పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

భౌమ కాలమానం

కాలం అంటే ఏమిటి?

may5కాలం అనంతమైన వరుస ఘటనల క్రమం. గతం నుండి వర్తమానం దాటి భవిష్యత్తులోకి ప్రయాణం చేసే ఒక రాశి. స్థలానికి మూడు ప్రమాణాలు - పొడవు, వెడలు, ఎతు (లేక) లోతు ఉంటే నాల్లో ప్రమాణం-కాలం. ఈ నాల్లో ప్రమాణాన్ని కొలవడానికి మనం ఏర్పాటుచేసుకున్న పరికరాలు క్యాలంర్, గడియారం. భారతీయ కొలమానంలో భారతీయులు ఘడియలు, విఘడియలు అని లెక్కవేస్తే, విదేశీయులు గంటలు, నిమిషాల్లో లెక్క వేస్తారు.

కానీ ఘడియలు, విఘడియలు లెక్కవేసే గడియారాలను మాత్రం మనం రూపొందించ లేదు. మన దేశంలోనే, మనం, తెలుగువాళ్ళం ఉగాదిని కొత్త సంవత్సరంగా భావిస్తే అస్సామీయులు రంగోలి లేక బేహాగ్ బిహు పండుగని కొత్త సంవత్సరంగా భావిస్తారు. ఈ బిహు సాధారణంగా చైనీయుల కొత్త సంవత్సరం పండుగతోనూ, థాయ్లాండ్ కొత్త సంవత్సవం పండుగ “పోయి-సాంగ్ కెన్” తోనూ కలసి వస్తుంది. కేరళలో కొత్త సంవత్సరం విషు ఆగస్టు-సెప్టెంబరు నెలల్లో వస్తుంది. కానీ ఈనాడు ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు అంగ్ల కాలమానం పాటిస్తున్నాయి. జనవరి మొదటి తారీఖునే అందరూ కొత్త సంవత్సరంగా పాటిస్తారు.

ఆదిమ మానవులు సూర్యచంద్రులు, తారల దీక్ష దశలను బట్టి ముప్పైవేల సంవత్సరాల క్రితం సమయాని. గణించడం మొదలెట్టారు. మనషి తన నీడను బట్టి కూడా సమయాన్ని గణించేవాడు. భూమి దీర్ఘ వృత్తాకార కక్ష్యలో సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తుంది. ఈ కక్ష్య 26° కోణంలో వంపుతిరిగి వుంటుంది కాబట్టి నీడ గడియారానికి, మనం చూసే గడియారానికి కాలంలో తేడా వుంటుంది. రేఖాంశాలను బట్టి కూడా కాల గణనలో మార్పులు వస్తాయి.

రోజువారీ కాలగణన ఇలా వుంటే మానవ ప్రపంచంలో వరుసగా జరిగే ఘటనలను బట్టి మనిషి కాలాన్ని కొన్ని విభాగాలు చేశారు. భారతీయులు కాలాన్ని కృతయుగం (సత్యయుగం), త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం అని నాలుగు భాగాలుగా విభజించారు. కృతయుగం (17,28,000 సం.), త్రేతాయుగం (12,96,000 సం.) ద్వాపరయుగం (8,64,000 సం.), కలియుగం (4,32,000 సం.) గా నిర్ణయించారు. ఈ యుగాలు తిరిగి పునరావృతమౌతాయని భావించారు. ఈ విభజనకు శాస్త్రీయ, చారిత్రక ఆధారాలు కనిపించడం లేదు.

సైన్సు ప్రపంచంలో శాస్త్రజ్ఞులు కాలాన్ని మరో విధంగా విభజించారు. భౌమ శాస్త్రజ్ఞులు (Geologists. లుప జంతుశాస్త్రజ్ఞులు (Paleontologists) బౌను చరిత్రను కొన్ని కాలవిరామాలు (Time intervals) గా విభజించారు. సైన్సులోని ప్రధాన ఘట్టాలను లెక్కలోకి తీసుకుని ఈ విభజన జరిగింది. ఈ కాలవిరామాల్లో కూడా సంవత్సరాల సంఖ్య సమానంగా లేదు. కాలాన్ని మహావలయాలు (Eons) గా, యుగాలు (Eras) గా. కాలావధులు (Periods) గా విభజన చేశారు.

మహావిస్పోటనం (Big Bang) తర్వాత అంతరిక్షంలో వ్యాపించిన సన్నని మబ్బులాంటి అంతర్నక్షత్ర ధూళి, ధూసరాల రేణువులు క్రమ పరిణామంలో సూర్యుడిగా, భూమిగా, గ్రహాలుగా ఏర్పడిన తర్వాత భూమి మృతాషాణాది అంశాలను (మన్ను, రాయి ఏర్పడిన పొరలను) అధ్యయనం చేసి ఒక కాలమానం రూపొందించారు. దీన్నే మనం భౌమ కాలమానం (Geologic Timescale) అంటున్నాం.

 1. సీనోజాయిక్
  • మయోకోసీన్
  • ఓలిగోసీన్
  • ఇయోసీన్
  • పొనియోసీన్
 2. మెసోజాయిక్
  • క్రెటేషియస్
  • జ్యురాసిక్
  • ట్రైయాసిక్
 3. పేలియోజాయిక్
  • పెర్మియాన్
  • కార్బొనిఫెరస్
  • డెవోనియన్
  • సిలూరియన్
  • ఓర్దోవీసియన్
  • కేంబ్రియన్
 4. ప్రీకాంబ్రియన్
  • ప్రొటిరోజాయిక్
  • ఆరాయిన్

ఈ కాలమాన పట్టికలో-పురాతనమైన కాలం కాలపట్టిక అడుగుభాగం నుండి ప్రారంభమవుతున్నది. ఇందులో ప్రీకాంబ్రియన్ భూమి చరిత్రలో తొలి భాగపు కాలం. సుమారుగా క్రీ.పూ. 4600 మిలియన్ల సంవత్సరాల నుండి క్రీ.పూ 541 మిలియన్ల సంవత్సరాలు మధ్యనున్న కాలం. ప్రీకాంబ్రియన్ కాలంలో ఆర్కాన్ యుగంలో బాక్టీరియా ఉద్భవించిందని శాస్త్రజ్ఞులు గుర్తించారు. బ్రిటిరోజాయిక్ యుగంలో ఆల్గే మొక్కలు ఉనికిలోని వచ్చాయని, క్రమంగా కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆక్సిజన్ ఉనికిలోకి వచ్చిందని శాస్త్రజ్ఞులు నిర్ధారించారు.

కాంబ్రియన్ యుగం వచ్చేప్పటికి ('కాంబ్రియన్' అనే ఆనాటి పేరు ప్రస్తుతం ఇంగ్లాండులోని వేల్స్ ప్రాంతానికి వుండేది) దొరికిన శిలాజాలను బట్టి స్పాంజి మొక్కలు పుట్టాయని తెలుస్తున్నది. ఈ కాలంలోనే జీవరాశుల మొదటి పైలం (Phylum) బ్రియోజా ఏర్పడింది.

పేలియోజాయిక్ ఆ తర్వాత క్రీ.పూ 542 మిలియన్ సంవత్సరాల నుండి క్రీ.పూ 251 మిలియన్ సంవత్సరాల వరకు అంతమైంది. ఈ కాలం చివరికి వచ్చే సరికి ఫెర్న్ మొక్కలు, కోరల్స్ విస్తృతంగా వ్యాపించాయి. దీని తర్వాత మెసోజాయిక్ కాలం మొదలై క్రీ.పూ 180 మిలియన్ సంవత్సరాలు సాగింది. ఈ కాలంలోనే అనేక మొక్కలు, వెన్నెముకలేని జంతువులు, చేపలు, సముద్ర జంతువులు, చివరకు డైనోసార్లు రాజ్యం చేశాయి. ఈ కాలంలోని జురాసిక్ యుగంలోని జంతువులను ఆధారం చేసుకుని స్టీవెన్ స్పైర్ బెర్గ్ దర్శకత్వం వహించిన 'జురాసిక్ పార్క్’ చలన చిత్ర ప్రపంచంలో సంచలనం సృష్టించింది.

సెనోజాయిక్ కాలం ప్రస్తుతం నడుస్తున్న కాలం. క్రీ.పూ 66 మిలియన్ సంవత్సరాల క్రితం మొదలైంది. ఇది స్తన్యజంతువుల కాలం. ఈ కాలం వచ్చే సరికి డైనోసార్లు అంతరించాయి. స్తన్య జంతువులు అనేకం అభివృద్ధిచెందగా గడ్డి, పాములు, పక్షులు మొదలుకొని అనేక జీవజాతులు ఉనికిలోనికి వచ్చాయి. ఉభయ చరాలు ఈ కాలంలోనివే. జ్ఞానార్జన చేసే విద్యార్థులు ఈ కాలం పట్ల అవగాహన పెంచుకోవడం ఎంతో అవసరం. అంతేగాకుండా వీటి గురించి అధ్యయనం చేయాలి. పుక్కిట పురాణాలలో చెప్పే కాలాలు చాలా వరకు ఊహాశక్తి మీద ఆధారపడి వుండగా విజ్ఞానశాస్త్రం సూచించే కాలాలన్నింటికీ భూమిపొరలు ఆధారంగా నిలుస్తాయి.

ప్రతి రోజూ, ప్రతిక్షణమూ మనకు కొత్తదే అలాంటప్పుడు బహుశా కొత్త సంవత్సరానికి ప్రత్యేక అర్థం వుండదనుకొనే మనిషి కాలానికి ఒక అర్ధం సృష్టించుకుంటాడు. కొత్త సంవత్సరం పేరుతో ఆంగ్లసంత్సరాది అనీ తెలుగు సంవత్సరాది అనీ భేదభావాలను సృష్టించడానికి ప్రయత్నం చేయడు.

మనిషి కాలాన్ని అర్థవంతంగా గడిపి భూమ్మీద ఒక చిరస్మరణీయతను పొందగలిగిననాడు ఆ మనిషి కాలానికి ఒక ప్రాముఖ్యత లభిస్తుంది. భగత్ సింగ్, కల్పనాచావ్లా, రవీంద్రనాథ్ టాగూర్, కైలాష్ సత్యార్థి, ప్రముఖ బాక్సర్ మేరీకోమ్ ల జీవన సాఫల్యత సాధించడం లక్ష్యంగా పెట్టుకున్నవారు ముందడుగు వేస్తారు. విజయం సాధిస్తారు. అంతేకానీ తోటి మసుషుల పట్ల భేదభావాలతో రగిలిపోయేవాళ్ళు జీవితంలో సాధించేది ఏమీవుండదని తెలుసుకుంటారు.

ఆధారం: పైడిముక్కల ఆనంద్ కుమార్

3.01351351351
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు