పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

మత్తుమందులు – శాస్త్ర చికిత్సలు

శాస్త్ర చికిత్సలు చేసేటప్పుడు మత్తు మందుల వినియోగం.

drugsవైద్యవృత్తిలో శస్త్రచికిత్సల తంతు మొదలయ్యాక అ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. శస్త్రచికిత్స చేసే వైద్యులు జబ్బుతో ఉన్న మనిషిని కత్తులతో కోయడాన్ని భయంకరమైనదిగా భావిస్తాము. కాలక్రమేణా వ్యాధిగ్రస్తునికి నొప్పి మరిపించేలా చేసేందుకు సారా తాగించేవారు. అలా తాగిన మైకంలో నొప్పి తెలియకుండా ఆ మత్తు ఉపకరించేది. అయితే సారామత్తు తొందరగా తప్ప మత్తు రాని స్ధితి ఉండడం వలన సారాకు అలవాటు పడిన తరువాత తాగుబోతు అయ్యే ప్రమాదం ఉండడం వలన సారాయిని శస్త్రచికిత్సల్లో మత్తు పదార్ధంగా వాడకాన్ని క్రమేపి మానేశారు.

ఆ తరువాత వారికి క్లోరోఫామ్ బాగా ఉపకరిచింది. అయితే క్లోరోఫాంను చాలా సేపు వాసన చూపించాల్సి వచ్చేది. క్లోరోఫాం లోని విష గుణాల వల్ల కొన్ని సార్లు ఆపరేషన్ తరువాత వ్యాధిగ్రస్తుడు మరణించేవాడు. కాబట్టి క్లోరోఫం వంటి విష లక్షణాలు లేని మరే ఇతర  రసాయనం మత్తు మందుగా పని చేస్తుందన్న అన్వేషణ మొదలైంది.

అదే సందర్భంలో మత్తు ద్రవ్యాలు వాయుస్ధితిలో ఉంటేనే మంచిదన్న విషయం మర్చిపోకూడదు. ఎందుకంటే ఘనస్దితిలో ఉంటే  దాన్ని ఆహార వాహిక ద్వారానే ఇవ్వాలి. అది నోటి ద్వారా పొట్టలోకి వెళ్ళి అక్కడి నుండి ప్రేవుల వరకు వెళ్ళి రక్తంలో కలవాలి. ఈ మధ్యలో అది ఎక్కడా జీర్ణం కాకూడదు. తన సహజ లక్షణాన్ని పోగొట్టకూడదు. పైగా ఆహారవాహికకు ప్రమాదకారిగా కూడా ఉండకూడదు. ఘన పదార్ధాలు మెదడును మత్తులోకి దించగలిగితే అది పొట్టకు ప్రేగుల మీద అవాంచనీయ ఫలితాలను ఇవ్వవన్న విషయానికి తక్కువ నమ్మకమే వుంటుంది. ద్రవ పదార్ధాల విషయాలల్లో కూడా ఇదే చెప్పుకోవచ్చు. కాకుంటే నోటి ద్వారానే కాకుండా ఇన్ జెంక్షన్ ద్వారా కూడా ద్రవరూపంలో మత్తు మందులను ఇవ్వవచ్చును. నేటికి (Local Anesehetia) ప్రాంతీయ మత్తుకు ఇచ్చే మందులను చాలా మటుకు ద్రవరూపంలో ఇన్ జెంక్షన్ ద్వారానే ఇస్తున్నాము. ఐసోఫ్లూరెన్ లాంటి ఇందుకు ఉదాహరణలు. సార్వత్రిక మత్తు ఇవ్వడానికి మాత్రం వాయు రూప మత్తు ద్రవ్యాలను వాడతారు. ముక్కు ద్వారా కృతిమ శ్వాసతో పాటు ఈ వాయు మత్తు ద్రవ్యాన్ని ఇచ్చినప్పుడు మెదడు మొద్దుబారి మాత్తునిస్తుంది. ఆపరేషన్ అయిపోయాక తొందరగానే మత్తు వీడుతుంది. నైట్రస్ ఆక్సైడ్ ను ఇలాంటి మత్తు ద్రవ్యంగా వాడటం పరిపాటి.

ఆధారం: ఎ. రామచంద్రయ్య

3.01169590643
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు