రక సంలీన చర్యలకు అంతరాయం కలిగింది. ఆ పరిస్థితుల్లో చిన్న మూలకాల పెద్ద మూలకాలుగా మాత్రమే మారే కేంద్రక చర్యలు, పరమాణువులు అణువులుగా మారే చర్యలు జరిగాయి. ఆ క్రమంలోనే భూమి మీద నీరు, కార్బన్ డయాక్సైడ్, నైట్రోజన్ వంటి వాయువులు ఏర్పడ్డాయి. భూమి మధ్యభాగం గట్టిపడుతూ వాతావరణంలోకి గాలులు చేరాయి. ఉష్ణోగ్రత, పీడనాలు చాలా ఎక్కువగా ఉండడం వల్ల 100oC ఉన్నా నీటి ఆవిరి ద్రవీభవించక తప్పని స్థితి ఏర్పడింది.

క్లాసియన్ – క్లాపిరాన్ సూత్రం అనే ఉష్ణోగ్రతిక శాస్త్ర నియమం ప్రకారం ఓ వాయువు దాని ద్రవరూపం సమాతాస్థితిలో ఉన్నప్పుడు ఆ పదార్థాన్ని బాష్పీభవన ఉష్ణోగ్రత అక్కడున్న పీడనాన్ని బట్టి మారుతుంది. పీడనం ఎక్కువయితే బాష్పీభవన ఉష్ణోగ్రత పెరుగుతుంది. అంటే పీడనాన్ని పెంచడం ద్వారా ఓ వాయువును తన సాధారణ బాష్పీభవన ఉష్ణోగ్రత కన్నా అధిక ఉష్ణోగ్రత వద్ద కూడా ద్రవీభవించ చేయగలడన్నమాట.

ఈ సూత్రం ఆధారంగానే మన వంటింట్లో ప్రెషర్ కుక్కర్ పని చేస్తుంది. అధిక పీడనం దగ్గర నీరు 100oC కు బదులు 120oC వరకు కూడా ద్రవ రూపంలోనే ఉంటుందన్నమాట. చాలా వేడిగా ఉన్న భూ వాతావరణంలో వాయు రూపంలో ఉన్నా నీటి ఆవిరి అక్కడున్న అధిక పీడనపు వత్తిడికి లోనయి నీరుగా మారింది. ఇదే నాటి వర్షం. ఈ ప్రక్రియే నిరాఘాటంగా, నిరంతరాయంగా కొన్ని లక్షల సంవత్సరాల పాటు సాగింది. అంటే కొన్ని కోట్ల బిలియన్ టి.యం.సి. నీరు భూమి లోతట్టు ప్రాంతాలకు చేరి సముద్రాలుగా మారాయి.

అయితే ఏదైనా ఓ వాయువు ద్రవ రూపంలో మారే క్రమంలో కొంత ఉష్ణాన్ని బయటకి వదులుతుంది. దీన్నే బాష్పీభవన గుప్పోష్ణం అంటారు. తద్వారా విడుదలయిన అధిక వేడి అంతరిక్షంలోకి వెళ్ళడం వల్ల భూమి మరింత చల్లబడి సముద్రాలు సాధారణ స్థితికి వచ్చాక జీవావిర్భానికి నెలవులయ్యాయి.

ఆధారం: ప్రొ. రామచంద్రయ్య

2.98675496689
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు