పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

మన దంతాలగురించి మనకేం తెలుసు?

దంతాలని శుబ్రం చేసుకోవాలి ఆరోగ్యం గా వుండాలి.

oct013.jpgజంతువులకు, మనుషులకు ప్రధానమైన తేడా ఏమిటంటే ఎన్నో చెబుతాం. కాని అన్నింటికంటే ముఖ్యమైన తేడా 'నవ్వు'. మనం నవ్వుతో సంతోషాన్ని వ్యక్తం చేస్తాం. కాని జంతువులు నవ్వకుండానే ఆనందిస్తాయి. కాని మనలో చాలా మంది నవ్వేటప్పుడు చెయ్యి అడ్డుపెట్టుకోవడం లేదంటే పళ్ళు కనిపించకుండా చిరునవ్వుతోనే సరిపెడతారు. దీనికి కారణం వారి పళ్ళు పరిశుభ్రంగా లేకపోవడం, దుర్వాసన రావడం. ఇది వారినేకాక పక్కవారిని కూడా ఇబ్బంది పెడుతుంది. మనసారా నవ్వాలంటే మనం దంతాలపట్ల ప్రత్యేక శ్రద్ద వహించాలన్నమాట.

‘పళ్ళెందుకు అంటే బొగ్గుతో తోమడానికి అన్నాట్ట ఓ పెద్దమనిషి, అది సరదాగా అన్నమాట. మనం తినే ఆహారాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేయడం దంతాల పని. అలా చేస్తేనే ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. మనకు తెలిసి జంతువులేవీ పళ్ళు తోముకోవు. కాని మనం మాత్రం వందరకాల బ్రష్ లు, పేస్ట్ లతో కోట్లరూపాయల వ్యాపారాన్ని వేల మంది పంటి డాక్టర్లనీ ప్రోత్సహిస్తున్నాం. అయినప్పటికీ ఎంతో మంది దంత వ్యాధులతో సతమత మవుతున్నారు.

oct014.jpgఆహారాన్ని నమిలే సమయంలో చిన్న చిన్న ఆహార తునకలు పళ్ళ మధ్యవున్న సందుల్లో ఇరుక్కుంటాయి. అవి అలాగే ఉన్నప్పుడు సూక్ష్మజీవుల చర్యవల్ల అవి కుళ్ళుతాయి. సూక్ష్మజీవులకు ఆవాసాలుగా, మారతాయి. ఇక సూక్ష్మజీవులు వాటి జనాభాని పెంచుకునే పనిలో పడతాయి. ఆహార పదార్థాలపై రసాయనచర్యలు జరుపుతాయి. అందువల్ల ఆమ్లాలు (Acids) విడుదలవుతాయి. ఈ ఆమ్లాలు దంతాలపై పింగాణి పొర (Enamel) ను కూడా కరిగిస్తాయి. దీంతోపంటిపై నున్న కవచం కరిగి చిన్న చిన్న గుంటలు ఏర్పడుతాయి. అవే క్రమంగా పెద్దరంధ్రాలుగా మారి పైకి నల్ల మచ్చలుగా కన్పిస్తాయి. వాటి లో ఆహారపదార్థాలు చేరి కుళ్ళిపోతాయి. దాంతో రంధ్రాలు పెరిగి పెద్దదై పళ్ళు పుచ్చిపోతాయి. క్రమంగా పళ్ళు కదిలి వాటిని తీసేయాల్సిన పరిస్థితి వస్తుంది. వీటితోపాటు కుళ్ళిన పదార్థాల వల్ల దుర్వాసన కూడా వస్తుంది.

సాధారణంగా చిన్న పిల్లల్లో ఆరునెలల వయసు వచ్చాక దంతాలు రావడం మొదలవుతుంది. చిగుళ్ళను చీల్చుకుని దంతాలు బయటకు వచ్చేసమయంలో దురదగా ఉండి కనిపించిన ప్రతి వస్తువును నోట్లో పెట్టుకుని కొరుకుతుంటారు. దాంతో ఆ వస్తువుల ద్వారా పిల్లలనోట్లోకి సూక్ష్మజీవులు ప్రవేశిస్తాయి. అక్కడ నుంచి జీర్ణవ్యవస్థ లోకి వెళ్ళి అస్వస్తతను కలిగిస్తాయి. విరేచనాలు, వాంతులు, జ్వరం లాంటి లక్షణాలు కన్పిస్తాయి. దీనికి మనం రకరకాల పేర్లు పెట్టి నాటు వైద్యుల ద్వారా పిల్లల్ని ఇబ్బంది పెడుతుంటాం. దీనిపై అపోహలుమాని, వైద్యుని దగ్గర వైద్యం చేయిస్తే పిల్లలు మామూలుగా ఉంటారు.

పళ్ళు ఒకేరకంగా ఉండవు. వాటి ఆకారంలో చేసేపనిలో వేర్వేరుగా ఉంటాయి. పళ్ళు నాలుగురకాలు. అవి. 1. కొరుకు పళ్ళు (Incissors) 2. కోర దంతాలు (Canine) 3. నమలు దంతాలు (Premolars) 4. విసరు దంతాలు (molars). ఒక విభాగంలో పళ్ళ సంఖ్య 8. మొత్తం పళ్ళ సంఖ్య పెద్దవారిలో 32గా ఉంటుంది. I,C,P,M - 2,1,2,3 అనేది దంతఫార్ములా. పిల్లల్లో 20 దంతాలుంటాయి. వీటిని పాల దంతాలు (milk teeth) అంటారు. 7వ సం. నుండి క్రమంగా వీటి స్థానంలో శాశ్వత దంతాలు (permanent teeth) వస్తాయి.

పళ్ళు ఎన్నెన్నో వాటిని సరిగా శుభ్రం చేసుకోకుంటే కొద్ది కాలంలోనే కట్టుడు దంతాల అవసరం రావచ్చు. ఒకప్పుడు పళ్ళు తోముకోడానికి వేప, కానుగ, ఈత పుల్లలని మెత్తగా నమలి బ్రష్ గా వాడేవారు.

అతి చల్లని, అతి ఉష్ణ పదార్థాలు తీసుకోవడం పళ్ళకు హాని కలిగిస్తుంది. పుల్లనిది, కొన్ని రకా ఆమ్లాలు, కూల్ డ్రింక్స్ లు వంటి ఎనామిల్ ను కరిగిస్తాయి. చిన్నపిల్లల్లో చాక్లెట్ లు వళ్ళను పాడుచేస్తాయి.

పళ్ళు తోముకోవాలి? ఎన్నిసార్లు తోమాలి? వేటితో? అనేవి సహజంగా వచ్చే ప్రశ్నలు, పళ్ళను పై నుండి క్రిందకు, క్రింద నుండి పైకి శుభ్రం చేసుకోవాలి. పళ్ళలోపలి భాగాలను అదే విధంగా బ్రష్ చేయాలి. వెనుకపళ్ళను వలయాకారంలో తోముకోవాలి.

ఉదయం లేవగానే ఒకసారి బ్రష్ చేసుకొని నాలుకను శుభ్రం చేసుకోవాలి. రాత్రి పడుకునేముందు మరోసారి బ్రష్ చేసుకుంటే చాలా మంచిది. ఏదైనా ఆహారపదార్థం తిన్న తరువాత, స్వీట్స్ తిన్న తరువాత నోటిని నీటితో పుక్కిలించడం వల్ల అదీ ఉప్పు నీటితో చేస్తే చాలా వరకు సూక్ష్మజీవుల్ని తొలగించవచ్చు.

పళ్ళను మెత్తని పళ్ళపొడితో శుభ్రం చేసుకోవాలి. వేపపుల్ల లేదా బ్రష్ ఏదైనా వాడుకోవచ్చు. ఏ బ్రాండ్ బ్రష్ అయినా మూoct015.jpgడు నెలలకు మించి వాడవద్దు. బ్రష్లోని కుచ్చులు సున్నితంగా ఉండడమే మంచిది. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే దంతాలను కాపాడుకోవచ్చు. మనసారా నవ్వుని ఆస్వాదించవచ్చు.

ఆధారం: డా. వీరమాచనేని శరత్ బాబు.

3.00282485876
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు