హోమ్ / విద్య / బాలల ప్రపంచం / బాలల సైన్స్ విభాగం / అడిగి తెలుసుకుందాం / భూమి మనతోపాటు తిరుగుతుంది కదా! మరి మనకు కళ్ళు తిరగవు ఎందుకని?
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

భూమి మనతోపాటు తిరుగుతుంది కదా! మరి మనకు కళ్ళు తిరగవు ఎందుకని?

మనం భూమి పైన వున్నప్పుడు మన భూమిలాగే ఏ నికర బలాలకు లోనుకాకుండా సమతాస్థితిలో వుంటాము.

at2మనం భూమి పైన వున్నప్పుడు మన భూమిలాగే ఏ నికర బలాలకు లోనుకాకుండా సమతాస్థితిలో వుంటాము. అందువల్ల భూమి తిరుగుతున్న విషయాన్ని గుర్తించలేము. అయితే మనము గిరగిరా తిరిగినప్పుడు సాపేక్షంగా మన శరీర అంతర్భాగాలలోని ద్రవ పదార్థాలలో చలనాలు ఏర్పడతాయి. ఏదైనా నీటికుండను కుండతో పాటు - నీరు కూడా నిరిగిరా తిరుగుతుంది

మనకు కళ్ళు తిరగటానికి ప్రధాన కారణం మధ్య చెవిలో వున్న కాదూ అనే వలయాకార వాకలలోని ద్రవంలో అలజడులు

ప్రదమే. ఈ ద్రవంలో ఏర్పడ్డ చలనాలకు అనుగుణంగా మెదడుకు సంకేతాలు అందుతాయి. శరీరాన్ని ఈ కదలికలకు అనుగుణంగా నిలకడగా పంచటానికి మెదడు ప్రయత్నిస్తుంది, అయితే మనము గిరగిరా తిరిగినప్పుడు కాక్లియ నాళాలలో కదిలికలు ఎక్కువ సేపు వుండటం వలన మెదడు శరీరానికి సరైన సంకేతాలను ఇచ్చి సమతాస్థితిలో శరీరాన్ని వుంచటానికి ప్రయత్నించినా, పదే పదే కాక్లియా, ద్రవంలో మార్పులు మెదడును గందరగోళ పరుస్తాయి. అందువలన మనం నిలకడగా వుండలేము. దీనితోపాటు కంటిలోని ద్రవం కూడా ఆ కదలికలకు లోనుకావటం వలన పదే పడే పాతదృశ్యాలు కంటి రెటీనాలో కొంత సేపు వుండటం వలన దృష్టి కూడా గందరగోళానికి గురౌతుంది.అందువలన మనకు కళ్ళు తిరుగుతాయి. భూమితోపాటు మనం తిరుగుతున్నప్పుడు ఇంత తీవ్ర పరిస్థితి ఏర్పడదు.

ఆధారం: ప్రొ. ఎ. రామచంద్రయ్య

3.00299401198
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు